కామవర్ధనుడు

gvgarima

  | October 04, 2025


In Progress |   2 | 1 |   1142

Part 6

వర్షిణి మూడవ మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ కిన్నెరల సమూహాలు. వందల మంది కిన్నెరలు. వారందరికీ కొంత మంది వృద్ధ కిన్నెరలు స్త్రీ విలాసాలను నేర్పుతున్నారు. వారందరూ ఒకే విధంగా లేరు. వారిలో షండులు, వర్షవరులు, సౌగంధికులు, క్లీబులు, కుంభకులు, ఈర్షకులు, నపుంసకులు, ఆసేక్యులు, శాలీనులు, మోఘబీజులు, ఆక్షేప్తులు, నిష్పందులు, అనండులు (అండములే లేనివారు), పక్షాండులు (ఒక అండమో సగం అండమో) ఉన్నవారు, ఛిన్నాండులు, నిర్వేగులు, మందవేగులు, ఈర్ష్యాషండులు, స్త్రీ సములు, విశుక్రులు, నిష్ప్రకృతులు, అసమప్రకృతులు, అల్పస్పందులు.... ఇలా చరకుడు చెప్పిన 56 రకాల కిన్నెర జాతుల వారూ అక్కడ ఉన్నారు. వారందరికీ అంతః పుర ప్రవర్తనారీతులను వివరించి చెబుతూ నడకలు, నడవడికలూ నేర్పుతున్నారు కిన్నెరల గురువులు. కొందరు కిన్నెరలు సహజమైన స్త్రీల కన్నా ఎంతో అందంగా ఉన్నారు. కొందరు శరీరాకృతి స్త్రీలను పోలి ఉన్నా ముఖం మాత్రం మగవారి ముఖంలాగానే ఉంది. కొందరు నిండుగా బట్టలు కట్టుకుంటే, కొందరు అర్ధనగ్నంగా ఉన్నారు. కొందరు ఇంచుమించుగా నగ్నంగా ఉన్నారు. ఇంతమందిని చూసాకా వర్షిణి "అవంతీపురంలో కిన్నెర గానైనా బ్రతికెయ్యవచ్చు". అనుకుంది. (సశేషం)

Part 7

అప్పుడు ఆ మందిరంలోకి మంజుహాసిని అనే మధ్యవయస్కురాలైన కిన్నెర ప్రవేశించింది. చాలా స్త్రీ సహజమైన విలాసం తో అందరినీ తనచూపులతోనే ఆకట్టుకుంటూ అందర్నీ చూస్తూ చిరునవ్వు నవ్వింది. దోసిలి మల్లెలు వెదజల్లినట్టుంది.
"ప్రియ సఖులారా! మన నాయకురాలు భామినీ దేవి ఆదేశం మేరకు నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. మనలో సహజంగా కిన్నెరలు కొందరు. కొందరు కృత్రిమంగా కిన్నెరలు గా మార్చబడినవారున్నారు. కొందరు మధ్యవయస్సు వరుకు మగవారై పరిస్థితుల ప్రభావం వల్ల కిన్నెరలైనవారున్నారు.
అయితే కిన్నెరలు అనేది మనందరికీ వర్తించే పేరు. కిన్నెరలు గా మనం మహిళలు గా గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూంటాము. అది మనకు పవిత్రమైన, ఉదాత్తమైన లక్ష్యం. ఆలక్ష్యం కోసం మనం శారీరికంగా, మానసికంగా, బౌద్ధికంగా, రాజరికం గా సంసిద్ధం కావాలి.".... (సశేషం)


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.

gvgarima gvgarima (Author)

థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