సౌమ్యగా తొలిసారి అడుగు బయట పెట్టాను…
నన్ను నేనే నమ్మలేకపోయాను…
"ఇది నిజమేనా… నిజంగా నేనా?" అనే భావం గుండెల్లో గిజగిజలాడింది.
ఒక వైపు మాటల్లో చెప్పలేని ఆనందం…
మరొక వైపు… ఎక్కడో లోతుల్లో చిన్న భయం –
"ఎవరైనా గమనిస్తారేమో…" అనే అనుమానం.
కానీ… గుండె నిండా ఆత్మవిశ్వాసం కూర్చుకొని, నేను నడక మొదలెట్టాను.
అప్పుడు…
"Excuse me, madam…" అనే ఓ స్వరం నా వెనక నుంచి వినిపించింది.
"నన్ను కాదేమో," అనుకొని నేను ఆగకుండా ముందుకే నడిచాను.
మళ్ళీ…
"Excuse me, madam…"
ఈసారి, పిలుపు మరింత స్పష్టంగా వినిపించింది.
ఈసారి మాత్రం… నన్నే పిలుస్తున్నాడేమో అనిపించి వెనక్కి తిరిగాను.
అవునే… నిజంగానే నన్నే పిలిచాడు.
"ఏమిటండి?" అన్నట్టు తల తిప్పి ప్రశ్నించాను.
"మీరు చాలా బాగున్నారు… మీకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా?" అని అడిగాడు.
మొదట నేను చిన్నగా నవ్వుతూ,
"థ్యాంక్యూ," అన్నాను.
"కానీ… నాకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదు సర్…"
అంటూ మృదువైన గాత్రంలో చెప్పాను.
అయితే అతనికి వినిపించలేదు.
"ఏం అన్నారు?" అని అడిగాడు.
అప్పుడు నాకు కొంచెం అసహనం వేసింది.
ఇంకా ఎడితే… అది అయింది.
నా అసలు స్వరం గట్టిగా బయటపడినట్టు అనిపించింది.
కానీ…
ఆ గొంతు కూడా – లేడీ వాయిస్‌లానే వినిపించింది.
అంటే…
నా ఫ్రెండ్ ఇచ్చిన టాబ్లెట్ పనిచేసింది!
అనే విషయం అర్థమైంది.
నాలో భయం మాయమైపోయింది.
కొంచెం ధైర్యం, కొంచెం ఆనందం…
మాటల్లోకి వెళ్ళిపోయాను. స్వేచ్ఛగా మాట్లాడడం మొదలెట్టాను.
________________________________________
ఇంకా అతను తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
"నేను ఓ సినిమా కోఆర్డినేటర్‌ని అక్కా…
ఈరోజు షూటింగ్‌కి తీసుకెళ్లాల్సిన జూనియర్ ఆర్టిస్టులను కలెక్ట్ చేస్తున్నాను.
కానీ ఒక అమ్మాయి తక్కువైంది.
ఇంకొక అమ్మాయిని ఇప్పటికీ కనుగొనడం చాలా కష్టం.
మా డైరెక్టర్ సార్ ఆలస్యమైతే చాలా కోపంగా ఉంటారు."**
"మీరు చాలా బాగున్నారండీ…
మీరు రాగలిగితే, మిమ్మల్ని డబుల్ పే చేసేందుకు రెడీగా ఉన్నాను," అని చెప్పారు.
“అది అంతా విని, ‘అయ్యో! నాకు ఇంట్రెస్ట్ లేదు సర్…’ అని చెప్పేశాను.
ఎందుకంటే నేను అక్కడికి వచ్చినది ఇంకో పనిమీదే…
అంతేకాదు… నిజానికి నేను ఒక అబ్బాయిని…
కానీ… ఆయన నన్ను అమ్మాయినే అనుకుంటున్నాడు.
ఎంత చెప్పినా ఆయన వినడం లేదు…
ఒకటే మాట – "ఒక్కరోజే మేడమ్… ఒక్కరోజే ప్లీజ్!" అని అడుగుతూనే ఉన్నాడు.
