Family · Telugu

బావా ..... మరిదిని కాదు మరదలిని!

Completed | Part 2 of 3 | 0 Likes

Part 2

మేఘన తో నా పరిచయం కాస్తా నన్ను వేరే ప్రపంచంలోకి తీసుకుపోయింది!! అక్క స్వీడన్ నుండి రోజూ ఫోన్ చేసేది!! అంత బాగుందనే చెప్పేవాడిని(?). ఎప్పుడూ నా చదువు గురించే మాట్లాడేది. అట్లాంటి సమయంలో అక్క ఒక రోజు ఫోన్ చేసి "సునీల్!! నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నా అని చెప్పింది!" నేను వెంటనే నేను కొనుక్కున్న నా స్టఫ్ అంతా మేఘన కి ఇచ్చేసి తనతో చెప్పాను "ఇంకా మా ఇంటికి రావడం కుదరదని" తను నవ్వుతూ "దీనికే ఇంత బాధ పడిపోతున్నావా? నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా నా దగ్గరికి వస్తే నీకిష్టమైన అమ్మాయి గా మారిపోవచ్చు ..... అంటూ సాగనంపింది!"

ఒక వారం తరువాత అక్క వచ్చేసింది .... ఆశ్చర్యకరం గా అమ్మ కూడా వచ్చింది! మొట్ట మొదటిసారిగా తన కడుపున పుట్టిన పిల్లలను చూసుకోవటానికి. అక్కని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాం. అక్క తనతో పాటు ఎవరో ఫ్రెండ్ ని తీసుకు వచ్చింది. తన పేరు ధనుంజయ. మంచి సలీం గా ఉండి హ్యాండ్ సం గా ఉన్నాడు ..... చూడగానే నాలో ఏదో అలజడి. వాళ్ళది ఢిల్లీ నేటివ్ ప్లేస్ అంట. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికెళ్ళిన తరువాత తెలిసింది ... అతను మా కాబోయే బావ అని!

