డైరెక్టర్ సార్ నన్ను ఆఫీసుకి రమ్మని చెప్పగానే, ప్రియ కి చెప్పేశాను.
ఆమెకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది.
"నీ దగ్గర సరిపడే డ్రెస్సులు లేవు కదా? ఫర్వాలేదు! మనిద్దరం అలానే ఒక్కే సైజ్ లో ఉన్నాం. నా బట్టలే వేసుకో!" అని చెప్పి,
ఒక బ్యూటిఫుల్ డీప్ వి నెక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ తో స్టైలిష్ స్టెయిన్ శారీలో నన్ను రెడీ చేసింది.
గ్లామరస్ మేకప్ వేసి, హెయిర్ అంతా ఒక వైపు వాల్చి సెటప్ చేసి, ఒక క్లచ్ purse ఇచ్చింది.
తన హైహీల్స్ కూడా ఇచ్చింది. ఫైనల్‌గా నాకు నా లుక్ చూస్తే — ఎవరైనా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్తున్న హీరోయిన్ అనుకుంటారు!
ఇంతలో ప్రియా క్యాబ్ బుక్ చేసింది.
నేడు ఆ క్యాబ్ ఎక్కి, నేను డైరెక్టర్ సార్ ఆఫీసుకి వెళ్లాను.
అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ నా కోసం ఎదురు చూస్తున్నాడు.
నేను క్యాబ్ దిగగానే, "రండి మేడం" అంటూ నన్ను డైరెక్టర్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు.
"సార్ బిజీగా ఉన్నారు, మీరు ఇక్కడే కూర్చొండి" అన్నాడు.
"సరే" అని కూర్చున్నాను. కానీ లోపల మాత్రం టెన్షన్ మొదలైంది…
"ఎందుకు నన్ను రమ్మన్నాడు? ప్రియా చెప్పినట్టు ఏదైనా కమిట్‌మెంట్ అడుగుతాడా? అలాగైతే నేను అబ్బాయినని చెపేస్తా?"
అలాంటివే ఎన్నో ఆలోచనలు నాలో పుట్టాయి.
చివరికి 30 నిమిషాల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి,
"సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడు.
లోపలికి వెళ్లాను.
"గుడ్ ఈవెనింగ్ సార్," అన్నాను నా హస్కీ వాయిస్‌లో.
నన్ను చూడగానే,
"హా సౌమ్యా, రండి, కూర్చోండి," అన్నారు.
వెళ్లి సార్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాను.
డైరెక్టర్ సార్ నన్ను పైనుంచి కిందివరకు ఓ ఎగా దిగాచూసాడు.
ఆ చూపు నన్ను కాస్త ఒత్తిడిలోకి నెట్టేసింది.
"ఎక్కడ నేను అమ్మాయి కాదు అని తెలిసిపోతుందేమో?" అన్న భయం గుండెల్లో కల్లబొల్లలాడింది.
డైరెక్టర్: "సో మిస్ సౌమ్యా… మీరు ఈరోజే కదా మొదటిసారి కెమెరా ఫేస్ చేసింది?"
నేను: "అవును సార్…"
డైరెక్టర్: "హ్మ్… చాలా బాగున్నారు."
నేను: "థాంక్యూ సార్…"
డైరెక్టర్: "ఎక్కడ ఉంటారు మీరు?"
అంతా వివరంగా చెప్పేశాను — నా నేటివ్ ప్లేస్, నేను ఎలా జాబ్ చేస్తున్నానో…
"కో ఆర్డినేటర్ అడిగినప్పుడు యాక్ట్ చేసాను. రేపు ఈవెనింగ్ ట్రైన్ ఉంది. ఊరికి వెళ్లిపోతా. సోమవారం నుంచి మళ్లీ జాబ్‌కి లాగిన్ అవ్వాలి సార్," అని అన్నాను.
సత్యాన్నే చెప్పాను…
కానీ నేను చెప్పిన ప్రతిదీ — ఒక అమ్మాయి లా చెప్పాను.
ఎక్కడా "నాకు ఓ గందరగోళం ఉంది," అన్నట్టు చెప్పలేదు.
కొంచెం కూడాసందేహం కలిగించలేదు.