అప్పుడే పక్కనే ఉన్న వాన్ నుంచి ఒక అమ్మాయి దిగింది.
"ఒక్క రోజు మాత్రమే కదా మేడమ్… డైలాగ్స్ ఏముంటాయో లేవ్… పర్లేదు కదా!" అని నన్ను బతిమాలింది.
చాలాసేపు ఆలోచించాను…
ఇంతవరకు ఎవ్వరినీ – హీరోనీ, హీరోయిన్‌నీ – చూడలేదు… ఏదో ఒక సరదాకైనా చేస్తే తప్పేం?
అనిపించి… "సరే, ఒక రోజు అయితే చేస్తా." అన్నాను.
వాడు చాలా సంతోషంగా,
"థ్యాంక్యూ మేడమ్!" అని చెప్పాడు.
ఇంకా మేమంతా కలిసి వాన్లో ఎక్కాము.
వాళ్లు మమ్మల్ని ఒక స్టూడియోకి తీసుకెళ్లారు.
అక్కడినుంచి మళ్లీ షూటింగ్ స్పాట్‌కి.
అక్కడ అబ్బాయిలందరిని ఒక ప్రక్కకు తీసుకెళ్లారు.
నన్ను, నాతో పాటు వచ్చిన అమ్మాయిని – ఇంకా మరో ఇద్దరిని – డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
డైరెక్టర్ సర్ మమ్మల్ని ఒక్కసారి చూశాడు… మౌనంగా తల ఊపి, "ఓకే…" అన్నాడు.
అలానే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మమ్మల్ని మేకప్‌రూంకి తీసుకెళ్లాడు.
అక్కడ ఆ రోజు సీన్‌కి అవసరమైన కాస్ట్యూమ్స్ ఇచ్చారు.
అవి తీసుకొని మేమంతా డ్రెస్‌చేంజ్ రూంకి వెళ్లాము.
నాకేమో… అంతా భయం భయంగా ఉంది.
పక్కనే ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి,
"ఎందుకంత భయపడుతున్నావ్? ఇదీ ఓ కాలేజ్ డ్రామా లాంటిదే అనుకో…"
అని నవ్వుతూ ధైర్యం చెప్పింది.
నాకు పేరు అడిగింది.
"ప్రియా" అని చెప్పింది.
ఆమె వేసుకున్న డ్రెస్సు – సింపుల్ టీషర్ట్, స్కర్ట్.
మనం అందరూ అలానే డ్రెస్‌చేంజ్ చేసుకుని బయటికి వచ్చాం.
అసిస్టెంట్ డైరెక్టర్ మేకప్‌మెన్‌కి చెప్పాడు –
"ఈమెకు మేకప్ వేయండి."
అయితే నేను వేసుకున్న మేకప్ చూసి,
అదే మీదుగా కొద్దిగా టచ్‌అప్ చేసి పూర్తి చేశాడు.
అంటే నా రహస్యం బయటపడలేదు!
నా రియల్ హెయిర్ విడ్‌కి నేను ముందు నుంచి గ్లూ వేసి సెట్ చేసుకున్నాను,
అందుకే వారు ఏవిధంగా స్టైల్ చేసినా అది కదలలేదు.
ఇంకా నేను రెడీ అయ్యాను.
అయితే ఇంతలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సీన్ వివరించాడు:
"ఇది ఓ కాలేజ్ సీన్.
హీరో-హీరోయిన్ మధ్య చిన్న గొడవ.
పక్కన ఉన్న అమ్మాయిలు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తారు.
వాళ్లలో నువ్వూ ఒకరు."
డైలాగ్స్ లేవు.
అందరం డైరెక్టర్ చెప్పినట్టు, హీరోయిన్‌కి వెనుక నిలబడ్డాం.
