ఉదయం ఫ్లైట్ లో ఇద్దరూ బెంగళూర్ చేరుకున్నారు. నేరుగా ఇంటికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరికీ రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ అద్దెకిచ్చి రెండవ అపార్ట్మెంట్ లో ఉండాలని వాళ్ళ ఆలోచన. అయితే ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ లలోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి రెండు ఇద్దరికీ అత్తవారి ఇళ్లే కనుక ఇద్దరూ కోడళ్ళే, ఇద్దరూ మొగుళ్ళే కనుక ముందుగా సుకన్య ఇంటికి వెళ్ళారు. సుకన్య ఇంటిలో సుకన్య వాళ్ళ అమ్మ, మేనత్త, మేనత్త కూతుళ్ళు ఉంటున్నారు. తండ్రి అటు ఇటు బిజినెస్ పని మీద తిరుగుతూ ఉంటాడు. అందుకని ముందు తన పుట్టింటివారికి శ్యామ్ ను శ్యామల గా పరిచయం చేయాలి అని నిశ్చయించుకుంది సుకన్య. అందుకని నేరుగా వాళ్ళు సుకన్య వాళ్ళింటికి చేరుకున్నారు. వాళ్ళని చూసి స్వాగతం చెప్పారు ఇంటిల్లిపాదీ. అయితే ఇద్దరూ ఆడ దుస్తుల్లో ఉండటం చూసి సుకన్య తల్లి అడిగింది. ఇదేమిటే ఈ చోద్యం. అల్లుడుగారి ఈ వేషం ఏమిటే? అని అడిగింది. వేషం కాదమ్మా! నిజం. శ్యామ్ కాదు ఈమె శ్యామల. ఇవన్నీ మా వివాహం తరువాత హనీమూన్ కి వెళ్లేముందు తెలిసింది. హనీమూన్ లో స్పష్టమైంది. మా స్నేహం కూడా బలపడింది. అది ఇప్పుడు నా సన్నిహిత స్నేహితురాలు. దాని ఇష్టం నా ఇష్టం. దాని కష్టం నా కష్టం. ముందు అది నాకు తాళి కట్టింది. హనీమూన్ లో నేను దానికి తాళి కట్టాను. ఇద్దరం ప్రస్తుతానికి ఒకళ్ళకోకళ్ళు మొగుళ్ళం. ఒకళ్ళకి ఒకళ్ళు పెళ్లాలం. మా కాపురం మాదే. ఇటుపైన ఇది ఇక్కడ మనలాగే తిరుగుతుంది. మంతోటే తిరుగుతుంది. ఎవరైనా అడిగితే నా మొగుడు ఆఫీస్ పని మీద ఫారిన్ వెళ్ళాడు అని చెప్పండి. ఇది ఆయన చెల్లెలు అని చెప్పండి. అంది. ఆమె స్థిరత్వానికి, ముక్కుసూటి తనానికి, ఆమె స్పష్టమైన ఆలోచన కి ఆశ్చర్యపోయింది శ్యామల. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు అనికూడా ఆలోచించకుండ సుకన్య కాళ్ళమీద పడి నమస్కరించింది. వెంటనే సుకన్య ఆమెని దగ్గరకి తీసుకుని, గట్టిగా కౌగలించుకుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుని నొ ఫార్మాలిటీస్ డార్లింగ్. అంది. సుకన్య సాహసం తల్లి అనసూయకి, మేనత్త విశాలాక్షి కి బాగా తెలుసు. ఇక మేనత్త కూతుళ్ళు వనజ, రోజా సరే సరి. అందరూ కిల కిల నవ్వేశారు. శ్యామ్ శ్యామలగా అత్తవారింట్లో ప్రవేశించింది.
వెంటనే దీనికి వంటగది చూపించండి. ఇది వంట బాగా చేస్తుంది. అని చెప్పింది సుకన్య. వాళ్ళు ఇంటికి వచ్చే దారిలో షాపింగ్ చేసి కొన్ని చూడిదర్ లు, లాంగ్ స్కర్టులు, అనార్కలి ద్రస్సులు, చాలా నైటీలు , ఇలా చాలా చాల కొనుక్కుని వచ్చారు.
