"అందుకని భానుమతి మేడం, మిమ్మల్ని మాలాగా పూర్తిగా ఆడదానిగా మార్చలేనేమో కానీ చూడటానికి ఆడమనిషి గా అందరూ నమ్మేలా నేను సిద్ధం చేస్తాను. అలాగే మీరు ఇంక నిస్సందేహంగా నా ముందు ఆడదుస్తుల్లో తిరగొచ్చు.
మీకు స్త్రీ సహజమైన కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఒకటి మీ పొడవాటి జుట్టు. రెండవది ఆడవారికి మల్లే మీ స్తనాలు. మూడవది మీ ఆడగొంతు. నాల్గవది మీరు మగవారి లో పొట్టి. ఆడవారిలో మామూలు ఎత్తు. చక్కని స్త్రీ సహజమైన శరీరపు అమరిక. అలాగే యాభై ఏళ్లు వచ్చినా వంటి మీద ఎక్కడా అవాంఛితంగా ఒక వెంట్రుక కూడా లేదు. ఇంక చాలు నేను ప్రతిరోజూ మీ బాడీ తో మ్యాజిక్ చేస్తాను". అని చెప్పింది కోకిల. మొదటి సారి నాకు కోకిల గురించి కుతూహలం కలిగింది. "కోకిల! నువ్వు ఏంచదువుకున్నావు?" అని అడిగాను. నా బుగ్గ మీద చిటికేసి "ఇంటర్ బైపిసి చదివా మేడం." అని చెప్పింది కోకిల. విన్న తరువాత కోకిలంటే ఒక మెచ్చుకోలు ఏర్పడింది. మేడం! సారీ సార్! ఇప్పుడు కాలేజీ కి వెళ్లి వచ్చేయండి. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాకా ఏం చేయాలో చెబుతాను. అంది. సాయంత్రం వరకూ కాలేజీ లో పాఠాలు చెబుతూ ఉన్నా నా మనస్సు కోకిల చేయబోయే మ్యాజిక్ మీదే ఉంది. సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వచ్చేశాను. రండి మేడం.. అంటూ ఎదురొచ్చి లోపలికి తీసుకుని వెళ్లింది. స్నానం చేసి రమ్మంది. టవల్ నడుం వరకూ చుట్టుకుంటుంటే... హా ... భద్రం... భద్రం... ఆడవాళ్ళు రొమ్ముల వరకూ చుట్టుకోవాలి. అని చెప్పింది. చిన్నగా నవ్వుకుని టవల్ రొమ్ములవరకూ చుట్టుకుని స్నానానికి వెళ్లి స్నానం చేసి వచ్చాను. పెద్ద పెద్ద అంగలు వెయ్యకు. అడుగు లో అడుగేసుకుంటూ రా. అంది. నెమ్మదిగా వచ్చాకా సన్నటి అండీస్ తొడుక్కోమని ఇచ్చింది. దానిమీద స్పోర్ట్స్ ఫుల్ అండర్ వేర్ తొడుక్కోమని ఇచ్చింది. మాకైతే కట్ అండీస్ చాలు. నీకు ఈ రెండు కావాలి. అని చెప్పింది. ఆ తరువాత పైన తగిన బ్రా వేసుకోమంది. ఆ తరువాత కింది చుడీదార్ ధరింపచేసింది. పైన ప్లెయిన్ కుర్తీ వేసుకో మంది. తరువాత నెమ్మదిగా జుట్టు దువ్వి రబ్బరు బ్యాండ్ తో జుట్టు దగ్గరికి ముడివేసింది. తరువాత చేతులకి గాజులు, చెవులకి దుద్దులు ఏర్పాటు చేసింది. కళ్ళకి కాటుక దిద్దింది. ముఖానికి ఫౌండేషన్ మేకప్ లైట్ గా చేసింది. తరువాత అద్దం ముందు నిలబెట్టింది. నన్ను నేను చూసుకున్నాను. కళ్ళు ఆశ్చర్యం తో విప్పారాయి. ఆనందం పెల్లుబికింది. వెంటనే కృతజ్ఞత తో కోకిలని కౌగిలించుకున్నాను. తరువాత నేను ఇందుమతి హీల్స్ చెప్పులు వేసుకున్నాను. ఆడవాళ్ళం ఇద్దరం హాస్పిటల్ వైపు నడిచాం.
Family · Telugu
భానుమతి... ఒక బహుమతి
Completed
|
Part 2 of 3
|
1 Likes
Part 2
1260 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)