నాకు నెర్వస్‌గానే ఉంది. కానీ ప్రియా నా చెయ్యిపట్టి,
"ఏం లేదు… టెన్షన్ పడకూ!" అంది.
అయినా కూడా నా చేతులు చెమట పట్టేవి.
"ఇంత టెన్షన్ వస్తే… వెనకలైన్‌లో నిలబడి ఉండు!" అంది నవ్వుతూ.
"సరే!" అనుకొని వెనక వెళ్లి నిలబడ్డాను.
అంతా సెట్ అయ్యాక, అసిస్టెంట్ డైరెక్టర్:
"All ok sir!"
అని డైరెక్టర్‌కి చెప్పాడు.
కెమెరా రెడీ… లైట్స్… "యాక్షన్!"
"యాక్షన్!" అన్న డైరెక్టర్ మాటతోనే
సెట్ మీద ఒక ఊహించని శాంతి ఏర్పడింది.
హీరో, హీరోయిన్ మధ్య ఫన్నీ గొడవ నడుస్తోంది.
వాళ్ల వెనుక మనం — బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్.
సౌమ్య వెనకే నిలబడి ఉంది. నెర్వస్… కానీ లోపల ఏదో మత్తు, ఏదో బలమైన అనుభూతి…
అందరూ నటించాలనే పని చేస్తుంటే
ఆమె మాత్రం జీవిస్తోంది!
అప్పుడు… డైరెక్టర్ ఒక్కసారిగా
కెమెరా రోలవుతున్న టైంలోనే
"ఒక నిమిషం!" అన్నాడు.
అందరూ షాక్ అయ్యారు.
అతను ముందుకొచ్చి నేరుగా సౌమ్య వైపు చూశాడు.
"ఈ అమ్మాయి ఎవరు?" అని అడిగాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చి,
"సర్, లాస్ట్ మినిట్‌కి వొచ్చిన జూనియర్ ఆర్టిస్ట్. టైమ్ షార్ట్ అవుతుంది కాబట్టి మీకు చెప్పలేకపోయాం…" అన్నాడు.
డైరెక్టర్: "ఓహ్… Interesting face. Refreshing presence… ఈ సీన్‌కి చిన్న close-up వేసి చూద్దాం!"
అందరూ ఆశ్చర్యపోయారు.
జూనియర్ ఆర్టిస్టుగా వచ్చిన అమ్మాయి
ఒక క్షణం ఖంగారు పడింది.
తన పేస్ లో ఆత్మవిశ్వాసాన్ని తనే విచ్చేస్తుందేమో అనిపించింది.
"All okay," అన్నాక డైరెక్టర్ "Action!" అన్నాడు.
హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఫన్నీ సీన్‌లో మేమూ ఫిట్ అయిపోయాం.
ఒకటి కాదు, ఐదు టేకులు తీసుకున్నారంట.
మేమంతా చెప్పినట్టు చేశాం.
అంతలోనే మా పార్ట్ అయిపోయింది.
హీరో, హీరోయిన్ సీన్స్ చేస్తున్నారు.
మేమైతే మేకప్ తీసేసుకుని, డ్రెస్ మార్చేసుకుని సెట్ నుంచి బయటకి రావడం మొదలెట్టాం.
కానీ నేను మాత్రం ఒక్క డ్రెస్ మాత్రమే మార్చుకున్నాను.
మేకప్ తీసేసి ఏమయిన ప్రాబ్లమ్ వస్తుందేమో అనిపించి ఆపేశాను.
ఇంకా నేను, ప్రియా కలిసి కోఆర్డినేటర్ దగ్గరకి వెళ్లాం,
పేమెంట్ తీసుకోవడానికి.
నాకు ఇచ్చింది రూ.4000.
"ఇది సౌమ్యకు వచ్చిన మొదటి ఆదాయం," అనుకుంటూ హృదయంలో ఓ చిన్న సంబరం కలిగింది.
అక్కడినుంచి వాన్న్లోకి ఎక్కిపోతుండగానే…
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి,
"మేడమ్, మీను సర్ పిలుస్తున్నారు…" అన్నాడు.
