(గమనిక: నేను రాసే కథలన్నీ కేవలం కల్పితం. ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు.)
అలా నేను సందీప్‌కి చీర కడుతుంటే తను చాలా ఇబ్బంది పడుతూ, సిగ్గుతో ముడుచుకుపోతున్నాడు. నేను మాత్రం కదలకుండా తననే చూస్తూ ఉండిపోయాను. అసలు కొద్ది గంటల ముందు వరకు నా భర్తగా నా ముందు గంభీరంగా తిరిగిన వ్యక్తి... ఇప్పుడు నా చీరలో నా ముందే నిలబడటం నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు. తన ముఖ కవళికల్లో సందీప్ పోలికలు ఉన్నాయి... కానీ కళ్ళు, పెదాలు, చెంపలు, శరీరం అన్నీ ఒక సుకుమారమైన ఆడపిల్లలాగా మారిపోయాయి.
"లావణ్య... త్వరగా కట్టవే... నాకు చాలా విచిత్రంగా, ఏదోలా ఉంది" అన్నాడు తల దించుకుని.
తను అలా సిగ్గుపడుతూ మాట్లాడేసరికి నా కంగారులోనూ నాకు తెలియకుండానే చిన్న నవ్వు వచ్చింది. "ఇప్పుడు తెలిసిందా సందీప్... అమ్మాయిలు రోజూ చీర కట్టుకోవడం ఎంత కష్టమో?" అన్నాను.
నా మాటలకి తనకి కోపం వచ్చింది. "ఇప్పుడు జోక్స్ వేసే టైమా ఇది లావణ్య...? అసలు నా శరీరానికి ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు!" అంటూనే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
నేను ఒక్క క్షణం సైలెంట్ అయ్యాను. నిజానికి నాకు లోపల ప్రాణం పోతున్నంత భయంగా ఉంది. కానీ నేను కూడా ధైర్యం కోల్పోతే సందీప్ ఇంకా కుంగిపోతాడని పైకి నటిస్తూ ఉన్నాను. నేను తన నడుము చుట్టూ చీర మడతలు పెట్టి గట్టిగా బిగిస్తుంటే సందీప్ ఒంటిలో ఒక వణుకు వచ్చింది.
"కొంచెం సడలుగా కట్టవా... చాలా టైట్ గా ఉంది..." అన్నాడు.
"అమ్మాయిలు ఇలాగే రోజూ కట్టుకుంటారు సందీప్" అన్నాను సర్దిచెబుతూ.
"నేను అమ్మాయిని కాదు లావణ్య! మగవాడిని!" అని కోపంగా గద్దించాడు. కానీ ఆ గొంతు మాత్రం పూర్తిగా ఆడవాళ్లలా మృదువుగా, కోయిల కూతలా వినిపించింది. అదే తనని ఇంకా బాధ పెడుతోంది. తను మాట్లాడినప్పుడల్లా తన గొంతు వినడానికే తనే షాక్ అవుతున్నాడు.
నేను తనని అద్దం ముందు కూర్చోబెట్టి జుట్టు దువ్వడం మొదలు పెట్టాను. ఉదయం వరకు చిన్నగా ఉన్న తన క్రాఫ్ జుట్టు... ఇప్పుడు భుజాల దాకా నల్లగా, ఒత్తుగా పెరిగి వచ్చింది. నేను దువ్వుతుంటే తను అద్దంలో తన రూపాన్ని తానే నమ్మలేనట్టు చూసుకుంటూ ఉన్నాడు.
"లావణ్య... నిజంగా... నేనా ఇది...?" అన్నాడు దీనంగా.
ఆ మాట వినగానే నా చేతులు ఆగిపోయాయి. తను అద్దంలో తన కళ్లల్లోకి తానే చూసుకుంటూ నెమ్మదిగా ఏడవడం మొదలు పెట్టాడు.
"నాకు చాలా భయంగా ఉంది లావణ్య... నేను ఇలా ఎందుకు అయ్యాను...? రేపు పొద్దున బయట వాళ్లకి ఎలా కనిపించాలి...? నా ఆఫీస్ వాళ్లకి ఏమని సమాధానం చెప్పాలి...?" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోయింది.
నేను తన భుజం మీద చేయి వేసి, "నేనున్నాను కదా సందీప్... ఏం కాదు... మనం రేపే ఆ మాతాజీ దగ్గరకు వెళ్దాం, ఆవిడ కాళ్ళు పట్టుకుందాం..." అన్నాను.
సందీప్ వెంటనే నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. "లేదు లావణ్య... నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు... ఆవిడని తలుచుకుంటేనే నా శరీరం వణికిపోతోంది, నాకు భయంగా ఉంది" అన్నాడు.
