గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు సౌమ్య. నేను ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్‌ని… ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ, లైఫ్‌లో టెన్షన్లు ఉండదంటే అబద్ధమే.
ఇలాంటి టైంలోనే మనం నిజంగా హీరోయిన్‌మా అనిపించే సన్నివేశాలు వస్తుంటాయి. అసలు విషయం ఏంటంటే… ఇప్పటికీ నేను మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించాను. ఆ మూడు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. అందువల్లనే నేను ప్రొడ్యూసర్స్‌కు లక్కీగా మారిపోయాను.
నాకోసం చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు నా డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక రోజు, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. నా PR టీమ్, ఆ మూవీ టీమ్ మధ్య అన్ని టెర్మ్స్ మాట్లాడుకున్నారు. నా డేట్స్ కూడా మ్యానేజ్ చేసి ఆ మూవీకి ఏర్పాటు చేశారు. ఇక నేను వెళ్లి కాంట్రాక్ట్ పేపర్ల మీద సైన్ చేయడమే మిగిలింది.
"రేపు మంచి రోజు" అని నా PR టీమ్ చెప్పడంతో, సరే అన్నాను.
నేను చాలా హ్యాపీగా ఉన్నాను… పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో సినిమా… ఇక నా కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపించింది.
అప్పుడే సడెన్‌గా నాకు ఒక కాల్ వచ్చింది… ఎవరో చూద్దాం అనుకుంటే… నాకు మొదటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్. ఆయన అంటే నాకు చాలా అభిమానం. కాల్ లిఫ్ట్ చేసి, "గుడ్ ఈవెనింగ్ సర్" అని విష్ చేశాను. డైరెక్టర్ సర్ కూడా నన్ను కంగ్రాట్స్ చెప్పారు – “కొత్త సినిమా వచ్చింది” అని.
"థ్యాంక్యూ సర్" అన్నాను.
అలా నేను డైరెక్టర్ సార్‌తో దాదాపు 30 నిమిషాలు మాట్లాడాను.
అక్కడికే... సడెన్‌గా "సౌమ్యా… నాకోసం ఒకటి చేస్తావా?" అని అడిగారు.
ఎంతైనా నాకు కొత్త జీవితం ఇచ్చిన డైరెక్టర్ కదా… "సరే చెప్పండి సర్" అన్నాను.
"ఏం లేదు సౌమ్యా… నా రీసెంట్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రొడ్యూసర్లు ఎవరూ నాతో సినిమా చేయడానికి రాగట్లేదు… అప్పులు అయ్యాయి… నా కెరీర్ మసకబారిపోతోంది సౌమ్యా… ఈ పరిస్థితి నుంచి నన్ను నువ్వే బయటపడేయాలి," అని కోరాడు.
"అయ్యో సర్, మీరు నాకొత్త జీవితం ఇచ్చారు. మీ కోసం ఏమైనా చేస్తాను. ఎలా సహాయం చేయాలో చెప్పండి సర్," అనాను.
"ఏం లేదు సౌమ్యా… నా దగ్గర మంచి కథ ఉంది. ప్రొడ్యూసర్స్, హీరోలు అందరూ ‘బాగుంది’ అంటున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు."
"ఏంటి సర్ ఆ కండిషన్?" అని అడిగాను.
"ఆ సినిమాలో హీరోయిన్‌గా నీవుండాలి అనేది వాళ్ల కండిషన్. నువ్వే హీరోయిన్‌గా ఉంటే, నిన్ను చూసి ప్రొడ్యూసర్స్, హీరోలు ముందుకు వస్తారు. ఏందైనా, నువ్వు ఇప్పటి హీరోయిన్స్ లో టాప్‌లో ఉన్నవాళ్లలో ఒకరు కదా… లక్కీ హీరోయిన్ కూడా. అందుకే నీ డేట్స్ అడ్జస్ట్ చేస్తావేమో అని అడగాలని నిన్ను కాల్ చేశాను," అన్నాడు.
"సరే కథ ఏంటో చెప్పండి సర్," అని బహుశా తడబడుతూ సమాధానమిచ్చాను.
ఆయన క్షణం నిశ్శబ్దంగా ఉన్నారు. తరువాత శాంతంగా, కానీ లోతుగా అడిగారు —
"సౌమ్యా… ఒక చిన్న సినిమా చేస్తున్నాను… కొత్త కథ, కొత్త వేదిక. నువ్వే హీరోయిన్‌గా చేస్తావా?"