"ఎవరు సర్?" అని ప్రియా అడిగింది.
"డైరెక్టర్ సర్…" అన్నాడు.
"ఓహ్, వస్తున్నా. సౌమ్యా, నీవెళ్లి రా. నేను వాహనంలో వేచి ఉంటా," అంది.
నాకు ఏమాత్రం అర్థం కాలేదు.
ఎందుకు పిలిచారు? ఏం జరిగిందో?
అంటూ మెల్లగా నడుస్తూ డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను.
"గుడ్ ఆఫ్టర్నూన్ సర్," అన్నాను.
"నీ పేరు?" అన్నాడు.
"సౌమ్య సర్," అన్నాను.
"హం… నైస్. బాగున్నావ్."
"థ్యాంక్యూ సర్…" అన్నాను
అప్పుడే పక్కన ఉన్న కోఆర్డినేటర్ "అవును సర్," అన్నాడు.
"నీకు పేమెంట్ సెటిల్ చేసాం కదా? ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అన్నాడు కోఆర్డినేటర్‌ను చూస్తూ.
అదే మాట విన్న డైరెక్టర్ ముఖం మారిపోయింది.
"నన్నే రమ్మన్నాను… ఈ అమ్మాయిని ," అన్నాడు.
అంతే… కోఆర్డినేటర్ మౌనంగా తల వంపాడు.
"ఇంతకముందు ఏ సినిమాల్లోనైనా నటించావా?" అని నన్ను అడిగాడు.
"లేదండి… ఇదే నా మొదటి సారి," అన్నాను.
"అలానా !" అంటూ ఆయన ముఖంలో ఉత్సాహం కనిపించింది.
"సరే… ఈవెనింగ్ నా ఆఫీసుకు రా. కలుద్దాం."
అంతేకాదు, అసిస్టెంట్ డైరెక్టర్‌ని పిలిచి
"ఈమె ఫోన్ నంబర్ తీసుకో. కాంటాక్ట్‌లో ఉండు," అన్నాడు.
మళ్లీ కోఆర్డినేటర్‌ని చూసి,
"ఈ అమ్మాయిని ఈవెనింగ్ నన్ను కలవడానికి తెసుకొని రా," అన్నాడు.
నాకు అర్థం కాలేదు.
కానీ, నా లోపల ఏదో కలిసిపోని కలవర…
వాన్‌లోకి ఎక్కేసరికి ప్రియా అడిగింది:
"ఏమంటున్నాడు?"
"ఈవెనింగ్ తన ఆఫీస్‌కు రావాలని అన్నాడు," అన్నాను.
"వావ్! ఏంటి లక్కీగా కొట్టేసావ్ రా! ఫస్ట్ డేలోనే డైరెక్టర్ ఆఫీస్ మీటింగ్!"
నాకేమీ ఇంట్రెస్ట్ లేదు.
"ఇష్టంలేదు ప్రియా… వద్దు అనిపిస్తోంది."
"అలాగే ఎందుకు అంటావ్… వచ్చిన ఛాన్స్ వదులుకోకు!"
ఇపుడు… నేను నిజం చెపాల్సిన టైమ్ వచ్చేసింది.
ప్రియా చెవిలో చెప్పాను…
"నిజం చెప్పాలి," అనిపించింది.
"ప్రియా… నేను అబ్బాయిని. అమ్మాయిని కాదు. నేను ఒక క్రాస్‌డ్రెస్సర్ ని."
ఆమె మొదట నవ్వింది. "జోక్ చేస్తావ్ సౌమ్యా!"
"నిజం ప్రియా… నమ్మడం లేదు కదా… నా రూమ్‌కి రా, చూపిస్తా," అన్నాను.
"సరే… పద అనింది.
"ఇప్పుడు చెప్పు సౌమ్యా, నువ్వు చెబుతున్నదే జోక్ అనీ," అంది ప్రియ.