"మరి ఇలా ఎంతకాలం ఉంటావ్ సందీప్...?" అని నేను అడుగుతుండగానే... తను కంగారుగా తన చేతులతో తన ఛాతీని కప్పుకున్నాడు.
నేను అది గమనించి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాను. ఇప్పటివరకు కంగారులో నేను పూర్తిగా గమనించలేదు... కానీ ఇప్పుడు తన శారీరక ఆకృతి పూర్తిగా ఒక పరిపూర్ణమైన స్త్రీలా మారిపోయింది. సందీప్ కూడా నా చూపుల్ని గమనించి వెంటనే సిగ్గుతో ముఖం తిప్పేసుకున్నాడు.
"అలా చూడకు లావణ్య... ప్లీజ్... నాకు సిగ్గుగా ఉంది..." అన్నాడు.
తనలా సిగ్గుపడటం చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కొద్దిసేపటి క్రితం వరకు నా భర్తగా ఉన్న వ్యక్తి... ఇప్పుడు నా ముందు ఒక లజ్జగల అమ్మాయిలా నిలబడ్డాడు.
నేను పరిస్థితిని కంట్రోల్ చేయడానికి మెల్లగా తన జుట్టును జడలా అల్లడం మొదలు పెట్టాను. అలా జడ వేసి పూర్తయ్యాక, నుదుట చిన్న ఎర్రటి బొట్టు పెట్టబోతుంటే సందీప్ నా చేతిని ఆపేశాడు.
"వద్దు లావణ్య... అది మాత్రం వద్దు ప్లీజ్..." అని బ్రతిమిలాడాడు.
"ఇది పెట్టకపోతే బయట వాళ్లకి అనుమానం వస్తుంది సందీప్... ప్లీజ్ సహకరించు" అంటూ నేను బలవంతంగా తన నుదుట చిన్న ఎర్ర బొట్టు పెట్టాను.
సందీప్ అద్దం ముందు నిలబడి తన కొత్త రూపాన్ని పూర్తిగా చూసుకొని షాక్ అయ్యాడు. చీర... జడ... నుదుట బొట్టు... మృదువైన కాంతివంతమైన ముఖం... అసలు సిసలైన తెలుగింటి ఆడపిల్లలా ఉన్నాడు. తనని తానే చూసుకొని భయంతో వెనక్కి ఒక్క అడుగు వేసాడు.
"నేనా ఇది...? భగవంతుడా... నేనా ఇది...?" అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ బెడ్ మీద కూలబడ్డాడు.
నేను దగ్గరకు వెళ్లి, "సందీప్... ప్లీజ్ ఏడవకు..." అని ఓదార్చబోయాను.
కానీ తను కన్నీళ్లతో నా వైపు చూసి, "నువ్వే కదా లావణ్య ఆ మాతాజీతో అన్నావు... 'నా భర్తను అమ్మాయిగా మార్చండి చూద్దాం' అని... ఇప్పుడు చూడు ఏమైందో... నీ అహంకారం తృప్తి చెందిందా?" అన్నాడు.
ఆ మాట నా గుండెల్లో ఈటెలా గుచ్చుకుంది. నేను సైలెంట్ అయిపోయాను. నిజమే... నేను కోపంలో, నా రిపోర్టర్ అహంకారంలో మాట్లాడిన మాట... ఈరోజు మా జీవితాలను, నా భర్త సర్వస్వాన్ని ఇలా మార్చేసింది. నేనే నేరస్తురాలిని అనిపించి నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి.
ఇంతలో హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగింది... 'డింగ్ డాంగ్!'
మేమిద్దరం ఒక్కసారిగా కంగారు పడ్డాం. ఈ రాత్రి వేళ ఎవరు వచ్చారు? సందీప్ భయపడిపోయి వెంటనే నా వెనుక దాక్కున్నాడు.
"ఎవరు లావణ్య...?" అన్నాడు వణుకుతున్న గొంతుతో.
"తెలియదు సందీప్... నువ్వు లోపలికి వెళ్ళు త్వరగా, బెడ్‌రూమ్ డోర్ లాక్ చేసుకో" అన్నాను.
కానీ తను నా కొంగు పట్టుకుని, "నేను ఒక్కడినే లోపల ఉండలేను... నాకు భయంగా ఉంది..." అన్నాడు.
డోర్ బెల్ మళ్ళీ గట్టిగా, విరామం లేకుండా మోగింది. "సరే... నువ్వు బెడ్ రూమ్ లోనే ఉండు, నేను చెప్పేదాకా బయటకి రావద్దు" అని చెప్పి డోర్ దగ్గరకు వెళ్లాను. నా చేతులు వణుకుతున్నాయి. ఎవరైనా సందీప్‌ని ఈ రూపంలో చూస్తే ఏమవుతుంది?
