Office · Telugu

రేవతి నవ్వింది (ప్రేరితులు THE INDUCED— కథ 3)

రేవతి నవ్వింది (ప్రేరితులు THE INDUCED— కథ 3) Cover Image
Completed | Part 2 of 3 | 1 Likes

Part 2

Part 2 Image

ఆమె ఆ మాట చెప్పినప్పుడు, తన గొంతులో గతం ఇంకా గుచ్చుకుపోయి ఉన్నట్టు అంబికకు అనిపించింది.
“ముందు ముందు ఆలోచన పెరిగింది.
రోజూ అవమానం.
రోజూ గద్దింత.
రోజూ జరిమానా.
రోజూ నన్ను నేను తక్కువగా అనిపించే వాతావరణం.
మగవాడిగా నిలబడాలి, సమర్థించాలి, ఎదురు మాట్లాడాలి—అన్న శక్తి నాలో కొంచెం కొంచెంగా కరిగిపోయింది.
ఇంతలో, మా వలె ఇబ్బందులు పడేవాళ్లలో కొందరు స్నేహితులు దొరికారు. వాళ్లలో కొందరు జాతర్లకు, పల్లెటూరి ఉత్సవాలకు స్త్రీ వేషంలో వెళ్తుండేవారు. మొదట నేను వాళ్లతో కుతూహలం తో వెళ్లాను. తర్వాత… ఆ వేషంలో నాకు ఒక విచిత్రమైన విడుదల అనిపించింది.”
.
ఆ విడుదల కోసం తరచూ మా లాంటి వాళ్లం కొందరం పల్లెటూరి ఉత్సవాలకు స్త్రీ వేషాల్లో వెళ్తుండేవాళ్లం. నిజానికి అది సరదా కాదు; బాధ నుంచి బయటపడటానికి ఒక రంధ్రం. ఆ రోజు చీర కట్టుకున్నాక, కనీసం కొన్ని గంటలైనా ఆఫీసు బాస్ తిట్లు, మగాడివి కదా అన్న బరువు, ఇంటి బాధ్యతలు—అన్నీ దూరంగా అనిపించేవి. ఎక్కడెక్కడో నృత్యాలు చేశాం. ఎన్నెన్నో పాటలు పాడాం. చీర,రవికెలు కట్టాం. చుడీ దార్ లు కట్టాం. లంగా, వోణీలు కట్టాం . స్కర్టులు వేసుకున్నాం. ఈత కొలనుల్లో బికినీలల్లో తిరిగాం. ఇదీ అదీ అని లేదు. అదే ప్రపంచం అనుకుని తిరిగాం. మా ఆనందానికి హద్దు లేదు. మేము అనుభవించిన విడుదల ఎంతో హాయినిచ్చింది. అయితే దానివల్ల ఒక ప్రమాదం నా జీవితంలో...
ఒకసారి అదే జాతరలో నన్ను మా ఆవిడ చూసింది.
నేను ఆమెను చూసిన క్షణం నా గుండె ఆగిపోయినట్టైంది. ఆమె నన్ను మొదట గుర్తుపట్టలేదు. తర్వాత నా కళ్లను చూసి గుర్తుపట్టింది. ఆమె ముఖంలో భయం కాదు, అసహ్యం కాదు—ఒక విచిత్రమైన అవమానం కనిపించింది. ‘ఇది నువ్వా?’ అని అడిగింది.
నేను సమాధానం చెప్పలేకపోయాను.
ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఆమె ఎక్కువగా అరవలేదు. అదే నాకు ఇంకా భయంకరంగా అనిపించింది. రెండు బట్టలు సర్దుకుంది. ‘నేను నీతో ఉండలేను’ అంది. ‘నువ్వు తప్పు చేశావు కాబట్టి కాదు. నువ్వు ఎవరో నాకు చెప్పకుండా నన్ను నీ పక్కన నిలబెట్టావు కాబట్టి.’
ఆ మాట నాకు గట్టిగా తగిలింది.
నేను ఆమెను ఆపడానికి ప్రయత్నించాను. కానీ నా చేతిలో మాట లేదు. నా జీవితంలో మొదటిసారి నాకు అర్థమైంది—నేను ఆఫీసులో బాస్ చేత అవమానించబడ్డాను; జాతరలో జనాల కళ్లలో విచిత్రంగా కనిపించాను; ఇంట్లో నా భార్య ముందు అబద్ధంగా నిలబడ్డాను.
ఆమె వెళ్లిపోయింది.