"ఇంకా చెప్పితే అర్థం కాదు, చూపించాలి," అన్నట్టు నా విగ్ తీయడమూ, చూపించడమూ చేశాను.
అయినా తను నమ్మలేదు. "జుట్టు లేని వాళ్లు విగ్ వేసుకోవడం కామన్ కదా," అంది.
ఇంకా నేను వేసుకున్న చుడిదారూ తీసేశాను. నా బ్రెస్ట్ ఫార్మ్స్ రిమూవ్ చేసి చూపించాను.
అదంతా చూసిన ప్రియా, షాక్‌లోకి వెళ్లిపోయింది.
"అంటే నువ్వు లేడీ గెటప్ ఆర్టిస్టా?" అని అడిగింది.
"మరి వాయిస్ ఏంటి?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
"నా గురించి క్లియర్‌గా చెప్తాను. విను," అన్నాను.
"నేను అబ్బాయి. కానీ అమ్మాయిలా డ్రెస్ అయ్యినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది.
నా వర్క్ ట్రిప్స్ మీద క్యాంపులకు వచ్చాక, ఫ్రీ టైమ్‌లో ఇలా రెడీ అవుతాను.
ఈరోజు ఉదయానికూడా అలా రెడీ అయ్యి బయటకి వచ్చాను. అదే టైంలో ఆ కోఆర్డినేటర్ నన్ను రిక్వెస్ట్ చేశాడు. వెంటనే నువ్వూ వచ్చి అడిగావు.
ఇక మిగతా సంగతి నీకు తెలిసిందే" అన్నాను.
అదంతా విన్న ప్రియా ఇంకా షాక్‌లోనే ఉంది.
నేను డ్రెస్ మార్చుకుని మేల్ నైట్ డ్రెస్ వేసుకున్నాను. కానీ బ్రెస్ట్ ఫార్మ్స్ మాత్రం తీయలేదు. మళ్లీ వేసుకున్నాను.
మేకప్, వాయిస్, బ్రెస్ట్ ఫార్మ్స్ వున్న కారణంగా మేల్ డ్రెస్ వేసుకున్నా కూడా అమ్మాయిలా కనిపిస్తున్నాను.
అప్పుడు ఎవరో డోర్ తట్టాడు. అలానే వెళ్లి తలుపు తీయగా… రూమ్ సర్వీస్ బాయ్ వచ్చాడు.
నన్ను చూసి "మేడం, వాటర్ బాటిల్," అని ఇచ్చాడు. నేను తీసుకుని "థ్యాంక్యూ" అన్నాను.
"మేడం మీ వాయిస్ చాలా స్వీట్‌గా ఉంది," అన్నాడు.
నేను చిరునవ్వుతో "థ్యాంక్యూ" అన్నాను.
"ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా?" అన్నాను.
"నీ పేరు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు నువ్వు సౌమ్య నే.
నిన్ను అలా చూసిన ప్రతి ఒక్కరికీ నువ్వు అసలైన అమ్మాయిలానే కనిపిస్తున్నావు.
అంటే నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది.
అంతేకాకుండా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
ముందు వెళ్లి డైరెక్టర్‌ను కలవు, ఏం అంటాడో చూద్దాం. ఆ తరువాత ఆలోచిద్దాం," అంది ప్రియా.
అంతలో నాకు ఫోన్‌కాల్ వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్.
"చెప్పండి," అన్నాను.
"సౌమ్యా గారా?" అన్నాడు.
"అవును," అన్నాను మృదువుగా.
"మేడం, మీకు సర్ ఆఫీస్ అడ్రస్, లొకేషన్ పంపించాను. ఈవెనింగ్ 7కి అక్కడ ఉండండి," అన్నాడు.
నాకు స్పందించేలోపే కాల్ కట్ చేశాడు.
"ఇప్పుడు ఎలా ప్రియా?" అన్నాను.
