సమయం ఉదయం తొమ్మిది గంటలు. నేను మువ్వలవానిపాలెం కోలనీ కూడా దాటి కైలాస గిరి హిల్స్ కి ప్రక్కన జూ పార్క్ వెనుక వైపు ఉన్న ఒక చిన్న కాంటిన్ లో టీ త్రాగుతున్నాను. ఎవరో నా వీపుని చూస్తున్నట్లు అనిపించింది. వెంటనే సర్దుకుని నా చీరపైట తో నా వీపుని కప్పుకుని కూర్చున్నాను. టీ సిప్ బై సిప్ త్రాగుతున్నాను.
ఇంతలో "హాయ్! మిస్ సుధ!" అన్న పిలుపు వినవచ్చింది. ఎక్కడో విన్న గొంతులా అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఆ పిలిచిన వ్యక్తిని చూసి గతుక్కుమన్నాను. "వీడేమిటి ఇక్కడ?" అనుకున్నాను. అతనొచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.
"ఎలా ఉన్నారు మిస్? నా పేరు ప్రకాష్. యస్ ఆర్ బిజ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నా. సుధాకర్ మీ అన్నయ్య కదా! నా టీం లోనే ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. హి ఈజ్ వెరీ డొసైల్ అండ్ ఎఫిసియంట్ అట్ వర్క్. నాలుగైదు సార్లు మీ ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో చూపించి మీరిద్దరూ ట్విన్స్ అని చెప్పాడు. మీ పేరు సుధ అని చెప్పాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీ అన్నయ్య మంచి మాటకారి. ఐ అప్రిసియేట్ హిజ్ ఫెమినైన్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అవడానికి మేల్ అయినా హిజ్ స్పీచ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ పెర్ఫెక్ట్ లీ ఫెమినైన్. మార్కెటింగ్ స్కిల్స్ లో హి ఈజ్ సూపర్. ఎనీ హౌ,.. హౌ ఆర్ యూ?" అన్నాడు.
నేను ఏం మాట్లాడాలేదు. కేవలం నా తల ముందుకు, వెనక్కి, పైకి, కిందకు, అటు, ఇటు ప్రక్కలకు తిప్పాను.
మళ్ళీ ప్రకాషే "మిస్... మీరు తలూపుతుంటే మీ పెద్ద పెద్ద చెవిరింగ్ లు చాలా చక్కగా కదులుతూ మీ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. యు ఆర్ వెరీ బ్యూటీఫుల్." అన్నాడు.
నా వాయిస్ పైకి రానివ్వకుండా చాలా చిన్నగా థాంక్స్ ప్రకాష్ గారు." అన్నాను.
"ఎంత తియ్యగా చెప్పారండీ. గిటార్ మీటినట్టుంది మీ గొంతు. ఆ లిటిల్ హస్కీ." అన్నాడు. నేను మళ్ళీ అలాగే తలూపాను.
ప్రకాషే చాలా సేపు ఏవేవో మాట్లాడుతూ "సుధా! మీకు అభ్యంతరం లేకపోతే బీచ్ లో అలా కాసేపు తిరిగి వద్దాం. " నేను మళ్ళీ తలూపాను.
ఇద్దరం బీచ్ వైపు నడిచాం. ప్రకాషే మాట్లాడుతూ ఉన్నాడు. నేను మౌనంగా వింటున్నాను. అవునూ... మీ అన్నయ్య ఎక్కడ? వీకెండ్ కదా. ఈ సమయంలో మీరొక్కరే వచ్చారేం? మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యండి. ముగ్గురం దసపల్లా లో లంచ్ చేద్దాం." అన్నాడు.
నేను కొంచెం కంగారుగా దగ్గాను. నెమ్మదిగా లో వాయిస్ "అన్నయ్య స్టీల్ ప్లాంట్ దగ్గర తన ఫ్రెండ్స్ ని కలవటానికి వెళ్లాడు ప్రకాష్ గారు."