రెండు రోజుల తరువాత అమ్మ "సునీల్! అక్క ధనుంజయ ని ప్రేమించింది.... అది తెలిసే నేను వచ్చాను ... శరత్ ని తీసుకురావద్దు అని చెప్పింది .... ఇది మన ముగ్గురికీ సంబందించిన విషయం అంది. అందుకే నేనోక్కర్తినే వచ్చాను" అనిచెప్పింది. ఒక 3 డేస్ లో వాళ్ళ ఇద్దరి పెళ్ళీ జరిగిపోయింది. నేనూ నా స్టడీస్ పై దృష్టి పెట్టాను వాళ్ళిద్దరూ ఎక్కడికైనా వీకెండ్ కి వెళ్ళినప్పుడు నేను మేఘన దగ్గరకు వెళ్లి నాకిష్టమైన చీరలోకి మారిపోయేవాడిని. అట్లా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు పూర్తయింది. అక్క "సునీల్ నీకిష్టమైతే ఇంకా చదువుకోరా.... లేకుంటే జాబ్స్ ఏమైనా ట్రై చెయ్యి. అంతేకానీ ఖాళీగా ఉండొద్దు" అని చెప్పింది. ఇంకా నాకు అక్క అమ్మ సంపాదనల మీద ఆధారపడటం ఇష్టం లేక కాంపస్ ప్లేస్ మెంట్ ద్వారా ఒక మంచి కంపెనీ లో ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. నా జీవితంలో ఫినాన్షియల్ ట్రబుల్స్ లేక పోయినా ... లైఫ్ అంత హై సర్కిల్స్ లో నడిచిపోతున్నా చిత్రంగా ఎందుకనో అమ్మాయిలను చూస్తే స్పందన కలిగేది కాదు. కానీ అక్కను ఎంతో బాగా ప్రేమించే బావ ధనుంజయ అంటే మాత్రం ఏదో తెలియని భావం కలిగేది. తన సమక్షంలో నాలో ఉన్న స్త్రీ నిద్ర లేచేది. తన డ్రెస్సెస్ ఇస్త్రీ చెయ్యటమన్నా .... తన పర్సనల్ పని చెయ్యటమన్నా నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. అట్లాంటి సమయంలో హటాత్తుగా అక్క ప్రమాదంలో మాకు దూరమయిపోయింది. తను ఎంతో ఇష్టంగా చూసుకునే భార్య లేకపోవటంతో బావ మద్యానికి బానిస అయిపోయాడు. తనని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు. అమ్మ నన్ను హైదరాబాద్ వచ్చెయ్యమంది. కానీ నాకేమో ఎంతో ఇష్టమైన బావని వదిలేసి వెళ్ళటమనేది పాపం అనిపించింది. తను ఆఫీసు కి సెలవు పెట్టేశాడు. ఎప్పుడు చూసినా త్రాగుడే! నేను "ఒక రోజు ప్రదేశం మారిస్తే ఏమైనా లాభం ఉంటుందేమో" అని తనని బలవంతంగా ఊటీ తీసుకువెళ్లాను. అక్క లేని బాధ నుండి కొంచెం తెరుకున్నట్టు కనిపించింది. కొంచెం మందు తగ్గించాడు. నాలో ఏదొకొత్త ఉత్సాహం. బావని మళ్ళీ మామూలు మనిషిని చేయ్యోచ్చనే నమ్మకం కుదిరింది. తను నెమ్మదిగా డ్యూటీ లో జాయిన్ అయిపోయాడు. వీకెండ్స్ లో ఇద్దరమూ సరదాగా హోటల్స్ కి వెళ్ళేవాళ్ళము. అట్లా ఒక సారి మేము పార్టీ కి వెళ్ళినప్పుడు "మేఘన" కనిపించింది. తను నన్ను కళ్ళతో పలకరించి ప్రక్కకు రమ్మంది. బావతో బాత్రూం అని చెప్పి వెళ్లాను. తను నాతో "ఏమిటీ అసలు కనిపించటం మానేశావు. నేను గుర్తు రావటంలేదా" అని అడిగితే తనకు విషయం మొత్తం చెప్పి మళ్ళీ బావ దగ్గరికి వచ్చేశాను. డిన్నర్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డే బావా కొంచెం మందు తీసుకుంటూ "సునీల్!! ఏమీ అనుకోనంటే ఒక విషయం అడుగుతా. నిజం చెప్పరా. నిన్న హోటల్ లో ఎవరితోనో హిజ్రాతో మాట్లాడుతున్నావ్? నేను గమనించాను. నీకెలా తెలుసు? నీకిష్టమైతేనే చెప్పు లేకుంటే లేదు అన్నాడు. నాకు షాక్ కొట్టినట్లయింది. కానీ తమాయించుకుని "బావా! మమ్మల్ని కన్న మా అమ్మనుకూడా కాదని నీ దగ్గరే ఉంటున్నానంటే అర్ధం చేసుకో బావా! నువ్వు నాకు పరాయి వాడివైతే నేనిలా చెయ్యగలనా? నువ్వుతప్ప నాకు సొంత వాళ్ళెవరూ లేరు బావా!" అంటూ మొదటి నుండీ నాకున్న క్రాస్ డ్రెస్సింగ్ అలవాట్లు, మేఘనతో పరిచయం, ఇక్కడ క్రాస్ డ్రెస్సింగ్ చేయటం, ఆడవాళ్ళు కనపడ్డా కలగని స్పందన బావ సమక్షంలో కలగడం, బావ అంటే నాకున్న ఇష్టం అన్నీ చెప్పేసాను. తను ఆశ్చర్యపోయాడు. నేనూ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పంచుకునే సరికి రిలీఫ్ ఫీల్ అయిపోయాను.

నెక్స్ట్ డే బావ ఆఫీసు నుండి ఫోన్ చేసి ఏదో ఆఫీసు పని మీద లండన్ వెళ్ళాల్సి వచ్చింది. 5 డేస్ లో వస్తాను అని చెప్పాడు. నేను కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావటంతో ఆ వారమంతా బిజీ గా గడిపేశాను. ఆరోజు శుక్రవారం. ఇంటికి వెళ్ళేసరికే బావా ఇంట్లో ఉన్నాడు. మా ఇద్దరికీ వంట చేయటం కోసం ఉపక్రమించబోతుంటే "నేనన్నీ ఆర్డర్ చేశా కానీ .. ఫ్రెష్ అయి రారా!" అన్నాడు