"నీకే చెప్పా కదా – వస్తోన్న ఛాన్స్ మిస్ చేసుకోకూడదు," అంది.
"నేను ఇప్పుడెక్కడికి వెళ్ళాలి, నా దగ్గర సరైన డ్రెస్సులూ లేవు," అన్నాను.
"డోంట్ వర్రీ. నీ సైజ్, నా సైజ్ ఓకే లాంటివే. మా ఇంటికి రా.
ఇలాగూ నువ్వు రెడీ అయిన తర్వాత ఎవరు నమ్మరు నువ్వు అబ్బాయివని. మా ఇంట్లో కూడా ఎలాంటి సమస్య ఉండదు," అంది.
అది నిజమే అనిపించి "సరే" అన్నాను.
మళ్లీ నేను ముందే వేసుకున్న చుడిదార్‌నే మళ్లీ వేసుకున్నాను. గ్లూ అప్లై చేసి విజ్ సెట్ చేసుకున్నాను.
విజ్ సెట్ చేయడంలో ప్రియా సహాయపడింది. ఇప్పటి వరకు నాకు హెయిర్‌స్టైల్ చేసుకోవడం రాలేదు.
కానీ ఇప్పుడు ప్రియా సహాయపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది.
"ప్రియాకి నిజం చెప్పినందుకు చాలా బాగుంది. ఒక మంచి సపోర్టివ్ ఫ్రెండ్ దొరికింది," అనిపించింది.
"థ్యాంక్యూ ప్రియా," అన్నాను.
"అయ్యో అందులో ఏముంది… నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు ఉన్నావ్. ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా.
ఒకవేళ ఆ డైరెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినా వదలకూ…
ఒక ఛాన్స్ తో నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది," అంది.
ఆ మాట విని నాకు స్వల్పంగా సిగ్గేసింది.
నా హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని ప్రియ వాళ్లింటికి బయలుదేరాం.
వాయిస్ చెంజ్ టాబ్లెట్స్ కూడా పెట్టుకున్నాను.
అలా నడుచుకుంటూ ప్రియా ఇంటి వైపు పోతున్నాం.
రోడ్డుమీద కుర్రాళ్లు చాలా మంది నన్నే చూస్తున్నారు. నాకు కొంచెం భయం వేసింది.
ప్రియ వైపు దగ్గరకి వెళ్ళాను.
"ఎందుకు టెన్షన్?" అని అడిగింది.
"అబ్బాయిలు నన్నే చూస్తున్నారే…" అన్నాను.
"అంటే అర్థం ఏంటి?" అని అడిగింది.
"ఎమో…" అన్నాను.
"ఓయ్ పిచ్చిదానా, అబ్బాయిలు అమ్మాయిని చూస్తున్నారంటే మనం బాగున్నామన్నమాట.
వాటిని మనం కాంప్లిమెంట్స్‌లా తీసుకోవాలి. నీ విషయంలో కాన్ఫిడెంట్‌గా తీసుకో," అంది.
"సరే," అన్నాను.
ఇంకా ఇరువై నిముషాలు వాకింగ్ చేసి ప్రియా ఇంటికి వచ్చాం.
అక్కడ ఆమె అమ్మ ఉండింది. ఆమెకి నమస్కారం పెట్టాను.
"ఎవ్వరు?" అని అడిగింది నన్ను చూసి.
"ఇది నా ఫ్రెండ్ సౌమ్య అమ్మా. పని మీద హైదరాబాద్ కి వచ్చింది," అని చెప్పింది ప్రియా.
"సరే, నువ్వు రా vey," అని తన రూమ్‌కి తీసుకెళ్లింది.
"సౌమ్యా, ఇక్కడ నువ్వు, vey అనే పిలవు…" అంది.
"సరే, లే vey," అన్నాను.
"ఇంకా నీకు ఏ డ్రెస్ కావాలి?" అని అడిగింది.
"నాకు ఏమీ తెలీదు, నువ్వే వెయ్," అన్నాను.
