Family · Telugu

మజిలీ

మజిలీ Cover Image
In Progress | Part 4 of 11 | 1 Likes

Part 4

"వావ్ ... మై గాడెస్ .... యు అర్ లుకింగ్ గార్జియస్" అంటూ దగ్గరికి వచ్చి నన్ను కౌగలించుకుని నా పెదవులపైన సున్నితంగా కిస్ చేసాడు.

అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనను నేను ఊహించలేదు .... అట్లాగని నేను అతని చర్యను ప్రతిఘటించనూలేదు.

తను నన్ను బయటికి తీసుకెళ్లడానికి కేవలం అంత ఖర్చు పెట్టాడంటే అతనికి నామీద ఎంత ప్రేమ ఉందో ఊహించగలను.

తను పెట్టిన సున్నితమైన ముద్దుకి నా జూనియర్ ఉద్రేకపడడం నాకు తెలుస్తోంది.

తను నన్ను ముద్దుపెట్టిన వెంటనే సంభాళించుకుని "సారీ బేబీ .... నిన్ను చూడగానే తట్టుకోలేకపోయాను. నీ మీద చెయ్యి వేయను అని చెప్పాగా .... ఇక నిన్ను టచ్ చేయను" అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

నేను తెచ్చిపెట్టుకున్న కోపంతో "ఒట్టుతీసి గట్టున పెట్టి లటుక్కున కౌగిలించుకుని ముద్దు పెట్టేసి ఏమీ ఎరగనట్లు ఇప్పుడు మళ్ళీ ఒట్టేస్తున్నావా ... నిన్ను నమ్మడం నా బుద్ధిపొరపాటు. ఇక వెళ్ళిరా బాబూ ... ఏదైనా పెళ్ళైన తరువాతే " అన్నాను.

అందుకు సిద్ధార్ధ్ నవ్వుతూ "నీ కళ్ళలో కోపం కనపడడం లేదు బేబీ ... కేవలం ఆహ్వానం కనపడుతోంది. అయినా సారీ చెప్పాను కదా ... ఇంకెందుకు కోపం. పద బయటకి వెళ్దాము ..... నీకు స్టన్నింగ్ సర్ప్రైజస్ చాలా ఉన్నాయి." అంటూ బయలుదేరదీయబోయాడు.

సిద్ధూ, ఇప్పుడు బయటకు రావాలంటావా? నేను నీతో ఏకాంతంగా గడపొచ్చని, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత మొత్తంగా మారిపోయిన నా లైఫ్ స్టైల్ నీకు చూపించొచ్చు అనుకుంటే బయటకు తీసుకెళ్తానంటున్నావు. ఈ ప్రయాణాల్లో మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఇంట్లోనే గడపొచ్చుగా నాకు నువ్వూ నీకు నేనుగా అన్నాను.

అందుకు సిద్ధార్ధ్, బేబీ! ఈ టైం కోసం ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ ని అడిగితే కాదనరు .... కానీ మా అమ్మకు తెలిస్తే గొడవ చేస్తుందని ఇప్పటివరకు వెయిట్ చేసాను. బయటకు వెళ్లినా నువ్వు నేనే .... మన మధ్యకు ఎవరూ రారు .... నువ్వు నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావో.... యెట్లా ఉండాలనుకుంటున్నావో అట్లానే ఉండు.... ఈరోజు మాత్రం నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు. ప్రామిస్ అన్నాడు.

ఇక మాట్లాడటానికి ఏమి ఉంది ...

మళ్ళీ తనే "బేబీ, త్వరగా బయలుదేరుదాము .... నాకు ఆకలి వేస్తోంది" అన్నాడు.

సరే అని ధైర్యం కూడగట్టుకుని తనతో బయలుదేరాను. ఇంటికి తాళం వేసి వ్యానిటీ బ్యాగ్లో పెట్టుకుని తనతో హై హీల్స్ లో నడుస్తుంటే బెరుకుగా ఉంది. అది గమనించాడేమో నా చేతిని పట్టుకుని కార్ దగ్గరికి నడిపించి ఫ్రంట్ డోర్ తీసి కూర్చోబెట్టాడు. నేను కూర్చున్నాక చీర అంచులు డోర్ లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా సర్ది తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేసాడు. అది అధునాతనమైన ఫార్ట్యూనర్ కారు.

