ఆడతనపు మెరుపుల పండుగ చమయ విలక్కు (గరిమ కథల్లో కొల్లం పండుగ)

gvgarima

  | December 15, 2025


Completed |   0 | 1 |   852

Part 1

నేను తిరుపతికి మకాం మారిన తరువాత మల్లి, ప్రవీణ, మందిర, మా సుందరమ్మ అత్త వీళ్ళ సాహచర్యం, వీళ్ళతో సహజీవనం ఇవి నా బ్రతుకు కు చుక్కాని లాంటివి. అయితే నేనే కాదు. నాతో చాలా మంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలో అభాగ్యులు. అని నిత్యం ఆలోచిస్తుంటాను. ఈ సందర్భం లో నాకు మునుపు రాగిణక్క ద్వారా పరిచయమైన మహిళ అనితా నంబూతిరి. ఆమె ఒక అపురూప సౌందర్యవతి. ఆమె ఇటు కూవగం పండుగకి, అటు కొల్లం లోని చమయ విలక్కు పండుగకి ప్రతి సంవత్సరం వెడుతుంది. ఈ సంవత్సరం కూడా వె\డుతోంది. అప్పుడు నేను ఈ ఉత్సవం గురించి చెప్పమని అడిగాను. సమాధానం గా ఈ పండుగ గురించి చెప్పడం మొదలు పెట్టింది అనిత.
కొల్లం లోని దేవి ఆలయ ఉత్సవం, ముఖ్యంగా చమయవిలక్కు, కేరళలోని కొల్లం జిల్లాలోని చావరలోని కొట్టంకులంగర దేవి ఆలయంలో జరిగే ఒక ప్రత్యేకమైన మరియు ఉత్సాహభరితమైన వేడుక. ఈ 10-12 రోజుల పండుగ మార్చిలో మలయాళ మాసం మీనం సమయంలో జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ చమయవిలక్కు ఆచారం, ఇక్కడ పురుషులు చీరలు వంటి సాంప్రదాయ స్త్రీ దుస్తులు ధరించి, సాంప్రదాయ దీపాలను పట్టుకుని గొప్ప ఊరేగింపులో నడుస్తారు. సాంప్రదాయ ఆర్కెస్ట్రాలతో కూడిన ఈ ఊరేగింపు ఆకర్షణీయమైన మరియు రంగురంగుల దృశ్యాన్ని సృష్టిస్తుంది.
చమయవిలక్కు సంప్రదాయం శతాబ్దాల నాటిది మరియు స్థానిక పురాణం నుండి ఉద్భవించింది. కథ ప్రకారం, గోప బాలురు అమ్మాయిల వలె దుస్తులు ధరించి వారు దేవతగా పూజించే రాయి చుట్టూ ఆడుకునేవారు. ఒక రోజు, దేవత వారికి రాయి నుండి కనిపించింది, ఇది ఆలయ సృష్టికి మరియు ఈ ప్రత్యేకమైన ఆచారానికి దారితీసింది.
ఈ పండుగ సమయంలో, చవర, పుతుకడ్, కులంగర మరియు కొట్టక్కకం అనే నాలుగు 'కరాలు' లేదా తీరాల నుండి వచ్చిన పురుషులు ఈ ఆచారంలో పాల్గొంటారు. వారు జాగ్రత్తగా గడ్డం వేసుకుని, మేకప్ వేసుకుని, రంగురంగుల చీరలు ధరిస్తారు, దేవత నుండి ఆశీర్వాదం పొందేందుకు తమను తాము మార్చుకుంటారు.
చమయవిలక్కు పండుగ కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు; ఇది సాంప్రదాయ లింగ మరియు సామాజిక పాత్రలను విచ్ఛిన్నం చేసే సాంస్కృతిక దృగ్విషయం. ఇది లింగ వ్యక్తీకరణలో ద్రవత్వాన్ని ప్రదర్శిస్తుంది, దీనిని అరుదైన మరియు లోతైన వేడుకగా చేస్తుంది.
ఈ పండుగలో కెట్టుకఝ్చ, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు సాంప్రదాయ కళారూపాలు వంటి ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. పైకప్పు లేని ప్రత్యేకమైన గర్భగుడితో ఉన్న కొట్టంకులంగర దేవి ఆలయం పండుగ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.
చమయవిలక్కు భక్తి మరియు విశ్వాసం యొక్క శక్తికి నిదర్శనం. దీపాలను మోసుకెళ్లడం వల్ల దేవత నుండి అనుగ్రహం లభిస్తుందని పాల్గొనేవారు నమ్ముతారు, అది అప్పులు తీర్చడం కోసం అయినా లేదా పాపాలకు క్షమాపణ కోరడం కోసం అయినా.
ఈ ఉత్సవంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, దాని సమ్మిళితత్వం మరియు వైవిధ్యాన్ని జోడిస్తుంది. ఈ కార్యక్రమం వారు తమ గుర్తింపును జరుపుకోవడానికి మరియు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తీకరించుకోవడానికి ఒక వేదికగా మారింది.
పండుగకు సన్నాహాలు వారాల ముందుగానే ప్రారంభమవుతాయి, పాల్గొనేవారు కొత్త చీరలు, నగలు కొనుగోలు చేస్తారు మరియు ఈ సందర్భంగా బ్లౌజ్‌లు తయారు చేస్తారు. పండుగ రోజున, వారి భార్యలు లేదా మహిళా బంధువులు ఆలయానికి ఊరేగింపు కోసం దుస్తులు ధరించడంలో వారికి సహాయం చేస్తారు.
మొత్తంమీద, కొల్లం దేవి ఆలయ ఉత్సవంలో జరిగే చమయావిళక్కు ఒక ప్రత్యేకమైన మరియు మరపురాని అనుభవం, ఇది కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు విశ్వాసం మరియు భక్తి శక్తిని ప్రదర్శిస్తుంది.

