వాళ్ళను పంపించాను కానీ... నాకు అదోలా ఉంది. కానీ నేను తాను సంతోషంగా ఉన్నాము. ఏ లోటూ లేదు. ఇంట్లో ఉంటే... మెడలో తాళిబొట్లు, కాలికి మెట్టెలతో
ఇబ్బందిగా లేదు. కానీ బయటకు వచ్చేసరికి ఎవరు ఏమనుకుంటారో అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫీసులో కూడా అందరికీ తెలుసు. సమస్య ఏమిటంటే... మెడలో
తాళి ఉందని తెలిసిన ప్రతి ఆడవాళ్లు ప్రియతో పాటు నాకు కూడా... బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వడం.... నేను తాళి కి పసుపు కుంకుమ రాసుకోవడం... మొన్న
ఇంటికి మా సొంత పిన్ని, వాళ్ల పిల్లలు వచ్చారు. పిన్ని అయితే... నన్ను చాలా ఆటపట్టించడం చేసింది. ఆఖరుకు చెల్లెల్లు నన్ను... ముత్తైదువగా చూసి..
తాంబూలం ఇచ్చారు. ఏమైనా నా జీవితం మారిపోయింది. తను నాతో ఎంత బాగున్నా... తనని ఏమి తెమ్మని చెప్పను. నేనె వెళ్లి కాఫీ తెచ్చుకుంటా.. మనసులో
తాను నాకు భర్త అనే ఫిలింగ్ వచ్చేస్తోంది. పైగా మొన్న అమ్మ కూడా మీ ఆయన్ని ఒకసారి పిలువు అంది. నేను అదోలా చూస్తే... నేను తనతో కూడా... అలాగే
అంటాను. నువ్వు దానికి మొగుడు... తాను నీకు మొగుడు... ఎందుకంటే దాని మెడలో నువ్వు తాళి కడితే... నీ మెడలో తన చేత కట్టించుకున్నావు అంది.
ఇంతలో తాను వచ్చింది. ఈ రోజు మీరిద్దరూ ఉపవాసం ఉండండి. రేపు ఉదయం .. ఒక చిన్న పూజ ఉంది. ఏమిటి అత్తయ్యగారు అంటే... ఏముందమ్మ.. పెళ్లి
అప్పుడు...అబ్బాయి మెడలో తాళి కట్టావు కదా... కానీ నల్లపూసలు కట్టలేదు. అలా ఉంటే ... మంచిది కాదు అని పంతులు గారు అన్నారు. రేపు ఉదయం ... ఆ
ప్రోగ్రాం పెట్టాం. రేపు ఆ కార్యక్రమం అయితే... తరువాత ఒక నల్లపూసల చైన్ తెస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్నా చాలు. లేకపోతే... ఇంటికి కీడు అన్నారు.
ఇదంతా నాకు చెప్పలేదు.
మరుసటిరోజు ఉదయం నేను స్నానం చేసి రాగానే కొత్త పంచ, చొక్కా కట్టుకోమని ... దేవుడి.. గది దగ్గరకు తీసుకుని వెళ్లి... కూర్చోపెట్టారు. కాసేపటికి ప్రియ
వచ్చింది. ఇద్దరం దేవుడికి దండం పెట్టుకున్నాం. ప్రియ పైకి లేచి.. అమ్మ ఇచ్చిన నపూసలు.. నా మెడలో కట్టింది. దానికి ఒక బంగారు గుండు ఉంది. ఒకసారి
తనకు నమస్కారం చెయ్యమంటే చేశాను. ఇప్పుడు మంగళసూత్రం బయటకు తీసి.. పసుపు కుంకుమ రాసి దండం పెట్టుకో.. అని ప్రియతోటి.. ఇప్పుడు నువ్వు
కూడా అలాగే చేయమంటే చేసింది. రెండు రోజులు ఉంచుకొని... మూడోరోజు ఈ నల్లపూసలు దండ తీసి ఆ బంగారుగుండు.. తీసి.. నీ తాళిలో చేర్చుకోవాలి..
