Mother · Telugu

అమ్మా...... నాకు చీరకట్టు నేర్పవా!!

In Progress | Part 1 of 1 | 1 Likes

అమ్మా .... నాకు చీరకట్టు నేర్పవా!

నా పేరు సుజిత. నేను మగవాడిగా పుట్టినా తరువాత స్త్రీగా మారాను. ఇప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. నా కథేమిటో తెలుసుకోవాలని ఉందా? చెప్తాను చదవండి.

నా పేరు సుజిత్. నాకు12ఏళ్ళ వయసప్పుడు మా నాన్న చనిపోయారు. నా తల్లి తండ్రులది ప్రేమ వివాహము కావడంతో వాళ్ళ ఇరువైపులవారికీ వీళ్ళ ప్రేమ నచ్చకపోవడంతో మా అమ్మానాన్నలను ఎవరు ఆదరించలేదు. వీళ్ళిద్దరూ విద్యాధికులు కావడంతో వాళ్ళ కాళ్ళమీద వాళ్ళే నిలబడ్డారు. వాళ్ళ ప్రేమకు ఏకైక ఫలితమే నేను. ఒక్కడినే కావడంతో అల్లారు ముద్దుగా పెరిగాను. నాన్న ఆక్సిడెంట్లో అకస్మాత్తుగా మమ్మల్ని వదలి వెళ్లిపోవడంతో అమ్మ మొదట్లో క్రుంగి పోయినా నన్ను చూసుకుని తాను త్వరలోనే మామూలు మనిషయ్యింది. ఇంట్లో మేమిద్దరమే కావడంతో అమ్మతోనే ఎక్కువ కాలం గడిపేవాడిని. అమ్మ చాలా అందంగా ఉంటుంది. నన్ను చూసిన వాళ్ళందరూ మా అమ్మ పోలికలే నావి అనేవారు. ప్రసన్న ఆంటీ అని మా మా అమ్మ వాళ్ళ కొలీగ్ అయితే అరేయ్ సుజిత్! నువ్వు పెద్దైనాక చీర కడితే మీ అమ్మలానే ఉంటావు అనేది. అటువంటి మాటలు వినీ విని నేను ఇంట్లో అమ్మ లేనప్పుడు అమ్మ లంగాలూ, జాకెట్లూ తొడుక్కొని అద్దంలో చూసుకోవడం అలవాటైంది. నాకు 20ఏళ్ళ వయసు వచ్చినా మీసాలు వంటి మీద రోమాలూ పెరగలేదు. ఇది చూసి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్ళు. మా క్లాస్ లో గర్ల్స్ అయితే సుజిత్ నువ్వు వచ్చి మా బెంచ్లో కూర్చున్నా ఎవరూ గుర్తుపట్టలేరు అనేవారు. కాలక్రమేణా నా చుట్టూ ఉన్న వాళ్ళందరి మాటలూ వింటూనే నేను అస్సలు ఆడపిల్లగా పుట్టవలసిన వాడినేమో అనే భావన మొదలయ్యింది నాలో. అమ్మ నాతో ఏంటో క్లోజ్ గా ఉన్న అమ్మతో ఈ విషయం డిస్కస్ చెయ్యడం యెట్లా అని నాలో నేనే మధన పడేవాడిని(?). అటువంటి సమయం లో ఒక సంఘటన జరిగింది. ఆరోజు నేను టీవీ చూస్తున్నా మా అమ్మతో కలిసి.

