ముందే తెలుసు

gvgarima

  | October 21, 2025


Completed |   2 | 1 |   1438

Part 1

ముందే తెలుసు
నా పేరు శ్రావణ్. ఆరోజు నా టెన్త్ క్లాస్ ఆఖరి పరీక్ష. వ్రాసి ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం ఒంటిగంటన్నరైంది. నేను కాళ్ళు, చేతులు కడుక్కొని నా గదిలోకి వెళ్ళాను. నా యూనిఫామ్ విప్పేసి నా షార్ట్స్ కోసం చూశాను. నా బెడ్ దగ్గర ఉన్న బట్టల స్టాండ్ పై చూశాను. నా చొక్కాలు, కానీ షార్ట్స్ కానీ ఏమీ కనబడలేదు. అక్కడ నా అల్మైరా ఓపెన్ చేశాను. అందులో ఆశ్చర్యం కలిగించేలాగా రెండు పరికిణీ, వోణీ, జాకెట్టులు, నాలుగు లాంగ్ ఫ్రాక్ లు, చుడీదార్ లు, కొన్ని కుర్తీలు, నాలుగైదు నైటీలు, లింగరీ ఇలా ఏవేవో ఉన్నాయి. ఇంటికి ఎవరో వచ్చారనుకున్నా. కొంచెం అనుమానంగా నా బట్టలకోసం మంచం మీద చూశాను. అక్కడ ఒక జీన్స్ ప్యాంటు, పింక్ కలర్ టి షర్ట్, పింక్ పాంటీ, చిన్న బ్రా, ఆ పక్కనే ఒక నైటీ ఉన్నాయి. నేనింకా అయోమయం గా చూస్తూ ఉన్నాను. ఇంతలో అమ్మ కిచెన్ లోంచి కొంచెం గట్టిగా "ఒసేవ్, శ్రావణి! తొందరగా మంచం మీద ఉన్న నైటీ కట్టుకుని రావే! మన లంచ్ అయ్యాక నీకో సర్ప్రైజ్." అంది. నా చెవులను నేనే నమ్మలేదు. కారణం "ఎప్పుడూ ఒరేయ్, శ్రావణ్!" అనేది. కానీ ఈ రోజు ఒసేయ్, శ్రావణి!" అని పిలిచింది. ప్రొనౌన్, నౌన్ రెండూ మారిపోయాయి. ఇంకా నా అనుమానం పోలేదు. "అమ్మా! నా షార్ట్స్" అని నసిగాను. "ఒసేయ్, మొద్దు! నైటీ కట్టుకుని రమ్మన్నానా?" అంది. నాకు మేఘాలలో తేలుతున్నట్టుగా ఉంది. ఒళ్ళు దూది పింజలా తేలిపోతోంది. వెంటనే నైటీ వేసుకుని నిలువుటద్దంలో చూసుకున్నాను. ఈ ఆరునెలల్లో నా శరీరాకృతిలో ఏదో మార్పు వస్తోంది. నెమ్మదిగా శరీర అవయవాల పొందికలో మార్పు వచ్చింది. వళ్ళు కొంచెం గుండ్రంగా తయారౌతోంది. వక్షోజాలు, బట్స్ కొంచెం పెరిగాయి. పైగా గత ఏడాది గా అమ్మ నన్ను హెయిర్ కట్ కి వెళ్ళి నివ్వలేదు. జుట్టు చాలా పొడవుగా పెరిగింది. ఆ మార్పులు నాకు నచ్చేవే. నెమ్మదిగా నైటీ వేసుకుని డైనింగ్ హాల్ కి వచ్చాను. అక్కడ అమ్మ తో పాటు వనజ ఆంటీ కూడా వుంది. వనజ ఆంటీ, అమ్మ చిన్నప్పుడు క్లాస్ మేట్సు. అమ్మకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని యం.బి.బి.యస్ లో సీటొచ్చినా వదిలేసి బియసి బియిడి చేసి సైన్స్ టీచర్ అయ్యింది. ఆంటీ ఒక డాక్టర్ అయ్యింది. ఆంటీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తెలుసు. ఆంటీకి కూడా నేను శ్రావణ్ అని తెలుసు. కానీ ఆవిడ కూడా "రా శ్రావణి!" అని పిలిచింది. నేను టేబుల్ దగ్గరికి రాగానే నన్ను తన దగ్గరకు తీసుకొని నెమ్మదిగా ఒళ్ళంతా తడుముతూ పైనుంచి కింద దాకా చూస్తూ శ్రావణి లో మనం అనుకున్న మార్పులు అన్ని బాగానే వచ్చాయి రోజీ" అంది. అమ్మ, "వనజ ముందు మనం లంచ్ చేసి తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం." అంది. ఆంటీ తలూపింది. నేను ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ నా ప్లేట్ దగ్గర కూర్చున్నాను. ఆంటీ నవ్వు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. చాలా స్నేహంగా నవ్వుతుంది. అయితే ఈ రోజు ఇప్పుడు లంచ్ చేస్తూండగా నిండుగా నవ్వుతూనే కొంటెగా కన్నుగీటింది. నాకు ఇంకొంచెం ఆశ్చర్యం పెరిగింది. "రోజీ, శ్రావణి చాలా ముద్దుగా ఉందే. దీన్ని నాకొడుక్కిచ్చి పెళ్ళి చేసేద్దాం.". "సర్లేవే వనం, ఇంకా జర్నీ చాలా ఉంది కదా! నువ్వెలా అంటే అలాగే." అంది అమ్మ. నెమ్మదిగా ఆ కబుర్లు, ఈ కబుర్లు చెబుతూ లంచ్ పూర్తి చేసేశాం. "శ్రావణి, కొద్దిగా ఈ పూటకి గిన్నెలు సింక్ లో పెట్టిరా. నీతో కొన్ని విషయాలు చెప్పాలి." అంది అమ్మ.
ముగ్గురం హాల్ లోకి వచ్చి కూర్చున్నాము. వనజా ఆంటీ నన్ను దగ్గరగా లాక్కొని గట్టిగా బుగ్గలమీద ముద్దు పెట్టింది.
అప్పుడు అమ్మ ఇలా చెప్పడం మొదలు పెట్టింది. (సశేషం)

