రేణుక - వస్త్రధారణ

gvgarima

  | March 12, 2026


In Progress |   0 | 0 |   38

Part 1

రేణుక ఒక ధనిక కుటుంబంలో అబ్బాయిగా పుట్టి మారిన అమ్మాయి. అబ్బాయి గా ఆమె పేరు రాణా. చదువుకునే రోజుల్లోనే రాణా కి తనలో ఒక అమ్మాయి ఉందని తెలుసు. అయితే పదిమందికి ఆ విషయం తెలిస్తే తన తల్లితండ్రులు, కుటుంబం నవ్వులపాలౌతుంది. అలాకాకుండా ఉండాలంటే ఎలా అనుకుంటుంటే తను చదువుతున్న బాయ్స్ స్కూల్లో టీచర్ నాటకంలో ఒక ఫిమేల్ కారక్టర్ కోసం రాణాని ఎన్నుకున్నారు. అక్కడ నుంచి రాణా కలలు నిజం అవుతున్నాయి. చిన్న చిన్న మిడిలు, మినిలు, షార్ట్లు, గౌన్లు ఇలా నాటకాల పేర్లు చెప్పి ఇంటా బయట ఆడపిల్లలాగా తిరుగుతూంటే నాటకాలకోసం అనుకునేవారు. నెమ్మదిగా అందరూ రాణా అని పిలవటం మానేసి రేణు, రేణుక అంటూ పిలిచేవారు. కాలేజీ లో చేరాకా కూడా నాటకాలను వదల్లేదు.తన అక్క ఫ్రెండ్స్ తో కలిసి ఆడపిల్లగానే తిరిగేది.
తన వస్త్రధారణలో చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఆమెకు ఏ వస్త్రధారణ అయినా సరే, తనకు నచ్చినది వేసుకుంటుంది.
అన్నీ తొడలకు కొద్దిగా పైన ఉండే డ్రెస్సులే. అంతేకాదు. రేణుక మేనత్త ఒక గైనకాలజిస్ట్. రేణుకని చిన్నతనం నుంచి చూస్తూ. ఆడపిల్ల లక్షణాలు ఉండటం చూసి ఎవరికీ తెలియకుండా రేణుక కి పదహారవ ఏడు నుంచి HRT treatment మొదలు పెట్టింది. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చే సరికి కోతకొచ్చిన వరిచేలు లాగా అందంగా తయారైంది రేణుక.
రేణుకని చూసి రేణుక క్లాస్ మేట్సు బాయ్స్ పాండిచ్చేరి లాంగ్ డ్రైవ్ కి రమ్మన్నారు. రేణుక అలాగే అని బయల్దేరింది. జీన్స్ నిక్కర్, టీషర్ట్ వేసుకుంది. పాండిచ్చేరి బీచ్లో సాయంత్రం వరకు గడిపి ఆతరువాత స్నానం పేరు తో నిక్కర్, టీషర్ట్ తడిపేశారు. బాగ్ లో మరో మిడి, టీషర్ట్ తెచ్చుకుంది. ఆ బట్టలు వేసుకున్నాకా బాయ్స్ అందరూ కబాడీ పేరు తో రేణుని నలపటం మొదలెట్టారు. ఒక్కసారి నలుగురు మీద పడ్డారు. విషయం అర్థం అయిన రేణు హెల్ప్ హెల్ప్ అని అరిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు ట్రాన్స్ జెండర్ వనితలు రేణు ని ఆ బాయ్స్ నుంచి రక్షించారు. ఆ వనితల గురువు కనకం రాత్రి డిన్నర్ అయ్యాక రేణుని తన గదిలో పడుక్కో పెట్టుకుంది. ఆమె కూడా తెలుగు వనితే. ఆమె రేణుక ను పరిశీలనగా చూసింది. ఆమెలో మంచి కన్నెతనం కనబడింది. చాలా ఆదరం తో రేణుకి వస్త్రధారణ లో కొన్ని జాగ్రత్తలు నేర్పింది.
మనం ఆడవాళ్ళం కనుక తోచినట్లు డ్రెస్సులు వేసుకుని మగవాళ్ళను కవ్వించకూడదు. నిండుగా లంగా, జాకెట్టు ఓణీలు, చీర, జాకెట్టు, సల్వార్ కమీజు లు నిండుగా ధరిస్తే అందరూ గౌరవిస్తారు. అని చెప్పింది. మరునాడు కనకం సహాయంతో రేణు ఇంటికి చేరుకుంది. అప్పటినుంచి ఎప్పుడూ నిండైన వస్త్రధారణే చేసేది. మరో నాలుగు సంవత్సరాలపాటు మేనత్త నిర్వహణలో రేణుక కి SRS treatment కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు ఆమె ధరించిన నిండైన వస్త్రధారణ ఆమె గౌరవాన్ని ఎంతగానో పెంచింది.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.