"హౌ వండర్ ఫుల్!?. మీ ఇద్దరి వాయిస్ మాడ్యులేషన్ ఒకే రకం గా ఉంది. ఎనీ హౌ మనం ఈ రోజు దసపల్లా లో లంచ్ చేద్దాం." అన్నాడు. నేను మళ్ళీ అలాగే కన్ఫ్యూజ్డ్ గా తలూపాను. ప్రకాష్, నేను బీచ్ వడ్డున కెరటాల పక్కనుంచి నడుస్తున్నాం. ప్రకాష్ ఆరు అడుగుల పొడగరి. మంచి హాండ్సమ్ యంగ్ మాన్. నేను నా చీర కుచ్చిళ్ళు కొంచెం పైకెత్తి నడుస్తున్నాను. నా మువ్వల పట్టీలు కొంచెం చిన్నగా సవ్వడి చేస్తున్నాయి. (సశేషం)
మాటను బట్టి మగువ
Part 1
Part 2
ఒక ప్రక్క నుంచి కుచ్చిళ్ళు పట్టుకొని నడుస్తూ కొంచెం కెరటాలకు దూరం గా వచ్చి నా ఎద పైటంచును జాగ్రత్తగా సర్దుకుని ప్లీట్స్ సరిచేసుకుని మళ్ళీ ప్రకాష్ ని అనుసరించి నడవటం మొదలు పెట్టాను. ప్రకాష్ నన్ను ఓరకంట గమనించటం నేనూ చూస్తూనే ఉన్నాను. "యు ఆర్ గార్జియస్." అన్నాడు .
"ఊ..." అన్నాను. "అవునూ... మీరుండేది డాబా గార్డెన్స్ లో కదా! మీరు ఇక్కడికి వచ్చేరేమిటి? జస్ట్.... పనేమైనా ఉంటే హెల్ప్ చేద్దామని అడిగాను. అంతే." అన్నాడు. నేను, "(లో వాయిస్ లోనే) ప్రతి వీకెండ్స్ లో నాకు ఇక్కడికి రావటం అలవాటు ప్రకాష్ గారు!" అంటూ పెద్ద అల మీదకు పడుతుంటే కెవ్వున అరిచి ప్రకాష్ చెయ్యి పట్టుకున్నాను. ప్రకాష్ పరిభాషలో అతని గుండెలో వెయ్యి గిటార్లు మ్రోగాయనుకుంటా. నెమ్మదిగా నన్ను పొదివి పట్టుకుని అలల తీరం నుంచి బయటకు నడిపించి తన కారు వైపు నడుస్తూ "సుధా, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను ప్రకాష్ అని పిలవొచ్చు. ఇంతకీ మీరు వీకెండ్స్ లో ఇక్కడకు వస్తారన్నమాట. నేను మీకు కంపెనీ ఇవ్వొచ్చా ప్రతివారం." అని అడిగాడు. "ఎందుకు కాదు. తప్పకుండా. అయితే ఒక రిక్వెస్ట్. నన్ను ఇకపై మీరు అనొద్దు. నువ్వు అంటే చాలు." అన్నాను.
అలా మొదలైన మా పరిచయం వారం వారం కొత్త కొత్త అనుభవాలతో హద్దులు మీరని ఫ్రెండ్ షిప్ గా పెరుగుతోంది.
ఆరోజు నేను చుడీదార్ ధరించి వచ్చాను. నన్ను ఆపాదమస్తకం చూసి తన్మయంలో పరవశించి పోతున్నాడు ప్రకాష్. "ఏమందం సుధా? ఫాంటాస్టిక్." అన్నాడు. "ప్రకాష్! ఒక ప్రశ్న. మా అన్నయ్య సుధాకర్ స్పీచ్ మానరిజమ్స్ గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు కదా!? మా అన్నయ్య స్పీచ్ లో స్పెషాలిటీ ఏమిటి? హౌ ఇట్స్ ఫెమినైన్?" అని ప్రశ్నించాను. ప్రకాష్ చెప్పటం మొదలైంది. (సశేషం)
Part 3
సుధ! స్త్రీల భాష కు పురుషుల భాషకు అభివ్యక్తిలో, భావప్రాధాన్యం లో, ప్రయోగాలలో, స్వరమాధుర్యంలో, సమాధానం ఇచ్చే తీరులో, మృదుత్వం లో ఇంకా మరెన్నో అంశాలలో చాలా తేడాలు కనబడుతాయి. ఇవి పరిశీలకులకు మాత్రమే తెలుస్తాయి.