Part 2

అనిత చెప్పే తీరు చాలా బాగుంటుంది. సహజంగానే అనిత స్నేహ పూర్ణ. అయితే పరిచయం చేసింది రాగిణక్క కనుక నా విషయం లో అనితకి మరింత ఇష్టం ఉంది. అంతేకాదు నా విషయం లో కేర్ కూడా ఎక్కువే. కనుకనే కొల్లం గురించి చెప్పి ఈ సారి కొల్లం లో మార్చి 23 న కలుద్దాం మధు. మార్చి 24, 25 తారీఖులలో మెయిన్ ఫెస్టివల్. నువ్వు తిరుపతి నుంచి రా. నేను బెంగళూరు నుంచి వస్తాను. మనిద్దరం కొల్లం లో గుడికి దగ్గరలో విజయ పాలెస్ లో రూంలు బుక్ చేసుకుందాం. అని చెప్పింది. నేను అలాగే అని చెప్పాను. నేను విజయా ప్యాలెస్ లో సెకండ్ ఫ్లోర్ 209 రూం నెంబర్ బుక్ చేసుకున్నాను. అనిత రూం నెంబర్ 109లో అంటే ఫస్టు ఫ్లోర్ లో బుక్ చేసుకుంది. నేను మార్చి 23 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కొల్లం చేరుకున్నాను. కొల్లాం నుంచి కొట్టకూలంగర్ దేవీ ఆలయానికి 18 కిలో మీటర్లు దూరం. అలా బస్ లో ఊళ్ళోకి వచ్చి అక్కడి నుంచి నేరుగా విజయ ప్యాలెస్ కు వెళ్ళాను. నేను ప్యాలెస్ లో నా రూం లో దిగాకా రిఫ్రెష్ అయి అనితకి ఫోన్ చేశాను. రా మధు. అని చెప్పింది. నేను అనిత దగ్గరకి వెళ్ళాను. అక్కడ సోఫాలో అనిత పాంటీ, బ్రా మాత్రమే కట్టుకుని ఉంది. వంటి మీద మరే వస్త్రాలు లేవు. సిగరెట్ తాగుతోంది. ఒక పది నిముషాలు పాటు సిగరెట్ త్రాగుతూనే నేను కట్టుకున్న పంజాబీ డ్రెస్ చాలా బాగా ఉంది అని చెప్పింది. ఆ తరువాత ఆ కబుర్లు, ఈ కబుర్లు చెబుతూ తన కాలి వేళ్ళకీ, చేతి వేళ్ళకీ మెరూన్ రంగు వేసుకుంది. మరో పది నిముషాలకి లేచి నిలబడింది. అయిదు అడుగుల పదంగుళాల ఎత్తు. చాలా లోతైన బొడ్డు. నిగ నిగా మెరిసే తొడలు. ఎంతో అందమైన సన్నని పాదాలు. ఆమె శరీరం ఎంతో అందంగా ఉంది. బంగారు ఛాయ. నెమ్మదిగా లంగా తీసుకుంది. పైనుంచి లంగా వేసుకుని లంగా బొందులు ఇంపుగా నడుముకు బంధించి అక్కడి నుంచి తను తెచ్చిన మూడు సూట్ కేసులలో ఒకసూట్ కేస్ నిండా