అప్పుడు నాకు 26 సంవత్సరాల వయస్సు. నేను నా అలవాటు ప్రకారం శుక్రవారం సాయంత్రం మా అక్క వాళ్ళింటికి వెళ్దామని సాయంత్రం బయల్దేరాను. ఎప్పుడూ చీర కట్టుకునే దాన్ని ఆరోజున మాత్రం సల్వార్, లో నెక్ కమీజ్ కట్టుకున్నాను. నే కట్టుకున్న సల్వార్ నడుం దగ్గర్నుంచి మోకాళ్ళవరకూ చాలా టైట్ గా ఉంది. పై కమీజ్ లో నెక్ కావడం, శాటిన్ క్లాత్ తో కుట్టింది, మరియు చాలా టైట్ గా ఉండటం వల్ల నా ఎద పొంగుల్ని నేను లోపల వేసుకున్న బ్రా లోంచి తన్నుకు వచ్చేలా చేస్తోంది. అయితే నేను ఒక సైడుకు మాత్రమే వేసుకున్న నైలాన్ చున్నీ నా పొంగుల్ని కప్పలేక జారిపోతోంది. జావకారిపోతోంది. నా పొంగులకు కిందనున్న కమీజు నా పొట్టకు అతుక్కుపోయి నా నాభి లోతుని చూసే వాళ్ళ కళ్ళతో కూడా కొలవడానికి దారి చూపిస్తుంది. కమీజు మరికొంచెం కిందకు వెడితే నడుము నుంచి ఊరువుల వరకూ నాకు మంచి ఆకృతిని ఇచ్చింది. నేను ఫ్లాట్ చెప్పులు వేసుకుని ఉన్నాను. మా అక్కతో సెల్ఫోన్ లో మాట్లాడుతూ పరుగెత్తుకుంటూ బస్ ఎక్కి స్త్రీల సీట్లలో ముందునుంచి మూడవ వరుసలో కిటికి సీటు పక్క సీటులో కూర్చున్నాను. నా కిటికీ సీటులో ఎవరో యువతి కూర్చుని ఉంది. బస్సు కదలగానే నేను ఫోన్ లో మాట్లాడటం ఆపేశాను. బస్ కొంచెం ముందుకు కదిలిన తరువాత "హాయ్ సిస్టర్, నా పేరు అనిత" అని చెప్పింది. నేను "సంతోషం అక్కా. నాపేరు మధు." అని చెప్పా. "నీ డ్రెస్ చాలా బాగుంది." అని చెప్పింది. ఇంకా "మీ అక్కగారింటికి వెడుతున్నారా!" అని అడిగింది. "అవునక్కా!" అన్నాను. అనిత గొంతు కొంచెం వేరేగా ఉంది. ఆమెకి నా గొంతు కూడా అలాగే ఉంది. "అక్కా, మీరు...?" అన్నాను. "అవును సిస్టర్! నేనొక ట్రాన్స్ జెండర్ ని. మీరు కూడా...?" ... అని ఆగింది. "అనితక్కా! మీరు అనకండి. ఏకవచనం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకా నాగురించి చెప్పాలంటే నేను పుట్టుకతో మగపిల్లవాణ్ణే. కాని అయిదుగురు అక్కల తరువాత పుట్టడం వల్ల నాకు పదేళ్ళ వరకు మగపిల్లల బట్టలు కట్టలేదు. అందుచేత ఆ తరువాత కూడా మా అక్కల బట్టలే కట్టడం అలవాటైంది. కేవలం స్కూల్ లో, కాలేజీలో మాత్రమే మెగా బట్టలు కట్టడం అలవాటు. ఇంట్లో కాని, ఇలా ఊళ్ళెళ్ళినప్పుడు కానీ ఆడ దుస్తులే ధరిస్తాను." అని చెప్పాను. "అవును చెల్లీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ గొంతు కూడా ఎక్కువగా ఆడపిల్లల గొంతులాగే ఉంది." అని చెప్పింది. అలా అలా ఎన్నో విషయాలుమాట్లాడుకుంటున్నాం. మాటల సందర్భంలో అనిత చెప్పింది. ఇంకో నెలరోజుల్లో తమిళనాడు విల్లుపురానికి దగ్గర కూవాగం లో ఒక పెద్ద ట్రాన్స్జెండర్ పండుగ జరుగుతుంది. నువ్వు కూడా రాకూడదు? అక్కడ ఆ పండుగలో కొన్నివేలమంది ట్రాన్స్ జెండర్ లు దేశం నలు మూలలనుంచి వస్తారు." అని చెప్పింది.. "వివరంగా చెప్పక్కా!" అని అడిగాను. "వెంటనే నా చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని, ఇన్నాళ్ళకు జనరల్ పబ్లిక్ లో నన్ను అసహ్యించుకోకుండా అక్కా అని ఆప్యాయంగా పిలిచిన ఒక చెల్లిని చూశాను. చాలా థాంక్స్ చెల్లీ" అని చెప్పి కూవాగం గురించి చెప్పడం మొదలు పెట్టింది.
Friends · Telugu
గరిమ కథలు 9 అనిత చెప్పింది... ఛలో కూవాగం
Completed
|
Part 1 of 3
|
0 Likes
Part 1
1095 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Awesome sis. Chala detailed ga aa koovagam festival gurinchi explain chesaru
Thanks a lot sister. In future I am going add some of my experiences there. I wish your encouraging comments more and more LB,🤝