అది 1988 వ సంవత్సరం. విజయవాడ సత్యనారాయణ పురంలో శంకరానికి, దేవికి ఉన్నంతలో లక్షణంగా పెళ్ళి జరిగింది. శంకరం తెలుగు ఉపాధ్యాయుడు. దేవి డిగ్రీ పాసైంది. కాపురం సజావుగా ఉంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక మంచి చదువులు చదువుకుని ముగ్గురు విదేశాలలో స్థిరపడ్డారు. ముగ్గురు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు 2015. శంకరానికి 55 ఏళ్లు. దేవికి 50 ఏళ్లు. వాళ్ళు హైదరాబాద్ కి మారారు.
పిల్లలు కొంచెం పెరిగినప్పటినుంచి వాళ్ళిద్దరి దాంపత్యం కొద్దిగా మందకొడిగా ఉంది. సంవత్సరాలు గడిచిన కొద్ది వారు ఇద్దరూ కలుసుకునే ది తక్కువ అయ్యింది.
శంకరానికి అకస్మాత్తుగా మనసులో ఏవో కొత్త ఊహలు పుట్టాయి. రోల్స్ మార్చుకుంటే? నేను స్త్రీ లాగా... దేవి పురుషుడిగా కలుసుకుంటే... అని. నెమ్మదిగా పిల్లలు కొనిపెట్టిన కంప్యూటర్లో అటువంటి విషయాలను చూడటం మొదలు పెట్టాడు. ఏకాంతం లో తనను తాను స్త్రీ లాగా అలంకరిచుకోవటం, దేవి వస్త్రాలను ధరించి ఊహల్లో తేలిపోవటం అలవాటైంది. నడకలో, మాటలో, కులుకు లో ఆడంగి అలవాట్లు చేసుకున్నాడు. జుట్టు బాగా పెంచుకున్నాడు. మీసం, గడ్డం తీసేశాడు. అతనికి ఒక అడ్వాంటేజ్ పురుష స్తనాలు.
తన కోరికను ముందు మాటల్లో, ప్రవర్తనలో కొంచెం కొంచెం వ్యక్తం చేశాడు. దేవికి చికాకు పుట్టింది. దగ్గరికి రానివ్వటం మానేసింది. శంకరం ఒంటరిగా బాధపడుతున్నాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. ఒకే కప్పుకింద ఉన్నా కొన్ని వందల మైళ్ళ దూరం ఉంది వాళ్ళ మధ్య. ఒకసారి వాళ్ళ కూతురు స్వతంత్ర యుయస్ నుంచి వచ్చింది. ఒక నెలరోజులు వాళ్ళ దగ్గర ఉంది. ఆ సమయంలో తండ్రి ముభావంగా ఉండటం, అతని స్త్రీ వంటి ప్రవర్తన అన్నీ చూస్తోంది. తండ్రి స్కూల్ కి వెళ్లినప్పుడు కంప్యూటర్ లో ఏదో ఆన్లైన్ వర్కు కోసం చూస్తే ఆడ వేషంలో తండ్రి ఫోటోలు చాలా కనిపించాయి. తండ్రి ఒక ఫోల్డర్లో తన భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తూ వ్రాసిన వ్రాతలు కనబడ్డాయి. తన పని పూర్తి చేసుకుని తన తల్లి దగ్గరకు వచ్చి ఆ కబుర్లు, ఈ కబుర్లు చెబుతూ తనదగ్గర ఉన్న ఒక ఆల్బమ్ చూపించింది. అందులో ఒకామె చాలా అందంగా వివిధ భంగిమల్లో వివిధ డ్రెస్సుల్లో కనబడుతోంది. ఆమె భుజంపై చెయ్యి వేసి జీన్స్ ప్యాంటు, టి షర్ట్ వంటి డ్రెస్సు లలో స్వతంత్ర. ఎవరే ఈ అమ్మాయి? అని దేవి అడిగింది. "మీ అల్లుడమ్మా. శోభన్. తనకు నచ్చినప్పుడల్లా శోభనగా మారుతాడు." "నువ్వెలా ఒప్పుకున్నావే?" అడిగింది. "డ్రెస్సు ల్లో ఏముందమ్మా? దాంపత్యం ముఖ్యం." అంది. దేవి లో ఏవో ఆలోచనలు పుడుతున్నాయి. తరువాత ఒక వారానికి స్వతంత్ర యుయస్ కు వెళ్ళిపోయింది.