ఆరోజు టీవీలో "గజల్ దలివాల్" అనే ట్రాన్సజెండర్ అబ్బాయి నుండి అమ్మాయి గా యెట్లా మారాడో ఒక న్యూస్ స్టోరీ చూశాను. అమ్మ కూడా చూడడంతో నేను అమ్మతో. "అమ్మా! ఇది సృష్టి విరుద్ధం కదా ..... ఆ ఫామిలీ సొసైటీ లో ఎంత సిగ్గు పడాలో కదా! వాళ్ళెంత ఇబ్బంది పడి ఉంటారో " అన్నాను.
దానికి అమ్మ "సుజిత్! ఒక్కో మనిషికి ఒక్కో ప్యాషన్ ఉంటుంది. పాపం తనెంత మెంటల్ గా స్ట్రగుల్ అయి ఉంటుందో .... లేకుంటే సొసైటీ లో తన ఫామిలీ ఇబ్బంది పడుతుందని తెలిసినా తన నిర్ణయాన్ని కోరికని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది ... అంతేకాదు వాళ్ళ పేరెంట్స్ అంతే పెద్దమనసు తో తన కోరికని మన్నించారు చూడు అదీ మానసిక పరిపక్వత అంటే!" అంది. అంత లోతైన మానసిక విశ్లేషణ అమ్మ నుండి వెలువడుతుందని నేనైతే ఊహించలేదు. అయినప్పటికీ నా మానసిక అశాంతి ని అమ్మ ముందు పెట్టె ధైర్యం చెయ్యలేకపోయాను.

కానీ ఆ సంఘటనతో నాలోని ఆడతనం ఇంకా బలీయమైపోయింది. మాది డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అవ్వడంతో రాత్రి అమ్మ పడుకున్న వెంటనే అమ్మకు తెలియకుండా నా పాకెట్ మనీ తో కొనుక్కున్న నైటీలు, పంజాబీ డ్రెసెస్ వాడేసుకుడ్ని పడుకోవడం , ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ క్రాస్ డ్రెస్సింగ్ స్టోరీస్ చదువుకుంటూ సంతృప్తి పడేవాడిని. ఇంతలో .....

ఇంతలో అమ్మకు ఆఫీస్ పని మీద ఒక 15రోజులు బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. నన్ను కూడా తనతో రమ్మంది అమ్మ. నేనే అమ్మా నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోయాక నేను ఒక్కడినే ఉండి చేసేదేముంది. ఇక్కడనే ఉండిపోతా అంటే అమ్మ సరే నీ ఇష్టం అని భోజనం వాళ్ళ కొలీగ్ ప్రసన్న ఆంటీ వాళ్ళింట్లో అరెంజ్ చేసింది. అమ్మ వెళ్ళిపోయాక రోజూ ప్రసన్న ఆంటీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నాకు కేరేజ్ ఇచ్చి వెళ్లిపోయేది. నైట్ టైం డిన్నర్ కి వాళ్ళింటికి వెళ్ళేవాడిని.

వాళ్ళింటిలో డిన్నర్ ముగించుకుని ఇంటికి వెళ్లిన వేంటనే తలుపులు మూసేసి నాకిష్టమైన చీరలో ముస్తాబై పోయేవాడిని. ఆ విధంగా ఒక తొమ్మిది రోజులు గడిచిపోయాయి. ఆరోజు మంగళవారం. ఆంటీ వాళ్ళింటిలో భోజనం చేసి ఇంటికి వచ్చి నాకిష్టమైన చండేరీ రంగు చీర తీసుకుని కట్టుకుని ముస్తాబై కాసేపు టీవీ చూసి ఆ తరువాత నెక్స్ట్ డే అసైన్మెంట్ పూర్తి చేసి ఆ చీరలోనే నిద్ర పోయాను. రాత్రి రెండు గంటలకు నేను మంచి నిద్రలో నుండగా అమ్మ నుండి ఫోన్. తాను రేపు మార్నింగ్ రాజధానికి వచ్చేస్తున్నానని. మార్నింగ్ 4గంటలకల్లా ఇంటిలో ఉంటానని తన దగ్గర స్పేర్ కీ ఉంది కాబట్టి నిన్ను నిద్ర లేపను అంది. సరే అమ్మా అని వెంటనే నా రూమ్ లో క్రాస్ డ్రెస్సింగ్ రిలేటెడ్ వస్తువులన్నీ తీసేసి చీర మడతపెట్టేసి ... మేకప్ పూర్తిగా చెరిగి పోయేవరకూ స్నానం చేసి నిద్రపోయాను. నైట్ లేట్ గా నిద్ర పోయానేమో మెలకువ వచ్చేసరికి ఉదయం 8గంటలు అయింది. నేను నిద్ర లేచి హాల్ లోకి వెళ్లేసరికి అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ త్రాగుతూ నన్ను చూసి "గుడ్ మార్నింగ్ సుజిత్ ..... పది రోజులకే చిక్కిపోయావేంట్రా కన్నా!" అంటూ విష్ చేసింది. నేను ఏమీ లేదమ్మా చూసి చాలా రోజులయ్యింది కదా నీకలానే అనిపిస్తుంది లే! అన్నాను.

