Sister · Telugu

గరిమ కథలు 10 కూవాగానికి నా తొలి ప్రయాణం

Completed | Part 1 of 5 | 0 Likes

Part 1

అనిత చెప్పాకా నాకు ఒకసారి కూవాగం వెళ్ళాలి అనిపించింది. సాలూరు వెళ్ళగానే మా పెద్దక్క కి ఇలా బస్సు ప్రయాణం లో అనిత కలవడం, కూవాగానికి రమ్మని చెప్పటం ఇవన్నీ చెప్పాను. కూవాగం ట్రాన్స్ జెండర్ల పండుగంట అని కూడా చెప్పాను.
అంతా విన్న తరువాత "నువ్వు ట్రాన్స్ జెండర్ వి కాదు కదే?" అని అడిగింది.
"నేను మగ అయినా నన్ను ఆడపిల్ల లాగే సంబోధిస్తున్నారు కదక్కా!?
మరి నేనెవరినీ?" అని అడిగా.
నాకవన్నీ తెలీదే. పైగా నువ్వు తిరుపతి చెల్లాయి భాను వాళ్ళు ఆడపడుచు నీలని పెళ్ళాడాలనుకుంటున్నావు కదా!? ఒక పని చేద్దాం. భానుని, నీలని అడిగి నిర్ణయం తీసుకుందాం." అని వెంటనే భానుకి ఫోన్ చేసి నీలని కూడా ఫోన్ దగ్గరికి రమ్మని పిలిచింది. ఇద్దరికీ జరిగినదంతా చెప్పి "ఇప్పుడు చెప్పండే. ఇది ట్రాన్స్ జెండర్ల పండుగకి వెళ్తాదంట. మీరేమంటారే?" అని అడిగింది. వెంటనే నీల ఫోన్ తీసుకుని "వదినా! మధుని వెళ్ళ నీ! దాని కాబోయే మొగుడి గా నే పర్మిషనిస్తున్నా!" అంది. "అదేం విడ్డూరమే? నువ్వు దానికి మొగుడివేంటే?" అని ఫోన్ లోనే బుగ్గలు నొక్కుకుంది.
"వదినా, మధు మీ అందరికీ అది అయితే. నేను దానికి మొగుణ్ణే." అంది. నాకెందుకో పక్కనుంచి నీల మాట వినగానే సిగ్గనిపించింది. భానక్క కూడా "వెళ్ళ నీవే దాన్ని." అంది. .......

1287 Views 3 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (3)

Ladybug
Ladybug 1 year, 2 months ago

Very nice and interesting. Super

gvgarima
gvgarima Author 1 year, 2 months ago

ThanQ LB💓🎵

gvgarima
gvgarima Author 1 year, 2 months ago

Dear Sister LB, this story is finished. Journey Koovagam will be my next story. Please go through this present story and add your valuable comment.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login