Family · Telugu

రాఘవుడే రాఘవి

Completed | Part 5 of 6 | 1 Likes

Part 5

ఇంక ఆ రోజు నుంచి నన్ను ఆడ పిల్లగానే పెంచటం మొదలు పెట్టింది మా అత్త. రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు గా మారుతున్నాయి. మా అత్త భువనేశ్వర్ రైల్వేస్ లో క్లార్క్ గా పనిచేసేది. మా అత్త నా విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ వల్ల నేను ఏ విధమైన మగలక్షణం లేకుండా పెరుగుతున్నాను. నేను అప్పటికి మూడు సంవత్సరాలు గా శారదాంబ గారి దగ్గర కర్ణాటక సంగీతం, శ్రీకాంతరథ్ దగ్గర హిందుస్తానీ సంగీతం, నర్మదా బెహరా దగ్గర కథక్ నృత్యం నేర్చుకుంటున్నాను. శారదాంబ గారితో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లలో కచేరీలు ఇవ్వటానికి వేడుతుండేదాన్ని. మా నాన్న వాళ్ళు కూడా ఒకసారి మాత్రమే అడిగారు. నీకు ఇలా ఆడపిల్లగా పెరగటంలో ఇబ్బంది ఏమన్నా ఉందా? లేదు. అత్త పెంచే తీరు నాకు బాగా నచ్చింది. నేను ఆడపిల్లగానే పెరుగుతాను. అన్నాను. ఇంక వాళ్ళు ఏమీ అనలేదు. ఇంట్లో అనుమతి ఉంది. గురువుల దగ్గర ఏం ప్రశ్న లేదు. మిగిలిన గురువుల దగ్గర అస్సలు తెలియనే తెలియదు. మా అత్తకు తెలిసిన గైనకాలజిస్ట్ సహాయంతో మోనిటర్ చేయిస్తూ నాలోని ఆడతనం బాగా పెరిగేందుకు కావలసిన హార్మోన్ చికిత్స ఎప్పటికప్పుడు చేయిస్తూనే ఉంది. అవాంఛిత రోమాలు రాకుండా కావాల్సిన చికిత్స కూడా చేయించింది. నాకు పదహారవ ఏడు వచ్చే సరికి నేను కథక్ నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వటం మొదలు పెట్టాను. నేను పూర్తిగా నృత్య సంగీతాలకే అంకితం అయిపోయాను. అవసరమైన మేరకు హిందీ, ఇంగ్లీష్, ఒరియా, తెలుగు భాషలలో మంచి పట్టు సాధించాను. పూరీ శ్రీ జగన్నాథ మందిరంలో స్వామి వారి సన్నిధిలో శ్రీ జగన్నాథ స్తోత్రాలు, ఒరియా భాషలో శ్రీ జగన్నాథ స్వామి పై పాటలు, జయదేవుడు రచించిన గీతగోవిందం నుంచి అష్ట పదులు పాడటం అలవాటైంది. ప్రతి ఆదివారం భువనేశ్వర్ నుంచి శ్రీ జగన్నాథ పూరీ కి వెళ్ళటం అలవాటయింది. నా పాటలను ఎందరో మెచ్చుకునే వారు. నా నృత్యం అంటే ఎంతమందికో ఇష్టం.
మా గురువుగారి నేతృత్వం లో నేను గీత గోవింద కావ్యానికి నృత్యాభినయం కూడా చేయటం మొదలు పెట్టాను. ఆ దృశ్య కావ్యంలో నేను రాధిక గా అభినయం చేస్తున్నాను. నా ఆకృతి కూడా చాలా నాజూకు గా, బ్రహ్మ చెక్కిన అప్సరస రూపం లా ఉంది. మేకప్ లేకుండా కూడా చాలా అందగత్తెనే నేను. కళ్ళు తిప్పుకోలేని అందం వచ్చింది. ప్రతి రోజు నేను నిదురలేవగానే ఎంతో కృతజ్ఞతతో మా అత్తకు దండం పెట్టి మరీ నా దినచర్య మొదలు పెట్టేదాన్ని. ఇలా మరి రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ రెండు సంవత్సరాలలో నాకు మా అత్త SRS కూడా చేయించింది. కొన్నాళ్ళ పాటు మేమిద్దరం ఈ పనిమీద ఢిల్లీ వెళ్ళి అక్కడ అన్నీ నిదానించే వరకూ ఉండి నెమ్మది గా తిరిగి భువనేశ్వర్ కి చేరుకున్నాం. నేను ఇప్పుడు ఒక ప్రసిద్ధ కళాకారిణిని. క్రమం తప్పకుండా యోగాభ్యాసం కూడా చేసేదాన్ని. దాని వల్ల శరీరం ఎప్పుడూ నా స్వాధీనంలోనే ఉండేది. నాకు ఇరవై ఏళ్లు వచ్చేసరికి మా అత్తకి 50 సంవత్సరాలు వచ్చాయి. తను రైల్వేస్ లో స్టేషన్ సూపర్ ఇంటెండెంట్ గా ప్రమోషన్ తీసుకుంది. మధ్యలో ట్రాన్స్ఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదు. కానీ సూపర్ ఇంటెండెంట్ గా ప్రమోట్ అయ్యాకా ట్రాన్స్ఫర్ అవమన్నారు. దానితో VRS తీసుకుంది. స్వంత ఇల్లు ఉంది. తాతగారిచ్చిన భూమి ఉంది. సొంతం గా ఒక సంగీత నాట్య శిక్షణ శాల మొదలు పెడదాం అని ఆలోచన వచ్చింది అత్తకి. నేను అత్తకి ముద్దుల కూతుర్ని. ఎప్పుడు కాదనలేదు. అందుకే మేం పాఠశాలను మొదలు పెట్టేశాం. అయితే ఎవరూ లేని అనాథపిల్లలకు కూడా అందులో ప్రవేశం కల్పించాలని ఆలోచించాము. అందులోనూ కొన్ని కొన్ని అనాథ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ జాగ్రత్తగా గమనించి మగపిల్లలు గా పుట్టి ఆడపిల్లలుగా ప్రవర్తించే పిల్లలను ఒక అయిదుగురిని చేరదీశాం. మరి రెండు సంవత్సరాలు గడిచాయి. పాఠశాల నడుస్తోంది. రాఘవి గా దేశ విదేశాలలో నాకు మంచి పేరు వచ్చింది. ఒకసారి మేము ముంబాయి లో ప్రోగ్రామ్ ఇచ్చి వస్తుంటే .....

1570 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login