"రాజు ఈ మధ్య జరుగుతున్న విషయాలు మన అందరికీ తెలిసినవే కదా. తెలుగు కథా, నవలా రచయిత(త్రి) గా ఉమాదేవి అనే పేర నేను అందరికీ పరిచయమే. నాకథలన్నా, నవలలన్నా ఒక దశాబ్దకాలం పాటు తెలుగు ప్రజలందరికీ చాలా అభిమానం పెరిగింది. ఎవరికైనా దశతిరిగింది అంటారు. బహుశా దశతిరగటం అంటే ఇదేనేమో. ఇప్పుడు పదేళ్ళ తర్వాత నా కథలపట్ల ఆసక్తి తగ్గింది. ఈ పదేళ్ళలో నేను మంచి రచయిత(త్రి)నని తెలిసిన ప్రముఖ పత్రిక ఆంధ్రదీప్తి సంపాదక వర్గం లో నాకు ఉద్యోగం ఇచ్చారు. నా రచనలకు డిమాండ్ తగ్గటం తో నన్ను మూడు మాసాల క్రితం ఉద్యోగం లోంచి తీసేసిన విషయం మనందరికీ తెలిసిందే. నీకు బాంక్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిగా ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు లో ఉద్యోగభారంతో నువ్వు ఎంత సతమౌతున్నావో నాకు తెలుసు. అందుకే ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. అని నిర్ణయానికి వచ్చాను. అందుకని ఇలా." అని ఉమా మహేశ్వరం కొంచెం ఆపాడు. "నాకు నువ్వు బిజీగా ఉన్నప్పుడు కూడా సహాయం చేయటం అలావాటే కదా. ఇంటి పనులు నాకు బరువనీ నేను చెప్పలేదు. ఒకవేళ నువ్వు ఇంటి పనులు చెయ్యాలి అనుకున్నావనుకో ఈ గెటప్ ఎందుకు ఉమా?" అని అడిగింది రాజేశ్వరి. "నేను కారణం లేకుండా ఏం పనీ చెయ్యనని మీకు తెలుసు కదా. మన అపార్ట్మెంట్ లో ఈ మూడు నెలల అనుభవం తో నేనీ నిర్ణయానికి వచ్చాను. పక్కింటి సుబ్బలక్ష్మి, ఎదురింటి యాజులు గారి భార్య సుమతి, ఫస్ట్ ఫ్లోర్ వరదరాజులు గారి భార్య రంగనాయకి.. వీళ్ళంతా రోజు వచ్చి నాతో ఏదో ఒక బాతాఖానీ వేసుకుని అదేంటి తమ్ముడు, అదేంటి మరిది గారూ... అంటూ వరుసలు కలిపి మీరు ఉద్యోగం మానేశారుట కదా. రాజేశ్వరి ఉద్యోగం మానెయ్యచ్చు కదా. ... అంటూ నా బుర్ర తినేస్తున్నారు. నాకిదేదో బాగానే ఉంది. వాళ్ళతో ఉన్నంత సేపు నేను కూడా ఆడ దాన్నే అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం వాళ్ళ భర్తలకు ఇష్టం లేదు.అందుకని యాజులు, గోవిందరాజులు నా దగ్గరకు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళ భార్యలతో మాట్లాడొద్దని. అందుకని ఆత్మ రక్షణ కోసం నాకు తట్టిన ఉపాయం నన్ను. ఇలా ఉమాదేవి గా మార్చింది." అని చెప్పాడు. రాజేశ్వరి, హేమ, రమ ఒక్కసారి గట్టిగా నవ్వారు. ముగ్గురు కలిసి"అది సరే ఉమా. నువ్వు ఈ వేషం లో ఉంటే ఆ ఆడవాళ్ళు ఇక్కడ కి రావటం మానేస్తారా?" అని అడిగారు. "వాళ్ళు వస్తారు. వాళ్ళకి నేను మీవదిన ఉమాదేవిని. అని చెప్పు. నీభర్త ఉద్యోగం కోసం ముంబై వెళ్ళాడని చెప్పు." "మరి నిన్ను మేము ఏమని పిలవాలి డాడీ?" అని అడిగారు కూతుళ్ళు ఇద్దరూ. "ఇన్నాళ్లూ ఎలా పిలుస్తున్నారు? ఏకాంతంలో నన్ను అమ్మా అని అమ్మ ను డాడీ అని పిలుస్తున్నారు కదా. ఇకపై నన్ను మీరిద్దరూ అత్త అని పిలవండి." "సరే అత్తా, నువ్వు వేషం అయితే మార్చావనుకో. కానీ నీ గొంతు ఎలాగా?" అని అడిగారు కూతుళ్ళు. "ఏమర్రా, నా గొంతే గుర్తు పట్టలేదే మీరు?" అని గొంతు మార్చి అడిగాడు ఉమ. ఆ గొంతు అచ్చం వాళ్ళ మద్రాసు అత్తయ్య గొంతు లాగా ఉంది. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. రాజేశ్వరి మాత్రం ఒకసారి నిట్టూర్చి"సరే, మళ్ళీ రేపు ఉదయం ఆఫీసుకు వెళ్ళాలి. కదా. ఇప్పుడే మా వదినని వాళ్ళకి పరిచయం చేస్తాను." అని చుట్టు పక్కల ఉన్న పరిచయస్తులైన మహిళలందర్నీ పిలిచి మా వదిన ఉమాదేవి." అందరికీ ఆమెను పరిచయం చేసింది.
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
299 Views2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (2)
Nice concept keep going
Thank you very much sister Sandhya...