అంటూ ఒక సన్నటి నల్లపూసల లాంగ్ చైన్ తెచ్చి నా మెడలో వేసింది. ఇది నీకు అమ్మగా నా గిఫ్ట్. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో అంది. నా కళ్ళలో నీళ్ళు
తిరిగాయి. ఏడుపు వచ్చింది. ఏంటిది అమ్మా... నువ్వు కూడా... అనగానే... తాళి కట్టించుకున్నావు... అది నీ నిర్ణయం. దానితోపాటు కొన్ని నియమాలు, వాళ్లకు
కొన్ని పాటించవలసిన పద్ధతులు ఉంటాయి. వాటిని కాదంటానికి హక్కులు ఉండవు. నీకు ఇష్టం అయినా, కష్టం వచ్చినా అవి తప్పవు. అయినా.. నీకు బాధ
ఉండ కూడదు అని... ఒక్కసారిగా అన్నీ అమలు చెయ్యడం లేదు. అంటే ఇంకా ఏమి చెయ్యాలి... అన్నాను. ప్రియ ఏమిలేదులే... అంది. మా అమ్మ.. ఇది నీ
ఇష్టం కాదు... ఆ దేవుడు చేసిన నిర్ణయం. ముత్తైదువ గాజులు, పట్టీలు, లేకుండా ఉండొచ్చా. చెవులు అంటే నీకు ముందే నుండే ఏవో పెట్టుకుంటున్నావు. రోజూ
ఈరోజుల్లో అడపిల్లలే వేసుకోవడం లేదు... నిన్నెందుకు అడుగుతాను. కనీసం ఇంట్లో ఉండే సమయంలో శుక్రవారం, మంగళవారం పండుగ రోజుల్లో అయినా
వేసుకోవాలి. అయినా నేను చెప్తే ఎవరు వింటారు... అందుకే పరిహారం కింద... నేను ఒంటిపూట భోజనం చేస్తున్నాను... అంది. నేను వెంటనే నీకు ఎలా ఇష్టం
అయితే అలాగే ఉంటానమ్మా... కావాలంటే ఇప్పుడే పెట్టి చూడు... అన్నాను. అమ్మ లోనికి వెళ్లి... వెండి పట్టీలు, గాజులు తెచ్చింది. ముందు రెండు చేతులకు 3
గాజులు వేసి ఒక బంగారు గాజు వేసి మళ్ళీ 3 గాజులు వేసింది. తరువాత కాళ్ళకి పట్టీలు పెట్టింది. ఇప్పుడు నేను ముఖాన కుంకుమ, మెడలో మంగళసూత్రం,
నల్లపూసలు, చేతులకు గాజులు, కాళ్ళకి పట్టీలు, మెట్టెలతో ఉన్నాను. అక్కడ ఉండలేక గదిలోకి వెళ్ళాను. చేతులు కదిలితే గాజుల శబ్దం వస్తుంది. రూములో
ఉన్న అద్దంలో చూస్తే... తాను కట్టిన నల్లపూసలు దండ... మరీ షార్టుగా గొంతుకు ఉంది. అంటే రెండురోజుల వరకు నేను బయటకు వెళ్లలేను. అంటే ఈ రెండు
రోజులు నేను ఇంట్లో ఇలాగే ఉండాలి. ఇంతలో ప్రియ వచ్చినట్లు అనిపించి లేచాను. ఎందుకో ఇప్పుడు తను నన్ను ఎలా అనుకుంటోందో తెలియదు కానీ...
నేను మాత్రం తనని నా మొగుడు అని అనుకోవడం మొదలెట్టాను.తను కూర్చొని... ఈ రెండు రోజులు ఎలాగోలా సర్దుకొండి. తరువాత సంగతి తరువాత అంది.
నాకు మొదటి రోజు గదిలోంచి రావడానికి సిగ్గువేసి అక్కడే ఉన్నాను. ప్రియ వచ్చి అన్నం, టిఫిన్ ఇస్తూ ఉంది. నాకేమో తనని చూడాలంటేనే ఇదిగా ఉంది.
సాయంత్రం అయ్యేసరికి అమ్మ వచ్చి... రేపొద్దున ప్రియ వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తున్నారు.... అని చెప్పింది. ప్రియ ఇప్పుడెలా... చేద్దామంటూ అడిగాను.