అంతా విన్న డైరెక్టర్ సార్ కాసేపు నిశబ్దంగా ఉన్నారు.
డైరెక్టర్: "ఈరోజు షూటింగ్ లో మానిటర్ లో నీ ఫేస్ జూమ్ చేసి చూశాను.
ఒక అమ్మాయిలో కనిపించని ప్రత్యేకమైన కళ నీ ముఖంలో చూసాను.
అందుకే నిన్ను ఆఫీసుకు రమ్మని చెప్పాను."
నేను: "థాంక్యూ సార్…"
డైరెక్టర్:
"నేను ఎంతో మంది అందమైన అమ్మాయిలను చూశాను…
కానీ వాళ్ళెవర్లో కనిపించని ఒక ప్రత్యేకత నీ ముఖంలో చూసాను."
సౌమ్య (విస్మయంతో):
"ధన్యవాదాలు సార్…"
డైరెక్టర్:
"అందుకే… నా తదుపరి సినిమాలో నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను."
(నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు… నిజం చెప్పేసేద్దామా వద్దా అని మనసులో వాడివేడి ఆలోచనలు.)
సౌమ్య:
"సార్… నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు already జాబ్ ఉంది. ఫ్యామిలీ… responsibilities అన్నీ ఉన్నాయి."
డైరెక్టర్:
"పర్వాలేదు. షూటింగ్ అంటే పెద్దగా రోజులు కావు. కేవలం 15 రోజులు మాత్రమే.
జాబ్‌కి 15 నుండి 20 రోజుల sick leave వేయించుకుని వచ్చి, షూటింగ్ పూర్తి చేసి మళ్లీ వెళ్ళిపోవచ్చు."
సౌమ్య:
"అయినా నాకు acting అంతగా రాదు సార్…
ఇవాళ డైలాగ్ లేదు కదా అని , టైమ్ ఉందికదా అని ఓకే అన్నాను."
డైరెక్టర్:
"అవి నేను చూసుకుంటాను కదా…
అయినా షూటింగ్ వెంటనే కాదు. ఇప్పుడు జరుగుతున్న సినిమా ఆగస్ట్‌కి పూర్తవుతుంది.
ఆ తరువాతే నీ సినిమా మొదలవుతుంది. అంటే నీకు టైమ్ ఉంటుంది.
ఒక్క 15 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయి."
సౌమ్య :
"సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు."
డైరెక్టర్ (దృఢంగా):
"లేదు సౌమ్య… నా సినిమాలో నువ్వే ఉండాలి అని నేను ఫిక్స్ అయిపోయాను.
ఎంత ఖర్చయినా పర్వాలేదు… నీకు నేను ఫిక్స్ అయ్యాను.
ఈ పాత్రకు నువ్వే సరైనవు!"
(సరే, షూటింగ్ ఎప్పుడూ కాదంటున్నాడు… ఇప్పుడే నిజం చెప్పేసి అవసరం లేదు.
వీటన్నిటికీ ఓసారి ఆలోచించి చెప్తే మంచిదే… ఇంటికెళ్లాక కాల్స్‌కి లిఫ్ట్ ఇవ్వకపోతే సరిపోతుంది కదా అన్నట్టు నాలో నేను ఉద్దేశించాను.)
సౌమ్య:
"సరే సార్… నేను కాస్త ఆలోచించి, ఆఫీస్‌లో లీవ్‌కు అప్లై చేసి, ఎప్పుడు రావచ్చో చెప్తాను."
డైరెక్టర్:
"బాగుంది… బాగా ఆలోచించు.
ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ రావు.
నువ్వు ఓకే అయితే… పెద్ద హీరోయిన్ అవుతావ్!"
(నాలో నాకే నవ్వొస్తోంది… “నాకు బాడీనే లేదు, ఇంకా నేను అమ్మాయిని కూడా కాదు… ఈ సినిమా చేస్తేనే ఎలా హీరోయిన్ అవుతాను?” అని నా మనసులో నవ్వుకున్నాను.)
సౌమ్య:
"సరే సార్… ఇక నేను వెళ్తాను."