ఒక మేనేజర్ కి ఇచ్చే శిక్షణలో ఒక కటుత్వం నేర్పుతారు. కాని మీ అన్నయ్యను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎదురుగా ఉంటే మగ మనిషి అని తెలుస్తుంది కాని లేక పోతే ఎవరో ఒక పదిహేను, పద్ధెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ఇంకా గొంతులో పరిపక్వత రాని, స్త్రీ గొంతును పోలిన స్వరం వినబడుతుంది. అందువల్ల ఫోన్ లో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నది మహిళ ఏమో అనుకుంటుంటారు. చాలా సార్లు నా కాబిన్ లో కూర్చుని ఉన్నప్పుడు కూడా మేము స్పీకర్ లౌడ్ లో పెట్టి ఇద్దరం కస్టమర్ లతో మాట్లాడేటప్పుడు మీరాగండి సార్ .. మాడమ్ గారు ఏం చెబుతారో విందాం. హర్ వర్డ్స్ ఆర్ కన్విన్సింగ్. అంటుంటారు. అని ప్రకాష్ చెబుతుంటే సుధ ముఖం లో ముసిముసి నవ్వులు, సిగ్గుతో చెంపలు ఎర్ర బడటం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అప్రయత్నంగా నేను నా పైట సర్దుకున్నాను. ఇవేవీ ప్రకాష్ కన్ను దాటి పోలేదు. “ఏంటో అన్నయ్య గురించి చెబుతుంటే అమ్మాయిగారికి అంత సిగ్గు?” అని అడిగాడు ప్రకాష్. నేను వెంటనే సర్దుకుని చిన్నగా దగ్గి ఏం లేదు. మీరు కానివ్వండి. అంటూ నాతో తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిల్ లోంచి ఒక గుక్కెడు మంచినీళ్ళు త్రాగాను. “అరే ॥। మీ అన్నయ్య దగ్గర కూడా ఇలాంటి బాటిలే. తాను కూడా ఇలాగే దగ్గుతాడు. ఎంతైనా మీ ఇద్దరూ కవలలు కదా. ఈ పోలికలు సహజమేలే.
అలాగే మీ అన్నయ్య ఏం మాట్లాడాలన్నా “నా అభిప్రాయం ఏమిటంటే. ..”, “నేను అనుకుంటున్నాను . . . “, “ఒక విధంగా. .. మీరు చెప్పిందే రైట్ ఏమో.. . . కానీ కంపెనీ కి కొన్ని రూల్స్ ఉంటాయి కదండీ. వాటికి మనం కట్టుబడి ఉండాలి కదా!” అంటూ సాగదీస్తూ వాళ్ళతో బాటు తనని కూడా కలుపుకుని మాట్లాడుతాడు. ఇదంతా ఆడవాళ్ళ మల్లేనే. “ అన్నాడు.
“అంటే మీ ఉద్దేశం ఏమిటండీ? మా ఆడవాళ్ళం అల్లా సాగదీస్తామా?” అన్నాను తిప్పుకుంటూ.
“అలా అని కాదు. అదిగో చూశావా? ఎంత వయ్యారంగా తిప్పుకుంటూ మాట్లాడావో? మీఅన్నయ్య నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు. ఆడవాళ్ళకి ఒక ఎంపతి ఉంటుంది“ అన్నాడు.
“ఏం పతి?” అని ఏడిపిస్తూ అడిగాను.
“వస్తాడు .. .. నీ పతి త్వరలోన.. ..“ అని చెవి మెలిపెడుతూ చెప్పాడు.
“మరింకా???”అడిగాను
సమాధానాల చివర “కదూ!”, “అవునా కాదా?” వంటి కన్ఫర్మేషన్ ట్యాగ్ ప్రశ్నలు ఆడవాళ్ళ సొత్తు. అని ప్రకాష్ అంటుంటే ..
మారికాదేంటి? అని అడిగాను. “ఇదే మేడమ్! నేను చెప్పిన ప్రశ్న తోకలు”. అన్నాడు నవ్వుతూ.
