నేను, సుభాషిణి

gvgarima

  | May 10, 2026


In Progress |   1 | 0 |   185

Part 1

నేనూ, సుభాషిణీ
నేను అక్క దగ్గరకు ప్రతి వారాంతంలో వెళ్ళటం మొదలు పెట్టాను. 22 ఏళ్ళు వచ్చినా మీసం మొలవని లేత మొహం. ఒత్తుగా లేక, పల్చగానూ లేని కనుబొమలు. అక్క దగ్గర నేను సౌందర్యపు కిటుకులు చాలా నేర్చుకునేదాన్ని. అందులో... పెన్సిల్ తో కనుబొమలు దిద్దుకోవటం, ఐటెక్స్ కాటుక పెట్టుకోవడం. లిప్ స్టిక్ పెదాలకు తగినంతగా పులుముకోవటం. వంటివి. అక్క దగ్గరకు వెళ్ళేటప్పుడు కుర్తా, చుడీదార్ కట్టుకుని వెళ్ళేదాన్ని. అక్క దగ్గరకు వెళ్ళాకా అక్క డ్రెస్ ల కట్టుకునే దాన్ని. లేకపోతే అక్క చీరలు కట్టుకొనే దాన్ని.
నెమ్మదిగా శార్వాణక్క ఫ్రెండ్స్ నాకు కూడా దగ్గరయ్యారు. అందరూ నన్ను "రాణి గారు" అనో, మిస్. రాణి అనో పిలుస్తుండేవారు. అక్క ఫ్రెండ్స్ లో సుభాషిణి మాత్రం నాకు చాలా దగ్గరైంది.
నేను, సుభాషిణి కలిసి అక్క ఉండే క్వార్టర్స్ లో ముందు పూలతోట, వెనుక కూరగాయల మొక్కల తోట పెంచటం మొదలు పెట్టాము. ఆరునెలలు తిరిగేసరికి ముందు కనకాంబరాలు, మల్లెలు, చేమంతి, గులాబీలు, చిట్టి చేమంతి, బంతి దిశంబరాలు మొదలైన పూలమొక్కలు బాగా పెరిగాయి. వెనుక వంగ, బెండ, టమోటా, బీరతీగ, పొట్ల తీగ, సొరతీగ, మిరప మొదలైనవి పెంచాం. సుభాషిణి
నా దగ్గర సంగీతం నేర్చుకునేది. నేను వచ్చాను అంటే చాలు నన్ను వాటేసుకుని కూర్చునేది. నేను ఆమెతో అరమరికలు లేకుండా మాట్లాడే దాన్ని. "సుభాషిణి, నీకు తెలుసు కదా! బయొలాజికల్లీ నేను మగ అని."అంటే "రాణి డియర్! నువ్వు పుట్టుకతో మగ అయినా మా అందరికీ మిస్. రాణి వే. నాకు డార్లింగ్ వి కూడా. నీకు ఇష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం." అది విని నేను నవ్వి ఊరుకునేదాన్ని‌
సుభాషిణి కి టైలరింగ్, అల్లికలు, పూలమాలలు కట్టటం ఇవన్నీ బాగా తెలిసిన కళలు. తను నాకోసం రకరకాల దుస్తులు "గౌన్లు, పరికిణీ వోణీ జాకెట్టులు, స్కర్టు, జాకెట్టులు, చుడీదార్ లు, కుర్తీలు... ఇలా కుట్టి గిఫ్ట్ గా ఇచ్చేది.
అయితే మా ఇద్దరి ప్రేమ ముదిరే సమయంలో సుభాషిణి కి వాళ్ళ బావతో పెళ్ళి జరిగింది. వాళ్ళబావ ఐఎఎస్ అధికారి. కనుక పెళ్ళి అవగానే సుభాషిణి ఉద్యోగం మానేసింది.
ఔను మరి. నిజ జీవితాల్లో ప్రేమలు సక్సెస్ కావడం ఆ రోజుల్లో చాలా అరుదు.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

pooja2122 pooja2122

Stop this type of stories, as crossdresser we didn't like this kind of stories. You're a good story writter but these kind 🤞👎