నాకు ఒక్కసారిగా షాక్ లాగా అనిపించింది. కొత్త సినిమా… కాని పక్కనే పెద్ద స్టార్ హీరో సినిమా వేచి ఉంది. నాతో డేట్ బుక్ చేసిన నిర్మాతలు ఉన్నారు.
"సర్… ఇప్పుడునా?" అని తక్కువ శబ్దంతో అడిగాను.
ఆయన నవ్వుతూ చెప్పారు —
"ఓ సారి కథ విను. ఇది నీ కోసం. నిజంగా నీ కెరీర్‌ని నిర్వచించే అవకాశం ఇది. ఫేమ్ కంటే... నటనను కోరుకునే పాత్ర."
నాలో ఏదో నిశ్శబ్దంగా కదలడం మొదలైంది. కెరీర్ మొదలుపెట్టిన ఆ డైరెక్టర్, నన్ను తొలిసారి స్క్రీన్ మీద నడిపించిన ఆయన మాటలు... నమ్మకంతో నన్ను చూస్తున్న కళ్లు.
"కథ చెప్పండి సర్…" అనాను.
ఆయన చెప్పడం మొదలెట్టారు —
ఒక గ్రామీణ ప్రాంతంలో సొంతంగా బతికే యువతి కథ. సమాజంతో పోరాడుతూ, తాను మలచుకున్న విలువల్ని నిలబెట్టుకునే కథ. గ్లామర్ లేని పాత్ర. కానీ గుండె తడిచేలా ఆవేశభరితమైన కథ. నిజమైన నటనకు పరీక్ష.**
ఆ కథ వింటుంటే నా కళ్ళలో నీరు తేలింది. ఇది నా జీవిత కథలా అనిపించింది.
"ఓకే సర్… నేనే చేస్తాను," అన్నాను… కానీ అది చెబుతూనే… నాలోని మరో ప్రశ్న నన్ను పట్టుకుంది. "మరి ఆ పెద్ద హీరో సినిమా?"
ఆయన అర్థమైనట్లుగా నవ్వారు.
"చాలా మందికి ఆ సినిమా వస్తుంది. కానీ ఈ పాత్ర… ఇది నీ కోసమే రాసినట్టిది. నువ్వు చేయకపోతే, ఎవ్వరు చేయలేరు."
"రేపు మూవీకి సైన్ చేస్తున్నాను సర్… కానీ సైన్ చేసే ముందు మీకూ డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెబుతానన్నాను," అనగానే,
"అది విన్నందుకు చాలా థ్యాంక్స్ సౌమ్యా," అని చెప్పి డైరెక్టర్ సర్ కాల్ కట్ చేశారు.
తర్వాత, నేను నా మేనేజర్‌ని పిలిచాను.
"ఈ కొత్త సినిమా డేట్స్‌లో, మా డైరెక్టర్ సర్ సినిమా కోసం కూడా డేట్స్ అడ్జస్ట్ చెయ్యాలి," అని చెప్పాను.
అది విన్న నా మేనేజర్ ఓ చిన్న నిశ్శబ్దం తర్వాత చెప్పాడు:
"మేడమ్, అలా సాధ్యపడదు. మీరు రేపు సైన్ చేయబోయేది పాన్ ఇండియా మూవీ. మీరు ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే, ఆ సినిమా పూర్తయ్యే వరకూ వేరే సినిమాకి సైన్ చేయకూడదన్న క్లాజ్ స్పష్టంగా ఉంది మేడమ్."
నేను కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను. తర్వాత ఆత్మవిశ్వాసంతో అన్నాను —
"నేను మాట ఇచ్చాను. నీవు ఏమి చేస్తావో నాకు తెలియదు… కానీ డేట్స్ అడ్జస్ట్ చేయమని చెప్పు."
"సరే మేడమ్, రేపు మాట్లాడి చూస్తాను," అన్నాడు.
ఆ రాత్రి, నా స్కిన్ కేర్ రొటీన్ పూర్తి చేసుకుని నా రూమ్‌కి వెళ్లి పడుకున్నాను.
అదేప్పుడు నా మనసు మాత్రం బరువుగా మారిపోయింది.
మరుసటి రోజు ఉదయం లేచి రెడీ అయిపోయి, నా ఫేవరెట్ కలర్ అయిన గ్రీన్ మాక్సీ వేసుకుని అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళాను.
