భామిని లేకుండా చిత్ర భుజించదు.
భామిని లేకుండా స్నానం చెయ్యదు.
భామిని ప్రక్కన లేకుండా నిదురించదు.
భామిని సాహచర్యం లో ఎన్నో కళలలో నైపుణ్యం సంపాదించిన చిత్ర తన సౌందర్యాన్ని కూడా లోకోత్తరంగా పెంచుకుంది.
భామిని వల్ల వచ్చిన ఈ మార్పులన్నీ మహారాజు కి ఎంతో ఆనందాన్ని కలుగజేశాయి.
ఒకరోజు మహారాజు, మహారాణి భామినిని పిలిచి ఆమెను సత్కరించబోయారు. వారి ప్రక్కనే చిత్రాంగద కూడా ఉన్నది.
అప్పుడు భామిని. "నేను మా రాజ్యానికి వెళ్లి మాతల్లి దండ్రులతో కలిసి వస్తాను. అప్పుడు నేనడిగిన బహుమతి గా నీకూతురు నాకిచ్చి వివాహం చెయ్యండి." అంది.
మహారాజు కోప్పడలేదు కానీ అడిగాడు. "నువ్వు కిన్నెరవు. నాకుమార్తెతో వివాహం ఎలా కుదురుతుంది?" అని అడిగాడు.
"కుదురుతుంది మహారాజా! నేను లేకుండా మీ అమ్మాయి ఒక్క రోజైనా ఉండగలదేమో అడగండి." అంది.
తల ఒంచుకునే రాకుమారి"భామిని లేకుండా నే ఒక్క క్షణం కూడా ఉండలేను తండ్రి!" అంది. ఆమె తలెత్తి చూసేసరికి ఆ ముగ్గురినీ ఆశ్చర్యపరుస్తూ వారి ఎదుట భామిని కి బదులు గా కాంభోజ యువరాజు భాను వర్మ ఉన్నాడు. "ఇప్పుడు చెప్పండి మహారాజ! మా వివాహం కుదురుతుంది కదా!" అని తన కామరూప విద్య తో తాను భామిని గా అక్కడికి వచ్చిన ఉదంతం చెప్పాడు.రాజు, రాణి ఎంతో సంతోషించారు. "యువరాజా, మీరు ఇక్కడే ఉండండి. మా మిత్రులైన కాంభోజ మహారాజు ను, మహారాణి నుంచి ఇక్కడికి నేను స్వయంగా వెళ్లి తీసుకుని వస్తాను. వివాహం ఘనంగా జరిపించుదాం." అన్నాడు చిత్రసేనుడు. భాను వర్మ తలూపేలోపు చిత్రాంగద "తండ్రి గారు, నా వివాహం భామిని తోనే జరగాలి. భాను వర్మ వారితో కాదు." అని గారాబంగా, సిగ్గు పడుతూ చెప్పింది. అలాగే చిత్రాంగదా దేవి. ఈ సేవకురాలు సదా మీ సేవలో. అని భాను వర్మ భామిని గా మారిపోయాడు. అందరూ నవ్వుకుంటూ ఉండగా ఆ జంట చెట్టాపట్టాలేసుకుని అంతఃపురం వైపు నడిచారు. కల్యాణం అంగరంగవైభవంగా జరిగాకా చిత్ర భామినికి తన అందాలను విందుగా ఆరబోసింది.
భామినీ విలాసం
Completed
|
2
|
2
|
1120
Part 6
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
|
Comments

Akka, chinnappudu chadivina Chandamama, bommarillu kathalanu gurtuchesaru.. Meeku ee vidam ga krutagnyatalu cheppalo teliyadam ledu. Chala thanks akka. Elantivi marinni kadalu rayamani na prarthana.

మీకు ఇంతగా నచ్చినందుకు థాంక్స్ చెల్లి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను 💕