ఫ్రెష్ అయ్యాక ఇద్దరమూ కలిసే భోజనం చేసాము. తరువాత అట్లా బయటికి వెళ్లి వద్దాం అంటూ బయలు దేరతీశాడు. చాలా ఉత్సాహం గా ఉన్నాడు మనిషి. దగ్గరలో ఉన్న కర్బన్ పార్క్ కి వెళ్లాం. ఒక బెంచ్ మీద కూర్చున్నాము. బావ నాతో "ఒరేయ్! నీతో కొంచెం అంతరంగికంగా మాట్లాడాలి అంటూ "నేను నువ్వు చెప్పిన విషయాలు, నా మీద నీకున్న ఇంట్రెస్ట్ అన్నీ విన్నాక ఈ వారం రోజులనుండీ చాలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంటర్నెట్ లో ఈ విషయం మీద స్టడీ చేసాక థాయిలాండ్ వెళ్లాను.... అక్కడ కూడా కొన్ని వివరాలు సేకరించాను. నీ బలహీనతలును మర్చిపోవద్దని చెప్పటం లేదు నేను .... కానీ నీ బలహీనతను కప్పి పుచ్చుకోకుండా నాకు మనోబలాన్నిస్తావా?" అంటూ తన అంతరంగాన్ని బయటపెట్టాడు. నాకు అర్ధం కాలేదు..... అయోమయం గా చూసాను తన వైపు. తను చాలా వరీడ్ గా ఉన్నాడు. ప్రశ్నకు జవాబు చెప్పి కర్రెక్టా కాదా అనే టెన్షన్ లో ఉన్న విద్యార్ధి లా కనిపించాడు .... నాకు చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ తనే "మీ అక్క ప్లేస్ లోకి నువ్వు వస్తావా?" అని అడిగాడు. తనే మళ్ళీ "మీ అక్క చనిపోయాక డెత్ బెనిఫిట్స్ కానీ ఇతరత్రా కానీ మనకు 4 కోట్లు వచ్చాయి.... నా నెలసరి జీతం 2 లక్షల వరకూ ఉంది. మనం ఆర్ధికంగా చాలా మంచి పోసిషన్ లోనే ఉన్నాం. ఇప్పుడు నాకు కావలసింది కాసింత ప్రేమ, నాకు మనోబలాన్ని ఇవ్వగల జీవిత భాగస్వామి. నా గురించి బాగా తెలిసిన నువ్వైతే నే బాగుంటుందేమో. అందుకే అడుగుతున్నా!! అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూ నిన్ను చీరలోనే చూడాలని ఉంది. ఆలోచించి చెప్పు. ఇందులో బలవంతమేమీ లేదు" అన్నాడు.

నాకు ఎలా స్పందించాలో తెలీలేదు. ఒక వైపు ఆనందం .... మరో వైపు అమ్మ. నాకున్న బలహీనత బావకు ప్రేమని అందిస్తుందంటే నాకేమి కావాలి!! వెంటనే "బావా! మరి నేను ఎప్పుడు జాబ్ కి రెసిగ్నేషణ్ ఇవ్వాలి అని అడిగాను" బావ మొఖంలో ఆనందం!! "థాంక్ యు రా సునీల్" అంటూ ఆగి " మిసెస్ సునీలా ధనుంజయ" అంటూ ఒక చిన్నపాటి హగ్ ఇచ్చాడు. వెంటనే తనే "పదా!" అంటూ దగ్గరలోనే ఉన్న షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్లి నాకోసం చీరలూ, నైటీలు, అండర్ గార్మెంట్స్, కాస్మెటిక్స్ అన్నీ దగ్గరుండి నాకిష్టమో కాదో తెలుసుకుని మరీ కొనేసాడు. నాకు మళ్ళీ వసంతం వచ్చినట్టు ఉంది. వెళ్తూ వెళ్తూ దారిలో మల్లెపువ్వులూ, స్వీట్స్ అన్నీ కొన్నాడు..... అప్పటికి సమయం రాత్రి 11.30 కావస్తుంది.