అక్కడ అప్పటికే డైరెక్టర్ సర్, ప్రొడ్యూసర్లు వచ్చేసరికి, నేను వెళ్లి వారిని గౌరవంగా విష్ చేశాను. డైరెక్టర్ సర్ నన్ను హగ్ చేస్తూ "వెల్‌కమ్ సౌమ్యా" అన్నారు.
అన్నీ వివరాలు చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ నా ముందుంచారు.
ఆ సమయంలోనే… నేను నా మేనేజర్‌కి సిగ్నల్ ఇచ్చాను —
"డేట్స్ అడ్జస్ట్ చేయమని చెప్పు" అని.
ఇంకా నా మేనేజర్ ఆ విషయాన్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి వివరంగా చెప్పాడు.
వారు విన్న వెంటనే సీరియస్ అయ్యారు:
"ఇది పాన్ ఇండియా సినిమా. ఇందులో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో… నీకూ అంతే. మేజర్ లీడ్ రోల్. అందుకే నీ లుక్ బయట కనిపించకూడదు. సినిమా అయిపోకముందే వేరే సినిమాలో సైన్ చేయొద్దని కాంట్రాక్టులో క్లియర్ గా ఉంది," అన్నారు.
నిజాయితీగా, నేనూ నా మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నించాను:
"నాకు ఇంకో సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా నా కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్ సర్," అన్నాను.
అప్పుడు ప్రొడ్యూసర్ తిట్టేలా, కానీ ఓ మితిమీరి జాగ్రత్తగా అన్నాడు:
"చూడండి మేడమ్… మిమ్మల్ని, మా హీరోగారినీ నమ్మి ఈ బడ్జెట్ పెడుతున్నాం. షెడ్యూల్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మీరు పిలిస్తే షూటింగ్‌కి వెంటనే అందుబాటులో ఉండాలి. రెగ్యులర్ సినిమాల్లో మీరు తీసుకునే రెమ్యునరేషన్ కంటే రెట్టింపు ఇస్తున్నాం.
మా రూల్స్ అంగీకరిస్తే సైన్ చేయండి. లేదంటే మేము వేరే హీరోయిన్ చూస్తాం. ఏం నిర్ణయం తీసుకుంటారో రేపు లోపలే చెప్పండి."
అంటూ నాతో మాట్లాడి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.
________________________________________
ఇప్పుడు…
నా మనసు కలవరం. ఒకవైపు పాన్ ఇండియా సినిమా — గ్యారంటీడ్ విజయం.
ఇంకొవైపు — నా మొదటి డైరెక్టర్… నన్ను హీరోయిన్‌గా మారుస్తూ మొదటి ఛాన్స్ ఇచ్చినవాడు… ఆయన కోసం చేసిన మాట.
చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాను.
"పాన్ ఇండియా సినిమాకి ఓకే చెప్తాను.
అయితే… మా డైరెక్టర్ సర్‌కి మూడేళ్ల తర్వాత అయినా డేట్స్ ఇస్తానని చెప్తాను…"
కానీ... అది సరైన నిర్ణయమా?...
ఆ రోజు సాయంత్రం… డైరెక్టర్ సర్‌కి కాల్ చేసి చెప్పాను, "సర్… నా నిర్ణయం తీసుకున్నాను."
ఆయన కొంచెం నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత, గంభీరంగా చెప్పారు —
"నాకు అంత టైం లేదు సౌమ్య. వచ్చే వారం సినిమా స్టార్ట్ కాకపోతే… ఫైనాన్సర్లు నాపై కేసు వేస్తారు."
ఆయన గొంతులోని బిగుదల విని నాకు బాధ వేసింది. కానీ మనసులోని బాధను మింగేసి… నవ్వినట్లు నవ్వి —
"అలాంటిదేమీ ఉండదు సర్," అని చెప్పి… కాల్ కట్ చేసేశాను.
అంతలోనే కొత్త సినిమా డైరెక్టర్‌కి కాల్ చేసి,
"మీరు చెప్పిన షరతుకు ఓకే సర్," అని చెప్పా.
"అలాగే… రేపు అదే ప్లేస్‌లో కలుద్దాం," అన్నారు.
"సరే సర్," అని చెప్పి ఫోన్ పెట్టి పడుకున్నాను.