అంటూ లేచి వెనక్కి తిరిగి నడుస్తున్నా…
ఆ సమయంలో వెనుకనుండి చూసిన డైరెక్టర్ ఒక్క మాట వేశాడు—
"పర్వాలేదు… నువ్వు అబ్బాయికంటే… అమ్మాయిగానే చాలా బాగున్నావ్!"
ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్టైంది.
అయో… నిజం తెలిసిపోయిందా?!
షాక్‌తో, టెన్షన్‌తో డైరెక్టర్ వైపు తిరిగి,
"సార్… అది…" అంటూ ఏదో చెప్పబోయాను…
డైరెక్టర్ నన్ను చూసి:
"నాకు తెలుసు… నువ్వు అబ్బాయివి… కానీ అమ్మాయిలా వేషం వేసావని."
నాకొంచెం గమ్మత్తుగా:
"సార్… మీకిది ఎలా తెలుసింది?" అని అడిగాను.
డైరెక్టర్ చిరునవ్వుతో:
"పొద్దున్నే షూటింగ్ లోనే అర్థమైంది.
నువ్వు ఎంతవరకూ మేనేజ్ చేస్తావో చూద్దాం అనిపించింది.
అందుకే నిన్ను ఆఫీసుకి రమ్మన్నాను.
కానీ నువ్వు మాత్రం ఆశ్చర్యంగా చాలా బాగా మేనేజ్ చేసావు."
ఆ మాట వినగానే నాకు లోపల ఏదో బరువు పడినట్టే అనిపించింది. అవమానంగా తలదించుకున్నాను.
డైరెక్టర్ నన్ను చూసి:
"నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ పని చాలా అద్భుతంగా చేశావు," అన్నాడు.
"అంటే సార్… ఇది అంతా నన్ను టెస్ట్ చెయ్యడానికేనా? ఈ మూవీ ఛాన్స్ నిజమేనా?" అని అమాయకంగా అడిగాను.
డైరెక్టర్ నవ్వుతూ:
"ఆ మాటకు నవ్వే ఎందుకు రాదు? సినిమా ఛాన్స్ నిజమే!
నీ లుక్, నీ ఎక్స్‌ప్రెషన్ చూసాక నాకు ఆ పాత్రకి నువ్వే కరెక్ట్ అనిపించింది."
"ఏంటి ఆ పాత్ర సార్?" అని అడిగాను.
ఆ తరువాత డైరెక్టర్ నన్ను జాగ్రత్తగా కూర్చోమని చెప్పి కథ వివరించసాగాడు…
కథ సారాంశం:
ఒక అబ్బాయి చిన్నప్పటినుంచి అమ్మాయిలా ప్రవర్తిస్తూ ఉండడం. ఇంట్లో వారు అంగీకరించక, బయటకి పంపడం. అక్కడ అల్లరి పనులు చేస్తూ, కాస్త సంపాదన వచ్చినాక తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని, కొత్త ప్రదేశానికి వలస వెళ్లి అమ్మాయిగా గౌరవంగా జీవించడం. తన గతాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచడం.
ఈ సమయంలో —
హీరో తండ్రి ఒక డేంజరస్ విలన్. అతను ట్రాన్స్‌జెండర్లను ట్రాప్ చేసి, వారిని చంపి వారి శరీర భాగాలతో వ్యాపారం చేస్తూ ఉంటుంది. కొంతమంది అందంగా కనిపించే ట్రాన్స్‌జెండర్లను దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తుంటాడు.
నా పాత్ర:
హీరోయిన్‌కి బెస్ట్ ఫ్రెండ్. ట్రాన్స్‌జెండర్ అనే విషయం హీరోయిన్‌కి తెలుసు, కానీ ఆమె ఎప్పుడూ నన్ను నిజమైన అమ్మాయిగా గౌరవంతో చూస్తుంది. ఇద్దరం ఒకే ఫ్లాట్‌లో ఉంటాం.
ఒకరోజు, అపరిశ్రాంతంగా ఆమె నా గురించి హీరోకి చెబుతుంది. అదే విషయం హీరో తండ్రికి తెలియడంతో అతను తన బ్యాచ్‌తో నన్ను ట్రాప్ చేయించేందుకు సిద్ధమవుతాడు.