ఆమె వెళ్లిన తర్వాత రేవంత్ అనే పేరు ఇంట్లో మిగిలినా, ఆ పేరులో ఊపిరి మిగల్లేదు. నేను కొన్ని రోజులు అద్దం ముందు నిలబడి నన్ను నేనే చూశాను. నాకు అప్పటికి స్త్రీగా జీవించాలనే తుదినిర్ణయం ఉందా? లేక పురుషుడిగా బ్రతకలేని అలసట మాత్రమేనా? తెలియదు. కానీ రేవంత్‌గా తిరిగి వెళ్లడానికి తలుపు మూసుకుపోయిందనే భావం మాత్రం స్పష్టంగా అనిపించింది.
ఆ తర్వాత నేను నెమ్మదిగా రేవతిగా మారాను.
ప్రతీకారం కోసం కాదు.
భార్యను బాధపెట్టడానికి కాదు.
బాస్‌కి జవాబు చెప్పడానికి కాదు.
ఆ అన్ని విరిగిపోయిన చోట్ల నుంచి మిగిలిన నాకు ఒక పేరు కావాలి. ఆ పేరు రేవతి.”
అంబిక జాగ్రత్తగా అడిగింది.
“విడుదల?”
“అవును,” అంది రేవతి. “అక్కడ ఎవ్వరూ నన్ను ‘డెడ్‌లైన్ ఎక్కడ?’ అని అడగరు. ‘ఎందుకు ఆలస్యం?’ అని జరిమానా వేయరు. ‘మగాడివి కదా, ఇలా ఉండాలి’ అని బరువు మోపరు. ఆ రోజు ఒక చీర కట్టుకున్నాకా, కనీసం కొద్దిసేపైనా నేను నా మీద పెట్టిన మగతనం భారం దించేసుకున్నట్టు అనిపించేది. ఆ అనుభూతి మొదట జాతర రోజుకే పరిమితమైంది. తర్వాత అది అలవాటైంది. అలవాటు తర్వాత ఆలోచనగా మారింది. ఆలోచన తర్వాత నేను నిజంగా నా జీవితాన్ని ఎలా బ్రతకాలనుకుంటున్నానో ప్రశ్నగా మారింది.”
ఆమె మాటల్లో ఒక్కసారిగా కాఠిన్యం తగ్గి, స్వరంలో ప్రశాంతత వచ్చింది.
“ఒకసారి జాతరలో నేను స్త్రీ వేషంలో ఉండగా, దురదృష్టవశాత్తూ మా బాస్ నన్ను చూసాడు. అతను నా దగ్గరకు వచ్చి నిలబడి—‘నా ఆఫీసులో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగం లేదు. నిన్ను తీసేస్తున్నాను’ అన్నాడు.”
లత కోపంగా అంది. “అతని మీద ఫిర్యాదు చేయలేదా?”
రేవతి నవ్వింది. “అప్పుడు నాకు ఫిర్యాదు చేసేందుకు న్యాయబుద్ధి కన్నా అలసట ఎక్కువ. అతను అలా చెప్తాడని ముందే ఊహించిన నేను, ఒక చీర, జాకెట్టు కొనుక్కొని అతనికే గిఫ్ట్ ఇచ్చాను.”
“ఏంటి?” అని ముగ్గురూ ఒక్కసారిగా అడిగారు.
“అవును,” అంది రేవతి. “నాకు ఉద్యోగం పోతుందని తెలిసిన రోజే, ‘ఇది మీకోసం సర్’ అని ఒక ప్యాకెట్ ఇచ్చానుఅతను ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటిది?’ అన్నాడు. నేను నవ్వి—‘సార్, నాకు ఈ జీవితం మీ ప్రేరణ వల్లే వచ్చింది. నా మీద మీరు వేసిన జరిమానాలకు గుర్తుగా ఈ చీర తీసుకోండి. కట్టుకుని జాతరకి వచ్చెయ్యండి.” అన్నాను. ’ అన్నాను. ఆ తర్వాత ఉద్యోగం మానేేశాను.” (ఇంకా ఉంది)

233 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 15 hours ago

Akka..super nice start..Meeku asalu enni kotha kottha story ideas ela vastai akka..really great.

gvgarima
gvgarima Author 10 hours ago

థాంక్స్ చెల్లి మీకు

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login