Family · Telugu

తొలి అడుగులు

Completed | Part 1 of 2 | 1 Likes

Part 1

తొలి అడుగులు
నాకు అయిదేళ్ళ వయస్సు. ఆంధ్రలో ఒక పట్టణంలో మా నివాసం. నేను అయిదుగు అక్కల తరువాత పుట్టాను. అందుచేత నేనంటే అంతలో అందరికీ గారాబం. చిన్నతనంలో నా దుస్తుల గురించి ఎక్కువ పట్టించుకునే వారు కాదు. నాకు మగదుస్తులు కొన్నది తక్కువ. మా నాలుగవ అక్క, అయిదవ అక్క గౌనులు నాకు తొడుగుతుండేవారు. నాకు అవంటే బాగా ఇష్టంగా ఉండేది. పైగా అయిదవ ఏటీవరకు నాకు పుట్టుజుత్తులు తీయకపోవడంవల్ల నా జుట్టు కూడా బాగా పొడవుగా ఉండేది. పైగా గిరజాల జుట్టు. మా అక్కలలో ఎవరికి తీరుబాటు దొరికినా నాకు జడలు వేస్తూండేవారు. అలా జడలు వేసుకుని అక్కల గౌనులు కట్టుకుని బయటకూడా తిరగటం, అలాగే వాళ్ళ ఫ్రండ్స్ ఇళ్లకు కూడా వెళ్ళటం అలవాటయింది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా మేము ఆరుగురం అక్కచెల్లెళ్ళు అనుకునే వారు. మా అక్కలకి చాప మీద కూర్చో బెట్టి పండగ చేస్తే నాకు కూడా ఆ పండగ ఎప్పుడు చేస్తారా? అని కోరిక కలిగేది. అలా నా బాల్యంలో నేను ఆడ పిల్ల గానే పెరిగాను. అయిదేళ్లు దాతాకా నాకు నిక్కర్లు, చొక్కాలు కొనటం మొదలు పెట్టారు. నాకు ఎందుకో అవి నచ్చేవి కావు. అప్పటికి మగ, ఆడ భేదం కూడా కొంచెం అర్థమయ్యింది. ఎందుకో నేను మగపిల్లవాణ్ణి అన్న విషయం నాకు జీర్ణం అయ్యేది కాదు. ఇప్పటికీ అది జీర్ణం కానీ విషయమే. అయితే తప్పక ఒప్పుకోవలసిన ప్రకృతి ధర్మం అయ్యిందది. అయినా స్కూల్ కు వెళ్ళినప్పుడే నిక్కరు చొక్కాలలో వెళ్ళేవాణ్ణి. ఇంట్లో అక్కయ్యల దుస్తులే. పుట్టుజుత్తులు తీశాకా కూడా గిరజాల జుట్టు పెంచుకునే వాణ్ణి. ఇప్పటికీ అంతే. శ్యామకాల వేళ మా ఫ్రండ్స్, మా అక్క ఫ్రండ్స్ అందరం మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో ఆడుకునే వాళ్ళం.

2569 Views 4 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (4)

Meghana
Meghana 1 year, 4 months ago

Nenu morning office ki velle hadavidi lo first para chadivanu naku nachhi comment petta.. Eppudu mottam chadvaka edo cheppaleni anubhuti.. Chala antey chala bagundi meeru story rasey vidhanam.. Keep writing more sister

gvgarima
gvgarima Author 1 year, 4 months ago

మీకు ఇంతగా నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మేఘనా సిస్టర్. ఇక్కడ వ్రాసిన కథల్లో చాలా అంశాలు నా చిన్నతనానికి చెందినవి. అక్కల దుస్తులను నేను ధరించడం, అయిదవ ఏడాది వరకు జడలు వేసుకోవడం, ఊర్మిళ ఆంటీ తో పరిచయం ఇవన్నీ నిజాలే. ముందు ముందు ఇంకా చాలా షేర్ చేస్తాను. ఈ వెబ్ సైట్ ఒక స్వర్గం లా ఉంది. దీన్ని నిర్వహిస్తున్న మీకు ధన్యవాదాలు సోదరీ

Meghana
Meghana 1 year, 4 months ago

Story bagundandi..@gvgarima garu..Inka elanti manchi stories marinni rayamani na vinnapam.

gvgarima
gvgarima Author 1 year, 4 months ago

ప్రియమైన మేఘన గారికి, నమస్కారం,. చాలా సంతోషం. ధన్యవాదములు. తప్పకుండా మరిన్ని కథలను వ్రాస్తాను.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login