దారిలో ఏవేవో విషయాలు చెబుతూ మాతాజీ మిమ్మల్ని తీసుకుని ఆశ్రమానికి తీసుకుని రమ్మన్నారు. అక్కడికి వస్తే ఎందుకో మీకు తెలుస్తుందట." అన్నారు. నెమ్మదిగా మేం హృషీకేశ్ కు చేరుకున్నాకా వాళ్ళ కారులో నేను మాతాజీ దగ్గరకి బయల్దేరాను. హృషీకేశం నేను తొలిసారి వస్తున్న ప్రదేశమే అయినా ఈ ఆశ్రమం దారి మాత్రం నాకు సుపరిచితం లాగా అనిపించింది. కొంత దూరం వెళ్ళాకా అక్కడి నుంచి ఆ దారిలో ఏమేమి వస్తాయో ముందుగానే నాకు తెలుస్తున్నాయి. ఆశ్రమం సమీపించే సరికే లోపల ఏ గదిలో మాతాజీ ఉన్నారో ముందుగా నేనే వాళ్ళకి చెప్పాను. వాళ్లిద్దరూ నవ్వుకున్నారు. కారణం ఇవన్నీ నేను చెబుతాను అని మాతాజీ ముందే చెప్పారుట వాళ్ళకి. తరువాత ఆశ్రమంలో ఈశాన్యంలో ఉన్న తామర కొలను వద్దకు వెళ్ళి నెమ్మదిగా కాళ్ళు కడుక్కున్నాను. ఆ తరువాత అక్కడనుంచి మాతాజీ ఉన్న మందిరం వైపు నడుస్తున్నాను. ఇంతలో నాతో వచ్చిన ముఖర్జీ, మిశ్రా ఇద్దరూ అక్కడే నిలిచిపోయి మిమ్మల్ని మాత్రమే లోపలికి పిలిచారు. అన్నారు. సరే నెమ్మదిగా నేను లోపలికి ప్రవేశించాను. అది ఒక గుహలాగా ఉంది. అందులో ఉపరితలం లో షట్చక్రాలు వృత్తాకారంలో గీయబడి ఉన్నాయి. మధ్యలో సహస్రారం ఉంది. ఆ సహస్రారానికి మధ్య బిందువుకు క్రింద నేలపై సభా మందిరం మధ్యలో ఉన్న ఉన్నతాసనంపై మాతాజీ ఋతంభర ప్రసన్నం గా నవ్వుతూ "రా శివానీ!" అన్నారు. ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. కారణం నా సూక్ష్మ అంతరంగం లో "నేను ఒక స్త్రీని, నా పేరు శివాని" అనే భావన నాకు ఎప్పటినుంచో ఉంది. . అంతే కాదు. నాకు ఇంచుమించుగా రోజు విడిచి రోజు నాకు ఒకే కల వస్తుంది. ఆకలలో ఈ ఆశ్రమం, ఈ మాతాజీ, అలాగే శివాని నాకు కనబడుతుంటారు. ఆ శివాని నేనే అని ఇప్పుడే తెలుస్తోంది.
Festival · Telugu
యోగిని శివాని
Completed
|
Part 2 of 3
|
0 Likes
Part 2
1011 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)