అప్పుడే దేవి విజయవాడలో పుట్టింటికి వెళ్లింది. అక్కడ సత్యనారాయణ పురంలో ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు. ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తెరుచుకుంది. ఒకావిడ కొంగు సరిచేసుకుంటూ లోపలికి రమ్మని సైగ చేసి లోపలికి వయ్యారం గా నడుచుకుంటూ కిచెన్ లో కూరగాయలు తరగటానికి వెళ్ళింది. ఈ లోపు తలస్నానం చేసి పిడపచుట్టుకుని బయటకు వచ్చిన దేవి తల్లి కామాక్షి"రావే దేవి". అంటూ పిలిచింది. అప్పుడు సూట్ కేస్ లోపల పెట్టి "అమ్మా, నాన్నేరి? ఈవిడ ఎవరూ?" అంది. కామాక్షి ముసి ముసి నవ్వులు నవ్వుతూ "అదిగో కూరగాయలు తరుగుతోందిగా. ఆవిడే. .. లక్ష్మి! కూతురు పిలుస్తోంది. రా. అంది. వెంటనే ఏమే దేవి... ఎలాఉన్నావే... అన్నాడు లక్ష్మీపతి ఉరఫ్ లక్ష్మి. అప్పటికి తండ్రికి 72 ఏళ్లు. తల్లికి 68 ఏళ్లు.
దేవి లో ఏవో ఆలోచనలు బలపడ్డాయి. వాళ్ళతో ఆరెండు రోజులు ఎలాగో గడిపింది. హైదరాబాద్ కి బయల్దేరింది.
ఇంటికి చేరుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన శంకరం స్నానం చేసి తన రూం లో తాను పెట్టుకున్న లుంగీ, చొక్కా లో కోసం చూశాడు. కానీ అక్కడ లంగా, బ్రా, చీర జాకెట్ ఉన్నాయి. అయోమయంలో పడ్డాడు శంకరం. అప్పుడు వయ్యారం గా తలుపు దగ్గర నిలబడి దేవి"గౌరీ చీరకట్టుకో." అంది. శంకరం తేరుకునే లోపు దేవి దగ్గరకు వచ్చి చీర కొట్టుకోవటం లో సహాయం చెయ్యడం మొదలు పెట్టింది. శంకరం పూర్తి పేరు గౌరీశంకర్. ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం కలగలిసిన భావన. ఇద్దరూ గాఢపరిష్వంగం అలా ఎంతసేపు గడిపారో వాళ్ళకే తెలియదు. ఆనాటి నుంచి ఇంట్లో గౌరి స్కూల్లో శంకరం.
Discussion (7)
Gvgarima Akka, likes count issue fix chesanu..meeru check chesi cheppagalaru issue fix ayyindo ledo.
చెల్లి మేఘన గారు. నమస్కారం. మీ నిర్వహణాసామర్థ్యం చాలా గొప్పగా ఉంది. నానుంచి వచ్చిన చిన్న రిక్వెస్ట్ కి కూడా చాలా ఖచ్చితంగా స్పందించారు మీరు. నాకంటే చాలా బాగా వ్రాస్తున్నవారు ఎంతోమంది మన ఈ అందమైన ప్రపంచం లో ఉన్నారు. అందరితో పాటు నాకు సముచితమైన స్థానం ఇచ్చి మన్నించి గౌరవించటం చాలా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు
Akka, tappakunda meeru raise chesina concern meeda work chestha. Thank you for bringing it to my attention.
@gvgarima Akka meeru ee website ni mundu vundi nadipistunnanduku na krutagnyatalu
Chala bagundi... Ee madhyana chala busy ga vundi stories chadavalekapotunna.. Malli mee story tho start chesa.. Chala refreshing ga anipinchindi..
చెల్లి మేఘన! మీరు ఇచ్చే ప్రోత్సాహం చాలా గొప్పది. అంతే కాదు ఈ మధ్యకాలంలో మీరు ఈ వెబ్ సైట్ లో తెచ్చిన మార్పులు మన సోదరీమణులందరికీ ఒక స్వర్గానుభూతిని కలిగిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మీకు సర్వదా కృతజ్ఞతలు చెల్లీ💕🌹💕
చెల్లి మేఘన, మీకు ఒక రిక్వెస్ట్. నా కథలపై వచ్చిన కామెంట్స్ ను విషయంలో సంఖ్యలో తేడా లేదు. కానీ I have received 51 likes. But it is showing 14 only. So if any thing can be done in this regard I will be ever grateful to you ❤️