ఆలా తర్వాతి కార్యక్రమాలు చాలా అసౌకర్యం తో నే పూర్తి చేశాను. ఇక పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురు గది కి వచ్చాను. నా చెల్లి నన్ను ఒకింత కోపం ఈర్ష్య తో చూస్తుంది. తర్వాత చాలా సేపు రెస్ట్ తీసుకున్న. రిసెప్షన్ కోసం లెహంగా లోకి మారాను. నా జడ విప్పి పెద్ద బన్ చేసింది మేకప్ ఆర్టిస్ట్ నా బన్ నిండా రోజా పూలు క తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నా చెల్లి ఫ్రెండ్స్ అందర్నీ మళ్ళీ గది ఒ రానిచ్చింది మా అమ్మ. మా చెల్లి ని వేరే గది లోకి తీసుకువెళ్లి బయట తాళం వేసేసింది. తన ఫ్రెండ్స్ అందరికి నా నోట్లో చిన్న నొప్పి ఉండటం తో నేను మాట్లాడటానికి కష్టం అని కొంచెం అని వాళ్ళు నమ్మి ఆలా నన్ను ఆటపట్టిస్తూ ఉన్నారు. నేను అసౌకర్యం గానే వాళ్ళ మాటలకి నవ్వు నటిస్తున్నా. వాళ్ళు నాకు విశ్రాంతి కావాలి అనుకోని బయటకి వెళ్లిపోయారు. నేను ఆలా జరిగిన దాని అంతా నెమరువేసుకుంటున్నా. ఇంతలో రిసెప్షన్ కి రమ్మని చెప్పడం తో వెళ్ళా. అక్కడ నా చెల్లి ఫ్రెండ్స్ నాకు ఆరోగ్యం బాగోలేదని నమ్మారు కాబట్టి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నిరుత్సాహ పడి కేవలం విష్ చేసి వెళ్లిపోయారు.
నా బంధువులు అందరూ నాకు తెలుసు కాబట్టి మేనేజ్ చెయ్యగలిగా. పెళ్లి కొడుకు తరుపు వారిని, అతని స్నేహితులని ఇంకా అందరూ అతిథులతో ఫోటోలు అన్ని అయ్యే సరికి రాత్రి
తొమ్మిది అయ్యింది. శో
Family · Telugu
నేనే పెళ్లికూతురు
In Progress
|
Part 3 of 4
|
3 Likes
Part 3
4262 Views
3 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (3)
కథ చాలా చక్కగా ఉంది
Chala baga rasaru Indu..keep writing more..
Nice story contunu