Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 1 of 14 | 0 Likes

Part 1

నందు, ఆనంది ఇద్దరూ ఒకేసారి, ఒకేరోజు కాగ్నిజెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గా చేరారు. నందు కొద్దిగా రఫ్ ఇన్ బిహేవియర్ సాఫ్ట్ ఇన్ లుక్స్. భుజాల వరకు జుట్టు. కొంత జుట్టు మొహం మీద పడుతూంటే ఆ జుట్టు సందు లోంచి చూస్తూ మాట్లాడుతాడు. అయిదడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు ఉంటాడు. వాయిస్ టీనేజ్ వాయిస్ లా ఉంటుంది. కానీ హైలీ కన్విన్సింగ్ ఇన్ కమ్యూనికేషన్. ఎవ్వరినీ లక్ష్యపెట్టని చూపులు. ఎవరైనా రెచ్చగొడితే అనుకున్న పనిచేసేదాకా నిద్రపోడు. అన్నింటా గెలుపు తనదే కావాలి అనుకునే ఆధిపత్యపుధోరణి.
ఆనంది అతనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. చాలా మెత్తగా మాట్లాడుతుంది. ఎలాంటి వాళ్ళనైనా ఎక్కువ మాట్లాడకుండా బుట్టలో పడేసుకుంటుంది. వాళ్ళ చేత అవసరమైన పనులు చేయిస్తుంది.
ఇద్దరూ ఇంటికోసం వెతుకుతుంటే వాళ్ళ సీనియర్ మేనేజర్ చెప్పాడు. ఫ్రెండ్స్, కొండాపూర్ లో నా అపార్ట్మెంట్ ఉంది. అయితే ఇద్దరూ కలిసి ఉంటే రెంట్ కలిసొస్తుంది. లేకపోతే ఇద్దరికీ చెరో అపార్ట్మెంట్ చూడాలంటే కొంచెం టైం పడుతుంది. అన్నాడు. ఇద్దరూ కొంచెం ఆలోచించి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండటానికి తమ అంగీకారాన్ని తెలిపారు.
అలా వాళ్ళిద్దరూ కలిసి కొండాపూర్ లో అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. So both are living together. But not in relationship.
కొద్ది రోజుల్లోనే నందుని ఆనంది తన మాటవినేలా చేసుకుంది. ఆరునెలలు బాగానే ఉన్నారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు కూడా. ఈ ఆరు నెలల్లో వాళ్ళ కొలీగ్స్ అందరూ నందు గురించి బాగా అర్థం చేసుకున్నారు. అయితే కొరకరాని కొయ్య లాంటి నందుని ఆనంది ఎలా లొంగదీసుకుందో ఎవరికీ అర్థం కాలేదు. అపార్ట్మెంట్ లో బజార్ నుంచి ప్రొవిజన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ నందు తెస్తాడు. ఇంటి మెయిన్టెనన్స్, కిచెన్ ఆనంది చూస్తుంది.
ఆనంది వంట చాలా బాగా చేస్తుంది. కానీ నందు ఎప్పుడూ తినేసి వెళిపోతాడు కానీ ఒక్క పొగడ్త కూడా ఉండదు. అందుకని ఆనంది నందుని సాధిస్తూ ఉంటుంది. "బాగా మెక్కి వెళ్ళడం కాదు. ఇక్కడ మేం ఎలావండామో? చూడాలి." అంది.
"ఆనంది, తిండి లో పొగడటానికి ఏముంది?: ఎవరైనా చెయ్యొచ్చు. అయితే అది ఆడపని కాబట్టి నీకు వదిలేసాను." అన్నాడు.
"నందు, ఆడ పని. మొగ పని అంటూ తేడా చూపిస్తే నిన్ను చంపుతా." అంది.‌ "అనటానికి ఏముంది? ఆడపని ఆడపనే" అన్నాడు. "అవునులే. మెక్కడం, ఎక్కడం మగపని. వండటం ., ఇల్లు నీట్ గా ఉంచటం ఆడపని. ఆడపని ఆడపని అంటావు. ఆడవాళ్ళ కష్టాలు నీకేం తెలుసు?" అంది. "అందులో కష్టం ఏముంది. ఒక చీరో డ్రస్సో కట్టుకుని బరువులన్నీ తిప్పుకుంటూ తిరగడమే కదా... మీరు చేసేది. అది నేనూ చెయ్యగలను"... "ఓర్ని! ఒక ఆరు నెలలు ఆడదానిగా ఉండు. నీకు తేడా తెలుస్తుంది." అంది. ఇద్దరికీ మాట, మాట పెరిగి ఒక ఆరునెలలు మహిళగా ఉండటానికి సిద్ధపడ్డాడు నందు. (సంతోషం)

3393 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login