Office · Telugu

మీరు నా లా అవ్వొద్దు అనుకుంటే ఇలా చెయ్యకండి

In Progress | Part 2 of 3 | 1 Likes

Part 2

బర్త్డే రోజు అంతా భారత్ వాళ్ల అమ్మ అడుగుతూనే ఉంది "ఏరా... చీర తీసేసి వేరే బట్టలు వేసుకుంటావా?" అని. అతనికి తన పాత బట్టల లో birthday day spend చెయ్యడం ఇష్టం లేదు. "పర్లేదు లే అమ్మ. బానే ఉంది. ఉంచుకుంటాను లే" అన్నాడు. "జాగ్రత్త రా ... అసలే చాలా costly ది. ఏవైనా మరకలు పడి పాడవుతుందేమో" అని భయం గా చెప్పింది అమ్మ.

ఆ రోజు ముగిసేసరికి, అతనికి చీర బాగా అలవాటు అయ్యింది. ఆ రాత్రి పడుకునే ముందు చీర తీసేసి రోజు లానే పాత బట్టలు వేసుకుని పడుకున్నాడు. పట్టు చీర మాత్రం జాగ్రత్త గా మడిచి అమ్మ కి ఇచ్చేశాడు. Inners గట్రా అన్ని వాషింగ్ బుట్ట లో వేసేశాడు.

తర్వాతి రోజులు చిన్నచిన్న మార్పులతో మొదలయ్యాయి. ఇంట్లో అక్క వాడిని భారతి అని పిలవడం స్టార్ట్ చేసింది. "ఆట పట్టించకు అక్క" అంటే...., "నిన్ను అలా చీర లో చూసినప్పటి నుంచి నాకు ఒక చెల్లి కావాలి అని అనిపిస్తుంది. ఎలాగూ నా బట్టలే వేసుకుంటున్నావుగా... నిన్ను నా చెల్లి లా ఫీల్ అవ్వనీ రా..." అంది.

మొదట — ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే (అంటే అమ్మా నాన్నలు లేని సమయం లో) అలా పిలిచేది.
తర్వాత — అలవాటు అయిపోయి అమ్మ నాన్నల ఉన్నప్పుడు కూడా అక్కా - చెల్లెళ్ల లా మాట్లాడుకునే వారు.
కొద్ది రోజులకి — అది common అయిపోయింది. అమ్మ కూడా 'చెల్లి ని పిలువు... చెల్లి కి ఇది ఇవ్వు...' అలా అనడం స్టార్ట్ చేసింది.
ఇంకొన్ని రోజులకి -- నాన్న కూడా భారతీ అని పిలవడం.... తన గురించి మాట్లాడినప్పుడు 'చిన్న కూతురు ' అనడం స్టార్ట్ చేశారు.

ఈ మార్పులు నాచురల్ గా జరిగిపోయాయి... కొన్ని రోజులకు అమ్మ గమనించింది.
“ఇప్పుడేం కంప్లైంట్ లేదు కదా నీ బర్త్డే గురించి?” అని నవ్వుతూ వాడిని అడిగింది.
అతను చిన్నగా నవ్వాడు.
“బెస్ట్ బర్త్డే.”
నాన్న కూడా సంతోషంగా చూసేవాడు.
ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ బర్త్డే రోజు ఏదో అసంతృప్తి ఉండేది.
ఈసారి మాత్రం అతను ప్రశాంతంగా ఉన్నాడు.

ఒక రోజు పొద్దున్నే ఇంట్లో హడావిడి గా ఉంది. ఏంటని గమనిస్తే భరత్ కి అర్ధం అయ్యింది ఏంటంటే అమ్మ అక్కకు ఆ Birthday పట్టు చీర కట్టుకోవడం లో హెల్ప్ చేస్తుంది. భరత్ లో ఏదో తెలియని బాధ ఉండింది. రాత్రి ఆలస్యంగా అక్క తిరిగివచ్చింది. అతను వెంటనే చీర తీసుకుని చూసాడు.
దానిపై చిన్న చిన్న మరకలు ఉన్నాయి.
అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
“ఇది ఏమిటి?” అన్నాడు కోపంగా.
“అరే... చిన్నదే లే… డ్రై క్లీనింగ్కి ఇస్తే పోతుంది” అంది అక్క.
“Careful గా ఉండొచ్చు కదా.... ఎంత మంచి చీర... ఎలా పాడు చేశావో చూడు...." అన్నాడు కోపంగా.... "అంత లా react అవుతున్నావు ఏంటీ? నా చీర! నా ఇష్టం " అని కోపంగా అరిచింది అక్క. "అది నా చీర" అన్నాడు గట్టిగా.
అలా అంటూనే అమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు.
“అమ్మా… చూసావా? నా చీర చెడగొట్టింది!”

