nadakalo vayyaram

gvgarima

  | November 28, 2025


Completed |   2 | 1 |   939

Part 1

నడకలో వయ్యారం (చిన్న కథ)
సుశాంత్ శాంతి గా మారుతున్న సమయం అది. జుట్టు భుజాలకు మించి పొడవుగా పెంచుకున్నాడు. అలా పెరగటానికి ఎనిమిది నెలలు పట్టింది. అలాగేనెమ్మదిగా ఆడ వస్త్ర ధారణ కి అలావాటు పడుతున్నాడు. ఆవిషయం లో తనకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని నెట్ లో చూస్తుండగా చెన్నైలో ఒక సిడి సపోర్ట్ అనే సెంటర్ కనబడింది. దాని నిర్వాహకురాలు హేమ అని ఫోన్ నంబర్ కూడా దొరికింది. ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు.
సుశాంత్ స్వస్థలం రాజమండ్రి. వర్కింగ్ ప్లేస్ నెల్లూరు. బయట ఊళ్లకు వెడితే తనను తాను ఆడపిల్లలాగే అలంకరించుకుని కొద్దిగా చీకటి పడే వేళకి ప్రయాణం అవుతాడు. ఆ రోజు మాత్రం పొద్దున్నే నాలుగు గంటల వేళకు తన రూం నుంచి బయల్దేరాడు. చెన్నై కి ఏదో బండి దొరికితే దానిలో వెళ్ళాడు. క్రీమ్ కలర్ కుర్తి, జీన్స్ పాంట్ ధరించి కుర్తి లోపల పాడెడ్ బ్రా వేసుకున్నాడు. ఎడమచేతికి లేడీస్ రిస్టు వాచీ, కుడిచేతికి ఒక లావుపాటి గాజు వేసుకుని, ఫ్లాట్ స్లిప్పర్స్ వేసుకున్నాడు. నెమ్మదిగా చెన్నై సెంట్రల్ కు చేరుకునేసరికి 7.00 గంటలు అయ్యింది. సిడి సపోర్ట్ కి చేరుకునేసరికి 8.30 అయ్యింది. హేమ అప్పటికే క్లయింట్స్ తో మాట్లాడుతోంది. నేను నెల్లూరు నుంచి వచ్చాను అని చెప్పగానే “ఓ శాంతి! వెల్కమ్” అని ఆహ్వానించింది. “కాఫీ తాగుతావా?? అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే తన ఫ్లాస్క్ లో ఉన్న కాఫీ కప్పులో పోసి నాకు ఇచ్చింది. నేను నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తుండగా ఆమె తన క్లయింట్స్ తో మాట్లాడుతూనే నన్ను పరిశీలిస్తోంది. పది నిముషాల్లో వాళ్ళకి కావలసిఉంది అమ్మేసి నా వైపు తిరిగింది. ఇప్పుడు చెప్పు శాంతి. నీ కేం కావాలి? నువ్వు cd గా ఉండాలనుకుంటున్నావా? లేక ఆడ గా మారిపోవాలి అనుకుంటున్నావా? అని అడిగింది.. తనకింకా నిర్ధారణ లేదు. ప్రస్తుతానికి స్త్రీలా ప్రవర్తించాలి అని, కొంత కాలం తరువాత ఏమవ్వాలో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అయితే ఇప్పుడు నీకేం కావాలి? అని అడిగింది హేమ. నేను చక్కగా ఆడపిల్ల లాగా వయ్యారంగా నడవాలి. ఆ నడక నేర్పించాలి. అన్నాడు,. “అయితే సాయంత్రం వరకూ నువ్వు చెన్నై వీథుల్లో తిరుగు. ఇక్కడ ఆడవాళ్ళని, స్కూల్ గర్ల్స్ ని, ఇక్కడికి దగ్గరలో కళాక్షేత్ర కి వెళ్ళి వాళ్ళు అంతా ఎలా నడుస్తున్నారో చూసి రా. వాళ్ళలో నీకు ఎవరి నడక బాగా నచ్చిందో చెప్పు. ఆ నడక నీకు నేర్పుతా” అంది హేమ.
ఆ రోజంతా అన్ని వయస్సుల ఆడవాళ్ళని పరిశీలిస్తూనే ఉన్నాడు. వారిలో నూటికి 90% మందిలో ఎవ్వరిలోనూ ఆడ నడకలో నాజూకు దనం లేదు. అందరూ తాము ఎలా నడుస్తున్నారో చూసుకోవటం లేదు. బస్ దొరికిందా లేదా? ఆటో దొరికిందా లేదా? స్కూటీ వరకు గబగబా నాడుస్తున్నామా? లేదా? ఇవె వాళ్ళ తీరు తెన్నులు. అయితే కపాలేశ్వర స్వామి ఆలయం దగ్గర పూలు, పళ్ళు అమ్మే వాళ్ళు మాత్రమే కొంచెం ఆడవాళ్ళలా నడుస్తున్నారు. మరికొందరు ఆడ నడక నడుస్తున్నారు కానీ వాళ్ళ శరీర భారం వల్ల..”
సాయంత్రం హేమ కు ఆదేచెప్పాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. ?నువ్వు ఇలా చెయ్యి. నీ బట్స్ ఎత్తుగా కనబడటానికి బట్ పాడ్స్ వేసుకో. అని చెప్పింది. ఆ పైన పాడెడ్ బ్రా కి బదులు బ్రెస్ట్ ఫార్మ్స్ వేసుకో. ఆపైన పాడెడ్ బ్రా వేసుకో అని చెప్పింది. అల్లాగే ఫ్లాట్ చెప్పులు ప్రక్కన పెట్టి హై హీల్స్ వేసుకో. హై హీల్స్ వేసుకుని నడక ప్రాక్టీస్ చెయ్యి. ఆ నడకలో కూడా నీ ఆరెండు అరచేతులు నీ తొడలను చూడటం కాకుండా ముందు ఉన్న దారిని చూసే లా పెట్టు. అడుగులు అంగలు పెద్దవి కాకుండా చిన్న చిన్న అడుగులు వేసుకో. నడిచే సమయం లో కృత్రిమత లేకుండా సహజం గా నిదానంగా నడు. అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి.” అని చెప్పింది. హేమ చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం అంతా ఆ నడకే ప్రాక్టీస్ చేశాడు. చాలా వరకూ అడనడక వచ్చింది. వయ్యారానికి మాత్రం నిర్వచనం లేదు. ఇది వయారపు నడక.కథ.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Abba super bhale vundi @gvgarima akka ee story

gvgarima gvgarima (Author)

మీకు నచ్చినందుకు చాలా సంతోషం చెల్లి. మీకు కృతజ్ఞతలు. వీటిలో చాలా వరకూ కథలు నా అనుభవం లోనివి, నేను చూసినవి. అతికొద్ది కథలు మాత్రం ఫిక్షన్ కథలు.