Festival · Telugu

భామినీ విలాసం

Completed | Part 3 of 6 | 2 Likes

Part 3

భామిని అవడానికి తృతీయ ప్రకృతి మహిళ అయినా కళ్ళు తిప్పుకోలేని అందం ఆమెది. ఎవ్వరినీ లక్ష్యపెట్టని చూపులు. ఎప్పుడూ చెరగని చిరునవ్వు. నిండైన వస్త్ర ధారణే కానీ ఇంపైన వస్త్రధారణ. శృంగార భావాన్ని ఇనుమడింప చేసే ధారణ.
భామిని విషయం లో చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
అంతః పురం లోని మిగతా తృతీయ ప్రకృతి స్త్రీ లలాగా రాజగురువు రూపొందించిన స్త్రీ కాదు.
కాంభోజ దేశపు రాజు వివేక వర్మ చిత్రసేనుడి మిత్రుడు. ఈమధ్య కాలంలో చిత్రసేనుడు కాంభోజ దేశానికి వెళ్లినప్పుడు తన మిత్రుడికి తన కూతురు లో వచ్చిన మార్పు గురించి చెప్పాడు. వివేక వర్మ తనయుడైన భాను వర్మ మౌనంగా అంతా విని తన తండ్రి తో ఏదో చెప్పాడు. అప్పుడు వివేక వర్మ చిత్రసేనుడితో నీతో ఒక వనిత ను పంపుతాను. ఆమె చెయ్యవలసిన పని చేస్తుంది. అని చెప్పాడు. భాను వర్మ ఎవరినో పిలిచి ఏదో చెప్పి భామిని ని పిలుచుకు రమ్మన్నాడు. ఆమె రాజసౌధం లో లేదని దగ్గర లో ఉన్న కిన్నెర వాటికకు వెళ్ళింది అని చెప్పారు. కాంభోజ దేశం లో తృతీయ ప్రకృతి స్త్రీలను కిన్నెరలు అని వ్యవహరిస్తారు. ఈమె కిన్నెర వాటికకు వెళ్ళింది అని తెలుసుకుని భాను వర్మ తనే స్వయంగా ఆమెను తీసుకుని వస్తానని వెళ్ళాడు. భాను వర్మ వెళ్ళిన కొద్దిసేపటికి భామిని వచ్చింది. భాను వర్మ తల్లి పిలిచిందని రాజ గృహంలో ఉండిపోయాడు. వివేకుడు భామినికి విషయం చెప్పి చిత్రసేనునితో అతని రాజ్యానికి వెళ్లి పని పూర్తి చేసుకుని రమ్మన్నాడు. ఆమె అలా అవంతీ నగరానికి చేరుకుంది. ఇదీ ఆమె గురించిన కొంత సమాచారం (సశేషం)

2343 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 8 months, 3 weeks ago

Akka, chinnappudu chadivina Chandamama, bommarillu kathalanu gurtuchesaru.. Meeku ee vidam ga krutagnyatalu cheppalo teliyadam ledu. Chala thanks akka. Elantivi marinni kadalu rayamani na prarthana.

gvgarima
gvgarima Author 8 months, 3 weeks ago

మీకు ఇంతగా నచ్చినందుకు థాంక్స్ చెల్లి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను 💕

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login