(గమనిక: ఈ కథ పూర్తిగా కల్పితం మాత్రమే. ఇందులోని పాత్రలు, సంఘటనలు, ప్రదేశాలు అన్నీ రచయిత ఊహాజనితం. ఎవరినీ ఉద్దేశించి రాయడం లేదు.)
అలా సందీప్ ఒక్కసారిగా స్పృహ తప్పి నా మీద పడిపోవడంతో నేను గట్టిగా కేక పెట్టేశాను. "సందీప్... సందీప్... కళ్ళు తెరువు... ప్లీజ్!" అని వణుకుతున్న గొంతుతో పిలిచాను. నా కంగారు చూసి అమ్మ కూడా భయపడుతూ వెంటనే కిచెన్‌లోకి పరిగెత్తి నీళ్ళు తీసుకొచ్చింది. నేను వణుకుతున్న చేతులతో అతని ముఖంపై నీళ్ళు చల్లాను.
కొన్ని క్షణాల తరువాత సందీప్ మెల్లగా కళ్ళు తెరిచాడు. కానీ అతని కళ్లల్లో ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తోంది, శరీరం చలిజ్వరానికి వణికినట్టు వణికిపోతోంది.
"లావణ్య... నాకు చాలా భయంగా ఉందే..." అని చిన్నపిల్లాడిలా నా కొంగు పట్టుకుని ఏడ్చాడు. అతను అలా దీనంగా మాట్లాడేసరికి నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. "ఏం కాదు సందీప్... నేను ఉన్నాను కదా..." అని పైకి ధైర్యం చెప్పినా, నా గొంతులోని వణుకు నా భయాన్ని పట్టిస్తోంది. అమ్మ మాత్రం షాక్‌లో అలాగే టీవీ వైపు చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అప్పటికే టీవీ ఆఫ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితం జరిగినదంతా నిజమా, లేక మా భ్రమా అన్నట్టుగా మేమంతా ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాము.
"ఇది సాధారణమైన విషయం కాదు లావణ్య..." అంది అమ్మ మెల్లగా. నేను తల దించుకున్నాను. "నేను ముందే చెప్పాను కదా ఆ మాతాజీతో జాగ్రత్తగా ఉండమని..." ఆ మాట వినగానే నా గుండెల్లో కత్తితో పొడిచినట్టు అనిపించింది.
సందీప్ మెల్లగా లేచి సోఫాలో కూర్చున్నాడు. ఇప్పటికీ తన చీర కొంగుని చేతులతో గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఉన్నట్టుండి తన చేతులు చూసుకొని తనే భయపడిపోయాడు.
"లావణ్య..." అని పిలిచాడు. "ఏమైంది సందీప్?" అని దగ్గరకు వెళ్లాను. "నా చేతులు చూడు..." అన్నాడు. నేను వెంటనే అతని చేతుల వైపు చూసాను. అప్పటికే అతని మగతనం ఉట్టిపడే వేళ్లు మరింత సన్నగా, సుకుమారంగా మారిపోయాయి. గోళ్లు కూడా కొంచెం పెరిగి, ఆడవాళ్ల గోళ్లలా కనిపిస్తున్నాయి. అతను వాటిని చూస్తూ వణికిపోయాడు. "ఉదయం వరకు నా చేతులు ఇలా లేవు లావణ్య..." అన్నాడు ఏడుస్తూ. அம்ம దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని చూసింది. "మార్పులు ఇంకా ఆగలేదు... లోపల ఇంకా ఏదో జరుగుతోంది..." అంది భయంగా.
