నాలోని ఆడపిల్ల (గీత కథ)

gvgarima

  | November 02, 2025


Completed |   3 | 1 |   1345

Part 1

నేను పుట్టగానె నాన్న
కొడుకు పుట్టెఓరన్న
ఇదె చూడు నాకన్న
ఎవడు వీడి కంటె మిన్న

అంటూ విందుల చేసె
బంధువులందరు మురిసె
నా అన్నలు చిందులేసె
అమ్మ వేరుగా నను చూసె

ఇంట్లో అందరు కొడుకులు
ఇంటలేవు లక్ష్మి కళలు
ఒక్క ఆడ పిల్ల హొయలు
ఇంట వెలుగు దీపశిఖలు

అని తలచిన అమ్మ నన్ను
వేసి నాకు చిన్న గౌను
లక్ష్మి అనుచు నను పిలిచెను
ముద్దులిడిచి మురిపించెను. (సశేషం)

Part 2

ఆడపిల్లలతొ ఆటలు
వంట, వార్పులు, పాటలు
పూలమాలలల్లికలు
ఇంట రంగవల్లికలు

నాన్న కూడ అమ్మ మనసు
నెరుగుచు కాదనక వయసు
పెరిగి నంత నన్ను జేర్చె
నదె బాలికల బడిలో

వయసు తోను ఎదపొంగులు
పెరిగె యువత పొంద మరులు
నడకను బాలికల తీరు
మాటల కన్నియల జోరు

నవ్విన సెలయేటి సడులు
మదిలో కోర్కెల సుడులు
తుళ్ళి తుళ్ళి నాట్యాలు
సిరి మువ్వల సవ్వడులు (సశేషం)

Part 3

ఆడపిల్లలతొ ఆటలు
వంట, వార్పులు, పాటలు
పూలమాలలల్లికలు
ఇంట రంగవల్లికలు

నాన్న కూడ అమ్మ మనసు
నెరుగుచు కాదనక వయసు
పెరిగి నంత నన్ను జేర్చె
నదె బాలికల బడిలో

వయసు తోను ఎదపొంగులు
పెరిగె యువత పొంద మరులు
నడకను బాలికల తీరు
మాటల కన్నియల జోరు

నవ్విన సెలయేటి సడులు
మదిలో కోర్కెల సుడులు
తుళ్ళి తుళ్ళి నాట్యాలు
సిరి మువ్వల సవ్వడులు (సశేషం)

Part 4

నాలోన కులుకు పుట్టె
నాన్నకేమొ గుబులు పుట్టె
అమ్మ కేమొ నవ్వు పుట్టె
అందరికీ వింత పుట్టె

పుట్టినపుడు వీడు
ఇపుడేమో కన్నె ఈడు
దీనికెవరు దొరకు జోడు
అని అమ్మని అడిగినాడు

అపుడు తాత వచ్చినాడు
నా బాల్యపు కథ చెప్పినాడు
అమ్మ పుట్టినూరు కలడు
ముదుసలి ఫకీరు ఒకడు

అమ్మ మనసు నెరిగినాడు
తాతకు తల ఊపినాడు
నాకొకవేరిచ్చినాడు
బాలికగా మార్చినాడు

పోకడలవి బాలికవే
పాలిండ్లు బాలికవే
చిందులన్నిబాలికవే
నిదురోయే మగటిమి తప్ప

అలా యువతి నైతి నేను
కట్టు బొట్టు దిద్ది నాను
కన్నె హొయలు రువ్వి నాను
యువత ప్రేమ దోచినాను (సంతోషం)

Part 5

లక్ష్మి అనుచు కొందరు
లచ్ మి అనుచు కొందరు
లక్కీ అనుచు కొందరు
లవ్ మి అనుచు యువకులు

నన్ను పిలుచు వారందరు
నా తొ చెలిమి చేయువారు
యువకులు నా చుట్టు చేరి
నా జంటను కోరువారు

ఒక సాయం పొద్దు వాలు
కట్టి లంగా ఓణీలు
తలను తురిమి మల్లె పూలు
చేరినాను ఏటివాలు

ఒంటరిగా నడిచి నాను
కాలువ గట్టున నేను
పూదోటను చేరి నాను
పూల లతల ముట్టి నాను

ఎన్నొ జతల కళ్ళు నన్ను
పరికించెను సొగసుల గని
సొంతం కావాలంటే
ఏమి చేయ వలెనటంచు

నన్ను అడుగు చుండె వారు
ప్రతి ఒక్కరు కోరు వారు
వారి కోర్కె మింటి మీరు
నాపై వలపుల జోరు

ఇంతలో ఊరి పెద్ద
కొడుకు వచ్చె నీయ ముద్దు
వెనుక నుంచి నా నడుము చుట్టు
తన చేతుల పట్టినాడు (సశేషం)


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Ladybug Ladybug

Super

gvgarima gvgarima (Author)

Thank you LB for your sweet ❤️ comment. I request other sisters also to give your lovely 😍 comments. Your sister Garima with lots of love

gvgarima gvgarima (Author)

మై డియర్ యల్బిఅండ్ ఆల్ అదర్ సిస్టర్స్, నేను ఈ చిన్న కథను ఒక గీత రూపంలో వ్రాసాను. ఇది నాకు తోచిన ఒక ప్రయోగం. బహుశా తెలుగులో ఇది ఒక కొత్త ప్రయోగం ఏమో. మూడవ ప్రకృతి వనితల కథలను గీత రూపం లో వ్రాయటం. మీకు నచ్చితే మీ ప్రేమతో కూడిన కామెంట్స్ ను ఇక్కడ జతచెయ్యమని కోరుతున్నాను. ప్రేమతో మీ గరిమ