Family · Telugu

రాఘవుడే రాఘవి

Completed | Part 3 of 6 | 1 Likes

Part 3

ఇలా నేను భువనత్త ఇంట్లో ఉండగా ఉయ్యాలలో ఊగుతున్న నన్ను చూసి ఎదురింటి ఘనపాఠీ గారు మా అత్త దగ్గరకు వచ్చారు. అమ్మా మీ మేనకోడలు చాలా లక్షణంగా ఉంది. మా అబ్బాయి వేద పండితుడు. వాడి వయసు పదిహేను సంవత్సరాలు. మాకు యజ్ఞ, యాగాదులు చెయ్యాలి అంటే బాల్య వివాహం చెయ్యాలి. రజస్వల కాని బాలతో పెళ్ళి జరిపించాలి. కనుక ఈ అమ్మాయి తల్లి దండ్రులతో మాట్లాడి వాళ్ళకుఅంగీకారమైతే ఈ పిల్లని మా కోడలిగా చేసుకుంటాం అన్నారు. మా అత్త మనసేమిటో నాకు తెలియదు. అయితే వెంటనే నేను మా వాళ్ళతో మాట్లాడి చెబుతా అంది. తరువాత మా నాన్నకి ఫోన్ చేసి రాఘవని నాతో అట్టే పెట్టేసుకుంటా. ఇక్కడే చదివిస్తా. అని చెప్పింది.
మా నాన్నకి మేం అయిదుగురం పిల్లలం. నేను మధ్యన పుట్టాను. నాకు ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక చెల్లి, ఒక తమ్ముడు. అత్తయ్య స్థితి తెలుసు కనుక నాన్న కాదనకుండా అలాగే అన్నారు. దాంతో దసరాకి వచ్చిన నేను అత్త దగ్గరే ఉండిపోయాను. ఇంక అప్పుడు ఘనపాఠీ గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది.
ఇది పుట్టటం మగ పిల్లవాడిగా పుట్టింది. కానీ దీన్ని మంచి ఆడపిల్లగా పెంచుతాను. దానికి అవసరమైన శస్త్ర చికిత్స కూడా చేయిస్తాను. మీరు ఒప్పుకుంటే మా రాఘవిని మీ కోడలిగా చేసుకోవచ్చు. అంది. అందుకు ఘనపాఠీ గారు అమ్మా, మీ మంచితనానికి చాలా సంతోషం. కానీ వేదం నా కొడుకుతో ఆగిపోకూడదు. మాకు వంశాభివృద్ధి కావాలి. కనుక మీరు అన్యథా భావించకండి. అయితే ఒక విషయం చెబుతా. మీ అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పండి. చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. నాకు దేహసాముద్రికం తెలుసు. కేవలం చెయ్యి చూసి మాత్రమే కాదు. ముఖం, ఆకృతి చూసి కూడా చెప్పగలను. మీ రాఘవి మంచికళాకారిణి అవుతుంది. అని చెప్పారు. అవసరమైతే నా భార్య సంగీతం నేర్పుతుంది. అని చెప్పారు. అలా ఆయన భార్య శారదాంబ దగ్గర సంగీతానికి చేర్పించింది నన్ను మా అత్త. ఇంక నా భవిష్యత్తు ఆడపిల్లగానే అన్నమాట.

1564 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login