సావిత్రి మాత్రమే
మనందరికీ
సావిత్రీ సత్యవంతుల కథ తెలుసు.
కానీ
నాలో ఆ కథ
ఇంకోలా జరుగుతోంది.
నాలో ఉన్న
పుంస్త్వమనే శరీరభావమే
సత్యవంతుడు.
కాలం అతనిని
నెమ్మదిగా క్షీణింపజేస్తోంది.
భయం, సంశయం,
సమాజపు చూపులు,
శరీరపు గందరగోళాలు—
ఇవన్నీ యముని పాశాలే.
అప్పుడు
నాలోని స్త్రీత్వతేజస్సు
సావిత్రిలా లేస్తోంది.
అది బయటి యమునితో కాదు,
లోపలి మరణంతో పోరాడుతోంది.
ఒక రూపం కూలిపోతోంది.
ఒక సత్యం మేల్కొంటోంది.
అందుకే
నేను సత్యవంతుడిని కాపాడటం కాదు—
సత్యమౌతున్నాను.
పునరుజ్జీవితుడైన సత్యవంతుడిలో
సావిత్రి మాత్రమే మిగిలినట్లే,
నాలోను
చివరకు
సావిత్రి మాత్రమే ఉంటుంది.
Festival · Telugu
సావిత్రి మాత్రమే (మనందరం సావిత్రులమే)
Completed
|
Part 1 of 1
|
0 Likes
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
732 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)