నేను నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసాను. బయట మా అమ్మ నిలబడి ఉంది!
అమ్మ లోపలికి వస్తూ, "ఏంటే... ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయట్లేదు? ఏం చేస్తున్నావ్?" అంది కోపంగా.
నేను బలవంతంగా పెదవులపై నవ్వు తెచ్చుకుంటూ, "అదేం లేదు అమ్మ... కొంచెం ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను" అన్నాను.
అమ్మ హాల్‌లోకి వస్తూ చుట్టూ చూసి, "సందీప్ ఎక్కడ? కనిపించట్లేదు?" అని అడిగింది.
నేను ఒక్కసారిగా కంగారుతో చెమటలు పట్టేసి, "అతను... అదీ... లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు అమ్మ" అన్నాను తడబడుతూ.
అమ్మ నన్ను అనుమానంగా పైనుంచి కిందకి చూసింది. "నీ మొహం ఏంటీ అలా ఉంది...? ఏడ్చావా...? కళ్ళు వాచి ఉన్నాయి?" అంది.
"లేదు అమ్మ... ఏం లేదు..." అన్నాను.
"ఏదో జరిగింది... మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, నాకు నిజం చెప్పు లావణ్య" అని అమ్మ గద్దిస్తుండగానే...
బెడ్ రూమ్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. సందీప్ బయటకి వచ్చాడు!
కాళ్ళకు పారాణి లేదు కానీ... కట్టుకున్న చీరను తడబడుతున్న చేతులతో సర్దుకుంటూ, జడ ముందుకు వేసుకుని, నుదుట బొట్టుతో, తల దించుకొని నెమ్మదిగా నడుస్తూ బయటకి వచ్చాడు.
అమ్మ ఒక్కసారిగా షాక్ అయి ఆగిపోయింది. తన కళ్ళు పెద్దవయ్యాయి. "లావణ్య... ఎవరమ్మా ఈ అమ్మాయి? ఈ టైంలో ఇంట్లో ఉంది?" అని అడిగింది. నేను నోట మాట రాక మూగబోయాను.
అమ్మ మళ్ళీ కంగారుగా, "లావణ్య, అడుగుతున్నాను కదా... ఎవరు ఈ అమ్మాయి? సందీప్ ఎక్కడ?" అంది.
సందీప్ భయపడుతూ నా వైపు చూసి, ఆపై కళ్ళు నిండా నీళ్లతో అమ్మ వైపు చూస్తూ... "అత్తయ్య... నేనే... నేనే సందీప్‌ని..." అన్నాడు ఏడుస్తూ.
ఆ మాట వినగానే అమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. లోపల ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి.
"ఏం... ఏం అన్నావ్...? ఎవరు నువ్వు?" అంది అమ్మ నమ్మలేక.
"నేనే సందీప్‌ని అత్తయ్య... మీ అల్లుడిని..." అంటూ సందీప్ వెక్కి వెక్కి ఏడ్చాడు.
అమ్మ భయంతో వెనక్కి రెండు అడుగులు వేసింది. "లావణ్య... అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది ఏంటి...?" అని అరిచింది.
నేను కూడా తట్టుకోలేక ఏడుస్తూ, మాతాజీ ఆశ్రమంలో జరిగిన విషయం, నేను చేసిన ఆ మూర్ఖపు ఛాలెంజ్, ఇంటికి వచ్చాక సందీప్ శరీరం మారిపోయిన విధానం... అన్నీ ఒక్కటొక్కటిగా చెప్పేశాను.
అమ్మ అంతా విన్నాక గుండె పట్టుకుని సోఫాలో కూలబడింది. "నేను ముందే చెప్పాను కదా లావణ్య... ఆ మాతాజీ సాధారణమైన ఆవిడ కాదు, చాలా శక్తులు ఉన్నాయని! నా మాట వినలేదు కదే..." అంది ఏడుస్తూ.
"తప్పు అయిపోయింది అమ్మ... క్షమించు..." అని నేను మోకాళ్లపై కూర్చున్నాను.
అమ్మ కోపంతో, బాధతో... "ఇది తప్పా? నీ అహంకారం, ప్రమోషన్ గర్వం వల్ల ఒక పసివాడి జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని నాశనం చేసావ్!" అంది. ఆ మాటలకి నేను తలదించుకుని ఏడ్చాను.
