సిగ్గేస్తోందే... అమ్మా... సిగ్గేస్తోంది ఏ
(గేయ రూపంలో ఒక తల్లీ బిడ్డల సంభాషణ)
బిడ్డ -
సిగ్గెస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
నాతోపాటు చదువుకున్న
నిన్న టేళ ఆడుకున్న
నేస్తాలను చూత్తావుంటే
వాళ్ళ చేయి తగులు తుంటే
సిగ్గెస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
ఆళ్ళకేమో మీసాలొచ్చె
మీసంతో మగసిరొచ్చె
నాకేమో సిగ్గు హెచ్చె
అక్క సోకు నాకు నచ్చె
సిగ్గెస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
పక్కింటి పద్మ కట్టే
ఫ్రాకులంటె ఇష్టమాయె
ఎదురింటి మీనాక్షి
పరికిణి పై మోజు లాయె
సిగ్గెస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
చేతినిండా గాజులతో
మనసులోన మోజులతో
నుదుటన తిలకం పెట్టుక
కళ్ళకు కాటుక పెట్టుక
సిగ్గేస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
పొడవాటి జడకట్టి
తలలోన మల్లెలెట్టి
తిరగాలనిపిస్తుందే
నవ్వాలనిపిస్తుందే
నా తప్పు ఏమిటమ్మా
నాన్నెందుకు నన్ను కొట్టె
ఆడొ మగ తెలియని పుట్టుక
నా తప్పా అమ్మా...
చీరకట్టుకుంటేనూ ఒక శిక్షా అమ్మ
సిగ్గెస్తోందే
నాకు సిగ్గేస్తోందే
సిగ్గేస్తోందే
అమ్మా సిగ్గేస్తోందే
తల్లి -
తప్పుకాదురా బాబు
నీ తప్పుకాదురా బాబు
మిగతా పిల్లలు లాగా లేవని
నాన్నకు కోపం బాబు
తను చేయాల్సిన దేదో తెలియక
నిన్ను కొట్టాడు బాబు
నా పెంపకాన్నే తప్పుపట్టి
ప్రశ్నిత్తాడు రా బాబు
బిడ్డ -
బాబూ అనకే అమ్మా.
ఏడుపొత్తోంది అమ్మా
అక్క లాగ నను ఒసేవనవే
ఇంటిపనులను చేత్తానమ్మా
ఉహు ఉహూ ఉహూఊఊఊ
తల్లి -
కూతురు గా నిను ఒప్పుకుంటేను
లోకం నవ్వేను బిడ్డా
గౌనో పరికిణి ఇద్దామంటే
నాన్నకు భయమేబిడ్డా.
ఉహు ఉహూ ఉహూఊఊఊ
బిడ్డ -
ఏడుపొత్తోంది అమ్మా
గట్టిఏడుపొత్తోంది అమ్మా
గట్టిగ ఏడుపొత్తోంది అమ్మా
గట్టిగ ఏడుపొత్తోంది అమ్మా
ఉహు ఉహూ ఉహూఊఊఊ
Discussion (0)