ఫాన్సీ చీరలు, రెండవ సూట్ కేసు నిండా కాటన్ చీరలు, మూడవ సూట్ కేసు లో ఒక రెండు పట్టుచీరలు, తన స్టే కి సరిపడా లింగరీ, వగైరా అన్నీ సద్దుకుని వచ్చింది. అనిత ఫాన్సీ చీరలు కట్టటం లో చాలా ఎక్స్పర్ట. నేను విప్పార్చిన కన్నులతో ఆమే చీర కట్టిన విధానం చూసి ఆశ్చర్య పోతున్నాను. ఇంతలో ముంబయి నుంచి రూపా జాస్మిన్ వచ్చింది. ఆమెని సాక్షాత్తు చూసింది ఇక్కడే కానీ నాకు, ఆమెకి షుమారు ఒక సంవత్సరం గా ఆన్లైన్ లో పరిచయం ఉంది. వస్తూనే హాయ్ మధు అంటు వచ్చి నన్ను కౌగలించుకుంది జాస్మిన్. ఆమె స్పర్శ చాలా మృదువు గా ఉంది. ఎంతో నాజూకు అయిన రూపం. జాస్మిన్ లాంటి పరిమళం. అపురూపమైన రూపం. కలసి రూపా జాస్మిన్. వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆర్థికంగా చాలా చిన్నదాన్ని. అనిత ఒక పెద్ద లాండ్ లార్డ్. ఆమె కి ఎన్నో ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు చేసే తోటలు కూడా ఉన్నాయి. అనిత ఒక సారి చీర కట్టింది అంటే ఆమె లోతైన బొడ్డులో పడి ఎంతటి రసికులైన గిలగిలలాడాల్సిందే. ఇక రూప ఏ డ్రస్సు వేసినా ఆ డ్రస్సు కే ఒక హోదా వచ్చినట్టే. రూప పునె ఒక సైంటిస్ట్. మెడికల్ బాటనీ మీద పరిశోధన చేస్తోంది. రూప ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఎత్తు. డ్రస్సు, ఆభరణాలు, మేకప్, మాట, చూపు, నడక అన్నీ ఎంతో సహజమైన ఆడతనానికి గుర్తులు. వాళ్ళిద్దరూ, నేను అలా సాయంత్రం బజార్ వైపు కాలినడకన వెళ్ళి వద్దాం అని బయల్దేరాం. అప్పుడు ఎంత మంది చూపులు వాళ్ళిద్దరిమీద పడ్డాయో? వాళ్ళతో పాటు నన్ను కూడా చూస్తున్నారు. ఇంతలో చాలా వేగంగా ఒక కుర్రాడు నన్ను పట్టుకోవటానికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంతలో తన చేతిలో ఉన్న చిన్న కర్రని వస్తున్న కుర్రాడికి ఎదురుగా పెట్టింది అనిత. ఊహించని ఆ దెబ్బకి ఎక్కడో తగిలిన ఆ కుర్రాడు నెమ్మదిగా అక్కడినుంచి జారుకున్నాడు.