"సారీ పద, నేను రెడీ చేస్తాను," అంది.
"సరే," అన్నాను.
తన వార్డ్రోబ్ నుంచి ఒక చీర తీసి ఇచ్చింది.
"చీరనా?" అన్నాను.
"అదే వేసుకో, పర్ఫెక్ట్," అంది.
"బ్రా ప్యాంటీ ఉన్నాయా?" అని అడిగింది.
"లేవు…" అని తలదించుకున్నాను.
"సరే, నేను ఇస్తా, ఉండు," అని తన బ్రా ప్యాంటీ ఇచ్చింది.
లోపలికి వెళ్లి ప్యాంటీ వేసుకున్నాను.
ఇప్పటికే ఎన్నో సార్లు వేసుకున్నాను కానీ… ఈసారి వేసిన ప్యాంటీ వేరే ఫీలింగ్ ఇచ్చింది.
ఎందుకంటే అది ఒక అమ్మాయి వాడినది కాబట్టి…
అందులోనే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నాను.
అప్పుడే "ఓయ్ సే!" అని తలుపు తట్టింది ప్రియా.
"హా వస్తున్నా," అన్నాను.
బ్రా వేసుకుంటున్నాను కానీ… కుదరడం లేదు.
"డోర్ ఓపెన్ చెయ్యి," అంది.
"ఉండు," అన్నాను.
"పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను," అంది.
నా చేతులతో నా బ్రెస్టు కవర్ చేసుకుని తలుపు తెరిచాను.
ప్రియా లోపలకి వచ్చింది…
అప్పుడే నేను ఓ ప్యాంటీ వేసుకుని, బ్రా నా చేతులకే వేసుకున్నాను. కాని హుక్స్ పెట్టుకోవడం కుదరడం లేదు.
ఇంతలో ప్రియా వచ్చి, నా వెనకనించి మృదువుగా బ్రా హుక్స్ వేసింది.
అప్పుడు నేను బ్రా, ప్యాంటీ వేసుకుని, లూస్ జుట్టుతో నిలబడి ఉన్నాను.
ఆ దృశ్యాన్ని చూసిన ప్రియా ఆశ్చర్యంతో –
"అబ్బా! భలే ఉన్నావ్ వే్! అబ్బాయిలు కూడా అంత అందంగా ఉంటారని ఎవరూ ఊహించరు!" అని నవ్వింది.
ఆ మాట విని నాకు కోపం కాదు, కానీ ఒక రకమైన సిగ్గు వేసింది.
అదికూడా గుర్తించగానే, "మేడం గారికి సిగ్గు వచ్చిందట!" అంటూ నవ్వుతూ నన్ను తాకింది.
"సరే రా," అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్లింది.
నేను ఇంకా సిగ్గుతో తడబడుతూ…
"చూడు వే్, ఇక్కడ అబ్బాయిలు ఎవరూ లేరు. మనం ఇద్దరం అమ్మాయిలమే కదా. ఇంకెందుకు సిగ్గు పడాలి?" అంది హాయిగా.
అంతలో, ఓ పెటికోట్ తీసి, "ఇది వేసుకో," అంది.
ఆమె చెప్పినట్టే వేసుకున్నాను.
తర్వాత ఓ బ్లౌజ్ ఇచ్చింది. అది ముందు భాగాన వి షేప్ లో ఉండి, వెనక పూర్తిగా ఖాళీ – కేవలం ఓ సింగిల్ స్ట్రింగ్ మాత్రమే.
"ఇది అవసరమా?" అని అడిగాను.
"నేను చెప్పినట్టు విను, వేసుకో," అంది ప్రేమగా.
"సరే," అన్నాను. బ్లౌజ్ వేసుకున్నాను.
వెనక నుంచి స్ట్రింగ్‌కి ముళ్లు వేయడంతో బ్లౌజ్ నా శరీరాన్ని సన్నగా హత్తుకుంది.