తను నన్ను అపురూపంగా చూసుకుంటుంటే నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ఇంతగా ప్రేమించగలడా .... ఏమిటి ఈ పిచ్చి ప్రేమ ... తను సరే .... ప్రపోజ్ చేసాడనుకోండి ..... నేనో .... యెట్లా అంగీకరించాను ఈ వింత ప్రేమని అని నాలో నేను ఆలోచించుకుంటుండగానే కారు సిటీ అవుట్ స్కర్ట్స్ దాటి ఒక పెద్ద కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది. లోపల సువిశాలమైన గార్డెన్ ... అందులో ఒక భవంతి .... చాలా బాగుంది.

కారు ఆగిందో లేదో ... ఒక మధ్యవయస్కురాలు వచ్చి నేను కూర్చున్న వైపు కారు డోర్ తీసింది. ఎంతో పరిచయమున్న దానిలా "రండమ్మా! అంటూ హెల్ప్ చేయడానికి చేయి చాపింది. హై హీల్స్ లో ఉన్నాను కదా కార్ దిగడానికి ఆమె హెల్ప్ తీసుకుని కార్ దిగి తనవైపు చిరునవ్వుతో చూచి నిలబడ్డాను. ఈ లోపు సిద్ధార్ధ్ కార్ దిగి "లక్ష్మీ! డిన్నర్ రెడీ చేశావా? ఆకలేస్తోంది.... స్నానం చేసి వచ్చేస్తాను .... అని నాతో "పద బేబీ! ఇది మన ఫార్మ్ హౌస్.... అప్పుడప్పుడూ వస్తూ ఉంటాను .... ఇక్కడికి వచ్చి చాలారోజులైంది" అంటూ నన్ను నడిపించసాగాడు.

నాకు ఇదంతా కలగా ఉంది. తాను వెనక్కి తిరిగి "లక్ష్మీ! కార్ డిక్కీ లో అమ్మగారి బ్యాగ్స్ ఉన్నాయి .. లోపల బెడ్ రూంలో పెట్టు" అన్నాడు

నేను ఏ రెస్టారెంట్ కో తీసుకు వెళ్లి డిన్నర్ చేసాక ఇంటికి తీసుకుపోతాడు అనుకుంటే ఈ మనిషేమిటి బ్యాగ్స్ లోపల పెట్టమంటున్నాడు ... అనుకుని మాట్లాడితే నా మగగొంతును పనిమనిషి ఎక్కడ గుర్తు పట్టేస్తుందో అని భయపడుతూ తనతో బెడ్ రూంకి వెళ్లాను.

పనిమనిషి యేవో బాగ్స్ పట్టుకు వచ్చి రూంలో పెట్టి బయటకు వెళ్ళగానే .... అప్పటివరకు ఆగిన నేను "సిద్ధూ! ఏమిటిదంతా.. డిన్నర్ అయిపోయాక ఇంటికి వెళ్లిపోతామనుకుంటే ఏమిటీ ఈ తతంగమంతా...?" అన్నాను .

రిలాక్స్ బేబీ! మీ పేరెంట్స్ ఎల్లుండి ఉదయం వస్తారు .... రేపు మధ్యాహ్నానికి నిన్ను ఇంట్లో డ్రాప్ చేసేస్తాను. అని బాత్రూమ్లోకి దూరాడు. తాను స్నానం చేసి మగవాళ్ళ బాత్ రోబ్ వేసుకుని బయటకి వచ్చాడు. నా కళ్ళకి హీమాన్ లా కనపడుతున్నాడు... నేను కళ్ళార్పకుండా చూస్తుంటే ... "ఓయ్! నువ్వలా చూస్తే నేను ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సి ఉంటుంది" అన్నాడు నవ్వుతూ.

నేను కూడా తనతో నవ్వేశాను . ఇక తను ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే వెళ్ళాలి అనుకొని పేస్ వాష్ చేసుకొస్తాను అంటే ....