ఆ మాట వినగానే సందీప్ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. "నాకు ఇలా వద్దు అత్తయ్య... నేను మామూలుగా నా పాత రూపంలోకి వచ్చేయాలి..." అని అంటూనే, తనకు తెలియకుండానే ఆ చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నాడు! అది గమనించిన మరుక్షణమే తన చేతిని కరెంట్ షాక్ కొట్టినట్టు వెనక్కి తీసుకున్నాడు. "అసలు నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? నాకేమైంది?" అని తన మీద తనకే అసహ్యం, భయం వేసినట్టుగా చూశాడు. నేను అతని భుజంపై చెయ్యి వేసి, "కాస్త ప్రశాంతంగా ఉండు సందీప్... ఎక్కువగా ఆలోచించకు" అన్నాను.
"ఎలా ఆలోచించకుండా ఉండను లావణ్య? నా గొంతు మారిపోయింది... నా శరీరం మారిపోయింది... ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా అలవాట్లు కూడా మారిపోతున్నాయి..." అని అతను వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఆ మాటతో ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. నిజమే... మేము కూడా అదే గమనిస్తున్నాము. కొద్దిగంటల క్రితం వరకు ఒక మగాడిలా ధీమాగా తిరిగిన సందీప్... ఇప్పుడు సోఫాలో కూర్చున్న తీరు, చీర సర్దుకుంటున్న విధానం, ఏడుస్తున్న శైలి... అన్నీ నెమ్మదిగా ఒక నవవధువులా మారుతున్నాయి.
అంతలోనే తన ముఖంపై పడిన పొడవాటి జుట్టుని, తనకు తెలియకుండానే కుడిచేతి వేళ్లతో చెవి వెనక్కి సర్దుకున్నాడు! అది చేసిన వెంటనే భయంతో నా వైపు చూశాడు. "నేను... నేను ఇలా కావాలని చేయట్లేదు లావణ్య! నా చేతులు నా మాట వినడం లేదు" అని అరిచాడు. అతని గొంతులో స్త్రీత్వం, భయం రెండూ స్పష్టంగా వినిపించాయి. అమ్మ కూడా అది గమనించి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. "నేను కావాలని చేయట్లేదు అత్తయ్య..." అని అంటూనే మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు.
నేను అతన్ని ఓదార్చడానికి దగ్గరకు వెళ్లాను. అతను సోఫాలో నుండి లేవబోతుండగా... తెలియకుండానే జారిపోతున్న చీర కొంగుని ఎడమ చేత్తో పట్టుకుని భుజం మీద సరిగ్గా సర్దుకున్నాడు. ఈసారి తానే స్పష్టంగా గమనించాడు. "లేదు... లేదు... నేను ఇలా ఎప్పుడూ చేయను... నేను మగవాడిని!" అని భయంతో అరిచాడు. అమ్మ కళ్ళల్లో కూడా ఇప్పుడు భయం స్పష్టంగా కనిపిస్తోంది. "లావణ్య... త్వరగా ఏదో ఒకటి చేయాలి... పరిస్థితి చేయి దాటిపోతోంది" అంది.
సందీప్ మెల్లగా లేచి పడకగది వైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ అతని నడక కూడా పూర్తిగా మారిపోయింది. ఒక మగవాడిలా కాకుండా... చిన్న చిన్న అడుగులు వేస్తూ, చీర కాళ్లకు అడ్డం పడకుండా ఒక అమ్మాయిలా జాగ్రత్తగా నడుస్తున్నాడు. అది తానే గమనించి ఒక్కసారిగా ఆగిపోయాడు. "లేదు... నేను ఇలా నడవట్లేదు..." అని భయంతో వెనక్కి తిరిగాడు. కానీ అలా తిరిగేటప్పుడు మళ్ళీ తన పొడవైన జుట్టుని చేత్తో వెనక్కి సర్దుకున్నాడు.
ఈసారి మాత్రం తను పూర్తిగా వణికిపోయాడు. "నా మనసు కూడా మారిపోతుందా లావణ్య?" అని అడిగాడు. ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎందుకంటే ఇప్పటివరకు మేము శరీరం మాత్రమే మారుతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు సందీప్ లోపల ఉన్న మగతనం చచ్చిపోయి, నెమ్మదిగా పూర్తిగా "సంయుక్త"గా మారిపోతున్నట్టు మాకు అనిపించింది.
