నిన్ను ట్రైన్ లో ఉండి చూస్తున్నాను. నువ్వు చాలా తియ్యగా పాడుతున్నావు. నీ డ్రస్సు మరీ పేదగా లేదు. కానీ నీవు ఇలా యాచన చెయ్యవలసిన అవసరం ఏమొచ్చింది? నీ కష్టం ఏమిటి? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అని అడిగింది నన్ను. అప్పుడు నేను గంగయ్య నుంచి గంగ గా నా మార్పు విశేషాలు, ఆర్కెస్ట్రా వాళ్ళు భౌతికంగా నన్ను ఎలా వాడుకున్నారో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అంతా వివరించి చెప్పాను.
రామనాయకి ఒక్క క్షణం ఆలోచించి నీకు రక్షణ కావాలి కదా? నాతో వస్తావా? మా కమ్యూనిటీ సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పుదువు గాని" అని అడిగింది.
నేను వెంటనే ఒప్పుకున్నాను. టాక్సీ లో తనతో పాటు సైదా పేటలో ఒక సందు చివర ఉన్న అపార్ట్ మెంటు కు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఆమె పరిరక్షణలో 25 మంది ట్రాన్స్జెండర్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళలో 15 ఏళ్ల వాళ్ళనుంచి 40, 50 సంవత్సరాల వయస్సు వాళ్ళ వరకు ఉన్నారు. రకరకాల స్త్రీ వస్త్రాలలో ఉన్నారు వాళ్ళంతా. కొంతమంది చీరలు, పరికిణీ, జాకెట్లు ధరించి ఉన్నారు. కొందరు ఫ్రాక్లు, కొందరు చుడీ దార్ లు కట్టుకుని ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళందరికీ నన్ను ఈ అమ్మాయి గంగ. మనలాంటిదే. మంచి గాయకురాలు. మన అందరికీ పాటలు నేరపటానికి వచ్చింది.. అంటూ తమిళంలో చెప్పింది. నాకు తమిళం అర్థం అవుతుంది, కానీ తిరిగి మాట్లాడలేను. ఇక అక్కడ నుంచి నా కొత్త జీవితం వాళ్ళకి సంగీతం నేర్పటం తో మొదలైంది.
నన్ను నేనెవరు అనే ప్రశ్న? ఎప్పుడూ చాలా లోతుగా బాధిస్తోంది. నేను - అతడా? ఆమె? లేక ట్రాన్స్ జెండరా? తెలియలేదు. ఈ ప్రశ్నలతో ఒక నెల గడిచింది. నాయకి నాకు కొన్ని దుస్తులు తెచ్చి ఇచ్చింది. అందరికీ నేను దగ్గర అవుతున్నాను. నాకు వాళ్ళందరితో కలిసి తిరిగటంలో నేనూ కూడా వాళ్ళలా మారితే బాగుంటుంది అనిపించింది. రామనాయకితో ఏకాంతంలో నా మనసులోని మాట చెప్పాను. నువ్వు ఇప్పుడు మాతోనే కదా ఉన్నావు!? అని అడిగింది. నిజమే. అయితే మీలాగే మారిపోవాలి అని ఉంది. లోపల ఒక వ్యక్తి, బయటకి ఒక వ్యక్తి గా ఉండటం నాకు ఇష్టం లేదు. అన్నాను. నాయకి మౌనంగా తల పంకించింది. ఆ రోజు ఉదయం 8.00 గంటలకి ఒక పదిహేను మందితో కలిసి బయటకు పనిమీద వెడుతూ నన్ను కూడా వాళ్ళటో రమ్మంది. (సశేషం)
Family · Telugu
ట్రాన్స్ జెండర్ కావాలంటే . . . . పరీక్ష
Completed
|
Part 3 of 4
|
1 Likes
Part 3
1122 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)