అలాగే మాట్లాడే టప్పుడు వ్యాకరణ బద్ధమైన వాక్యాలు. వాక్యం పూర్తిగా చెబుతే కాని సంతృప్తి ఉండదు. నాలాంటి వాడికి అంత ఓర్పు ఉండదు. నేను వాక్యం చెప్పవలసిన చోట చిన్న చిన్న పదాలు , వాక్యాల ముక్కలు వాడుతాను. కాని మీ అన్నయ్య అచ్చమైన మహిళ లాగే. అంటుంటే ప్రకాష్ జబ్బ మీద ఒక్కటిచ్చి చిన్నగా గిల్లాను.
“అబ్బో అన్నగారంటే అంతా ప్రేమన్న మాట”.. అన్నాడు.
“మరి మా అన్నయ్య కదా “ అని బదులిచ్చాను.
అలాగే మృదువైన అభ్యర్థనలను చేయడానికి "దయచేసి" మరియు "చాలా ధన్యవాదాలు" వంటి మర్యాదపూర్వక పదాలను ఎక్కువగా వాడుతాడు.
అలాగే హాలో గా పొగడ్తలు. సో "లవ్లీ" లేదా "వెర్రి ఆట్రాక్టివ్ " వంటి పదాల మితిమీరిన ఉపయోగం.
అల్లాగే అరుదైన పదాలను ఎంపిక చేసుకుని తన దెగ్గర ఉంచుకుంటాడు. ఉదా - "పర్పుల్"కి బదులుగా "మౌవ్" (mauve" instead of "purple)
అలాగే హైపర్ ఉచ్ఛారణ --- చాలా మృదువుగా, చాలా ప్రామాణికమైన ఉచ్ఛారణ. . . ఇవన్నీ స్త్రీ సహజమైన విధానాలు.
ఆధిపత్య ధోరణి మాది. కానీ మీలాగా అణకువ కలిగిన ధోరణి మీ అన్నయ్య ది.
ఆదేశాలిచ్చే విధానం మాది. మృదువుగా చెప్పి వొప్పించే పద్ధతి మీది. అదే మీ అన్నయ్య ది కూడా.
మాది రిపోర్టింగ్ కమునికేషన్.. మీలాగే మీ అన్నది రాపోర్టింగ్ పద్దతి. మేం ఖచ్చితంగా చెప్పామా లేదా అనే చూస్తాం .. ..మీరు సమన్వయ పరుస్తూ సాధిస్తారు. ఉన్న స్థితి ని కొనసాగించే పద్ధతి మాది. మహిళలు మాత్రం తరచుగా సంబంధాలను నిర్మించడానికి, సాన్నిహిత్యాన్ని సృష్టించడానికి మరియు సంబంధాలను నెలకొల్పడానికి ప్రయాస పడుతారు. మీ అన్నయ్య కూడా అంతే.
అల్లాగే మేం పోటీ తత్త్వం తో పనిచేస్తాం. అలాగే మాట్లాడుతాం. కాని వనితల బాట వేరు. సహకార తత్త్వం వైపు మొగ్గు చూపుతారు. మీ అన్నయ్య పురుష ఆకారం లో ఉన్న మహిళ. అందుకే మీ అన్నయ్య మార్కెటింగ్ లో మా కంపెనీ కి పెద్ద తోపు.
మరో విశేషం ఏమిటంటే మీ అన్నయ్య అంటే మా ఆఫీస్ లో ఉన్న మహిళా ఉద్యోగినులు అందరికే వల్ల మాలిన అభిమానం.
మీ అన్నయ్య వాళ్ళకోసం పూల మాలలు కట్టి ఇస్తాడు. వాళ్ళకి పేపర్ ఆర్నమెంట్స్ తయారు చేసి ఇస్తాడు. ఎవరి పుట్టిన రోజైనా వస్తే ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇస్తాడు. ఇంట్లో రకరకాల స్వీట్స్ తయారు చేసి తీసుకు వస్తాడు. అలాగే వాళ్ళకి లెటర్ డ్రాఫ్టింగ్ లో తాను సహాయం చేస్తాడు. అందుకని వాళ్ళంతా మీ అన్నయ్యని “సుధ!” అనే పిలుస్తారు.” అనిచెప్పాడు.