సందీప్ చాలా నీరసంగా కనిపిస్తూ గోడకి ఆనుకొని నిలబడ్డాడు. "బాబూ... కూర్చో కొంచెం" అని అమ్మ అంది. అతను మెల్లగా సోఫాలో కూర్చున్నాడు. కానీ కూర్చునే విధానం చూసి నాకు ఒళ్ళు జలదరించింది. చీర మడతలు సర్దుకొని, రెండు మోకాళ్ళు దగ్గరగా పెట్టుకొని ఎంతో పద్ధతిగా కూర్చున్నాడు. అది గమనించిన వెంటనే సందీప్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిపోయాడు.
"లేదు... నేను ఇలా కూర్చోను..." అని నెత్తీ నోరూ బాదుకున్నాడు. నేను, అమ్మ ఒకరిని ఒకరం చూసుకున్నాము. ఇప్పుడు అతనికి జరుగుతున్న శారీరక, మానసిక మార్పులు అతని నియంత్రణలో లేవు.
అంతలోనే అతనికి మళ్ళీ విపరీతంగా తల తిరిగినట్టు అయింది. చేతిని నుదుటిపై పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. "ఏమైంది సందీప్?" అని నేను కంగారుగా అడిగాను. "తెలియదు లావణ్య... శరీరం మొత్తం విచిత్రంగా ఉంది... వికారంగా అనిపిస్తోంది..." అని సమాధానం చెప్పాడు.
"కడుపులో ఖాళీగా ఉండటం వల్ల కావచ్చు, ఏమైనా తినాలి ముందు" అని అమ్మ అంది. నేను వెంటనే వంటగదిలోకి వెళ్లి కొంచెం అన్నం తీసుకొచ్చాను. "ప్లీజ్ సందీప్... కొంచెమైనా తిను" అన్నాను. "నాకు అస్సలు తినాలి అనిపించడం లేదు..." అని చెప్పి, ఒక్కసారిగా ముఖం వంకరగా పెట్టుకున్నాడు. వెంటనే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని బాత్రూం వైపు పరుగెత్తాడు. మేమిద్దరం కూడా అతని వెనకాలే వెళ్లాము.
సందీప్ వాష్‌బేసిన్ పట్టుకొని విపరీతంగా వాంతులు (Vomitings) చేసుకుంటున్నాడు. అతని పొడవైన జుట్టు ముందుకు పడిపోతుండగా... తనకు తెలియకుండానే ఎడమ చేత్తో ఆ జుట్టుని వెనక్కి పట్టుకున్నాడు! ఆ పని చేసిన వెంటనే అద్దంలో తనని తాను చూసుకొని భయపడ్డాడు. "నేను ఇలా ఎందుకు చేస్తున్నాను లావణ్య?" అని వణుకుతున్న గొంతుతో అడిగాడు.
అమ్మ ఒక్కసారిగా నా వైపు తీక్షణంగా చూసింది. "ఇదేంటి లావణ్య... ఈ లక్షణాలు..." అని ఆపేసింది.
నాకు కూడా గుండెల్లో పిడుగు పడినట్టు అనిపించింది. ఎందుకంటే... సరిగ్గా ఇదే లక్షణాలు, ఈ వాంతులు, ఈ నీరసం, వికారం... కొద్దిరోజుల క్రితం నాకు గర్భం వచ్చినప్పుడు వచ్చాయి! ఆ ఆలోచన రాగానే నేను ఒక్కసారిగా భయంతో వెనక్కి అడుగు వేసాను. 'భగవంతుడా... సందీప్ శరీరం కేవలం అమ్మాయిలా మారడమే కాదు... ఒక గర్భవతిలా కూడా మారుతోందా?' ఈ ఊహకే నా శరీరం చల్లబడిపోయింది.