సిద్ధార్ధ్, బేబీ ఆ బాగ్స్ లో నైటీస్ ఉన్నాయి ... శారీ తీసేసి నైటీ వేసుకో కంఫర్ట్ గా ఉంటుంది అన్నాడు. మళ్ళీ తనే "నేను బయటికి వెళ్తున్నాను ... డైనింగ్ హాల్ క్రింద ఫ్లోర్లో ఉంది ... నీకోసం వెయిట్ చేస్తాను ... హవాయి స్లిప్పర్స్ అక్కడున్నాయి చూడు నీకోసమే... ఇక్కడున్నప్పుడు వాటిని వాడవచ్చు .... అవి నీకోసమే తెప్పించాను. త్వరగా వచ్చెయ్యి.... ఏమైనా హెల్ప్ కావాలంటే ఇంటర్కం లో లక్ష్మిని పిలువు ... తను వచ్చి హెల్ప్ చేస్తుంది... ఫ్రీగా ఉండు .... తనకు నీ గురించి పూర్తిగా తెలుసు" అన్నాడు

ముందు ఫేస్ వాషింగ్ అనుకున్నాను కానీ బాత్రూం లోకి వెళ్లిన తరువాత బాత్రూం లోని ఇంటీరియర్ డిజైన్స్ చూసిన తరువాత స్నానం చేయడమే బెటర్ అనుకున్నాను.

చీర, జాకెట్, బ్రా, ప్యాంటీ విప్పాను. అప్పుడు గుర్తొచ్చాయి బ్రెస్ట్ ఫార్మ్స్. ఒక 15రోజులు ఉంచుకోవచ్చు ఏమీ కాదు అని రోహిణి చెప్పిన విషయం గుర్తొచ్చింది. దానితో ధీమాగా స్నానం చేయడం మొదలుపెట్టాను.

ఒళ్ళు సబ్బుతో రుద్దుకుంటుంటే బ్రెస్ట్ ఫార్మ్స్ దగ్గరకొచ్చేసరికి నాలో విచిత్రమైన ఫీలింగ్. క్రింద నా జూనియర్ లేచి డాన్స్ చేయడం మొదలెట్టాడు. నా బ్రెస్ట్ ఆర్టిఫిషియల్ కాకుండా నిజంగా ఉంటే బావుండుననిపిస్తోంది. అట్లాగే నా జూనియర్ కూడా అక్కడ లేకుండా ఉంటే బావుండుననిపిస్తోంది. నాలో కలుగుతున్న ఫీలింగ్స్ నాకే అర్ధం కావడంలేదు.

స్నానం పూర్తిచేసి శుభ్రంగా తుడుచుకొని రొమ్ములపైనుండి టవల్ కట్టుకొని బయటకు వచ్చాను. అక్కడి బ్యాగ్స్ లో నైటీ కోసం వెతికితే వైట్ కలర్ మీద రోజ్ కలర్ డిజైన్ ఫ్లవర్స్ ఉన్న ఖరీదైన నైటీ అది. ప్రైస్ ట్యాగ్ చూస్తే 4,999/- రూపాయలు అని ఉంది. ఆ మొత్తానికి మా ఇంట్లో నెలవారీ కిరాణా సరుకులు వచ్చేస్తాయి. మా అక్క కొనుక్కునే నైటీలు 500 రూపాయల లోపులోనే ఉంటాయి. అక్క గుర్తుకు రాగానే తనకు ఫోన్ చేద్దామనిపించి ముందు ప్యాంటీ , బ్రాలు తొడుక్కొని నైటీ పెట్టికోట్ వేసుకుని దానిపై నైటీ వేసుకుని కొంచెం తల దువ్వుకుని, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటూ పౌడర్ రాసుకుని, బిందీ పెట్టుకుని మా అక్కకు ఫోన్ చేసాను.

మా అక్క "సడన్ గా ఫోన్ చేసావేమిటే? ఏమైనా ఇంపార్టెంట్ విషయమా" అంది.

ఏమీ లేదు బావ లేడా ? అన్నాను.

'లేరు ఎక్కడికో పనుందని వెళ్లారు. ఏం చేస్తున్నావు? అమ్మ, నాన్న లేరుగా ఇంట్లోనే ఉండటంతో బోర్ కొట్టేస్తుందేమోనే? అని అంది.

నేను "ఎందుకు బోర్ కొడుతుంది? మా ఆయన దగ్గరుంటే ... " అన్నాను.

మా అక్కకు షాక్. "ఏమిటే నువ్వుంటుంది . సిద్ధార్ధ్ వచ్చాడా " అని అడిగింది.