“ఔను” అన్నాను పరధ్యానం లో నేను.
“ఔనా? నీకెలా తెలుసు?” అడిగాడు. వెంటనే సద్దుకుని “అదే మా అన్నయ్య చెప్పాడు.” అన్నాను.
“సరేలే .. .. ఇక మనం లంచ్ చేసి బయల్దేరుదాం. మధ్యాహ్నం మీటింగ్ ఉంది. మీ అన్నయ్య, నేను మీటింగ్ లో చాలా మంది కస్టమర్ లతో మాట్లాడాలి.” అని ప్రకాష్ లేచి నా చేతిని తన చేతిలోకి తీసుకుని కారు వైపు నడిచాడు.
(సశేషం)
Part 4
కారు డ్రైవ్ చేస్తూ “ఔను సుధ! మీ అన్నయ్యకి ఈ ఫిమేల్ మేనరిజం రావటానికి కారణం ఏమిటంటావు?” అడిగాడు.
మార్గరెట్ అని ఒక కేరళ టీచర్ మా యిద్దరికీ ఇంగ్లీష్ నేర్పారు. మూడు సంవత్సరాలు మేం ఆవిడ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాము. ఆవిడ మిమ్మల్ని స్వంత బిడ్డలలాగా చూసుకుంది. మాకు ఇంగ్లీష్ మాత్రమే కాదు. స్త్రీల అలవాట్లన్నీ నేర్పింది. చిన్నప్పుడే మా అమ్మ, నాన్న పోవటం వల్ల మేనమామ ఇంట్లో పెరిగాం. ఎలాగో మా ఇద్దరికీ డిగ్రీ పూర్తి అయ్యాక మమ్మల్ని “మీ ఉద్యోగాలు మీరు చూసుకోండర్రా! నేను పెద్దవాణ్ని అయ్యాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. వారి బాధ్యతలు చూసుకోవాలి నేను.” అన్నాడు మా మామయ్య. మేం అలాగే అని చెప్పి రాజమండ్రికి మారాం. అక్కడ మాకు మార్గరెట్ టీచర్ పరిచయం అయ్యింది. ఆమెకు మేం ఇంట్లో చోటు ఇస్తే సేవ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటాం అని చెప్పాం. ఆవిడ వెంటనే ఒప్పుకుంది. ఆ తరువాత ఆవిడ దగ్గర అలా ఇంగ్లీష్ నేర్చుకున్నాము. అన్నయ్య కి మీ కంపెనీలో మార్కెటింగ్ లో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత కథ మీకు తెలిసిందే. అన్నాను.
“సుధ! మీ అన్నయ్య లో ఉన్న ఆడదంటే నాకు చాలా ఇష్టం. లింగమార్పిడి చేసైనా సరే మీ అన్నయ్యని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమంటావు.” అని అడిగాడు. “హు .. హు .. అని కొద్దిగా రాగం తీసి బుంగమూతి పెట్టుకుని ఒక్క క్షణం ఆగి సరే . . మా అన్నయ్యను నువ్వు చేసుకుంటే నేను కూడా నీకు ఫ్రీ.. నేను కూడా మా అన్నయ్య తో పాటు వచ్చేసి మీ ఇంట్లో పని మనిషి గా వచ్చేస్తాను. మా అన్నయ్య ను విడిచి నేను ఉండలేను. నిన్ను కూడా విడిచి ఉండలేను.” అన్నాను.
“ఒక వేళ నాకు ఇంతకు మునుపే పెళ్లి అయి ఉంటే . . .?” అని అడిగాడు.
“మీకు మునుపు పెళ్లి అయ్యిందనీ తెలుసు. ఇద్దరు పిల్లలు పుట్టాకా ఆవిడ.. అదే మా అక్కయ్య బస్ యాక్సిడెంట్ లో చని పోయారని తెలుసు. మా అన్నయ్య మీ ఇంటికి తరచూ వచ్చేవాడు కదా. మీ ఇంటి వాచ్ మెన్ భార్య ఒకసారి బజార్ లో కలిసి నప్పడు మాటల సందర్భం లో మా అన్నయ్య కి చెప్పిందట. మా అన్నయ్యని ఒప్పిస్తాను. మీ పిల్లలకు మేం ఇద్దరం తల్లులం అవుతాము ” అన్నాను.
“అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం సుధాకర్ ఉరఫ్ సుధ?” అని అడిగాడు.
నేను ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. “ప్ర. .కా. . ష్” అన్నాను.
నువ్వే సుధాకర్ వి. నువ్వే సుధ వి అని నాకు తెల్సు సుధ. నాకు మొదట సుధ గా పరిచయం అవటానికి ముందు నుంచే నువ్వు వీకెండ్స్లో ఇలా ఇక్కడ బీచ్ కి సుధగా వస్తావని, నువ్వు ఒంటరివని నాకు బాగా తెల్సు. కారణం ఒకసారి నేను మన పరిచయానికి ముందే మీ ఇంటికి వచ్చినప్పడు చక్కటి కాటన్ శారీ లో నువ్వు కనిపించావు. నిన్ను చూసిన వెంటనే మీ అన్నయ్య ను అడిగి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అయితే ఆరోజు మీ అన్నయ్య ఏడీ అని అడిగితే ఫ్రెండ్స్ తో గాజువాక వెళ్లాడాని చెప్పావు. అన్నయ్య వచ్చాక ఒక సారి ఆఫీస్ కు రమ్మని చెప్పు.” అనిచెప్పి నేను ఆఫీస్ కు వచ్చేశాను..
ఒక గంట తరువాత సుధాకర్ వచ్చాడనుకున్నాను. అయితే నువ్వే సుధాకర్ వి అన్న విషయం ఎలా తెలుసుకున్నానంటే . . . నువ్వు కంగారులో ఆ రోజు నీ చెవి రింగ్ లను తియ్యకుండా, నీ లిప్ స్టిక్ తుడుచుకోకుండా ఆఫీస్ కు వచ్చేసావు. అప్పడు గుర్తు పట్టాను. ఆ తరువాత నిన్ను ఫాలో అయ్యి నీతో ఇలా పరిచయం పెంచుకున్నాను. మరి సుధా (కర్) నీ నిర్ణయం ఏమిటి? నీ మీద నూరు శాతం ప్రేమతో అడుగుతున్నాను.” అన్నాడు ప్రకాష్. దశపల్లా వచ్చింది. కారులో ప్రకాష్ భుజం మీద వాలి పోయాను.
నేను అప్పటికే మూడు సంవత్సరాలుగా స్త్రీగా మారటానికి కావలసిన చికిత్సలో ఉన్నాను. చాలా దశలు పూర్తి అయ్యాయి. ఇంకా శస్త్ర చికిత్సలు మిగిలాయి. అవన్నీ పూర్తి అయ్యాకా వివాహం చేసుకోవాలి అని అనుకున్నాం. ఈ లోపు సుధగా తరచు ప్రకాష్ పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తూ వాళ్ళ చేత పిన్ని అని పిలిపించు కొంటూ వాళ్ళకి దగ్గర అయ్యాను. శస్త్ర చికిత్సలు పూర్తి అయ్యాకా నేను మిసెస్ ప్రకాష్ ను అయ్యాను.
మాట కొద్ది మగువ అంటారు. నీ మాట వల్లనే నీలోని మగువని నాదానిగా చేసుకున్నాను అంటూ ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ప్రకాష్. నేను ఎప్పటికీ కరగని కర్పూరపు ముద్దనయ్యాను. లేదా ముద్దు కర్పూరం అయ్యానేమో! థాంక్స్ టు మార్గరెట్ టీచర్ అనుకున్నాను. నాకు నా భాషలో ఫిమేల్ మానరిజం రావటానికి టీచరే కారణం మరి. ఆవిడే నాకు చీర కట్టుకోవడం దగ్గరనుంచి అన్ని ఆడ పనులు నేర్పింది. జీవితంలో ఒంటరి వైన నీకు ఇవన్నీ ఎప్పటికైనా ఉపయోగ పడతాయి అని చెప్పింది. అవి ఇలా ఉపయోగ పడ్డాయి.
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.