Family · Telugu

బావా ..... మరిదిని కాదు మరదలిని!

Completed | Part 1 of 3 | 0 Likes

Part 1

నా పేరు సునీల్. రైల్వే లో పనిచేసే వారు నాన్న. నా చిన్నతనంలోనే అంటే 7వ తరగతి లో చదువుతూ ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ జానకి కి నాన్న జాబు ఇచ్చారు. నేనూ, అక్క శ్రావణి మా తల్లితండ్రులకు సంతానం. అక్క నాకన్నా 6సంవత్సరాలు పెద్దది. అమ్మకు రైల్వే లో టికెట్ క్లర్క్ జాబు రావటం వల్ల నైట్ డ్యూటీస్ ఉండేవి. నేను, అక్క నైట్ టైం ఇద్దరిమే ఒంటరిగా ఉండేవాళ్ళం. అక్క అందంగా ఉండేది దానికి తోడు బ్యూటీ పార్లర్ కిట్ ఎప్పుడూ మెయింటైన్ చేసేది. నైట్ టైం తనను ఎక్కువగా గమనించేవాడిని (?). ఆడది కావటంతో ఎన్నో వెరైటీ డ్రెస్సెస్ ఉండేవి. నాకేమో కొన్నే డ్రెస్సెస్ ఉండేవి. దానికి తోడు అమ్మ స్ట్రిక్ట్ గా ఉండడంతో చదువూ, ఇల్లూ తప్ప నాకిక వేరే లోకం ఉండేదే కాదు. అప్పుడప్పుడూ అక్క అమ్మమ్మా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అమ్మ డ్యూటీ కి వెళ్ళినప్పుడు అక్క, అమ్మ విడిచిన డ్రెస్సెస్ ట్రై చేయటం నాకో వ్యసనంగా ఉండేది. నేను ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఇన్ఫోసిస్ లో జాబు సంపాదించింది. కంపెనీ వాళ్ళు తనకు బెంగుళూరు లో పోస్టింగ్ ఇవ్వడంతో అక్క బెంగుళూరు హాస్టల్ లో ఉండి జాబు చేసేది. హైదరాబాద్ లో అమ్మా నేనూ ఉండేవాళ్ళం. ఆ సమయంలోనే నాకు కొద్ది కొద్దిగా ఉన్న క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు క్రొత్త పుంతలు తొక్కింది. అమ్మ మా ఉన్నతికోసం ఓవర్ డ్యూటీ లు కూడా చేసేది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నైట్ డ్యూటీ లు చేసే ఆడవాళ్ళను కొలీగ్స్ (మగ తోడేళ్ళు ) ఊరికే వదలవు కదా! శరత్ అని అమ్మ సహోద్యోగి మొత్తానికి అమ్మని లైన్ లో పెట్టేశాడు. అమ్మ మా ఇంటిలో బ్రెడ్ విన్నర్ కావటంతో తను శరత్ ని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకునేది. నాకు కోపమొచ్చినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత.

అట్లాంటి సమయంలో అక్కకు విషయం తెలిసి హైదరాబాద్ వచ్చి పెద్ద గొడవ చేసింది. అమ్మ నన్నూ, అక్కనూ కూర్చోపెట్టి తను ఉద్యోగ పరంగా ఎదుర్కొన్న సమస్యలూ, మగతోడు లేకపోతే ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో అన్నే చెప్పి శరత్ తనకు రక్షణ గా యెట్లా నిలబడ్డాడో అన్నీ చెప్పి మా ఇద్దరినీ కన్విన్సు చేసింది. మొత్తానికి శరత్ మా ఇద్దరికీ కూడా అలవాటైపోయాడు.అమ్మకు నాన్న లేని లోటును పూడ్చి, డబ్బు ఆశ చూపించి, తనకున్న ప్రాపర్టీస్ లో కొన్ని అక్క పేరునా, నా పేరునా వ్రాశారు. ఆయన భార్య చనిపోయిందట, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇంకా తనకు సమస్యలు లేకపోవడంతో మమ్మల్ని తనతో వాళ్ళింటికి షిఫ్ట్ అయిపొమ్మని ఒక్కటే గొడవ. అమ్మను ఒప్పించి మొత్తానికి ఆయన ఇంటికి షిఫ్ట్ అయ్యిపోయాము. ఒకవేళ వాళ్ళ పిల్లలు వస్తే మేము మా ఇంటికి వచ్చేయ్యవచ్చు అని మా ఇంటిని అమ్మ ఖాళీగానే ఉంచింది. కొన్ని డ్రెస్సెస్, ముఖ్యమైన సామగ్రితో శరత్ ఇంటికి షిఫ్ట్ అయ్యాము అమ్మా నేను. తను నాకు పైన సపరేట్ రూం ఇచ్చాడు. బుక్స్ అవీ సర్దుకుంటుంటే తెలిసింది అది నాకన్నా 4సంవత్సరాలు వయసులో పెద్దదైన వాళ్ళ అమ్మాయి రూం అని. తను విడిచి వెళ్ళిన డ్రెస్సెస్ అవీ ఉన్న రాక్స్ అట్లాగే ఉంచాను. నైట్ ఎవరూ లేనప్పుడు తలుపులేసుకొని ఆ డ్రెస్సెస్ ట్రై చేసేవాడిని. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు కొన్ని డ్రెస్సెస్ తీసుకువెళ్ళి మా పాత ఇంటిలో పెట్టేశాను. అమ్మతో పాత ఇంటికి చూడటానికి వెళ్తున్నా అని బయలుదేరేవాడిని. అమ్మ తనకు కూడా శరత్ తో ఏకాంతం దొరుకుతుందని నన్ను పంపేది. నాకు ఎందుకో తెలియదు కానీ బాడీ మీద హెయిర్ గ్రోత్ అంతగా లేదు. షేవింగ్ కూడా అవసరం ఉండేది కాదు. మా ఇంటికి వెళ్లి క్రాస్ డ్రెసింగ్ చేసుకుని టైం స్పెంట్ చెయ్యటం అలవాటుగా మారింది. శరత్ అమ్మా వాళ్ళ సంబంధానికి నా వైపు నుండి అభ్యంతరం లేకపోవడంతో నన్ను చాలా బాగా చూసుకునేవారు. శరత్ అంకుల్ అయితే అమ్మకు తెలీకుండా నాకు బోలెడు డబ్బిచ్చేవాడు. వద్దంటే ఈ వయసులోనే ఏవేవో కొనుక్కోవాలనుకుంటారు మీరు పర్వాలేదు ఉంచుకో అని జేబులో పెట్టేసేవాడు. అట్లాంటి సమయంలో కిరణ్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ డాడ్ బిగ్ షాట్. సిటీ లో మంచి పేరుంది. వాడికీ నాకూ ఉన్న కామన్ హాబిట్స్ వల్ల, లైక్ మైండెడ్ అవ్వటంతో కొద్దికాలంలోనే బాగా క్లోజ్ అయిపోయాము. ఒకసారి మేమిద్దరమూ మా పాత ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాడూ టీవీ చూస్తున్నాము. నాకు ఏదో పనుండి మేడ పైకి వెళ్లాను. ఆ పని చూసుకుని క్రిందికి వచ్చేసరికి రాక్ లో ఉన్న శరత్ అంకుల్ కూతురి బ్రాని తడిమి చూస్తున్నాడు కిరణ్. నేను చప్పుడు చెయ్యకుండా కాం గా వెనక్కు వెళ్లి తలుపు సందులోనుండి చూస్తున్నాను. వాడు ఆ బ్రాని టీ షర్టు మీదనే ట్రై చేస్తున్నాడు. వెంటనే అప్పుడే వెళ్ళినట్లు లోపలి వెళ్లి ఇదేంట్రా అని అడిగాను కిరణ్ ని. వాడు ముందు కొంచెం తడబడ్డా తనకున్న క్రాస్ డ్రెస్సింగ్ హాబిట్ గురించి మొహమాట పడుతూ చెప్పాడు. నాకు ఆనందం వేసి నేను కూడా తనలానే ఒక క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు ఉన్నవాదినని చెప్పగానే తన లాప్ టాప్ తీసి వాడి క్రాస్ డ్రెస్సింగ్ ఫొటోస్ చూపించాడు. బెంగుళూరు, చెన్నై ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రాస్ డ్రెసెర్స్ పార్లర్స్ వెళ్లి తేయిన్చుకున్నప్పటి ఫొటోస్ అవి. అప్పటినుండి సెలవు గానీ, వీలుగానీ దొరికిందంటే చాలు మా పాత ఇంటికి రావడం మా రూపాలు మార్చుకోవడం అలవాటు అయ్యిపోయింది. శరత్ అంకుల్ ఇచ్చే డబ్బు, కిరణ్ పాకెట్ మనీ తో మా ఇద్దరికీ కావలసిన క్రాస్ డ్రెస్సింగ్ సామగ్రి కొనుక్కోవడం మాకు పెద్ద కష్టమైన పనిలా ఉండేది కాదు. వెస్ట్రన్ స్టైల్ నుండి ఇండియాలో అన్ని ప్రాంతాల స్త్రీల వస్త్ర ధారణను ట్రై చేశామంటే మీరే ఆలోచించుకోండి. మా డిగ్రీ అయ్యేవరకూ కొనసాగింది మా కంబైన్డ్ క్రాస్ డ్రెస్సింగ్. డిగ్రీ అయ్యిన తరువాత కిరణ్ అమెరికా చదువులకోసం వెళ్ళిపోయాడు. నేను తప్పని పరిస్థితుల్లో అక్క దగ్గరకు బెంగుళూరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో జాయిన్ అయ్యాను.

