ఇక అప్పటినుంచి అమ్మ నాకు రోజు నా జుట్టుని దువిపిలక లాగా వేసేది అంతేకాదు మంచి మంచి హెయిర్ కండిషనర్స్ ఆయిల్స్ అప్లై చేసేది వాటి వల్ల నా జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడం మొదలు పెట్టింది వన్ మంత్ గడిచిపోయింది నా ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది లాప్టాప్ లో పనిచేస్తుండగా జుట్టు చిరాకు పెట్టినప్పుడల్లా అమ్మని పిలిచి దువ్వ చెప్పేవాడిని నేను గమనించలేదు ఇప్పుడు నా జుట్టు మరో జానెడు పెరిగింది చెప్పాలంటే జడ వేసేంతగా పెరిగింది నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అప్పుడు అమ్మ నా జుట్టుని వెనక్కి దువ్వి జడ వేసింది తర్వాత అర్జెంటు అని నాకు ముందు వైపు పడేసింది నేను ఒక్కసారిగా ఏంటా అని చూశాను చూస్తే జడ ఒక్కసారిగా శాఖ అయిన ఇది నాదేనా అని అప్పుడు అమ్మ నవ్వుతూనే ఉంది ఏంటమ్మా జడవేశావు అన్నాను నువ్వే కదరా నీకు జడ వేసినంత జుట్టు పెరిగితే జడ వేయించుకుంటే అన్నావు కదా చాలా క్యూట్ గా ఉన్నావు అని చెప్పింది వర్క్ చేసేటప్పుడు జడ వేసుకుంటే నీకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పింది సరే అని అలాగే ఉంచుకొని వర్క్ చేసుకున్నాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక నన్ను జడతో చూసి నవ్వారు అప్పుడు అమ్మ వాళ్ళని కొంచెం కోపంగా నన్ను వెక్కిరించొద్దు అంటూ చెప్పింది ఏంట్రా ఇది అమ్మాయిలాగా జడ వేసుకున్నావు అని అడిగాడు నాన్న ఎంత చెప్పినా వినకుండా అమ్మే జడ వేసిందా అన్న అని చెప్పాను అప్పుడు నాన్న అమ్మతో వాడు మన కొడుకు కూతురు కాదు వాడికి ఎందుకు జడ వేశావు అని అన్నాడు అప్పుడు అమ్మ మీకు వాడు కొడుకు కావచ్చు నాకు మాత్రం కూతురు అన్నది ఆ మాటకి అందరం షాక్ అయ్యాము మళ్లీ తర్వాత అందరం భోజనం చేసి పడుకున్నాము తర్వాతి రోజు కూడా ఇలాగే అమ్మని పిలిచాను అప్పుడు అమ్మ వచ్చి ఏంటి రా అని అడిగింది కొంచెం జడవేసి పెట్టావా అని అన్ని అడిగాను అప్పుడు అమ్మ నవ్వుతూ నువ్విలా జడ వేయమని బతిమాలుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నది జడవేశాక అమ్మ తన రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకువచ్చి చివరలో ముడిలాగా వేసింది ఆ రబ్బర్ బ్యాండ్ పువ్వుల డిజైన్తో చాలా గర్లీ గా ఉంది మధ్యాహ్నం తర్వాత అమ్మ నేను బయటకు వెళ్లి వస్తాను అని చెప్పింది ఎందుకు అన్నాను కొన్ని చిన్న చిన్న వస్తువులు కొనేది ఉంది అని చెప్పి వెళ్ళింది అమ్మ వచ్చేసరికి నా వర్క్ అయిపోయింది నేను రిలాక్స్ గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాను అప్పుడు అమ్మ వచ్చి కవర్ పక్కన పెట్టి నా పక్కన కూర్చుంది వెంటనే కవర్ తీసుకొని నాకు ఏమైనా తెచ్చావా అని ఓపెన్ చేసి చూస్తున్నాను అప్పుడు అమ్మ నవ్వుతూ అందులో ఉన్నవి అన్నీ నీకోసమే అని చెప్పింది ఏంటా అని చూస్తే రబ్బర్ బ్యాండ్ లు హెయిర్ పిన్నులు హెయిర్ ఆక్సిస్సోరీస్ ఇలా అన్ని ఆడవాళ్ళ వస్తువులే తీసుకొచ్చింది ఏంటమ్మా అన్ని ఆడపిల్లల వస్తువులే తెచ్చావు అని అడిగాను అప్పుడు అమ్మ నవ్వుతూ ఆడ మగ అని తేడా లేదు పొడవు జుట్టుకి అవసరమై వస్తువులే అవి వాటితో పాటు బింది స్టిక్కర్ బొట్లు కూడా ఉన్నాయి నేను ఆశ్చర్యంగా ఇవి కూడా నాకేనా అన్నాను అప్పుడు అమ్మ నవ్వుతూ కాదు కాదు అవి నా కోసం కావాలంటే నువ్వు పెట్టుకో అని చెప్పింది నేను వద్దులే అన్నాను తర్వాత నాన్న తమ్ముడు వచ్చాక అందరం భోజనం చేసి పడుకున్నాము నా జడ గురించి ఏమీ అనలేదు అమ్మ నా జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ చేసేది ఒకసారి అమ్మ పూజ గదిలో ఉండగా నన్ను పిలిచింది హారతి తీసుకోవడానికి నేను వెళ్ళాను అప్పుడు అమ్మ హారతి ఇచ్చాక నాకు కుంకుమ బొట్టు పెట్టింది తర్వాత నేను వెళ్లి నా వర్క్ లో నేను నిమగ్నమయ్యాను కాసేపయ్యాక నేను అద్దంలో చూసుకున్నాను జడ రబ్బర్ బ్యాండ్ కుంకుమ బొట్టు క్లీన్ సేవ్ ఒక ఆడపిల్ల వితౌట్ మేకప్ లో ఉన్నట్టే ఉన్నాను నీకు బొట్టు చాలా బాగా సూట్ అయింది రా రేపటి నుంచి రోజు బొట్టు పెట్టుకో తర్వాతి రోజు అమ్మ నాకు జడ వేసి తిరగమని చెప్పింది నేను అమ్మ వైపు తిరిగాను అప్పుడు అమ్మ ఒక బింది తీసుకొని నా కనుబొమ్మల మధ్యలో పెట్టింది చాలా అందంగా ఉన్నావు రా అని చెప్పింది సరే అమ్మను హర్ట్ చేయడం ఇష్టం లేక అలాగే ఉంచుకున్నాను మళ్లీ సాయంత్రం నాన్న తమ్ముడు వచ్చాక నేను బింది పెట్టుకున్న విషయం మర్చిపోయాను అప్పుడు నాన్న నన్ను చూసి నవ్వాడు కానీ ఏమీ అనలేదు అప్పుడు మా తమ్ముడు బింది నీకు భగ సూట్ అయింది అన్న అన్నాడు నేను వెంటనే షాక్ అయిపోయి అద్దంలో చూసుకున్నాను కానీ తర్వాత నుంచి వాళ్లు ఏమీ అనలేదు
Mother · Telugu
కూతురు - written by Miss
Completed
|
Part 3 of 13
|
0 Likes
Part 3
5120 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)