________________________________________
పొద్దున్న లేచేసరికి… పానిమనిషి వచ్చి,
"అమ్మగారు, ఈ కవర్ డోర్ దగ్గర పడి ఉంది," అని నా చేతికి ఇచ్చి వెళ్లిపోయింది.
ఆ కవర్ ఓపెన్ చేసి చూశాను… నా గుండె ఉలిక్కిపడిపోయింది.
ఆ కవర్‌లో నా పాత ఫోటోలు… నేను అబ్బాయిగా ఉన్నప్పటి ఫోటోలు…
నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోలు… అన్నీ!
ఆ ఫోటోలతో పాటు ఓ లేఖ కూడా ఉంది.
"నువ్వు నాకే డేట్స్ ఇవ్వకపోతే… నీవు అసలు అమ్మాయే కాదన్న సత్యాన్ని…
ఈ సినిమా ఫీల్డ్ మొత్తం తెలుసుకునేలా చేస్తాను. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఉంటాయి.
అప్పుడు నువ్వే కాదు… నీ సినిమా కూడా ఆగిపోతుంది."
ఈ లేఖను ఎవరు రాశారు అని చూస్తే…
అది నా జీవితాన్ని ప్రారంభించిచిన అదే డైరెక్టర్…!
________________________________________
శరీరం కంపించిపోతున్నట్టుంది. కళ్ళలో నీళ్ళు తడిచాయి. కానీ తడిపించుకోవడం లేదు.
కాల్ చేసి సూటిగా అడిగాను —
"సర్… ఇది మీరే రాశారా?"
ఆయన చలించకుండా అన్నాడు —
"అవును. ఎప్పుడో ఫిల్మ్ నగర్ రోడ్ మీద నిన్ను చూసి ఒక్క అవకాశం ఇచ్చి… నిన్ను స్టార్ చేశాను.
ఇప్పుడు నేను జైలుకు వెళ్తానంట… నువ్వూ మళ్లీ రోడ్డుమీదకే రావాలి.
నా సినిమా సైన్ చేయ్. మనిద్దరం హ్యాపీగా ఉండగలుగుతాం.
లేకపోతే… నీకు ఇచ్చిన లాస్ట్ మూవీకి వచ్చిన 'బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్' అవార్డు కే నువ్వు అర్హురా?
నువ్వే అసలు అమ్మాయివే కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను."**
అని సూటిగా బెదిరించాడు. కాల్ కట్.
________________________________________
ఇదంత విని షాక్ అయారు కదా?
"హీరోయిన్ అంటావ్… కానీ మళ్లీ అబ్బాయా?" అనిపించింది కదా?
అవును… మీరు విన్నది నిజమే.
నేను ఒక అబ్బాయిని. గత ఏడాది వరకూ…
ఇప్పుడు నేను జెండర్ ట్రాన్సిషన్ సర్జరీ చేయించుకున్నాను.
కానీ ఎంత సర్జరీ చేసినా… సమాజం మాత్రం ఇంకా అమ్మాయిగా గుర్తించలేదు.
అందుకే నా భయం.
"ఇప్పుడు నా ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే…"
నిజం చెప్పాలంటే… నేను ఒక క్రాస్‌డ్రెస్సర్‌ని.
అంటే, అమ్మాయిలా డ్రెస్ వేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం.
ఇంట్లో ఎవరూ లేనప్పుడు, బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు,
డ్రెస్‌లు సీక్రెట్‌గా క్యారీ చేసి, హోటల్ రూమ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలా డ్రెస్ వేసుకునేవాడిని.
"అసలు నేనొక అబ్బాయిని… కానీ హీరోయిన్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్‌గా ఉండి కూడా, నాలోని అబ్బాయి వ్యక్తిత్వాన్ని దాచుకోవడం… రోజూ నిద్రలేకుండానే నడుస్తున్న కష్టం."
నా డ్రెస్‌లు, మేకప్ స్టఫ్ అన్నీ చాలా జాగ్రత్తగా దాచేవాడిని.
ఇంకా… నా వయసు చెపలేదు కదా… ఇప్పుడు 24ఏళ్లు. తక్కువ లావుగా, మధ్యస్థ శరీరాకృతిలో ఉంటాను.
ఆన్‌లైన్‌లోని వీడియోలు చూసుకుంటూ, మేకప్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. చిన్న జాబ్ చేస్తూ, నెలలో కొంత సేవ్ చేసుకుని ఒక మంచి రియల్ హెయిర్ విగ్ కొన్నాను.