కానీ నా పాత్ర ఆ అబ్బాయిని నిజంగా ప్రేమించడం మొదలుపెడుతుంది.
తర్వాత నన్ను చంపడానికి సిద్ధం అవుతారు.
ఆ సమయంలో హీరో, హీరోయిన్ కలిసి నాకు సహాయం చేయడానికి వస్తారు.
తుదకు హీరో తండ్రే అసలు విలన్ అని తెలుస్తుంది.
వారిని ఓడించి, నన్ను మాత్రమే కాదు — చాలా మంది ట్రాన్స్‌జెండర్లను రక్షిస్తారు.
డైరెక్టర్ చివరికి:
"ఈ కథలో నువ్వు హీరోయిన్ కాదేమో… కానీ కథంతా నీ చుట్టూనే తిరుగుతుంది.
ఈ పాత్రకి నువ్వే పర్ఫెక్ట్!" అని అన్నారు.
అంతా విని,
"సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి," అని చెప్పి అక్కడి నుంచి బయటకి వచ్చాను.
________________________________________
ప్రియ ఇంటికి వెళ్లాక:
జరిగిందంతా ప్రియకి చెప్పాను.
ఆమె కూడా ఒప్పుకోమని చెపింది —
"ఇలాంటిది మళ్లీ మళ్లీ రాదు సౌమ్యా," అని అంది.
"నాకు కాస్త టైం కావాలి," అన్నాను.
"ఆలోచించుకో… కానీ ఇది గొప్ప ఛాన్స్. వదిలేయకు!" అని బలంగా చెప్పింది.
అక్కడినుంచి నేను నా హోటల్‌కి వెళ్లి పడుకున్నాను.
రాత్రి నిద్ర కూడా రాలేదు…
తర్వాత రోజు ఉదయం:
లేస్తూనే మళ్లీ బాగాగా తయారైపోయి…
కానీ సౌమ్యలా కాదు… మళ్లీ మళ్లీ నా పాత రూపంలోకి,
అబ్బాయిగా మారిపోయాను.
ట్రైన్ ఎక్కి, నా ఊరు తిరిగొచ్చాను.
అన్నీ మామూలుగానే ఉన్నట్టు అనిపించాలి అనుకున్నాను…
కానీ రోజూ ప్రియా, డైరెక్టర్ సార్ మెస్‌జ్ చేస్తున్నారు…
"ఏం డిసైడ్ అయ్యావ్?"
ఆ మేసేజ్‌లను చూసినా… నన్ను వెనక్కి లాగే ధైర్యం నాకు రాలేదు.
అదే సమయం, నేనొక నిర్ణయం తీసుకున్నాను.
"ఇంకెప్పుడూ సినిమా చేయను!"
డైరెక్టర్ సార్‌కు కాల్ చేసాను…
ఫోన్‌లో సంభాషణ
డైరెక్టర్:
"గుడ్ మార్నింగ్ సౌమ్యా."
సౌమ్య:
"గుడ్ మార్నింగ్ సార్."
డైరెక్టర్:
"చెప్పు సౌమ్యా… ఏం డిసైడ్ అయ్యావ్?"
సౌమ్య:
"సార్… మీరు చెప్పిన పాత్ర నేను చేయలేను సార్."
డైరెక్టర్ (ఆశ్చర్యంగా):
"ఎందుకు సౌమ్యా? ఏం జరిగిందీ?"
సౌమ్య:
"ఏం కాకపోయినా సరే సార్…
నేను ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తే… మువీ బాగుంటుంది కావచ్చు.
కానీ… నా కెరీర్‌కి ఊహించని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది సార్.
సొసైటీ నన్ను తక్కువగానే చూస్తుంది.
సినిమాలో పేరు రావచ్చు, కానీ బంధువుల దృష్టిలో నేను ఏదో తేడాగా మారిపోతాను…
నా తల్లిదండ్రులకు చిన్నదనంగా అనిపిస్తుంది."
డైరెక్టర్ (నిదానంగా):
"అలా ఏం జరగదు సౌమ్యా…"
సౌమ్య:
"జబర్దస్త్ లో లేడీ గెటప్స్ situation ఎలాగో అందరికి తెలుసు సార్…
ఇప్పటి నుంచే దాన్ని వినోదంగా చూసే సమాజం… నాకు గౌరవాన్ని ఇస్తుందా సార్?