కాదు సిద్ధార్ధ్ దగ్గరికే నేను వచ్చాను అన్నాను.

'ఏమిటే నువ్వు చెప్పేది... అమ్మ నాన్నకు తెలిస్తే ఫీల్ అవుతారే తల్లీ.... " అంటోంది.

నువ్వు చెప్పవని తెలిసే నీకు ఫోన్ చేసాను అంటూ మార్నింగ్ నుండి జరిగినవన్నీ చెప్పడం షురూ చేసాను.

అన్నీ విన్నాక మతిపోయింది తనకి. అవతలివైపు నుండి "ఇప్పుడు ఎక్కడున్నావ్? వాళ్ళ ఫార్మ్ హౌస్ ఎక్కడుంది? వాళ్ళమ్మగారికి తెలుసా?" అని అడుగుతోంది.

అన్నీ రేపు మార్నింగ్ మాట్లాడతా గానీ ఫోన్ పెట్టేయి. వీడియో కాల్ చేస్తా అన్నాను.

వీడియో కాల్ చేసి ముందు తనకు నేను కనిపించి , ఆ తరువాత బెడ్ రూమ్ చుట్టూ తిరుగుతూ అందులోని ఇంటీరియర్ చూపించాను.

అవతల్నుండి "నాకు కుళ్ళు పుడుతోందే .... సిద్ధార్ధ్ ముందు నాకెందుకు తగల్లేదు అని" అంటూ నవ్వేసి. ఏమైనా నువ్వు లక్కీనే. సరే తన నీకోసం వెయిట్ చేస్తున్నట్లున్నారు వెళ్ళు రేపు ఇంటికొచ్చాక ఫోన్ చెయ్యి అంది.

ఓకే . బై అని ఫోన్ పెట్టేసాను.

రూమ్ బయటికి వచ్చి క్రింది ఫ్లోర్లో ఉన్న డైనింగ్ హాల్ కి వెళ్ళాను. పెద్ద డైనింగ్ హాల్. నాకోసం వెయిట్ చేస్తున్నాడు నా సిద్ధార్ధ్.

సారీ లేట్ అయ్యింది .... బాగా వెయిట్ చేయించినట్లున్నాను.

లేదు బేబీ, ఆడవాళ్లకు ఎన్నో విషయాలుంటాయి. మగవాళ్ళం వెయిట్ చెయ్యాల్సిందే అంటూ కన్నుకొట్టాడు.

ఈలోపు లక్ష్మి హాట్ ప్యాక్స్ పట్టుకొచ్చి టేబుల్ మీద సర్దసాగింది.

సిద్ధార్ధ్ నేను నాన్ వెజిటేరియన్ తినను. అందుకని నువ్వేమీ మానేయనక్కరలేదు. మ్యారేజ్ తరువాత మాత్రం బయట తినాల్సిందే అన్నాడు.

నేను మాత్రం ఎందుకు .... నేను అంతగా నాన్ వెజ్ తినను. నేనుకూడా వెజిటేరియన్నే ఇక నుండి అంటూ లక్ష్మిని వెజిటేరియన్ డిషెస్ తీసేయమన్నాను. వాస్తవానికి నేను ఫుల్లీ నాన్ వెజిటేరియన్ని. తనని సంతోషపెట్టడానికి అబద్ధం ఆడినా .... అది నాకెంతో సంతోషాన్నిచ్చింది.

డిన్నర్ ముగించాక "బయట కాసేపు వాక్ చేద్దాం ... పౌర్ణమి వెన్నెల బాగుంది" అంటూ బయటకి నడుస్తుంటే తనని ఫాలో అయ్యాను.

బిల్డింగ్ ముందు గార్డెన్లో లైట్స్ వెలుగుతుంటే గార్డెన్ మధ్యలో కుర్చీలు వేసిఉన్నాయి. అందులో కూర్చున్నాము.... ఇంతలో లక్ష్మి ఐస్ క్రీం కప్స్ తెచ్చి ఇచ్చింది. తింటూ ఉండగా "ఇప్పుడు చెప్పు నీలిమా!" ఏదో చెప్పాలనుకున్నావు కదూ!" అన్నాడు.

5051 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

laplata
laplata 4 weeks ago

Please continue this story

NPBOY72
NPBOY72 2 months, 3 weeks ago

Write about nose piercing scene with as if yourself are being pierced

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login