చిత్రం మారింది

gvgarima

  | April 05, 2026


Completed |   1 | 1 |   343

Part 1

చిత్రం మారింది
ప్రభ, ప్రభు B. Tech లో క్లాస్ మేట్స్.
ప్రభ మంచి ఇంటిల్జెంట్. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. అయితే ఒకమాదిరి అందం ఆమెది. అయితే ఆమెకు తన అందం గురించి బాధకూడా లేదు. స్టడీస్ లో టాపర్. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. రిజర్వుడు గా ఉండేది. ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకునేది కాదు.
ప్రభు ఆమెకు పూర్తి విరుద్ధం. మంచి అందగాడు. అతను క్లాస్ లో కూర్చొనేది తక్కువ. ఎవరితో ఒకరితో ఎప్పుడూ గొడవే. చదువు తక్కువ. డాబెక్కువ.తండ్రిసంపాదించిన ఆస్తి. జల్సా రాయుడు.
చదువులు పూర్తి అయ్యాయి. ప్రభ డిస్టింక్షన్ లో, ప్రభు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు.
*******
ప్రభ మంచి ప్యాకేజీ తో పెద్ద ఐటీ కంపెనీలో చేరింది. ఆమె లైఫ్ స్టైల్ మారిపోయింది. మంచికారు. పెద్ద హోదా. చాలా మాడ్రన్ గా మారింది. మాటతీరు, వ్యవహారం కూడా షార్ప్ అయ్యాయి. ఆమె లైఫ్ లో ఫ్లూయెపన్సీ, ఇన్ఫ్లూయెన్స్ పెరిగాయి
ఒక ఆదివారం నాడు మాట్రిమోనియల్స్ చూస్తుంటే ప్రభు రిఫరెన్స్ కనబడింది. ప్రభు తనకు బాగా తెలుసు. మంచి హాండ్సమ్. ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చు. అనుకుంది.
వెంటనే కారు తీసుకుని బయల్దేరింది. ఇదివరలో ప్రభు వాళ్ళు ఉండే చోటికి వెళ్ళింది. అక్కడ వాచ్ మాన్ చెప్పాడు... ప్రభు తండ్రి బిజినెస్ లో దెబ్బ తిని షాక్ కి తట్టుకోలేక చనిపోయాడు. ఇంటిని అప్పులవాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తల్లితో పాటు ప్రభు ఊరుచివర ఒక తక్కువ అద్దెకు దొరికిన ఇంటికి మారారు. అని వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చాడు.
ప్రభ అక్కడికి వెళ్లింది. అక్కడ ఒక యువతి రకాల వంటకాలు... అరిసెలు, చక్కిలాలు, బొబ్బట్లు వగైరా తయారు చేస్తోంది. "ప్రభు ఎక్కడండి?" అని అడిగింది ప్రభ.

Part 2

ఆ పిలుపు కి వెనక్కి తిరిగి చూసింది ఆ యువతి. అలా చూసింది యువతి కాదు. యువతి లా మారి ప్రవర్తిస్తున్న ప్రభు. ప్రభ నిశ్చేష్టంగా చూస్తోంది.
ఇంతలో ప్రభుతల్లి ప్రభదగ్గరకి వచ్చి "వాళ్ళ నాన్న గారు పోయిన దగ్గర్నుంచి ప్రభు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి బ్రతుకు భారం అనుకున్న సమయంలో ముందుగా నేను వంటకాలు చేయటం మొదలు పెట్టాను. వీటిని అమ్మి జీవిస్తున్నాం ఇద్దరం.
నాకు సహాయం చేస్తూ తను కూడా నెమ్మదిగా స్త్రీ గా మారి ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పెళ్ళయితే మారతాడేమో నని మాట్రిమోనియల్
ఎడ్వర్టైజ్ మెంట్ ఇచ్చాను." అని ముగించింది.
ఈ కథంతా విన్న ప్రభ తల పంకించి ఏదో నిర్ణయానికి వచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
కొద్ది రోజులకు ప్రభు, ప్రభుల పెళ్ళి ఘనంగా జరిగింది.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Thanks @gvgarima akka.. Mee writings malli start chesinanduku.. Chala happy ga anipistundi mee stories chaduvutuntey