అందుకే… నన్ను మాఫ్ చేయండి. ఈ పాత్ర నేను చేయలేను."
డైరెక్టర్ (నిశ్శబ్దంగా, ఆలోచిస్తూ):
"హుమ్… ఇదే కదా నీ అసలు సమస్య…"
సౌమ్య:
"అవును సార్."
డైరెక్టర్ (ఒక ఉత్సాహంతో):
"అయితే… నువ్వు అబ్బాయిగా వచ్చి ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తే కదా సమాజానికి అంత ఆలోచన ఉండదు?"
సౌమ్య:
"అవును సార్."
డైరెక్టర్:
"అయితే, నువ్వు అబ్బాయిగా కాదు… అమ్మాయిగా వచ్చి నటించు.
అప్పుడు ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రను ఓ అమ్మాయి చేస్తుందనీ అందరూ అనుకుంటారు."
సౌమ్య (గుండెల్లో ఒక గందరగోళం):
"అది ఎలా సాధ్యం సార్?"
డైరెక్టర్:
"నువ్వు అబ్బాయివి అన్న విషయం నాకూ, మా ప్రొడ్యూసర్‌కే తెలుస్తుంది.
బాకీ అందరూ నిన్ను నిజమైన అమ్మాయిగా అనుకుంటారు.
నిన్ను అమ్మాయిగా ప్రిపేర్ చేయడం నా బాధ్యత."
సౌమ్య:
"సరే సార్… అలాగైతే… షూటింగ్ ఎప్పుడంటే?"
డైరెక్టర్:
"ఇంకో నెలలో, రెండో తారీఖున స్టార్ట్ అవుతుంది.
కానీ నువ్వు ఆపటికే పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారి ఉండాలి కాబట్టి,
ఈ నెల 15న హైదరాబాదుకి వచ్చేయి.
నిన్నుఅమ్మాయిగా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి కదా."
సౌమ్య:
"సరే సార్…"
అంటూ ఫోన్ కట్ చేసేశాను.
అంతే… ఇంట్లో అందరికీ “ఆఫీస్ పనిమీద విదేశానికి వెళ్తున్నా” అని చెబుతూ,
నా బట్టలు ప్యాక్ చేసుకుని హైదరాబాదు బయలుదేరాను.
హైదరాబాదు చేరాక డైరెక్టర్ సార్‌కి ఫోన్ చేశాను.
అప్పుడు ఆయన:
"సరే, నిన్ను పికప్ చేయడానికి ఒకరిని పంపిస్తున్నాను."
అని చెప్పి కాల్ కట్ చేసేశారు.
ఒక పది నిమిషాల లోపు…
ఓ కారు ఆగింది…
దాన్లోనుంచి బయటకి వొచింది – ప్రియా!
ప్రియాను చూసి నేను షాక్ అయిపోయాను.
"ఏంటి నువ్వా!? ఇక్కడ?" అని ఆశ్చర్యంతో అడిగాను.
ఆమె మాత్రం చిరునవ్వుతో:
"అవన్నీ తర్వాత చెప్తా…
రా వేయ్ సౌమ్యా! ఇక నీ ప్రయాణం మొదలైంది!"
అంటూ నన్ను డైరెక్టర్ సార్ గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లింది.
వెళ్లి స్నానం చేసి బయటకి వచ్చాను…
ప్రియా చెబుతుంది:
"రెడీ అవు సౌమ్యా…
ఇప్పటి నుంచి నిన్ను నిజంగా సౌమ్యగానే మార్చాలి.
చాలా పనులున్నాయి!"
అప్పుడు నాకు అసలు విషయం తెలియలేదు…
ఈ పాత్ర ఒప్పుకున్నదే ఒక పెద్ద తప్పు అయ్యింది అని.
కానీ అదే తప్పు… నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనీ కూడా
అప్పుడు నాకు అర్థం కాలేదు.
Part 3
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
2080 Views
4 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (4)
Wow, great start Soumya sweety. Next part when???? 💓
thank you sis. next week i upload next part
good start soumya
thank you