Part 3

ఆరోజు రాత్రి మరునాటికి కావాల్సిన కొన్ని ఫ్రెష్ ఐటమ్స్ కొన్నాం. తరువాత టెంపుల్ సరౌండింగ్స్ నుంచి బజార్ వరకూ ముగ్గురంవిహరించాం. ముగ్గురికీ స్త్రీలుగా ఉండటం, మసలటం చాలా సహజమైన విషయమే. నాకు నేను ఏ మేకప్ లేకుండానే స్త్రీగానే పరిగణింపబడుతూంటాను. ఇంకా అనిత, రూప ఇద్దరూ వస్త్రధారణతో చాలా ధనవంతులైన ఉన్నతకుటుంబపు ఆడవారిలా ఉంటారు.
అయితే కొల్లం దేవీ మందిరానికి వెళ్ళేటప్పుడు దేవతా స్త్రీలలాగా అన్ని విధాలైన అలంకారాలతో, చక్కని మేకప్ తో వెడితే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది అనుకున్నాము. నిలువెత్తు ఆభరణాలు, ప్రత్యేకంగా కేరళ చీరలు, తలనిండా ఒక్కొక్కరికి పది మూరలు మల్లెపూలు, వంటినిండా పూలమాలల అలంకరణలు చేయటానికి ఒక్కొక్కరికి ఒకరోజుకి మూడు వేలు ఖర్చు అయ్యింది.
ఆ రోజు 24 వ తారీఖు. మధ్యాహ్నం రెండు గంటలకు మేకప్ మొదలు పెడితే సాయంత్రం 6.30 కి మేకప్ పూర్తి అయ్యింది. ఇంక మేము మేలి ముసుగులు వేసుకుని గుడికి చేరుకున్నాం. అక్కడ అయిదు కుందెల దీపాలను మాకు మేకప్ చేసిన వాళ్ళే ఏర్పాటు చేశారు. ఆలయం అంతా వందల సంఖ్యలో మావంటి వారితో నిండి పోయింది. అక్కడ ఎంతో చక్కగా అలంకరింపబడిన చాలా ఎత్తైన ఏనుగులు కూడా ఉత్సవం లో పాల్గొన్నాయి.
మేము ఆ దీపాలు తీసుకుని ప్రవేశానికి రుసుము చెల్లించి ఆలయంలో అడుగు పెట్టాం. చాలా మంది లో మేం ఎంతో ప్రత్యేకం గా కనబడుతున్నాం. చాలా మర్యాద పూర్వకంగా స్థానిక యువకులు, ప్రజలు వచ్చి మాతో ఫోటోలు దిగుతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడికి ఎన్నో రాష్ట్రాలనుంచి వచ్చిన సోదరీమణులను పలకరిస్తూ వాళ్ళ తో పాటు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ రాత్రి తెల్లవార్లూ అక్కడే గుళ్ళోనే ఉన్నాం.
ఆతరువాత హోటల్ కు చేరుకుని నెమ్మదిగా పడుక్కుని మరునాడు అంటే మార్చి 25వ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచాం.
అనిత స్నానం చేసి తను తెచ్చిన చీరల్లో ఒక మంచి ఫాన్సీ చీర కట్టుకుంది. రూపకూడా చీర కట్టుకుంది. నేను సల్వార్ కమీజు ధరించాను. మేం ముగ్గురం కొల్లం బీచ్ కి వెళ్లి చాలా సేపు అక్కడే అనిత కి, రూప కి తెలిసిన వాళ్ళతో ఏవేవో ఆడి అక్కడే రెస్టారెంట్ లో అవీ, ఇవీ తిని రూం లకి చేరుకుని సింపుల్ మేకప్ లు మేమే స్వయంగా చేసుకున్నాం. సాయంత్రం ఎనిమిది గంటలకు దీపాలు పట్టుకుని గుడికి చేరుకున్నాం. రాత్రి ఒంటి గంట వరకు అక్కడే గుళ్ళోనే గడిపాం. ఆ తరువాత హోటల్ కు చేరుకుని తెల్లవారే వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. ఆతరువాత అనితకి, రూపకి గుడ్ బై చెప్పి స్నానం చేసి, రెడీ అయ్యి తొమ్మిది గంటలకు కొల్లం - తిరుపతి రైలు బండిలో ఆంధ్రా కి బయల్దేరాను.
అది నా తొలి కొల్లం పండుగ కథ.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.