వెంటనే తన దగ్గర ఉన్న లంగా ఓణి రవిక లోకి మారిపోయింది శ్యామల. శ్యామల వెంటనే బడలిక లేకుండా వంటింట్లోకి చేరింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకి వంటింట్లో అడుగుపెట్టిన శ్యామల ఒక గంటలో అందరికీ కావలసిన ఐటెమ్సు చాలా చేసింది. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ కలిసి పోయారు. శ్యామలని అందరూ ఒసేవ్ అనే వారే. శ్యామల కూడా అందరితో వరసలు కలిపేసింది. ఆమె వంటలు చూసి అందరూ అబ్బుర పడిపోయారు. వీళ్ళు వచ్చిన వార్త విని శ్యామల తల్లి సావిత్రి, చెల్లెలు గాయత్రి మధ్యాహ్నం మూడు గంటలకు సుకన్య ఇంటికి వచ్చారు. సుకన్య ఇంటిలో సావిత్రి, గాయత్రి కూడా శ్యామలని చూసి లోపల ఆశ్చర్యపడలేదు కానీ పైకి మాత్రం ఆశ్చర్యం గా చూస్తూ అడిగారు. మా అబ్బాయి ఏడి? మా అన్నయ్య ఏడి? అంటూ. ఇదిగో అత్తయ్య, మీ అబ్బాయి శ్యామే మీ అమ్మాయి శ్యామల అని మీకు తెలుసు అని నాకు తెలుసు. మీరు ఆశ్చర్యపోనక్కరలేదు. నేను మీ అమ్మాయిని వదలను. అది నన్ను కూడా వదలదు. కొన్ని నెలలు ఆగండి కథ సుఖాంతమే అవుతుంది. అనిచెప్పింది సుకన్య. కృతజ్ఞతగా చూసింది సావిత్రి. మెచ్చుకోలుగా చూసింది గాయత్రి. ఆ రోజు సాయంత్రం ఇంక ఆలస్యం చేయకుండా తన స్నేహితురాళ్ళనందరినీ తమ అపార్టుమెంటు లో ఉన్న పార్కు లో గెట్ టూ గెదర్ ఉంది రమ్మని చెప్పారు. వాళ్ళందరికీ శ్యామ్ శ్యామ్ గా తెలుసు. వాళ్ళంతా రరకాల గిఫ్టులతో వచ్చారు. అందరూ ఇంటికి చేరాకా నిజం తెలిసింది. అయితే సుకన్య చాకచక్యం వల్ల అందరూ నిజాన్ని చాల త్వరగా అంగీకరించారు. అక్కడి నుంచి ఆడవాళ్ళందరు పార్కు కి వెళ్లారు. అది చాల పెద్ద గదరింగ్. ఎన్నో ఏళ్లనుంచి శ్యామలలో దాగి ఉన్న కోరికలన్నీ ఒక్కసారి కట్టలు తెంచుకుని బయటకు వచ్చాయి. ఎవరు ఆమెతో అరమరికలు లేకుండా సమయం గడిపారు. ఆమె కూడా చాలా సహజంగా వాళ్ళతో కలిసిపోయింది. ఇక మరునాడు ఆఫీసు కు వెళ్ళాలి. ఆఫీస్ లో ఏంచేయాలో సుకన్య శ్యామల కి చెప్పింది. (ఇంకా ఉంది)
Part 5
5544 Views
4 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (4)
Em parvaledu akka..idi mana andariki avutundi..personal priorities vastai..ayina meeru em vrasina baguntundi..chala feel vundetattu vrastaru..so, no problem akka.
Akka story chala bagundi..kani last lo kangaru ga mugincharu anipinchindi...kadha koncham different ga rasaru anipinchindi..
Thanks Chelli. Absolutely. My intention is to extend this upto 20 episodes. But very unexpectedly I am facing a bunch of personal problems. So I have abruptly concluded this with an unwilling ending.
💕🙏👩❤️👩