సందీప్ వణుకుతున్న చేతులతో నీళ్ళు తాగుతుండగా అతని చీర కొంగు మళ్ళీ జారి కిందకి పడింది. అతను తెలియకుండానే ఎంతో సహజంగా దాన్ని సరిగ్గా భుజం మీద వేసుకున్నాడు. ఈసారి మాత్రం ఆ పని చేసిన తరువాత తను వెనక్కి తీసుకోలేదు... కొంతసేపు మౌనంగా నిలబడ్డాడు.
"లావణ్య..." అని పిలిచాడు మెల్లగా. "చెప్పు సందీప్..." అన్నాను వణుకుతూ. "నాకు... నాకు చాలా భయంగా ఉంది లావణ్య..." అన్నాడు.
"దేనికి సందీప్?" అని అడిగాను.
"నాకు... నాకు ఇవన్నీ ఇప్పుడు చాలా సహజంగా అనిపించడం మొదలవుతోంది..." అని చెప్పాడు! ఆ మాట వినగానే నా ప్రాణాలు పోయినంత పనైంది. "నేను కావాలని చేయట్లేదు లావణ్య... కానీ... చీర సరిచేసుకోవాలి అనిపిస్తుంది... జుట్టు ముఖం మీద పడితే ఇబ్బందిగా అనిపిస్తుంది..." అని అంటూనే మళ్ళీ తన జుట్టుని చెవి వెనక్కి సర్దుకున్నాడు.
ఈసారి మాత్రం తను వెంటనే చేతిని వెనక్కి తీసుకోలేదు. అద్దంలో కనిపిస్తున్న తన 'సంయుక్త' రూపాన్ని తనే మోహంగా, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.
"బాబూ... సందీప్..." అని అమ్మ గట్టిగా పిలిచింది. ఆ పిలుపుకి సందీప్ ఒక్కసారిగా కలక బైటపడినట్టు నా వైపు తిరిగాడు. "నేను పూర్తిగా మారిపోతున్నానా లావణ్య? ఇక నాలో ఉన్న మగవాడు తిరిగి రాడా?" అని అడిగాడు. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నా కళ్లముందే నా భర్త ఒక సంపూర్ణ స్త్రీగా మారిపోతున్నాడు.
ఇంట్లో గడియారం 'టిక్ టిక్' శబ్దం మాత్రమే భయంకరంగా వినిపిస్తోంది. చివరకు సందీప్ మెల్లగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కూర్చుంటూ చీర మడతలు, కుచ్చెళ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. అది గమనించిన వెంటనే అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్లు వచ్చాయి. "నేను నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను లావణ్య..." అని ఏడ్చాడు.
అమ్మ దగ్గరకు వెళ్లి అతని తల నిమిరింది. "భయపడకు బాబూ... ఏదో ఒక దారి ఉంటుంది, ఆ మాతాజీని బ్రతిమిలాడుకుందాం" అని ఓదార్చింది. సందీప్ ఒక్కసారిగా అమ్మ భుజంపై తల పెట్టుకొని ఒక కూతురిలా ఏడవడం మొదలుపెట్టాడు. నేను మాత్రం అక్కడే నిలబడి నా తప్పు గురించి, నా అహంకారం గురించి ఆలోచిస్తూ కుంగిపోయాను. ఒక్క అహంకారం... ఒక్క మాట... ఇప్పుడు నా భర్త జీవితాన్ని సర్వనాశనం చేసింది.
