BODY SWAP WITH NEIGHBOR – PART 3 అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య శ్రీ. పార్ట్-2 లో సుశాంత్ ఒక చిన్న అబద్ధంతో ఆ రాత్రికి శోభనాన్ని ఎలా ఆపగలిగాడో చూశారు కదా! కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఒక పరాయి స్త్రీ శరీరంలో బందీ అయిన సుశాంత్ ఆ గృహిణి జీవితంలోని అసలైన నరకాన్ని, బాధ్యతల భారాన్ని రుచి చూడబోతున్నాడు. అసలు శ్రావ్య గతం ఏంటి? ఆమె అత్తగారి అసలు స్వరూపం ఎలాంటిది? ఈ సుదీర్ఘమైన పార్ట్-3 లో చూద్దాం. ఆ రాత్రికి నెలసరి అనే అబద్ధంతో విక్రమ్ నుండి నన్ను నేను తాత్కాలికంగా కాపాడుకున్నాను కానీ, నా గుండెల్లో భయం మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ గదిలో మంచం మీద ఒక మూలన ముడుచుకుని కూర్చుండిపోయాను. పక్కనే విక్రమ్ నిద్రపోతున్నాడు. ఒక అబ్బాయిగా ఎప్పుడూ ఒంటరిగా, స్వేచ్ఛగా బతికిన నేను... ఈరోజు ఒక పరాయి మగవాడి పక్కన, ఒక అమ్మాయి శరీరంలో ఇలా భయపడుతూ కూర్చోవాల్సి వస్తుందని కలైనా ఊహించలేదు. తెллаవారేసరికి నిద్రలేని కళ్లతో, శ్రావ్య జీవితం గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాను. అసలు నన్ను ఎందుకు ఇలా మార్చింది? నన్ను ఈ బంధాల వలయంలో ఎందుకు ఇరికించింది? ఇంతలో తెల్లవారుజామున ఐదు గంటలకే మా అత్తయ్య గట్టిగా, కర్కశంగా బెడ్‌రూమ్ తలుపు తట్టింది. ఆ అరుపులకి నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆ దరువులకి విక్రమ్ కూడా నిద్ర లేచాడు. నేను కంగారుగా, వణుకుతున్న చేతులతో వెళ్లి తలుపు తీశాను. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల నా కళ్లు ఎర్రబడి ఉన్నాయి, జుట్టు చిందరవందరగా ఉంది. నన్ను ఆ స్థితిలో చూడగానే అత్తయ్య ముఖంలో ఒక వింతైన కోర నవ్వు కనిపించింది. మూతి ముడుచుకుని, ముసిముసిగా నవ్వుకుంది. రాత్రి మా మధ్య శోభనం జరిగిపోయింది అనుకుని, తను అనుకున్నది సాధించాననే తృప్తితో ఆమె అలా నవ్విందని నాకు అర్థమైంది. కానీ ఆ నవ్వు ఒక్క క్షణంలోనే మాయమైంది. వెంటనే నాపై అరవడం మొదలుపెట్టింది. "ఏమే శ్రావ్య! మొగుడు లేవడానికి ముందే పెళ్లాం నిద్ర లేవాలి, ఇల్లంతా ఊడ్చి, స్నానం చేసి ఇంట్లో అందరికీ కాఫీ ఇవ్వాలని నీ కన్నవాళ్లు నేర్పించలేదా? ఇంకా అలా దయ్యంలా జుట్టు వదిలేసుకుని నిలబడ్డావేంటి? వెళ్లి వెంటనే రెడీ అయ్యి అందరికీ వేడి వేడిగా కాఫీ పట్టుకురా!" అంటూ ఇల్లంతా ప్రతిధ్వనించేలా అరిచింది. నాకు ఒక్కసారిగా ఒళ్లు మండింది. నేనొక మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్న అబ్బాయిని, నన్ను ఇలా ఒక పనిమనిషిలా అరుస్తూ మాట్లాడుతోందేంటి అనిపించింది. కోపంతో ఎదురు మాట్లాడదామని నోరు తెరిచాను, కానీ ప్రస్తుతం నేను శ్రావ్య శరీరంలో ఉన్నాను, ఏమాత్రం తేడా వచ్చినా నా పరిస్థితి ఘోరంగా మారుతుందని గుర్తించి మనసులోనే ఆ కోపాన్ని దిగమింగుకున్నాను. ఏమీ చేయలేక భయంతో వంటగది వైపు అడుగులు వేశాను. ఒంటిపై ఉన్న పట్టుచీర చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే, కనీసం కాస్త ఫ్రీగా ఉండే చుడీదార్ వేసుకుందామని కప్‌బోర్డ్ నుండి ఒక డ్రెస్ తీసి బెడ్‌పై పెట్టానో లేదో... మళ్ళీ వెనుక నుండి అత్తయ్య అరుపు వినబడింది. ఆమె నా గదిలోకి వస్తూ, నా చేతిలోని డ్రెస్ లాక్కుని విసిరేసింది. "పెళ్లైన ఆడపిల్ల నిండుగా, సంప్రదాయంగా చీర కట్టుకోవాలి. తల నిండా మల్లెపూలు పెట్టుకుని, నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని భర్తకు, అత్తమామలకు సేవ చేయాలి. అదే మా ఇంటి ఆచారం! ఈ ఫ్యాషన్ దుస్తులు, చుడీదార్లు మా ఇంట్లో సాగవు. మర్యాదగా చీర కట్టుకుని బయటకు రా" అని కసురుకుంది. నిన్న అపార్ట్‌మెంట్‌కి వచ్చినప్పుడు నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన అత్తయ్యేనా ఈమె? ఇవాళ చూస్తున్న అత్తయ్యకు ఎంత తేడా! "సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చీర కట్టుకుంటాను" అని వణుకుతున్న స్వరంతో చెప్పాను కానీ, లోపల నా ప్రాణాలు పోయినంత పనైంది. ఒక అబ్బాయిగా నాకు చీర కట్టడం ఎలా తెలుస్తుంది? ఐదు మీటర్ల గుడ్డను ఒంటికి ఎలా చుట్టుకోవాలో తెలియక అద్దం ముందు నిలబడి కంగారుపడ్డాను. కానీ విచిత్రంగా, నా చేతులు నా ప్రమేయం లేకుండానే కుచ్చిళ్లు పెట్టడం, కొంగు సర్దడం మొదలుపెట్టాయి. శ్రావ్య శరీరానికి ఉన్న అలవాటు (Body Memory) వల్ల అచ్చం ఆమె ఎలా కట్టుకుంటుందో అలానే పర్ఫెక్ట్‌గా చీర కట్టేసుకున్నాను. ఆ తర్వాత జడ కూడా వేసుకున్నాను. కానీ ఆ పొడవాటి బరువైన జడను నడుముపై మెయింటైన్ చేయడం, అది అటు ఇటు కదులుతుంటే వచ్చే వింత అనుభూతిని భరించడం ఎంత కష్టమో నాకు అప్పుడే తెలిసింది. నేను కాఫీ డికాషన్ పెట్టి హాల్‌లోకి రాగానే అత్తయ్య సోఫాలో కూర్చుని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించింది. "ఒసేయ్ శ్రావ్య! కాఫీ ఇంకా అవ్వలేదా? టిఫిన్ ఏం చేస్తున్నావ్? ఎన్ని గంటలకి పెడతావ్? వంటా వార్పూ ఇలానే ఆలస్యంగా చేస్తే నా కొడుకు ఆఫీస్ కి ఎలా వెళ్తాడు?" అంటూ గయ్యాళిలా మాట్లాడుతుంటే నా తల పగిలిపోయేలా అనిపించింది. వెంటనే "వస్తున్నాను అత్తయ్య, కాఫీ ఇప్పుడే తెస్తున్నాను" అంటూ కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వెళ్లాను. మొదట