అప్పుడు సందీప్ మెల్లగా అమ్మ దగ్గరకు వచ్చి, చీర కొంగును చేత్తో పట్టుకుని సర్దుకుంటూ... "అత్తయ్య... లావణ్యని తిట్టకండి... తనకి కూడా తెలీదు ఇలా జరుగుతుందని..." అన్నాడు.
అమ్మ ఒక్కసారిగా సందీప్ వైపు చూసింది. తను మాట్లాడుతున్న తీరు, భయంతో నిలబడిన విధానం, అపస్మారకంగా చీర కొంగు సర్దుకోవడం... అన్నీ పూర్తిగా ఒక స్త్రీ లాగే ఉన్నాయి. అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. "బాబూ... సందీప్... నీకు ఇలాంటి విధి రావడం ఏమిట్రా..." అంటూ తన తల మీద చేయి వేసింది.
"అత్తయ్య... నేను అద్దంలో నా మొహం చూసుకోవడానికి కూడా భయపడుతున్నాను... నా సొంత గొంతు నాకే వింతగా వినిపిస్తుంటే ఏడుపు వస్తోంది..." అంటూ సందీప్ ఉన్నట్టుండి తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నాడు.
నేను అది చూసి షాక్ అయ్యాను! తనకు తెలియకుండానే తనలో స్త్రీ సహజమైన ప్రవర్తన (Feminine instincts) మొదలైపోయింది. సందీప్ కూడా తాను చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నానని గమనించి, కంగారుగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. "నేను... నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను లావణ్య...? నాకేం అవుతోంది?" అన్నాడు భయంగా.
"అది ఆ మాతాజీ మంత్ర శక్తి మహిమ అయి ఉంటుంది బాబూ..." అంది అమ్మ ఏడుస్తూ.
అలా మేము మాట్లాడుకుంటుంటే, ఒక్కసారిగా సందీప్‌కి కళ్ళు తిరిగినట్టు అయ్యి, సోఫా చేతిని పట్టుకుని కూర్చున్నాడు.
"ఏమైంది సందీప్...?" అని నేను కంగారుగా అడిగాను.
"తెలియదు లావణ్య... శరీరం అంతా చాలా నీరసంగా, వీక్ గా అనిపిస్తోంది..." అన్నాడు.
అమ్మ ఒక్కసారిగా సందీప్ వైపు తీక్షణంగా చూసింది. ఆపై నన్ను చూసి, "లావణ్య... వీడికి... కాదు... దీనికి ఏమైనా తినిపించావా?" అంది. అమ్మ కూడా సందీప్‌ని 'వీడు' అనాలా, 'దీను' అనాలా అర్థం కాక ఇబ్బంది పడింది.
ఆ మాట వినగానే సందీప్ గుండె పగిలినట్టు ఏడ్చాడు. "నేను అసలు ఎవరిని అత్తయ్య...? అబ్బాయినా...? అమ్మాయినా...? నా ఉనికి ఏంటి?" అన్నాడు. ఆ ప్రశ్నతో ఆ గదిలో ఒక్కసారిగా పిడుగు పడినట్టు నిశ్శబ్దం ఆవరించింది. ఎవరి దగ్గరా సమాధానం లేదు.
అలా మేమంతా భయంతో, శోకంతో నిలబడి ఉండగా... హఠాత్తుగా హాల్‌లోని టీవీ తనంతట తానే ఆన్ అయింది! ‘జుమ్మని’ శబ్దం వస్తూ స్క్రీన్ అంతా బ్లర్ అయింది. మేమంతా భయంతో టీవీ వైపు చూసాం.
స్క్రీన్‌పై ఆ మాతాజీ భయంకరమైన నవ్వుతో ప్రత్యక్షమైంది!
ఆవిడ తీక్షణంగా చూస్తూ... "నేను ముందే చెప్పాను కదా లావణ్య... నా శక్తులతో ఒక్కసారి అమ్మాయిగా మారితే, తిరిగి మగవాడిగా మారడం అసాధ్యం అని!" అంటూ క్రూరంగా నవ్వింది. ఆపై సందీప్ వైపు చూసి... "ఇక నుండి నీ భర్త సందీప్ లేడు... 'సంయుక్త' జీవితం మాత్రమే మిగిలి ఉంటుంది... అనుభవించు నీ అహంకార ఫలితాన్ని!" అని గట్టిగా అరిచింది.
ఆ శబ్దానికి, ఆ భయానికి సందీప్ ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టి, స్పృహతప్పి నా మీద పడిపోయాడు..................................
Discussion (6)
Next part
soon
Chala baga rastunnaru..nenu meeku manchi fan ayipoyanu
thank you
Wow.. Super.. What a story
tq meghana