అది పెట్టుకుని, లైట్ మేకప్ వేసుకుని రెడీ అయితే… నన్ను చూసి ఎవరూ "ఇతడు అబ్బాయి" అనలేరు.
అంత అందంగా, సహజంగా కనిపిస్తాను. కానీ మాట్లాడగానే గంత లోపం వల్ల కొంతవరకు అర్ధమవుతుంది — నేను అమ్మాయిని కాదని.
ఒక రోజు, నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ — కెనడాలో ఉంటాడు — ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు,
"ఇది కొత్త మెడిసిన్ Sowmya. ఈ టాబ్లెట్ వేసుకుంటే 24 గంటలపాటు నీ వాయిస్ పూర్తిగా అమ్మాయిలా మారుతుంది," అంటూ ఒక టాబ్లెట్ ఇచ్చాడు.
ఆ వాడు నా డ్రెస్ హాబీ గురించి ఇప్పుడే తెలుసుకున్నాడు.
"నీకు నాకంటే బాగా ఉపయోగా వస్తుంది," అని ఇచ్చాడు.
"సరే, ఓసారి ట్రై చేస్తాను" అని తీసుకున్నాను.
________________________________________
ఆ టాబ్లెట్ వేసి బయటకి వెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా… అనుకోకుండా నాకు హైదరాబాద్‌లో వర్క్ వచ్చింది.
డ్రెస్‌లన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి నాలుగు రోజుల ట్రిప్‌కి వచ్చేశాను.
అక్కడ నా ఆఫీసు వర్క్ రెండు రోజులు… మిగిలిన రెండురోజులు — నా స్వప్న ప్రపంచం!
నా పని చేసే చోట దగ్గరగానే ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ఒక హోటల్‌లో రూమ్ తీసుకున్నాను. మొదటి రెండు రోజుల్లో పని పూర్తయింది.
మూడవ రోజు ఉదయం లేచి, నా బాడీ హేర్ మొత్తం షేవ్ చేసుకుని, సాఫ్ట్‌గా చుడిదార్ వేసుకున్నాను.
నాకు లైట్ మేకప్ బాగా సెట్ అవుతుంది.
అదే నాకిష్టం. సహజమైన అమ్మాయి లా కనిపించేందుకు.
విగ్ పెట్టుకుని, క్లీన్‌గా సెటప్ చేసి, ఒక క్లిప్ వేసుకుని… జుట్టును ఓపెన్ చేసి వదిలేశాను.
అదే రూపం – అద్దంలో నాకు నచ్చిన అమ్మాయి.
అదే టైమ్‌లో, రెండు అంగుళాల హీల్స్ వేసుకుని, హ్యాండ్‌బ్యాగ్ తీసుకున్నాను. అందులో మొబైల్, డబ్బులు వేసుకున్నాను.
మొదటిసారిగా… ఆ టాబ్లెట్ వేసుకున్నాను. వేసిన కొద్ది నిమిషాల్లోనే… గొంతు విరిగినట్టు అనిపించింది.
బాగానే బాధించింది. మాట కూడా రాలేదు. "మొదట్లో అలానే ఉంటుంది" అనుకుని, ధైర్యం తెచ్చుకుని, రూమ్ లాక్ చేసి బయటకి వచ్చాను.
ఇంత వరకూ నేను ఎన్నో సార్లు హోటల్‌లో డ్రెస్ అయ్యాను. కానీ ఎప్పుడూ బయటికి రాలేదు.
కాని ఇప్పుడు… ఆ టాబ్లెట్ ఉన్న కారణంగా, ఒకింత ధైర్యంగా ముందడుగు వేసాను.
___
హోటల్ రెసెప్షన్‌కి వచ్చేసరికి…
"మేడమ్, మీ రూమ్ నంబర్ చెప్తారా?" అని అడిగాడు.
నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.
బయటే కాదు… నా గొంతు పని చేయకపోవడం వల్ల ఏం చెప్పలేకపోయాను.
ఆయన ఇంకాస్త దగ్గరకు వచ్చి,
"ఐడీ కార్డ్ ప్లీజ్," అని అడిగాడు.
తడబడి, భయంతో… నా చెమట తడిచిపోయింది. గుండె దద్దరిల్లిపోతోంది…
Part 1
2081 Views
4 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (4)
Wow, great start Soumya sweety. Next part when???? 💓
thank you sis. next week i upload next part
good start soumya
thank you