అంతలో సందీప్ మెల్లగా నా వైపు చూసి, "లావణ్య... నన్ను ఒంటరిగా వదిలిపెట్టకు..." అని నా చేయి పట్టుకున్నాడు. అతను అలా భయంతో చెప్పేసరికి నా గుండె ముక్కలైంది. నేను వెంటనే అతని పక్కన కూర్చున్నాను. సందీప్ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆ చేతి స్పర్శ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ముందులా గట్టిగా, రఫ్‌గా కాకుండా... చాలా మృదువుగా, వెచ్చగా ఉంది. అతను కూడా అది గమనించినట్టుగా తన చేతులనే చూసుకున్నాడు. "నా చేతులు కూడా అమ్మాయిలా మారిపోయాయి..." అని అంటూనే తన వేళ్ళని నెమ్మదిగా తాకుకున్నాడు. అతని కదలికల్లో కూడా ఇప్పుడు ఒక కొత్త స్త్రీత్వపు మృదుత్వం కనిపిస్తోంది.
అతను ఒక్కసారిగా లేచి మళ్ళీ అద్దం ముందు నిలబడ్డాడు. చీర... పొడవైన జుట్టు... చిన్న ఎర్ర బొట్టు... మృదువైన కళ్ళు... అద్దంలో కనిపిస్తున్న ఆ అందమైన అమ్మాయి రూపాన్ని చూసి వణికిపోయాడు. "ఇది నేనా?" అని అంటూనే తన చెంపని చేత్తో తాకుకున్నాడు. తన చర్మం కూడా కొద్దిగంటల్లోనే చాలా సాఫ్ట్‌గా మారిపోయింది.
"లేదు... లేదు..." అని అంటూనే అద్దం ముందు నుండి వెనక్కి వచ్చాడు. కానీ వెనక్కి తిరిగేటప్పుడు చీర కాళ్ళకి అడ్డంగా రావడంతో... దాన్ని చేత్తో కొంచెం పైకి పట్టుకుని నడిచాడు. అది చేసిన వెంటనే తను పూర్తిగా నిశ్శబ్దం అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు తన శరీరం మాత్రమే కాదు... తన బుద్ధి, అలవాట్లు కూడా చీరకి అలవాటు పడుతున్నాయి.
"లావణ్య... నేను ఇక ఎప్పటికీ మామూలుగా అవ్వనా?" అని అడిగాడు. ఆ ప్రశ్నకి నా దగ్గర కన్నీళ్లు తప్ప సమాధానం లేదు. అప్పుడే అమ్మ ఒక్కసారిగా గట్టిగా అంది—"ఇక ఆలస్యం చేయకూడదు. రేపు ఉదయమే తెల్లవారకుండా ఆ మాతాజీ దగ్గరకు వెళ్దాం. కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడుకుందాం."
ఆ మాట వినగానే సందీప్ భయంతో నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. "లేదు... నాకు అక్కడికి రావాలని లేదు... నాకు భయంగా ఉంది..." అని అంటూనే, తనకు తెలియకుండానే నా వెనకాల దాక్కున్నాడు... ఒక భయపడిన అబలలా, సుకుమారమైన అమ్మాయిలా! తాను కూడా అది గమనించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
"నేను నెమ్మదిగా... పూర్తిగా 'సంయుక్త'గా మారిపోతున్నానా లావణ్య...?" అని వణుకుతున్న గొంతుతో అడిగాడు.
ఆ మాటతో ఇంట్లో మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గడియారం 'టిక్ టిక్' శబ్దం మాత్రమే గుండె చప్పుడులా వినిపిస్తోంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక గగుర్పొడిచే భయం దాగి ఉంది. రేపు ఉదయం మాతాజీ దగ్గరకు వెళితే సందీప్ మళ్ళీ మగవాడిగా మారే నిజం తెలుస్తుందా? లేక ఇంకా ఏదైనా భయంకరమైన శాపం ఎదురవుతుందా? అనే ప్రశ్నలతో మేమంతా ఒకరినొకరం చూసుకుంటూ భయంతో అక్కడే ఉండిపోయాము..................................
Discussion (6)
Next part
soon
Chala baga rastunnaru..nenu meeku manchi fan ayipoyanu
thank you
Wow.. Super.. What a story
tq meghana