మాయమైపోయిన గోపిక ఎక్కడికి పోయిందోనని అందరూ ఎవరికి తోచిన కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా ఆరు మాసాలు గడిచాకా ఆర్ టి సి బస్ లోంచి సూట్ కేస్ పట్టుకుని దిగి మేలి ముసుగు కప్పుకుని, వయ్యారంగా మువ్వల పట్టీలు గల్లు గల్లుమనిపిస్తూ నడుచుకుంటూ ఒకామె అక్కావాళ్ళింటి లోపలికి వచ్చి సుబ్బూ, సుబ్బూ అంటూ పిలుస్తోంది. ఆ పిలుపు పరిచయమైన గొంతు అని నేనూ, రాజీ, అక్కా అందరం బయటకు వచ్చేశాం . మమ్మల్ని చూసి ముసుగు తీసి మా ముగ్గుర్నీ ఒకరితర్వాత, ఒకరిని కౌగిలించుకుని నేనే నర్రా... గోపికని. అని చెప్పింది. అప్పుడు ముగ్గురం చాలా జాగ్రత్తగా చూశాం. చాలా పొడుగాటి జడ. పొందికగా కొట్టిన చీర. మాంచి నవ నవలాడుతున్న యౌవనం. ... ఈ ఆరునెలల్లో ఏం జరిగిందో చెప్పమని అక్క అడిగింది.
జరిగింది క్లుప్తంగా చెప్పింది. నన్ను ఎత్తుకెళ్ళిన రాజీ స్నేహితురాళ్ళు నన్ను చెన్నై తీసుకువెళ్ళారు. అక్కడ నాకు కళ్ళకుగంతలు కట్టి బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక ఇరుకు సందులోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక పెద్ద భవన్తిలో హిజ్రా మాత దగ్గరికి తీసుకెళ్ళి గంతలిప్పారు. దీనికి శస్త్రచికిత్స చేయించాలని చెప్పారు. గురు మాత అలాగే నంది. ఒక వారం రోజులపాటు ప్రి ఆపరేషన్ చర్యలన్నీ చేసి నాకు జరగబోయేది చెప్పి నా పురుషాంగాన్ని, వృషణాలను తొలగించారు. తాత్కాలికంగా ఒక ట్యూబ్ పెట్టారు. నెమ్మదిగా స్త్రీ అవయవాకృతి కల్పించారు డాక్టర్. సౌందర్య చికిత్స చేయటానికి ఒక మూడు మాసాలు పెట్టింది. నా ఆపరేషన్ అవసరమైన డబ్బు రాజీ ఇచ్చింది అని తెలిసింది. ఈ ఆరు నెలల్లో నాకు కుట్లు, అల్లికలు నేర్పారు. అలాగే తొలి బోణీగా ఒక మార్వాడి సేఠ్ దగ్గరకి పంపారు. తన దగ్గర ఒక పదిరోజులు ఉంచుకుని నాకో పదలక్షలిచ్చాడు.వాళ్ళకి ఒక అయిదు లక్షలిచ్చాడు.
అని సూట్కేసులోంచి పదలక్షలు అక్కచేతిలో పెట్టింది.
Family · Telugu
బైపి గోపికాయె
Completed
|
Part 3 of 4
|
0 Likes
Part 3
2061 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Superb start..story chadivina taravatha evaru rasaru ani chustey..enkevaru maa Garima akka tappa enka evaru telugulo entha baga rayagalaru anukunna...
చాలా చాలా సంతోషం చెల్లీ. అంతా మీ ప్రోత్సాహం. కృతజ్ఞతలు