నేను నిద్ర లేచి హాల్ లోకి వెళ్లేసరికి అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ త్రాగుతూ నన్ను చూసి "గుడ్ మార్నింగ్ సుజిత్ ..... పది రోజులకే చిక్కిపోయావేంట్రా కన్నా!" అంటూ విష్ చేసింది. నేను ఏమీ లేదమ్మా చూసి చాలా రోజులయ్యింది కదా నీకలానే అనిపిస్తుంది లే! అన్నాను.

సరేకానీ, ఇంట్లో గ్రైండ్ చేసిన పిండి లేదు నువ్వెళ్ళి టిఫిన్ పట్టుకురా మనిద్దరికీ. ఈలోగా నేను మన రూమ్స్ క్లీన్ చేసేస్తా అంది. ఓకే మామ్ అంటూ నేను బైక్ తీసుకుని హోటల్ కి వెళ్ళివచ్చాను. అమ్మ రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసింది. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి నేను కాలేజీకి అమ్మ ఆఫీసుకి బయలుదేరాం.

ఒక వీకెండ్ కి అమ్మ "కన్నా! నేను నీతో ఒక విషయం డిస్కస్ చెయ్యాలిరా! నీతో మాట్లాడాలి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఈవెనింగ్ మనిద్దరం బయటకి వెళ్దాము వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోకు" అంది. నేను సరే అమ్మా అని ఇంట్లోనే ఉన్నా. ఈవెనింగ్ ఇద్దరం కలిసి కొంచెం దూరంలో ఉన్న ఒక టెంపుల్ కి వెళ్లాం. అది వీకెండ్స్ లో రష్ గా ఉన్నా పెద్ద గ్రౌండ్ ఉండటంతో చెట్లు వాటిక్రింద బెంచెస్ ఏర్పాటు చేశారు. దేవుడి దర్శనం అయిపోయిన తరువాత ఇద్దరమూ ఒక కార్నర్లో ఉన్న బెంచ్ మీద సెటిల్ అయ్యాము.

అమ్మ మౌనంగా ఉండటం చూసి నేనే ముందు కల్పించుకుని "అమ్మా! ఇంపార్టెంట్ మేటర్ అన్నావు. మాట్లాడటంలేదు ఏమైనా ప్రాబ్లమేటిక్ ఇష్యూ నా" అంటూ కదలేశాను.

అమ్మ ఒక్క క్షణం నావైపు చూసి నెమ్మదిగా గొంతు సవరించుకుని "ఏం లేదురా కన్నా! నేను మొన్న క్యాంపు నుండి వచ్చిన రోజు నిన్ను టిఫిన్ తీసుకురమ్మని నేను నీ రూమ్ క్లీన్ చేస్తూ నీ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉంటే కొన్ని లేడీస్ డ్రెస్సెస్ కనిపించాయి. వచ్చింది ఎవరు? నువ్వు ఎవర్నైనా ప్రేమిస్తే నాకు చెప్పకుండా యెట్లా ఉన్నావురా కన్నా? నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావని తెలిసిన దగ్గరనుండి మనసు బాగుండటంలేదురా. నువ్వు తప్ప నాకెవరున్నారు. అందుకే కొంచెం బాధనిపించి ఇక్కడికి టైహీసుకు వచ్చాను. ఎవరు నీ మనసులో ఉన్న అమ్మాయి? నేను లేనప్పుడు ఇంటికి తీసుకువచ్చావంటే నీకు ఎంతో క్లోజ్ అయ్యి ఉంటుంది, నీ మనసుకి నచ్చి ఉంటుంది. నువ్వు చెప్పలేదని నాకేమీ బాధలేదుకానీ వీలైతే త్వరలోనే నాకు పరిచయం చెయ్యి కన్నా!" అంది.

