అలా మొదలైంది... అప్పటినుంచి అలాగే...

gvgarima

  | May 10, 2026


In Progress |   0 | 0 |   69

Part 1

నేను రిసెర్చ్ చేస్తున్న రోజుల్లోనే శార్వాణి అని ఒక అక్కగారు. మా సహ పరిశోధకురాలు. వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు. ముగ్గురూ మాతో చదువుకున్న వాళ్ళే. ముగ్గురిలో ఇద్దరు సోషల్ ఎటికసీని బట్టి తమ్ముడనే పిలిచేవాళ్ళు. శార్వాణికి మాత్రం చనువు బాగా ఎక్కువ. నన్ను ఒక చెల్లెలు గానే చూసేది. ఇంట్లో ఎప్పుడూ అది, దాన్ని అంటూ స్త్రీ సర్వనామాలతోనే పిలిచేది. బయట మాత్రం తమ్ముడు.. అని పిలిచేది. ఎప్పుడూ ఎక్కువగా చుడీదార్ లు ధరించేది. అప్పట్లో కుట్టించుకోవడమే కానీ రెడీ మేడ్ దుస్తులు దొరికేవి కావు. అక్క వాళ్ళ బంధువుల అమ్మాయే టైలర్. అక్క, నేను ఒకే హైటు, ఒకే కొలతలు. అందుకని ఎప్పుడైనా కొత్త మోడల్స్ కుట్టాలంటే అక్క బిజీ గా ఉంటే నన్ను పంపించి రాణి కొలతలతో కుట్టేయ్ అని స్టాండింగ్ ఇన్స్ఝ్రక్షన్స్ ఇచ్చేసింది.
తరువాత కొన్ని నెలలకు అక్క కి శ్రీకాకుళం దగ్గర గ్రామంలో ఒక బాలికల ఆవాస పాఠశాలలో టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడు నేను అక్క దగ్గరకు వెళ్ళేదాన్ని. ఒక సారి దారిపొడవునా వర్షం లో తడిసి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్క ఉంటున్న ఇంటికి చేరేసరికి సాయంత్రం అయ్యింది. నా తడిసిన బట్టలు విడిచి అక్క చుడీ దార్ నే ధరించాల్సి వచ్చింది. నాకు గిరజాల జుట్టు, మీసాలు రాకపోటం వల్ల ఆ డ్రెస్ లో నేను ఆడపిల్ల గానే అందరికీ రాణి అనే పేరు తో పరిచయం అయ్యాను. అప్పటినుంచి అక్క దగ్గరకు వెడితే అక్కదుస్తులే కట్టుకుని తిరిగేదాన్ని.
oooooo


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.