అత్తయ్యకు ఇచ్చి, ఆ తర్వాత మామయ్యకు ఇచ్చాను. కానీ ఆమె నన్ను మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. "చూశారా అండీ, మీ కోడలి వరస! ఉదయాన్నే నిద్ర లేవగానే పెద్దవాళ్లు కనిపిస్తే కాళ్ల మీద పడి నమస్కారం చేయాలనే కనీస సంస్కారం, మర్యాద కూడా ఈమెకు లేవు" అంది. ఒక అబ్బాయిగా ఎప్పుడూ ఎవరి కాళ్ల మీద పడని నేను, ఈ గయ్యాళి అత్తగారి కాళ్ల మీద పడాలా అనిపించింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కాళ్లపై పడ్డాను. నా కళ్లలో నుండి తెలియకుండానే అవమానంతో, బాధతో కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఒక స్త్రీ పెళ్లయ్యాక పరాయి ఇంట్లో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో నాకు ఆ క్షణంలో అర్థమైంది. "ఏడ్చింది చాలు, పొద్దుపొద్దున్నే ఆ ఏడుపు ముఖం ఒకటి! వెళ్లి మొహం కడుక్కుని విక్రమ్‌కి కాఫీ ఇవ్వు" అంది అత్తయ్య. నేను కాఫీ కప్పు తీసుకుని విక్రమ్ రూమ్‌లోకి వెళ్లాను. విక్రమ్ బెడ్‌పై కూర్చుని పేపర్ చదువుతున్నాడు. "కాఫీ తీసుకోండి" అని అడిగాను. అతను నా వైపు ఒక వింత చూపు చూస్తూ, "అక్కడ టేబుల్ మీద పెట్టు" అన్నాడు. నేను కాఫీ టేబుల్ మీద పెట్టేసి వెనక్కి తిరగబోతుండగా, విక్రమ్ ఒక్కసారిగా నా చెయ్యి పట్టి గట్టిగా లాగాడు. నేను ఊహించని ఈ దాడికి అతని రొమ్ముపై పడ్డాను. వెంటనే నన్ను బెడ్ పైకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. నాకు లోపల అసహ్యంగా, భయంగా అనిపించి... వద్దు విక్రమ్, వద్దు అని చెప్తున్నా అతను వినలేదు. "ఏమైంది శ్రావ్య, రాత్రంతా దూరం పెట్టావు, ఇప్పుడైనా కాస్త ప్రేమగా ఉండు" అంటూ నాపై బలాన్ని ప్రయోగించబోయాడు. ఇంతలో అదృష్టవశాత్తూ మా మామయ్య గారు హాల్ నుండి రూమ్ వైపు రావడం చూసి, ఆ అలికిడికి విక్రమ్ నన్ను వదిలేశాడు. నేను కంగారుగా నా చీర కొంగు సర్దుకుని బయటకు వచ్చాను. మామయ్య గారు నన్ను చూసి చాలా ఆప్యాయంగా—"అమ్మా శ్రావ్యా, ఏమైనా ఇబ్బందిగా ఉందా తల్లి? ఆరోగ్యం జాగ్రత్త" అని అడిగారు. ఆయన్ను చూస్తే నాకు ఒక తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. ఆ తర్వాత అత్తయ్య వంటగది వైపు చూస్తూ, "ఇవాళ టిఫిన్ కి ఇడ్లీ, చట్నీ చేయమ్మా. అలాగే మసాలా కూడా గట్టిగా నూరు" అని ఆర్డర్ వేసింది. నేను వంటగదిలోకి వెళ్లి ఒంటరిగా నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాను. "అసలు శ్రావ్యకు, ఈ అత్తయ్యకు మధ్య ఏం గొడవలు ఉన్నాయి? నన్ను ఎందుకు ఈ నరకంలోకి నెట్టింది?" అని. నేను నా జీవితంలో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో రూమ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ వంట చేయలేదు. అసలు స్టవ్ ఎలా వెలిగించాలో కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ విచిత్రంగా, వంటగదిలోకి వెళ్ళగానే శ్రావ్య బాడీ మెమరీ వల్ల నా చేతులు ఇడ్లీ పాత్రను తీయడం, చట్నీకి తిరగమోత వేయడం ఒక ప్రొఫెషనల్ కుక్ లాగా గబగబా చేసేసాయి. శరీరం శ్రావ్యది కావడం వల్ల ఆమె నైపుణ్యాలన్నీ నా శరీరంలో ప్రవహిస్తున్నాయి. ఇంతలో హాల్ లో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే మా ఫ్లాట్ లోకి సుశాంత్ వచ్చాడు... అంటే నా శరీరంలో ఉన్న శ్రావ్య! ఆమెను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. కానీ హాల్ లో ఉన్న అత్తయ్య సుశాంత్ (శ్రావ్య) ని చూడగానే తన గయ్యాళి గొంతును ఒక్కసారిగా మార్చేసింది. చాలా నెమ్మదిగా, మర్యాద నటిస్తూ—"అయ్యో సుశాంత్ బాబు, రండి కూర్చోండి. అమ్మా శ్రావ్యా... సుశాంత్ కూడా వచ్చాడు కదా, తనకి కూడా కలిపి టిఫిన్ ప్లేట్ లో పెట్టు" అంది. అత్తయ్య బయట ఒకలా, లోపల ఒకలా ప్రవర్తించే డబుల్ యాక్షన్ చూసి నాకు మతిపోయింది. మేమందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేశాం. నా శరీరంలో ఉన్న శ్రావ్య చాలా స్వేచ్ఛగా, హాయిగా టిఫిన్ తింటోంది. టిఫిన్ తినడం పూర్తయ్యాక, అత్తయ్య మళ్ళీ నా వైపు చూసి—"శ్రావ్య, అందరి ప్లేట్లు తీసుకెళ్లి సింక్‌లో వేసి, శుభ్రంగా కడిగేయ్" అని ఆర్డర్ వేసింది. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎంగిలి ప్లేట్లు కడుగుతుంటే, నా శరీరంలో ఉన్న శ్రావ్య వంటగది వైపు చూస్తూ, నా అవస్థలు గమనిస్తూ పెదవులపై ఒక చిన్న నవ్వుతో నన్ను చూసి మనసులోనే నవ్వుకుంటోంది. నా మగతనాన్ని, నా స్వేచ్ఛను తను అనుభవిస్తూ నన్ను ఇలా గిన్నెలు కడిగిస్తుండటం నాకు చాలా అవమానంగా అనిపించింది. ఆ తర్వాత విక్రమ్ ఆఫీస్ కి టైమ్ అవ్వడంతో బ్యాగ్ సర్దుకుని బయలుదేరాడు. అప్పుడు శ్రావ్య (నా రూపంలో ఉండి) సోఫాలో కూర్చుని నాకు కంటితో సైగ చేసింది. విక్రమ్ కి ఎదురు వెళ్ళమని ఆమె సైగ సారాంశం. నేను విక్రమ్‌కి ఎదురు వెళ్లాను. విక్రమ్ ఆఫీస్ కి వెళ్తూ అందరి ముందూ నా తలపై ముద్దు పెట్టాడు. అది చూసి నా శరీరంలో ఉన్న శ్రావ్యకు లోపల ఏదో తెలియని కోపం, అసూయ వచ్చాయి. బహుశా తన భర్త పరాయి వ్యక్తిని (తన శరీరాన్ని) అలా ముద్దు పెట్టుకోవడం ఆమె భరించలేకపోయి ఉండొచ్చు, కానీ ఆమె దాన్ని బయటపడనీయకుండా కంట్రోల్ చేసుకుంది. అత్తమామలు పక్కనే ఉండటం వల్ల నేను ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళగానే అత్తయ్య సోఫాలో రెండు కాళ్లు చాపుకుని