తల్లి మరణించి రెండేళ్లు అయింది.
రవి, అరవింద్ కలిసి నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఒక సాయంత్రం...
వర్షం పడుతోంది.
బాల్కనీలో కాఫీ తాగుతూ రవి రోడ్డుపై వెళ్తున్న బైకులను చూస్తున్నాడు.
అరవింద్ నెమ్మదిగా అతని పక్కన కూర్చున్నాడు.
"ఏమి ఆలోచిస్తున్నావు?"
"ఏమీలేదు..."
"అబద్ధం."
రవి చిరునవ్వు నవ్వాడు.
"కొన్నిసార్లు నేను ఎవరో నాకు కూడా అర్థం కాదు."
అరవింద్ మౌనంగా విన్నాడు.
---
కొన్ని రోజుల తర్వాత...
అరవింద్ రవికి ఒక చిన్న బహుమతి ఇచ్చాడు.
అందమైన చెక్క పెట్టె.
తెరిచి చూస్తే అందులో చిన్న బంగారు గొలుసు, గాజులు ఉన్నాయి.
"ఇవి ఎందుకు?"
"నీ కోసం."
"నాకా?"
"అవును."
రవి ఆశ్చర్యంగా చూశాడు.
"నేను నిన్ను మార్చాలని కాదు. నువ్వు ఏ రూపంలో సంతోషంగా ఉంటావో అది కనుక్కోమని."
---
ఆ మాటలు రవి మనసులో తిరుగుతూనే ఉన్నాయి.
అతను తన జీవితాన్ని వెనక్కి చూసుకున్నాడు.
చిన్నప్పటి నుండి అందరూ అతనికి ఒక రూపం చెప్పారు.
"నువ్వు అబ్బాయివి."
మరికొందరు...
"నువ్వు అమ్మాయిలా ఉన్నావు."
కానీ ఎప్పుడూ ఎవరూ అడగలేదు.
"నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?"
---
ఒక ఆదివారం ఉదయం...
రవి అద్దం ముందు నిలబడ్డాడు.
తన పొడవాటి జుట్టును భుజాల మీదికి వదిలాడు.
చీర కట్టుకున్నాడు.
తేలికగా మేకప్ వేసుకున్నాడు.
అద్దంలో కనిపించిన వ్యక్తిని చాలా సేపు చూశాడు.
ఆ రూపంలో అతనికి భయం అనిపించలేదు.
వింతగా కూడా అనిపించలేదు.
ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారి...
ప్రశాంతంగా అనిపించింది.
---
సాయంత్రం అరవింద్ ఇంటికి వచ్చాడు.
రవి ఎదురుగా నిలబడ్డాడు.
అరవింద్ కొన్ని క్షణాలు మాట్లాడలేదు.
"ఎలా ఉన్నాను?" అని రవి అడిగాడు.
అరవింద్ చిరునవ్వు నవ్వాడు.
"నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు."
"అంతేనా?"
"అదే నాకు ముఖ్యం."
---
నెలలు గడిచాయి.
రవి క్రమంగా తన జీవితం గురించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు.
ఇక ఇతరులు తన గురించి ఏమనుకుంటారో కంటే...
తాను ఎలా సౌకర్యంగా ఉంటానో ఆలోచించడం మొదలుపెట్టాడు.
అరవింద్ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.
కేవలం తోడుగా నిలిచాడు.
---
ఒకరోజు రవి అడిగాడు.
"నేను పూర్తిగా మారిపోతే?"
అరవింద్ చిరునవ్వు నవ్వాడు.
"రూపం మారొచ్చు. పేరు మారొచ్చు. దుస్తులు మారొచ్చు."
"మరి?"
"నేను ప్రేమించింది నీ మనసుని."
రవి కళ్లలో నీళ్లు తిరిగాయి.
---
ఆ రాత్రి...
బాల్కనీలో నిలబడి నగర వెలుగులు చూస్తూ రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు.
అది ఎవరి కోసమూ కాదు.
తన కోసమే.
మొదటిసారి జీవితంలో...
ఇతరుల ఆశల ప్రకారం కాదు.
తన హృదయం చెప్పిన దారిలో నడవాలని.
దూరంగా రోడ్డుపై ఒక పల్సర్ బైక్ గర్జిస్తూ వెళ్లిపోయింది.
రవి చూసి నవ్వుకున్నాడు.
"ఒకప్పుడు అది నా కల."
కింద పార్కింగ్‌లో నిలబడి ఉన్న పెప్ స్కూటీ వైపు చూసాడు.
"ఇది నా జీవితం."
అరవింద్ అతని చేయి పట్టుకున్నాడు.
ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డారు.
After 5 years ....
Discussion (3)
Super story sister 👌
Wow Chelli... Ee roju morning coffee tho ee story marintha adbutham ga anipinchindi...Oka manchi story cheppadam antey andulo sexual content tho nimpeyadam kadu...oka feel ni kaliginchadam ani nirupinchav ee roju...very well written.. All the best.... Keep your good work going.
Tq