ఇది ఒక చిన్న కథ. ఒక చిన్న కథ. నా అనుభవాలలో ఒకటి. నా 20-30 ఏళ్ల వయసులో ఎన్నో జ్ఞాపకాల మూటలు. ఎందరివో మరువలేని మాటలు కూడా. నేను నా పిజి పూర్తి కాగానే రిసెర్చ్ చేస్తూంటే దాన్ని. మా విభాగం లో ఎక్కువ మంది మహిళా పరిశోధకురాళ్ళే. వాళ్ళందరితో చాలా సహజంగా, సన్నిహితంగా ఉండేదాన్ని. నన్ను అందరూ చిన్నా అని పిలిచేవారు. చిన్నా అనేది తెలుగులో జండర్ ఫ్రీ ఉపనామవాచకం కదా. ఆ సౌకర్యం నాకు ఎందుకో బాగుంది అనిపించేది. రిసెర్చ్ కి సంబంధించిన విషయాల్లో వాళ్ళతో చాలా తరచుగా చర్చల్లో పాల్గొనే దాన్ని. నేను వాళ్ళకన్నా జూనియర్ నే అయినా నా ఆలోచనలు వాళ్ళకి నచ్చేవి. నెమ్మదిగా అందరితో సాహచర్యం పెరిగింది. వాళ్ళు షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా నన్ను తోడు తీసుకొని వెళ్ళేవాళ్ళు. మహిళ దుస్తులు, మహిళల అవసరాల వస్తువులు కొనేటప్పుడు కూడా సంకోచం లేకుండా నా ఎదురుగానే వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనేవారు. ఆ తరువాత నుంచి వాళ్ళకి ఆ వస్తువులు కావాలంటే అప్పుడప్పుడు నేను వాళ్ళకి తెచ్చి పెట్టే దాన్ని. వాళ్ళల్లో ఎటువంటి నమ్మకం ఏర్పడిందో చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ. మా సీనియర్ రిసెర్చ్ స్కాలర్స్ లో మైథిలి అనే ఆవిడ ఆత్మీయంగా నా వీపు తడుతూ అక్కడున్న అందరితో "చిన్నా ని, ఒక పెళ్లి కాని అమ్మాయిని ఎవరినైనా మూడు రోజులపాటు ఒకే గది లో అన్ని ఫెసిలిటీస్ తో ఉంచి వాళ్ళు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాకా ఆ పెళ్ళి కాని అమ్మాయిని ఏ సందేహం లేకుండా ఇంకెవరికైనా ఇచ్చి నిస్సందేహంగా పెళ్ళి జరిపించెయ్యవచ్చు." అని నా బుగ్గ గిల్లుతూ చెప్పారు. అందరూ అవునంటూ తలూపారు. అందరికీ నేను చిన్నా నే. నాకు నేను "చిన్ని" ని. ఈ నిజం తెలిసినవాళ్ళు, తెలుసుకున్నవాళ్ళు అప్పట్లో అతి కొద్ది మంది. ఇది నాకు తరచు గుర్తుకు వచ్చే సందర్భం.
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
1049 Views0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (0)
No comments shared yet. Be the first to share your thoughts!
Discussion (0)