నాలో ఏదో తెలియని ఉద్వేగం. ఇంతవరకూ మా ఇంటిలో ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యం నాకు అత్యంత ప్రియమైన బావకి తెలిసిపోవటం తను దానిని తన సమస్యగా స్వీకరించి నాకు భారంగా ఉన్న నా శరీర ఆకృతిని నాకు ఇష్టమైన రీతిలో మలచడానికి భగవంతుడు పంపిన శిల్పిలా కనిపిస్తున్నాడు బావ! బావ స్నానానికి వెళ్ళాడు తన బెడ్రూంలోకి.... ఈ లోపు నేను నా బెడ్ రూమ్ లో ఉన్న అటాచెడ్ బాత్ రూమ్లో దూరి నా శరీరం మీద ఉన్న అవాంచిత రోమాల్ని తొలగించుకున్నా .... నేను సీక్రెట్ గా దాచుకున్న హెయిర్ విగ్, బ్రెస్ట్ ఫార్మ్స్ అన్నీ బయటకు తీసి నా శరీరం మీద అమర్చుకుని... బావకు ఎంతో ఇష్టమైన స్కై బ్లూ చీర కట్టుకున్నా .... జడలో బావ కొనిపెట్టిన మల్లెపూలు ..... అక్క మాకు మిగిల్చిన జ్ఞాపకాలు ... అక్క ఆభరణములు ఎన్నో ఉన్నా ఆ రాత్రికి మాత్రం సింపుల్ గా ఒక సన్నపాటి గోల్డ్ చెయిన్ ... చెరో చేతికి ఒక్కో బంగారు గాజు .... కాళ్ళకు పట్టీలు .... పెదవులకు లిప్ స్టిక్ ... కళ్ళకు సుర్మా ... అంతా ధైర్యంగా చేసినా ... బావ ముందుకు వెళ్ళాలంటే ఏదో సిగ్గు తెర అడ్డొస్తోంది! నా కాళ్ళలో చిన్నపాటి వణుకు! బయటకి వెళ్ళే సాహసం చెయ్యలేక మంచం మీదనే కూర్చుండిపోయాను. ఒక పది నిమిషాల తరువాత తలుపు తెరుచుకుంటున్న శబ్దం. గుండెల్లో సన్నపాటి వణుకు ... బావ ఏమంటాడో అని. నా తల సిగ్గుతో వాలిపోయింది. బావ నా దగ్గరికి వచ్చాడు. నా గడ్డం క్రింద చెయ్యి ఉంచి పైకి తన వైపు కి త్రిప్పుకున్నాడు .... తన కళ్ళలో ఏదో వెలుగు.... అంతలోనే ఏదో వేదన ..... అసంకల్పితంగానే నేను "బావా! ఏమిటి బావా అట్లా ఉన్నావ్" అని అడిగాను. దానికి బావ "ఏమీ లేదు.... నిన్ను ఇట్లా చూస్తుంటే మీ అక్క మళ్ళీ వచ్చినట్లుంది .... మీ అక్క చనిపోలేదు ... నా ప్రక్కనే ఉన్నట్లుంది .... మళ్ళీ అంతలోనే తను లేదనే బాధ గుండెని పిండేస్తుంది" అన్నాడు. నేను వెంటనే "బావా!! అక్క లేదనే బాధ నాకూ ఉంది .... కనీసం తను నిన్నైనా నాకు మిగిల్చి వెళ్లిందని నాకనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ! నువ్వూ నేనూ ఒంటరి వాళ్ళం కాదు బావా!! నీకు నేనూ ... నాకు నువ్వూ!! నన్ను విడిచి ఉండనని ప్రామిస్ చెయ్యి బావా!! అంటూ నాకు తెలియకుండానే బావ ను కౌగలించుకుని ముద్దులతో నింపేశాను. భావ కూడా తేరుకుని నా ప్రేమపూర్వక స్పర్శకు స్పందిస్తూ నా పెదాల్ని తన పెదాలతో కప్పేసాడు ... మా లాలాజలాలు కలిసిపోయాయి! కాసేపటి తరువాత తేరుకుని విడివడ్డాక ... బావ నాతో "సునీలా! నిన్ను నేను నా భార్యగా స్వీకరించటం నాకు ఇష్టమే కానీ ఒక మగవాడు ఆడదానిగా మారుతుంటే మీ అమ్మ చూస్తూ ఊరుకోదు. ఏమైనా అభ్యంతరం చెప్పొచ్చు . ముందు మీ అమ్మను యెట్లా ఒప్పించాలో ఆలోచించు" అన్నాడు. నేను కూడా అదే ఆలోచించాను. బావతో రేపే నేను హైదరాబాద్ వెళ్తున్నా బావా!! అని చెప్పాను.

489 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login