వీలున్నప్పుడల్లా శ్రీకాకుళం లో శార్వాణక్క దగ్గరికి వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా. ఒకసారి ఎప్పటిలాగే ఆ వీకెండ్ లో కూడా అక్కకి కావాల్సిన ప్రొవిజన్స్, ఇతరవస్తువులన్నీ తీసుకుని శార్వాణక్క దగ్గరికి వెళ్ళాను. శనివారం ఉదయం అక్కడికి వెళ్లినదాన్ని ఆదివారం సాయంత్రం వరకు అక్క దగ్గరే ఉన్నాను. అక్కడ ఉన్నంతవరకూ నాపేరు రాణివే. అక్క డ్రెస్సులు వేసుకొని తిరగడమే. అలా అందరికీ పరిచయం అయిన నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా అక్క స్కూల్ లో ఉన్న ఆడపిల్లలు అందరికీ పాటలు నేర్పేదాన్ని. అలాగే ఈ శనివారం అంతా కూడా వాళ్ళకి పాటలు నేర్పవే అని అక్క చెప్పింది. వాళ్ళు కూడా నేర్పండి మేడం. నేర్పండి మేడం. అని అడిగారు వాళ్ళు. ఆ రోజంతా వాళ్ళకి పాటలు నేర్పిన దాన్ని మరునాడు అక్క ఫ్రెండ్స్ తో ఆదివారం ఉదయం అంతా దగ్గరలో ఉన్న కొండమీద గుడికి వెళ్ళి వచ్చాం. గుడికి వెళ్ళే టప్పుడు నాకోసం అక్క ప్రత్యేకించి కుట్టించిన లంగా ఓణీ, జాకెట్టు ధరించి వెళ్ళాను. అందరికీ నేను రాణినే. కానీ శార్వాణక్క ఫ్రెండ్ శోభకి మాత్రం నేనెవరో తెలుసు. అందుకని ఆదివారం సాయంత్రం నేను వెనక్కి వెళ్ళే ముందు నేను డ్రెస్ మార్చుకుందామనుకుంటుంటే శోభ వచ్చి "చిన్నా, నువ్వు మీ అక్క డ్రెస్సుల్లోనే బాగుంటావు. అయితే ఒక బెట్. ఇప్పుడు మీ అక్క డ్రెస్సులో నువ్వు విశాఖపట్నం వెళ్ళగలవా?" అని అడిగింది. నాకు ఒకసారి అలా ప్రయాణం చేస్తే బాగుంటుంది అనిపించింది. అక్క కేసి చూశాను. అక్క అనుమతిస్తూ నవ్వింది. వెంటనే అక్క చుడీ దార్, దుప్పటా లో విశాఖపట్నం బస్సెక్కాను. బస్సెక్కించటానికి వచ్చిన అక్క, శోభ రాణి జాగ్రత్తగా వెళ్ళి రా.అన్నారు. నేను బుద్ధిగా అలాగే అని తలూపాను. నా పక్క సీట్లో కూర్చున్న బామ్మ గారు "పేరేంటమ్మాయి? రాణి వా? లక్షణంగా ఉన్నావు." అని ఆ మాటా ఈ మాటా కలిపి విశాఖపట్నం వరకూ ఏవేవో కబుర్లు చెప్పి దిగేటప్పుడు ఇదిగో రాణి, మా మనవణ్ణి పెళ్ళి చేసుకుంటావా?" అని అడిగింది. "తప్పకుండా బామ్మ గారు. పెళ్ళి చూపులు శ్రీకాకుళం లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకుందాం. నా డ్రెస్సులన్నీ మా అక్క దగ్గరే ఉంటాయి." అని కొంటెగా చెప్పి బస్సు దిగి పోయాను.
బామ్మతో కొంటె చెమక్కు
Completed
|
0
|
0
|
225
Part 1
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
|
Comments
No comments yet.