ఎలాగేముంది... ఇలాగే ఉండండి... ఉండాలి కూడా... నేను ఈ ఇంటికి కోడలు... మీరు ఆ ఇంటికి కోడలు అట ... మీ అమ్మగారు చెప్పారు. నల్లపూసలు
కట్టినప్పుడు... అత్తగారు బట్టలు పెట్టాలి... అందుకే వస్తున్నారు... అంది. ఉదయాన్నే లేచి... స్నానాలు ముగించి... టిఫిన్లు చేశాం. ఇంతలో ప్రియ వాళ్ళ అమ్మ,
నాన్న వచ్చారు. కాఫీలు అయ్యాక... మా అమ్మ నాన్న, ప్రియ వాళ్ళ అమ్మ నాన్న ఓ గదిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. మాకు టెన్షన్ పెరిగిపోతోంది. కాసేపటికి
బయటకు వచ్చారు. పిల్లలు... మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేశాం. ఆచారం ప్రకారం జరిగేలా చూడాలని మేం అందరం నిర్ణయం తీసుకున్నాము. ప్రియ మీ ఇంటికి
కోడలు... అలాగే మా ఇంటికి నువ్వు కోడలు. మా ఇంటి కోడలు... మా ఆచారం పాటించాలి. కనీసం మేము ఇంట్లో ఉన్నప్పుడు... మీ ఇంట్లో అయినా... మా
ఆచారాలు పాటించాలి. మీ ఇద్దరూ అలా కూర్చుని ఉండండి... అని కూర్చోపెట్టారు. ముందు నన్ను.. స్టడ్స్ తీయించి... కమ్మలు పెట్టారు, ముక్కుపుడక
ప్రెస్సింగ్ టైప్ పెట్టారు. ఒక ప్లేటులో చీర, జాకెట్, తాంబూలం పెట్టారు. వదిన గారు, మేము తొలి చీర, జాకెట్ పెట్టాము. మేము ఇంటికి వచ్చినప్పుడు... మా
కోడలు.. మాకు చీరలోనే కనిపించాలి... చెవులకు కమ్మలు, ముక్కుపుడక ఖచ్చితంగా ఉండాలి. మిగతావి నేను చెప్పనక్కరలేదు... అన్నారు. అంటే.. ఒక
అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. తప్పకుండా ఒదిన గారు.. అని అమ్మ అన్నది. అమ్మ నన్ను గదిలోకి తీసుకెళ్లి, చీర, జాకెట్ వేసింది. నల్లపూసలు
దండ, లోపలికి, తాళిబొట్లు చీరపైకి వేసింది. గాజులు, పట్టీలు, మెట్టెలతో నేను పూర్తిగా అడదిగా మరిపోయాను. నెత్తిపై జుత్తు ఒకటే తక్కువ. నెమ్మదిగా
తీసుకెళ్లింది. అత్తగారికి నమస్కారం చేశాను. ప్రియ, నేను పక్క పక్కన కూర్చున్నాం. ఈ రోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్. ఈసారి ప్రియ భర్తగా లోపల ఉంటే .. మధు
భార్యగా పాలగ్లాసుతో లోనికి వెళతారు... అని చెప్పారు. నేను సిగ్గుతో తలొంచుకున్నాను. రోజంతా ఇద్దరినీ విడిగా ఉంచారు. నేను చీరలోనే ఉండిపోయాను.
తరువాత రాత్రికి... నన్ను రెడి చేసి... పాలగ్లాసుతో లోనికి పంపారు. లొపల ప్రియ మంచంపై ఉంది. నేను లోనికి వెళ్లి నుంచున్నాను. తను నన్ను నమస్కారం
చెయ్యాలి అంది. నమస్కారం చేసి... మంగళసూత్రం కళ్ళకి అద్దుకున్నాను. తనకి పాలగ్లాసు ఇచ్చాను. తాను తాగి నాకు ఇచ్చింది... మిగతా సగం నేను తాగాను.
నాకు సిగ్గుగా ఉంది... నా భార్య ముందర నేను ఒక ఆడదానిగా ఉన్నాను. తను నన్ను చూసి... ఎందుకు సిగ్గు... నువ్వు కోరుకున్నది ఇదేగా... అని నా వెబ్
బ్రౌసింగ్ చూపించింది. అది చూసి నేను షాక్. భయపడకండి... అడవరిలాగా ఉండాలి, బట్టలు వేసుకోవాలి అనుకోవడం ఒక లక్షణం మాత్రమే.. లోపం కాదు.
నాకు మీరంటే ఇష్టం. ఒకసారి ఆఫీసులో మీ బ్రౌజింగ్ హిస్టరీ చూసి, డాక్టర్ తో... మాట్లాడాను.. తరువాత అత్త, మామ, మా అమ్మ నాన్నలతో మాట్లాడి... ఐదంతా
చేశాం. మీరు నేను సంతోషంగా లేమా... మీరు బాగానే సెక్స్ చేస్తున్నారు కదా... అంది. నేను హ్యాపీ. మీరు ఎప్పుడైనా అడదిగా తయారు అవొచ్చు... ఇంట్లో
అందరికీ తెలుసు...కాబట్టి ఎవరూ ఏమీ అనుకోరు....అన్నది. ఆ రోజు మేమిద్దరం చాలా సంతోషంగా గడిపాము.
ఉదయాన్నే లేచి.. అలవాటుగా మంగళసూత్రం కళ్ళకి అద్దుకున్నాను.నేను ఆ రోజునుండీ ఇప్పటి వరకు... మంగళసూత్రం, మెట్టెలు తియ్యలేదు.
అప్పుడప్పుడు ఇంట్లో పూర్తిగా... ఆడదానిలాగా మారి.. ఎంజాయ్ చేస్తాను
Discussion (4)
Wow super story
Very well written dear.. keep posting more stories. I became a big fan of your writings.
It's a very new concept.. Liked it so much..
TKS