అక్క - (వెంటనే)నీ చీరా? అది అది నాకు వచ్చిన గిఫ్ట్. ఏదో పాపం లే అని నేనే అమ్మా నాన్నలను ఒప్పించి నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాను!
భరత్ - ఎలాగైతే ఏంటి? నాకు ఇచ్చారు కదా!
నాన్న - (గొడవ లో జోక్యం చేసుకుంటూ) ఇంట్లో ఆడాళ్ళందరికీ ఆ చీర పై హక్కు ఉంది. గొడవ పడకండి.
అమ్మ - భరత్ నువ్వు ఆగు. ఏమే హేమ (అక్క పేరు) వాడు మగాడు అయ్యి ఉండి కూడా, first time అయ్యి ఉండి కూడా ఒక రోజంతా జారత్త గా ఉంచుకున్నాడు. నువ్వంటే ఒక్క రోజులోనే ఇలా పాడు చేశావు?

చివరికి అక్క కోపంగా అంది — “సరే. నిజంగా ఆ చీర నీకే కావాలా?”
భరత్ - కోపం గా “అవును.”
హేమ - “అయితే ఒక కండిషన్ — ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు చీరలే కట్టుకోవాలి. అప్పుడే అది నీది అవుతుంది.”
అతను కాసేపు ఆలోచించాడు.
భరత్ - (ఎలాగూ ఇప్పటికే ఎక్కువ సమయం అక్క బట్టల లోనే గడుపుతున్నాడు కాబట్టి) “ఓకే.”

అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం.

అమ్మ ఆలోచించి ఒక పందెం పెట్టింది.
“సరే… మీరు ఇద్దరూ ఆ చీర కోసం పోటీ పడాలి.”
ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
“నేను నా రోజువారీ చీరలు మీ ఇద్దరికీ ఇస్తా. ఎవరు ప్రతిరోజూ బాగా వేసుకుని, ఇంటి పనుల్లో సహాయం చేస్తారో — ఆ వ్యక్తికే ఆ పట్టు చీర. చీర అంటే ఆట కాదు… బాధ్యత కూడా.”

హేమ - “చూద్దాం… భారతి. ఆ చీర ఎలాగైన నేనే గెలుచుకుంటా”
భరత్ - “చూద్దాం.”

తరవాత పడుకునేటప్పుడు భరత్ వాళ్ళ నాన్న ఇలా అన్నాడు...
నాన్న - ఎంటే ఇలా competition పెట్టావు? చీర ఎలాగు హేమ కీ నీకే గా...? మధ్యలో వాడిని ఎందుకు లాగావు?
అమ్మ - నాకూ ఆ మరకలు చూస్తే కోపం వచ్చింది. హేమ కీ కూడా ఇంటి పనులు, వంట పనులు నేర్పించాలి. ఎప్పుడూ నేర్పుదాం అనుకున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంది. ఇదో మంచి అవకాశం.
నాన్న - ఏమో.... వాడి ఎమోషన్స్ తో ఆడుకోవడం తప్పు.
అమ్మ - తప్పేముంది? వాడు ఓడిపోతే వాడే ఇష్టంగా ఇచ్చేస్తాడు.
నాన్న - మరి వాడు గెలిస్తే?
అమ్మ - ఏముంది? వాడికే ఇచ్చేస్తాను. వాడు ఆ చీర కట్టుకొని ఎక్కడకు వెళ్తాడు? నాకు అవసరం వచ్చినప్పుడల్లా వాడిని అడిగి తీసుకుంటా. అప్పుడు కానీ హేమ తిక్క కుదరదు.

2221 Views 7 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (7)

Saroja999
Saroja999 4 weeks, 1 day ago

Wow andi..nedi 1st part story chuste cd story la ledu..okka Lower middle Class ga grounded ga undi..chala baga narrate chesaru

Miss
Miss 4 months ago

Waiting for next part

gvgarima
gvgarima 7 months, 3 weeks ago

చాలా తేలికైన భాషలో చాలా చక్కగా వ్రాశారు. కథ బాగుంది. కొనసాగిస్తే బాగుంటుంది. అవును నిజజీవితం ఎప్పుడూ బాధాకరం గా నే ఉంటుంది.

Genderless
Genderless Author 5 months, 2 weeks ago

ఇవ్వాళ ఈ స్టోరీ కంప్లీట్ చేస్తా...

Meghana
Meghana 8 months, 3 weeks ago

@Genderless, nenu mottam story chadive anthavaraku evaru rasaru ani chudaledu.. Chala twists tho bagundi evaru rasaru ani chusa.. Avunu elanti heart touching stories rayali antey maa @Genderless valle avutundi.. Super start my friend..

Genderless
Genderless Author 8 months, 3 weeks ago

Thnx Dear

Genderless
Genderless Author 5 months, 2 weeks ago

What about my other stories?

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login