కూర్చుని, "అబ్బా... ఈ మోకాళ్ల నొప్పులు చంపేస్తున్నాయి. ఒసేయ్ శ్రావ్య, ఇటు వచ్చి నా కాళ్లు కొంచెం ఒత్తమ్మా" అంది. ఒక డాక్టర్ చదువుతున్న నేను ఈమె కాళ్లు నొక్కాలా అనిపించినా, పెద్ద ఆవిడ కదా అని సర్దుకుపోయి మోకాళ్లపై కూర్చుని కాళ్లు నొక్కడం మొదలుపెట్టాను. కొద్దిసేపటికి ఆమె నా వైపు చూసి—"మధ్యాహ్నానికి వేడి వేడిగా చికెన్ కర్రీ, రైస్ చేయమ్మా. నీ మామయ్యకు చికెన్ అంటే చాలా ఇష్టం" అంది. ఇదే అదనుగా భావించాను. చికెన్ తేవడానికి మార్కెట్ కి వెళ్తే సుశాంత్ (శ్రావ్య) కూడా తోడు వస్తుంది, అప్పుడు ఆమెతో ఒంటరిగా మాట్లాడొచ్చు, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు అని మనసులోనే ఒక ప్లాన్ వేశాను. "సరే అత్తయ్య, నేను మార్కెట్ కి వెళ్లి చికెన్ తీసుకువస్తాను" అని లేచాను. ఇంతలో మామయ్య గారు చాలా మంచివారు కాబట్టి లేచి—"పర్లేదు అమ్మా శ్రావ్యా, ఎండగా ఉంది కదా... నేను వెళ్లి తీసుకొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో" అన్నారు. కానీ నేను వెంటనే కంగారుగా—"పర్లేదు మామయ్య, నేను, ఎదురింటి సుశాంత్ కలిసి వెళ్లి తీసుకొస్తాము. తనకు కూడా మార్కెట్ వైపు ఏదో పని ఉందట" అని చెప్పాను. దానికి అత్తయ్య అడ్డు తగులుతూ కోపంగా—"నేను చెప్పింది కోడలికి, మీకు కాదు అండీ. తనే వెళ్లి తెస్తుంది. ఇంట్లో కూర్చుని కూర్చుని ఒళ్లు బరువెక్కిపోతోంది, కాస్త నడిస్తే తగ్గుతుంది" అంటూనే, "సరే, తోడుగా ఆ సుశాంత్‌ని కూడా తీసుకెళ్లు, ఒంటరిగా ఎందుకులే" అని ఒక రకంగా ఒప్పుకుంది. అలా నేను, నా శరీరంలో ఉన్న శ్రావ్య ఇద్దరం కలిసి అపార్ట్‌మెంట్ గేటు దాటి వీధిలోకి వచ్చాము. అప్పటివరకు అత్తగారి ఇంట్లో అనుభవించిన నరకం నుండి కాస్త ఉపశమనం దొరికినట్టు అనిపించింది. నా మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ, శ్రావ్య నన్ను ఈ స్థితిలోకి ఎందుకు నెట్టింది అనే ద్రోహానికి సమాధానం తెలుసుకోవాలనే ఆరాటం, ఆవేశం నాలో ఒక్కసారిగా పెరిగిపోయాయి... PART – 4 కోసం వేచి ఉండండి...
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (4)
Anvitha221 month, 3 weeks ago
Bagundi story continue chey dear.. love to read more
Sandhya_SriAuthor1 month, 3 weeks ago
Thank you 😊
Maha1 month, 3 weeks ago
Story in good start sister...It nice and different story... Best wishes sister...👌
Discussion (4)
Bagundi story continue chey dear.. love to read more
Thank you 😊
Story in good start sister...It nice and different story... Best wishes sister...👌
Thank you 😊