నాకు షాక్!!! అమ్మ నా రూంలోకి రాదుకదా అనే ధీమాతో షెల్ఫ్ లాక్ చెయ్యడం మర్చిపోవడం అమ్మ నేను ఉపయోంచిన చీరల్ని చూసి ఎవరో అమ్మాయి వచ్చిందేమో అనుకుందన్నమాట! అంత షాక్ లోనూ, నా చీరకట్టు గురించి అమ్మకి యెట్లా చెప్పాలో ఎన్నో రోజులనుండి చెప్పాలనుకుంటున్న నాకు అదొక గోల్డెన్ ఛాన్స్ అనిపించింది.

"అమ్మా! నీకు ఎన్నో ఏళ్ళనుండి చెపుదామనుకుంటూనే ఉన్నా. కానీ నా జీవితంలో ఎవరూ లేరు. కానీ చిన్నప్పటినుండి నేను పొరపాటున మగ శరీరంలో ఉన్నానేమో అనుకుంటూ నైట్ టైం నా రూంలో నా పాకెట్ మనీ తో కొనుక్కున్న చీరలూ, పంజాబీ డ్రెస్స్ లు వాడుతూ నా అసంతృప్తిని చల్లపరుచుకుంటున్నా అంతేకానీ నువ్వులేనప్పుడు మన ఇంటికి మూడో మనిషి ఎవరూ రాలేదమ్మా? నన్ను క్షమించమ్మా!" అంటూ సందిగ్ధంలోనే నెమ్మదిగా ఎన్నో ఏళ్ళనుండి నేను కాపాడుకుంటూ వస్తున్న రహస్యాన్ని అమ్మతో చెప్పేశాను.

ఈ సారి షాక్ తినడం అమ్మ వంతు.

నెమ్మదిగా అమ్మ సరే కన్నా బయలుదేరదాం పదా అంటూ టెంపుల్ బయటికి దారితీసింది. తనలో ప్రతిస్పందన ఏమీ కనిపించలేదు. నాకు అంత అయోమయం. ఇంటికి వెళ్లాం. అమ్మ ఏమీ మాట్లాడలేదు. భోజనం చేసేప్పుడుకూడా ఏమీ మాట్లాడలేదు. నాకేమో అమ్మను కదిలించే ధైర్యంలేదు. కాదు ధైర్యం చాలట్లేదు. అట్లా రెండు రోజులు గడిచిపోయాయి. ఏదో పొడిపొడి మాటలే తప్ప ఎక్కువ సంభాషణలే లేవు.

ఒక వారం తరువాత అమ్మ "కన్నా! చిన్న పని ఉంది. మనం బెంగుళూరు వెళ్ళాలి. ఈ వీకెండ్ కి టికెట్స్ బుక్ చేసాను. మళ్ళీ సోమవారం వస్తాం మనం. రెడీగా ఉండు" అంది. సరేనమ్మా అని ఆ పని ఏమై ఉంటుందా అని అనుకుంటూనే ఉండగా ఫ్రైడే ఈవెనింగ్ బెంగుళూరు బయలుదేరాము. (సశేషం)

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

Follow the author to be notified when more parts are posted.
251 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 13 hours ago

Excellent story telling..chaduvutuntey manchi feel vachhindi chelli...keep rocking.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login