రాజ కుమార్తెలు, కిన్నెరలు, ఇతర పరిచారికలు కకావికలై పరుగులు తీస్తున్నారు. తిలోత్తమ నెమ్మదిగా దూరం నుంచి ఏం జరుగుతోందో చూస్తూ ఉంది. ఇంతలో ఆ సింహాల గుంపు మాయం అయ్యింది. అక్కడ ఒక పొట్టి మాంత్రికుడు ప్రత్యక్షం అయ్యాడు. చూడటానికి పొట్టిగా ఉన్నాడు కానీ చాలా దృఢంగా ఉన్నాడు. వర్షిణిని ఎత్తుకుని అంతఃపురం నుంచి అడవిలోకి కామవర్ధనుడు శరీరం వదిలిన చోటకు ఆకాశ మార్గం లో తీసుకుని పోయాడు. వర్షిణిలో ఉన్న కామ వర్ధనుడికి ఏవీ గుర్తు లేవు. కర్కోటకుడు ఎన్నో ప్రయోగాలు చేశాడు. అన్నీ విఫలం అవుతున్నాయి. అప్పుడు తనను అడ్డుకుంటున్న శక్తి ఎవ్వరా అని చూశాడు. ఎదురుగా జీవకుడు కనబడ్డాడు. కర్కోటకుడు మండి పడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్కోటకుడు చాలా తీవ్రం గా గాయపడ్డాడు. ఇంతలో వర్షిణి లో ఒక మార్పు వచ్చింది. వర్షిణి తన గురువు చేసిన ప్రయత్నాల వల్ల తన పరకాయ ప్రవేశ విద్యను గుర్తుకు తెచ్చుకుంది. త్వరగా వెళ్ళి ఆ చెట్టు తొర్రలో చూసింది. ఆమెకు తన కామవర్ధన శరీరం కనబడలేదు. కారణం అప్పటికి రెండు రోజుల మునుపు జీవకుడు ఆ శరీరాన్ని దహనం చేసేశాడు. ఇంక ఏంచేయాలో పాలు పోక అటు ఇటు తిరుగుతోంది, ఇంతలో అక్కడ ఒక వేశ్య మరణిస్తే ఆమే బంధువులు ఆమె శరీరాన్ని అడవికి తెచ్చారు. ద్ధహనం చేయటం కోసం. ఇంతలో కామవర్ధనుడు వర్షిణి శరీరాన్ని వదిలి ఆ వేశ్య శరీరం లోకి ప్రవేశించాడు. ఆమె లేచి కూర్చుంది. దానితో ఆమె బంధువులు అదిరిపడి అక్కడి నుండి పారిపోయారు. ఇంతలో కర్కోటకుని కాళ్ళు, చేతులను జీవకుడు నరికేశాడు. ఇక గత్యంతరం లేక కర్కోటకుడు వర్షిణి శరీరం లోకి ప్రవేశించాడు. అప్పుడు జీవకుడు తన మంత్రం దండం తో కర్కోటకుని మంత్రాశక్తుల్ని హరించేశాడు. ఆమె జ్ఞాపక శక్తిని పూర్తిగా వర్షిణిగా తానెవరో మాత్రమే గుర్తుండేలా చేశాడు. కర్కోటక జ్ఞాపకాలు అన్నీ మాయం అయిపోయాయి. అప్పుడు వేశ్య లావణిక అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. ఆమె లో ఉన్న కామ వర్ధనుడు జరిగింది తెలుసుకుని కోపంతో ఊగి పోయాడు. అయితే అతని కోపం ఆ వేశ్య శరీరానికి సరిపోవడం లేదు. అతడు రొమ్ము విరుచుకుంటే ఆమె స్థనాలు ముందుకు ఊగుతున్నాయి. అంగలు వేసి ముందుకు ఉరుకుదామనుకుంటే ఆమె చీర అడ్డుపడుతోంది. అప్పుడు కామ వర్ధనునికి తాను ఆశరీరంలో మాయలు ప్రయోగించడమే తప్ప పరాక్రమం చూపలేడు అని అర్థం చేసుకున్నాడు. స్త్రీ శరీరంలోకి మారాకా తన గురువుదగ్గర నేర్చుకున్న విచిత్రమైన విద్యలు అన్నీ గుర్తుకు వచ్చాయి. అయితే ఎన్నో ప్రయోగించి మాయా యుద్ధం చేశాడు కానీ జీవకుని శక్తుల ముందు అతని శక్తులు ఏవీ పనిచేయలేదు. చివరికి జీవకుడు తన మంత్రదండం తో లావణిక దేహంలో ఉన్న కామ వర్ధనుని శక్తులన్నీ హరించేశాడు. ఇప్పుడు అక్కడ సిగ్గులోలకబోస్తూ లావణిక, వర్షిణీ మాత్రమే మిగిలారు.
జీవకుడు వారిద్దరినీ తీసుకుని చిత్రాంగద అంతః పురం లో భానువర్మ దగ్గరకు తీసుకుని వచ్చాడు. జరిగింది అంతా వివరించాడు. భాను వర్మ చిత్రాంగద కు జరిగింది అంతా వివరించాడు. చిత్రాంగద కు చాలా ఆనందం కలిగింది. లావణికను అంతఃపురం లోని వేశ్యామందిరానికి పంపింది. వర్షిణిని కిన్నెరల మందిరానికి పంపింది. జీవకుడు భానువర్మ తో ఇక నేను మన గురువుగారి దగ్గరకు బయల్దేరతాను. ఇప్పుడు నీరాజ్యం నిష్కంటకం. అన్నాడు. జీవకునికి కృతజ్ఞతలను తెలియజేసుకుని గురువర్యులకు తన ప్రణామాలను తెలియ జెప్పాడు. జీవకుడు వెళ్లిపోయాక చిత్రాంగద తన అలవాటు ప్రకారం "భామినీ: అని గోముగా పిలిచింది. "ఏమి రాకుమారి?" అని భానువర్మ భామిని గా మారి వయ్యారం గా తిప్పుకుంటూ ఆమె చెంతకు చేరి ఆమె కౌగిలిలో కరిగిపొయ్యాడు (పోయింది).
సమాప్తం
Family · Telugu
కామవర్ధనుడు
Completed
|
Part 12 of 12
|
1 Likes
Part 12
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
3391 Views
6 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (6)
Can we down load the content
Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.
థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕
చెల్లెలు మేఘనగారికి, ఇక్కడ తొమ్మిదవ భాగం నుంచి కామ శాస్త్రం లోని వివిధ బంధాలను పరిచయం చేస్తున్నాను. ఆసక్తి కల సోదరీమణులు చదువగలరు అని మనవి .
18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.
18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.