అక్క శ్రావణి దగ్గర ఉండి చదువుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిదని తెలుసు. అయిన తప్పక రావలసి వచ్చింది. అక్క బెంగుళూరు విప్రోలో టీం లీడర్ గా పనిచేస్తోంది. ఎప్పుడూ అబ్రాడ్ టూర్స్ తో చాలా బిజీ గా ఉండేది. ఇంట్లో నేనొక్కడినే. తను ఉన్నప్పుడు ఇట్లా చదవాలి అట్లా చదవాలి అని ఒక్కటే నస పెట్టేది. తను బిజీ గా ఉండడంతో హైదరాబాద్ లో ఉన్న అనుభవంతో నేనే వంట చేసేవాడిని(?). తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అమ్మకూ శరత్ అంకుల్ కూ ఉన్న సంబంధం, తన ఒంటరితనం వల్ల అనుకుంటా కొంచెం యారోగెంట్ బిహేవియర్ తో ఉండేది అక్క. ఒకసారి తను కంపెనీ వర్క్ మీద స్వీడన్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ 6 నెలలు ఉండాలని చెప్పింది. అరేయ్ సునీల్! నేను వెళ్లాను కదా అని చదువు నెగ్లెక్ట్ చెయ్యకు. అది లేకుంటే జీవితం లో అన్నీ మిస్ అవుతావు. నీకు డబ్బులు కావాలంటే ఈ ఏటీఎం కార్డు వాడుకో! ఇంకా అవసరం ఉంటే నేను వేస్తాను. జాగ్రత్తగా ఉండు. ఇంటి రెంట్ ఆన్ లైన్ లో నేను పే చేసేస్తాను. అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. కావలసిన సమయం .... ఒంటరి తనం ...... నాలో మళ్ళీ కోరిక పుట్టింది...... స్త్రీగా మారాలని! మార్నింగ్ కాలేజీ కి వెళ్ళడం ... నైట్ టైం నాకిష్టమైన డ్రెస్సెస్ లోకి మారిపోవడం..... మధ్యలో హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉన్న మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఇక్కడికి డంప్ చేసేశాను.. అమ్మ దగ్గరికి కూడా వెల్ల బుద్ధయ్యేది కాదు! ఇక్కడ ఉంటె నేను చక్కగా స్త్రీత్వంలోకి ఒదిగిపోయే అవకాశం ఉంటుంది! అందుకే హైదరాబాద్ చాలా తక్కువగా వెళ్ళేవాడిని(?). బెంగుళూరు మంత్రి స్క్వేర్ లో నాకు కావలసిన స్టఫ్ అంతా కొనుక్కుని వాటిని ఎప్పుడూ నైట్ టైం ట్రై చేసేవాడిని(?). అట్లాంటి సమయం లో నాకు "మేఘన" అని ఒక హిజ్రా పరిచయం అయ్యాడు. తను ఎప్పుడూ శారీస్ లోనూ, సల్వార్ లోనూ కనపడేవాడు. కొంచెం పరిచయం అయిన తరువాత నాకున్న అలవాటును చెప్పుకోవడానికి తను సూటబుల్ అనిపించి తనకు చెప్పుకున్నాను. తను ఇది చాలామందికి ఉండే అలవాటే కాబట్టి వర్రీ అవ్వనక్కరలేదు అంటూ క్రాస్ డ్రెసింగ్ చేసేటప్పుడు తనూ నాకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చి వీకెండ్స్ లో మా ఇంటిలో ఉంది నన్ను ముస్తాబు చేసేవాడు. ఒకసారి తను వాడే ఎస్ట్రిన్ 0.625 హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చి వాడు ఏమీ పర్వాలేదు అని ధైర్యంచెప్పాడు. చాలా సంవత్సరాలుగా నాకున్న వ్యసనం ఇదే. మేఘన నాతో మాట్లాడే విధానం, నన్ను కన్విన్సు చేసే విధం అన్నీ కలగలిపి నాలో స్త్రీగా మారాలనే కోరిక బలపడసాగింది

497 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login