Festival · Telugu

ఆడతనపు మెరుపుల పండుగ చమయ విలక్కు (గరిమ కథల్లో కొల్లం పండుగ)

Completed | Part 3 of 3 | 1 Likes

Part 3

ఆరోజు రాత్రి మరునాటికి కావాల్సిన కొన్ని ఫ్రెష్ ఐటమ్స్ కొన్నాం. తరువాత టెంపుల్ సరౌండింగ్స్ నుంచి బజార్ వరకూ ముగ్గురంవిహరించాం. ముగ్గురికీ స్త్రీలుగా ఉండటం, మసలటం చాలా సహజమైన విషయమే. నాకు నేను ఏ మేకప్ లేకుండానే స్త్రీగానే పరిగణింపబడుతూంటాను. ఇంకా అనిత, రూప ఇద్దరూ వస్త్రధారణతో చాలా ధనవంతులైన ఉన్నతకుటుంబపు ఆడవారిలా ఉంటారు.
అయితే కొల్లం దేవీ మందిరానికి వెళ్ళేటప్పుడు దేవతా స్త్రీలలాగా అన్ని విధాలైన అలంకారాలతో, చక్కని మేకప్ తో వెడితే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది అనుకున్నాము. నిలువెత్తు ఆభరణాలు, ప్రత్యేకంగా కేరళ చీరలు, తలనిండా ఒక్కొక్కరికి పది మూరలు మల్లెపూలు, వంటినిండా పూలమాలల అలంకరణలు చేయటానికి ఒక్కొక్కరికి ఒకరోజుకి మూడు వేలు ఖర్చు అయ్యింది.
ఆ రోజు 24 వ తారీఖు. మధ్యాహ్నం రెండు గంటలకు మేకప్ మొదలు పెడితే సాయంత్రం 6.30 కి మేకప్ పూర్తి అయ్యింది. ఇంక మేము మేలి ముసుగులు వేసుకుని గుడికి చేరుకున్నాం. అక్కడ అయిదు కుందెల దీపాలను మాకు మేకప్ చేసిన వాళ్ళే ఏర్పాటు చేశారు. ఆలయం అంతా వందల సంఖ్యలో మావంటి వారితో నిండి పోయింది. అక్కడ ఎంతో చక్కగా అలంకరింపబడిన చాలా ఎత్తైన ఏనుగులు కూడా ఉత్సవం లో పాల్గొన్నాయి.
మేము ఆ దీపాలు తీసుకుని ప్రవేశానికి రుసుము చెల్లించి ఆలయంలో అడుగు పెట్టాం. చాలా మంది లో మేం ఎంతో ప్రత్యేకం గా కనబడుతున్నాం. చాలా మర్యాద పూర్వకంగా స్థానిక యువకులు, ప్రజలు వచ్చి మాతో ఫోటోలు దిగుతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడికి ఎన్నో రాష్ట్రాలనుంచి వచ్చిన సోదరీమణులను పలకరిస్తూ వాళ్ళ తో పాటు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ రాత్రి తెల్లవార్లూ అక్కడే గుళ్ళోనే ఉన్నాం.
ఆతరువాత హోటల్ కు చేరుకుని నెమ్మదిగా పడుక్కుని మరునాడు అంటే మార్చి 25వ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచాం.
అనిత స్నానం చేసి తను తెచ్చిన చీరల్లో ఒక మంచి ఫాన్సీ చీర కట్టుకుంది. రూపకూడా చీర కట్టుకుంది. నేను సల్వార్ కమీజు ధరించాను. మేం ముగ్గురం కొల్లం బీచ్ కి వెళ్లి చాలా సేపు అక్కడే అనిత కి, రూప కి తెలిసిన వాళ్ళతో ఏవేవో ఆడి అక్కడే రెస్టారెంట్ లో అవీ, ఇవీ తిని రూం లకి చేరుకుని సింపుల్ మేకప్ లు మేమే స్వయంగా చేసుకున్నాం. సాయంత్రం ఎనిమిది గంటలకు దీపాలు పట్టుకుని గుడికి చేరుకున్నాం. రాత్రి ఒంటి గంట వరకు అక్కడే గుళ్ళోనే గడిపాం. ఆ తరువాత హోటల్ కు చేరుకుని తెల్లవారే వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. ఆతరువాత అనితకి, రూపకి గుడ్ బై చెప్పి స్నానం చేసి, రెడీ అయ్యి తొమ్మిది గంటలకు కొల్లం - తిరుపతి రైలు బండిలో ఆంధ్రా కి బయల్దేరాను.
అది నా తొలి కొల్లం పండుగ కథ.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

1161 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login