Festival · Telugu

కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)

Completed | Part 1 of 7 | 0 Likes

Part 1

అది 17వ శతబ్దం చివరి రోజులు. శ్రీ శైలం అడవులకు దగ్గరగా ఉన్న ఒక మారుమూల గ్రామం. అక్కడ ఊరుచివర ఒక పర్ణశాలలో ఒక యోగి. అతని పేరు నందయోగి. అతని వయస్సు ఇంచుమించుగా మూడు వందల సంవత్సరాలపైనే ఉంటుందని తరతరాలు గా చెప్పుకునే విషయం. అతను ఎవరికైనా కనబడ్డాడు అంటే వారికి ఏదో ఒక రకమైన సహాయం చేసి వారి కష్టాలను తీరుస్తాడు అని అందరి నమ్మకం. అతను శివోపాసన, అమ్మవారి ఉపాసన కూడా చేస్తుంటాడు. ఆశ్రమంలో ఒక్కోసారి శివోపాసన చేసేటప్పుడు నవయౌవ్వనం లో ఉన్న ఒక ప్రమథమూర్తిగా రెండవ శివునిలాగా కనబడుతాడు. అమ్మవారి ఉపాసన చేసే సమయంలో అందమైన యువతిగా కనబడుతాడు. అంతేకాదు. శివపూజలో శివునికి నృత్యం సమర్పయామి అని చెప్పిన వెంటనే ఒక యువతి గా మారి పోయి నృత్యం చేసి తరువాత మళ్ళీ అందరూ చూస్తుండగానే యోగిగా మారి పోతాడు. ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే వారిని అడవిలోకి వెళ్ళి కష్టపడి ఏవైనా పళ్ళుతెమ్మని చెబుతాడు. వాళ్ళు తెచ్చిన పళ్ళు తినటానికి ముందు మీరు మాకు చేసిన ఉపకారానికి, మేం తెచ్చిన పళ్ళకు రుణం చెల్లు అయిపోయింది. ఇక మేం వేడుతున్నాము అని చెప్పిస్తాడు. నీళ్ళు వదిలిస్తాడు. ఈయన సిద్ధేంద్ర యోగిని కూడా చూశాడు అంటారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం కూచిపూడి నృత్యసంప్రదాయానికి ఏదైనా హాని కలిగితే అతడు అడ్డు పడతాడు. అని చెబుతారు. ఎన్నో ఉదాహరణలు కూడా చెబుతారు. ఇక్కడ ఆశ్రమం లో ఉంటాడు. అదే సమయం లో కూచిపూడి గ్రామం లోనూ కనబడుతాడు. తానీషా కూచిపూడి గ్రామాన్ని సిద్ధేంద్రయోగి సంప్రదాయ భాగవుతులకు ఇచ్చినప్పటినుంచి శ్రీశైలం లోనే కాక కూచిపూడికి దగ్గరలో ఒక అడవిలో ఒక ఉద్యానవనాన్ని కూడా సృష్టించాడు. ఆ ఉద్యానవనం లో మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ఉద్యానవనంలో ఒక నియమం పెట్టాడు, ఎవరైనా పురుషులు తన అనుమతి లేకుండా ఆ ఉద్యానవనంలో ప్రవేశిస్తే వెంటనే స్త్రీలుగా మారిపోతారు. వారికి తగిన విధంగా స్త్రీల పేర్లు పెడుతుంటాడు. ఇలా ఆ ఉద్యానంలో రమారమి తారాగణం లాగా 27 మంది స్త్రీలు ఆయన ప్రభావం వల్ల తయారైయ్యారు. ఆయన సత్యభామ వేషం ధరిస్తాడు. వారంతా గోపికలు. శ్రీకృష్ణుని చుట్టూ సేవ చేస్తూ నృత్యం చేస్తూ తన్మయత్వం లో పాడుతుంటారు.
ఒక సారి ఆయన శ్రీశైలం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక గ్రామీణ దంపతులు ఒక రెండేళ్ల శిశువును ఎత్తుకుని వచ్చారు. ఆ శిశువును ఆయనకు అప్పగించి విద్య, బుద్ధులు నేర్పమని చెప్పారు. ఆయనకు అడవిలో కందమూలాలను తీసుకు రావటానికి బయల్దేరారు. వాళ్ళు పాముకాటుకు గురై ఇంక తిరిగి రాలేదు. ఆశిశువు బాధ్యత నందయోగిపై పడింది. ఆశిశువుకు కురంగి అని పేరు పెట్టాడు. (సశేషం)

1545 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login