Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 3 of 14 | 0 Likes

Part 3

నందిని!, నీకు ఏ డ్రెస్సులు ఇష్టమో చెబుతే ఆ డ్రస్ లు కొందాం. అంది. ఆనంది.
ఆనంది! చిన్న డౌట్. నన్ను నువ్వు నందు అనకుండా చాలా స్ట్రేంజ్ గా నందిని అని పిలుస్తున్నావు?
ఔను బేబీ! ఈ ఆరు నెలలు నిన్ను feminine పేరు తో నందిని అనే పిలుస్తాను. అంతేకాదు. pronouns also feminine only. అంది. నందిని కి మనస్సు చిన్న ఆనందం తో కూడిన జలదరింపుతో ఝల్లు మంది. ఇద్దరూ గచ్చిబౌలీ లో ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కి వెళ్లారు. అక్కడ రకరకాల డ్రెస్సులు, నైటీలు, జ్యుయలరీ, అదర్ accessaries, అలాగే కావాల్సిన లింగరీ అన్నీ ట్రైల్ రూమ్లో కి ఇద్దరూ వెళ్ళి టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు. నందిని ఆనందిని అడిగింది. ట్రైల్ రూమ్ లోకి నువ్వెలా వస్తావు? అని. . డోంట్ వర్రీ బేబీ. నౌ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ ఫెదర్. అంది ఆనంది. తరువాత మెడికల్ షాప్ దగ్గర ఇద్దరూ ఆగారు. ఆనంది ఏవో మెడిసిన్స్ తీసుకుంది. ఇద్దరూ అపార్ట్మెంట్ కి చేరు కున్నారు. అపార్ట్ మెంట్ కి చేరుకున్నాకా నందిని నైటీ లోకి మారింది. ఏదో తెలియని హాయి. ఇంతలోనే వేర్ ఇస్ ద మెల్ ఇన్ మి? అని ఒక సందేహం. రేపు తెల్లవారేకా ఎలా? అని ఆలోచిస్తూ ముందు నెట్ లో చూస్తూ హెయిర్ కేర్ కు చెందిన కొన్ని ముళ్ళు, కొన్ని కొప్పులు గురించి study చేసింది. రాత్రి చాలా సేపటి వరకూ ఇదే యావ. కొత్తగా సమర్తాడిన పిల్లకి మగాళ్లని చూడగానే కడుపెప్పుడొస్తుందా? అని ఆరాటం ట. అలాగా ఈ రోజునుంచే నీలోని స్త్రీ గురించి ఇంత అన్వేషణ మొదలైందే బేబీ. పడుక్కో అమ్మా. అంటూ ఆట పట్టించటం మొదలెట్టింది ఆనంది. మామూలుగా అయితే నందు తనని ఎవరైనా అలా నియంత్రిస్తే చర్రున పైకి లేచేవాడు. కాని ఇప్పుడు తాను నందిని. ఈ ఆరు నెలలు ఆనందితో తన పోటీలో ఆనంది యే తనకు గురువు. కనుక కొప్పడకూడదు. అనుకుంటూ నెమ్మదిగా పడుకుంది. ఎప్పుడూ ఉదయం ఏడైతే కాని లేవని నందు ఇప్పుడు నందిని గా ఆనంది హెచ్చరికతో తెల్లవారుజామున అయిదింటికే లేచి కాఫీ పెట్టటం తో దిన చర్య ప్రారంభించింది.
కాఫీ అయితే పెట్టింది కానీ నాస్తా కి ఏంచేయాలి? అనే ప్రశ్న. అప్పుడు ఆనంది స్టైల్ గా నందు లుంగీ కట్టుకుని బ్రష్ చేసుకుంటూ చూడు డార్లింగ్, ఫ్రిజ్ లో బాటర్ ఉంది. ముందు ఇడ్లీలు పెట్టు ఈ పూటకి. ఆ తరువాత నువ్వు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. నీ వంటిపై హెయిర్ రిమూవర్ క్రీమ్ తో హెయిర్ లేకుండా క్లీన్ చేసుకో. తరువాత వంటికి చక్కగా పసుపు, చందనం పట్టించు. ఇది అంతా అయ్యే సరికి ఒక గంట పడుతుంది. మనకి ఆఫీస్ కు వెళ్ళటానికి టైమ్ తక్కువ అవుతుంది. కనుక ఈ ఒక్క పూటకి లంచ్ మన ఆఫీస్ లో చేసేద్దాం.. అంది. నందిని కి చాలా రిలీఫ్ గా ఉంది. వెంటనే ఆనంది చెప్పినట్లు నందిని తయారయ్యింది. ఆ తరువాత ఆనంది హెల్ప్ తో వైట్ కలర్ ఫ్లవరీ చుడీ దార్ వేసుకుంది. లోపల నిన్న కొన్న ఫ్లవరీ పాంటీ కట్టుకుని, బ్రెస్ట్ ఫార్మ్స్ పెట్టుకుని బ్రా వేసుకుంది. అప్పుడే విచ్చుకున్న తెల్ల తామర పువ్వులగా ఉంది నందిని. ఆ హాయి ఇంత అని చెప్పటానికి వీలు లేనంత.గా ఉంది. అమాంతం ఆనందిని వాటేసుకుంది. థాంక్స్ చెప్పటానికి. హా హా అమ్మాయి గారు జోరు తగ్గించాలి. ముందుంది ముదుసళ్ళ పండుగ. అంది. అవును కదూ. ఇప్పుడు తను ఆఫీస్ కు వెడుతోంది. కాదు. వెడుతున్నాడు. కాదు వేడుతోంది. ఎలాగ. అంటూ చాలా సంభ్రమానికి లోనైంది. సింపుల్ మేకప్ తో, చేతిలో నిన్న కొన్న వానిటీ బాగ్ పట్టుకుని, ఫ్లాట్ చెప్పులు తొడుక్కుని బుద్ధిగా ఆనంది తో నడిచింది నందిని. గుండెలు గుబ గుబ లాడుతున్నాయి. సెక్యూరిటీ గార్డ్ అపుతాడేమో? ఏం చెప్పాలో అనుకుంటూ కదిలింది నందిని. మెడలో తన ఐడి కార్డ్ వేసుకుంది. చేతికి నిన్న కొన్న Casio Enticer Analog White Dial Women's Watch పెట్టుకుంది. మాటిమాటికీ టైమ్ చూసుకుంటూ నడుస్తోంది. ఆఫీస్ దగ్గర పడిన కొద్ది నందినిలో టెన్షన్ పెరుగుతోంది. (సశేషం)

3382 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login