తర్వాత ఆమె చీర తీసి, నన్ను సావధానంగా డ్రేప్ చేసింది.
అంతే కాదు – నన్ను డ్రెస్ టేబుల్ ముందు కూర్చోబెట్టి గ్లామర్ మేకప్ కూడా చేసింది.
నా చర్మం అంతా ప్రకాశిస్తూ కనిపించసాగింది.
చివరగా జుట్టు అందంగా స్టైలింగ్ చేసి, ఒక వైపుగా వదిలింది.
బ్యాగ్‌కి బదులుగా ఒక క్లచ్ purse ఇచ్చింది – అందులో నా డబ్బు పెట్టుకున్నాను.
తన హీల్స్ కూడా ఇచ్చింది.
నాకు ఇప్పటికే హీల్స్ వేసుకుని నడవడం అలవాటు కాబట్టి – నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
చివరగా...
ప్రియా క్యాబ్ బుక్ చేసింది.
"ఇంకో 20 నిమిషాల్లో క్యాబ్ వస్తుంది," అంది.
అయినా నాకు గడగడలాడే ఉత్కంఠ.
మిర్రర్ ముందు నన్ను చూస్తే – నేనే నమ్మలేనింతగా అందంగా ఉన్నాను.
ఒక ఆడియో ఫంక్షన్‌కు వెళ్తున్న హీరోయిన్‌లా కనిపిస్తున్నాను.
వెనకనుంచి ప్రియా వచ్చి నా భుజం మీద చేతిని వేసి –
"చాలా అందంగా ఉన్నావ్ వే్!" అంది.
వెనక్కి తిరిగి ప్రియాను కౌగిలించుకుని –
"థ్యాంక్యూ వే్!" అన్నాను మృదువుగా.
ఆ వెంటనే ప్రియా చిన్నగా హెచ్చరిక ఇచ్చింది –
"ఏదైనా ఒప్పుకోమంటే ఓకే అన్నా పరవాలేదు… కానీ డైరెక్టర్స్ కొన్నిసార్లు 'కమిట్‌మెంట్' అడుగుతారు.
అది మాత్రం చెప్పకుండా తలొగ్గకూడదు," అంది.
"సరే," అన్నాను గంభీరంగా.
"నిన్ను చూస్తే ఎవరైనా హీరోయిన్ ఛాన్స్ ఇస్తారు లే వే్!" అని నవ్వింది.
ఇంతలో క్యాబ్ వచ్చింది.
"ఆల్ ది బెస్ట్, Sowmya!" అంటూ స్నేహభావంతో వీడ్కోలు చెప్పింది.
"థ్యాంక్యూ వే్!" అంటూ నేను క్యాబ్ ఎక్కాను.
క్యాబ్ నన్ను డైరెక్టర్ గారి ఆఫీసు దగ్గరకి తీసుకొచ్చింది.
కింద దిగి చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఎదురుగా కనిపించాడు.
"రండి, " అంటూ మర్యాదగా స్వాగతం పలికాడు.
"సర్ రూమ్ దగ్గర ఉండండి, త్వరలో సర్ వస్తారు," అన్నాడు.
"సరే," అన్నాను.
కానీ లోపల మాత్రం నా హృదయం గట్టిగట్టిగా కొట్టుకుంటోంది.
ఒక్కో క్షణం నరాలను ఉద్రేకంలోకి నెట్టుతోంది.
"ఏమవుతుందో… డైరెక్టర్ ఎం అడుగుతాడో ఎం చెప్తాడో … లేక ప్రియా చెప్పినట్టే ' కమిట్‌మెంట్' అడిగేస్తాడేమో…" అనే భయాలు నన్ను పట్టిపీడిస్తున్నాయి.
ఒక్క క్షణం నా గుండె క్షణం కోల్పోతున్నట్టే ఉంది…
Part 2
2079 Views
4 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (4)
Wow, great start Soumya sweety. Next part when???? 💓
thank you sis. next week i upload next part
good start soumya
thank you