Part 2

శ్రావణి, నీకు గుర్తుంది కదా. నువ్వు రెండేళ్ళ వయస్సు నుంచి అయిదేళ్ళ వయస్సు వరకు మీ పిన్ని అదే నా చెల్లెలు స్వర్ణ దగ్గరే పెరిగావు. కారణం పిన్నికి ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడు ఏడాది వయస్సు ఉండగా వాళ్ళు ఆటో లో ఎక్కడికో వేడుతున్నప్పుడు పిన్ని చేతిలోంచి జారి రోడ్డు మీద పడి చనిపోయాడు. అప్పుడు పిన్ని మామూలు మనిషి కాలేక పోయింది. కొన్నాళ్ళు మామూలు మనిషి కావాలి అనే ఆలోచనతో మీ బాబాయ్ రిక్వెస్ట్ పై నిన్ను అక్కడ ఉంచాం. అయితే పిన్ని నిన్ను కూడా తన కూతుళ్ల లాగే చూసేది. మగ పిల్లవాడు అంటే దిష్టి తగులుతుంది. అని. నిన్ను శ్రావ్య అని పిలిచేది. అలా మూడేళ్ళ పాటు ఆడ పిల్లలాగే పెరిగావు. పిన్ని కి, నాకు కూడా సంగీతం బాగా వచ్చు. అందుకని నీకు పిన్ని జానపదం పాటలు, స్త్రీల పాటలు ఇలా చాలా నేర్పింది. విచిత్రంగా నీ గొంతు అప్పటికీ, ఇప్పటికీ కూడా ఫిమేల్ గొంతే. చాలా శ్రావ్యంగా పాడుతున్నావు అని నీకు సంగీతం నేర్పింది. ఆ మూడేళ్లలో నీకు ఆడపిల్లగా ఉండటం అలవాటు అయిపోయింది. ఆ తరువాత పిన్నికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఎలాగో నచ్చ జెప్పి నిన్ను మన ఇంటికి తీసుకు వచ్చాము. అయితే నువ్వు ఆడపిల్లలాగా తిరగటం, ఆడ గొంతు తో పాటలు పాడటం మీ నాన్నకు నచ్చలేదు. నేను మీ నాన్నను నీ విషయం లో మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాను. నిన్ను శాశ్వతంగా మీ పిన్ని వాళ్ళింటిలో వదిలేసి రమ్మన్నాడు మీ నాన్న. మనం నెమ్మదిగా వాణ్ని మార్చుదాం అని చెప్పినా వినలేదు. మీ నాన్న నాతో కాపురం చేయనని చెప్పి వేరే స్త్రీకి అలవాటు పడ్డాడు. ఇద్దరం కోర్టుకు వెళ్ళాం. విడాకులు తీసుకున్నాం. మేం ఇద్దరం విడాకులు తీసుకున్న సంగతి నీకు తెలుసు కానీ అది నీ వల్లనే అని నీకు తెలియలేదు. అప్పటినుంచి నీకు సింగల్ పేరెంట్ పెంపకమే అయిపోయింది. నెమ్మదిగా నిన్ను నేను పనిచేస్తున్న స్కూల్ లోనే చేర్పించాను. నువ్వు కూడా నీ ప్రకృతి సహజమైన జెండర్ కి అలవాటు పడ్డావు కానీ అందులో ఇమడలేక పోతున్నావు. నీ గొంతు మారటం లేదు. నీ స్నేహితులు అందరూ నిన్ను ఆట పట్టిస్తూనే ఉన్నారు. నేను కూడా చూసి చూడకుండా వదిలేస్తున్నాను కానీ స్కూల్ పంక్షన్స్ లో అమ్మాయిలతో పాటు నీకు కూడా బృంద నృత్యాలలో, నాటికలలో ఆడ పిల్ల పాత్రలలో నిన్ను వేషం కట్టించే దాన్ని. నీకు ఆ వేషాలు అంటే ఎంతో ఇష్టం గా ఉండేది. అలాగే అంతమంది ఆడపిల్లలు ఉన్నా పాటల పోటీలలో నీకే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ లు వచ్చేవి. ఆడపిల్లలు కూడా నీపట్ల స్నేహంగానే ఉండేవారు. అలాగే నీకు హేమ, రమ, రమ్య వీళ్ళంతా ప్రెండ్స్ అయ్యారు. నువ్వు ఎనిమిదవ తరగతికి వచ్చిన తరువాత ఆకస్మాత్ గా నీకు కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు వనజ ఆంటీ దగ్గర నిన్ను చూపించాను. ఆంటీ ముందు కడుపు నొప్పికి ఏవో మందులు ఇచ్చింది. కానీ నీకు ఆ నొప్పి ప్రతి నెల రావటం, దానితో పాటు మూడ్ స్వింగ్స్, లోపల బ్లీడింగ్ అవుతున్న అనుభూతి, నీ బ్రెస్ట్ పెద్దవి అవడం, వాటిలో నొప్పి రావటం ఇవన్నీ చూసి వనజ తన సర్కిల్ లో ఉన్న ఎండోక్రయిననాలజిస్ట్ ను, ఒక ట్రాన్స్జెండర్ మేడికల్ స్పెషలిస్ట్ను కూడా తరచూ కన్సల్ట్ చేస్తోంది. వీరందరూ కలిసి నిర్ణయించింది ఏమిటంటే నీకు PMDS (Persistent Mullerian Duct Syndrome) ఉంది అని ఆ దృష్ట్యా నీకు treatment ఇవ్వడం మొదలు పెట్టారు. నీలో హార్మోనల్ సమతౌల్యం లోపించింది. అని గమనించారు. నీ లో ఉన్న స్త్రీ సహజమైన లక్షణాలు, వాటి పట్ల నీకు ఉన్న మక్కువ చూసి నాతో బాగా చర్చించి నీకు ఎటువంటి చికిత్స ఇవ్వాలో నువ్వు ఎనిమిదవ తరగతిలో ఉండగానే నిశ్చయించుకున్నారు. మొదలు పెట్టటానికి ఆరు మాసాల ముందునుంచి నువ్వు స్త్రీ త్వం పట్ల చూపుతున్న ఇష్టం కూడా పరిగణన లోకి తీసుకున్నారు. అలా నీ ఎనిమిదవ తరగతి నుంచి టెన్త్ పరీక్షల చివరి వరకు నీకు H R T చికిత్స ఇచ్చారు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన బాలికవు కావు కాని బాలికకు ఉండదగిన లక్షణాలు నీలో 80 శాతం వరకూ ఉన్నాయి. మిగతా 20 శాతం ఈ 80 శాతం కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అని అటు వనజ ఆంటీ, ఇటు అమ్మ కూడా నాకు చెప్పారు. ఇంక ఇటుపై నీకు SRS కు ఏర్పాటు చేస్తున్నారు. అది ఢిల్లీ లో వీళ్ళకు తెలిసిన టీం ఆఫ్ డాక్టర్స్ ద్వారా చేయిస్తారు. షుమారు రెండేళ్ళు పడుతుంది. నీకు ఇష్టమే కదా తల్లీ? అని అమ్మ అడిగింది. దానికి నేను అమ్మ ఒడిలో నా తల బోర్లా దాచుకుని ఇష్టమే అంటూ రెండు మూడుసార్లు ఊపాను. "ఆసి నీ దుంప తెగ. అదేం చెప్పటమే" అంది అమ్మ. వనజ కూడా చిన్నగా నవ్వుతూ "ఇప్పుడు మనం చేయబోయేది దుంప తెంపే కార్యక్రమమే కదా?" అని చెప్పింది. ముగ్గురం ముచ్చటగా నవ్వుకున్నాం.

రెండేళ్ళకు ఢిల్లీ లోనే నేను శ్రావణిగా ప్లస్ టు పూర్తి చేసుకున్నాను. మరో రెండు సంవత్సరాలకు కాని నేను శ్రావణి గా పూర్తిగా స్త్రీ గా మారలేదు. చిన్నతనం నుంచే మా అమ్మ రోజా కి నా లోని ఆడపిల్ల ముందే తెలుసు. ఇది సంక్షిప్తంగా నా కథ.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Akka meeru story lo chupinche aa research mariyu entho lothaina terminology nannu entha gano akkattukuntai.. Mee kadha kosam roju website check chestha.. Thanks akka nannu meeru enthgaano inspire chesthunnaru

gvgarima gvgarima (Author)

సంతోషం చెల్లి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు ❤️💕❤️