సుధ తన రోజువారీ కార్యక్రమాలన్నీ నిలిపివేసింది. డాక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్ళి పోయింది. ఆమెతో పాటు సావిత్రమ్మ పూర్తిగా హాస్పిటల్లో తోడుగా ఉంది. దీపిక ఇంటికి హాస్పిటల్ కి మధ్య తిరుగుతూ ఉంది. అనసూయమ్మ పూర్తిగా ఇంట్లో ఉంది.
ప్రిలిమినరీ పరీక్షలు అన్నీ ఒకే వారం రోజుల పాటు చేసి సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇచ్చి
ముందుగా వాగినో ప్లాస్టీ మొదలు పెట్టారు.
1. *వాగినోప్లాస్టీ:* సర్జరీ: 4 గంటలు పట్టింది. హాస్పిటల్ స్టే: 7 రోజులున్నారు. సుధ రోజు వారీ పనులు మొదలు పెట్టింది. రికవరీకి : 10 వారాలు పట్టింది.
తరువాత *వల్వోప్లాస్టీ:* సర్జరీకి 2 గంటలు పట్టింది. హాస్పిటల్ స్టే: 3 రోజులు పట్టింది. రికవరీకి 5 వారాలు పట్టింది.
ఆ తరువాత *క్లిటోరోప్లాస్టీ:* సర్జరీకి 2 గంటలు పట్టింది.
హాస్పిటల్ స్టే: 2 రోజులు తీసుకుంది. రికవరీ: 6 వారాలు పట్టింది .
ఇలా 21+5 - 26 వారాల్లో వాగినో ప్లాస్టీ, వోల్వో ప్లాస్టీ, క్లిటోరో ప్లాస్టీ పూర్తి అయ్యాయి. ఎప్పటికప్పుడు డాక్టర్ లు స్వెల్లింగ్, ప్రైమరీ ఇన్ ఫెక్షన్ లు వంటి వాటిని నివారిస్తూ వచ్చారు.
సుధని సావిత్రమ్మ, అనసూయమ్మ, దీపిక ఎంతో ప్రేమతో, రాజకుమార్తె లాగా చూసుకుంటున్నారు.
ఒక రెండు వారాల వ్యవధి ఇచ్చి *డైలేషన్ థెరపీ* మొదలు పెట్టారు.
మొత్తం 6 నెలలు కాలం తీసుకుంది. రోజుకి 1-2 సార్లు డైలేషన్ థెరపీ చేశారు.
*డైలేషన్ థెరపీ అంటే:* వాజినాల్ డైలేటర్‌లను (ప్లాస్టిక్/సిలికాన్) ఉపయోగించి, వాజినాను స్ట్రెచ్ చేయడం
సర్జరీ తర్వాత వాజినా కుంచించుకుపోకుండా, సైజులో ఉండటానికి సహాయపడుతుంది .
భవిష్యత్తులో సెక్సువల్ రిలేషన్స్‌కు ముందస్తు చర్యగా , డైలేషన్ థెరపీని పూర్తి చేయాలి. ఇలా సంవత్సరం పై ఒక నెలకు సుధ పూర్తిగా ఆడపిల్ల గా మారింది.
మరి మూడు మాసాలకు తన రొటీన్ కి వచ్చింది సుధ. అక్కడ నుంచి సుధ మంచి గాయనిగా, నర్తకి గా పేరు తెచ్చుకుంది. ఊళ్ళో గాన కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది.
దానితో పాటు దీపిక తో కలిసి అనసూయమ్మ మార్గదర్శనం లో *సఖీ పికిల్స్* మొదలు పెట్టింది. ఆ బిజినెస్ చాలా లాభసాటి గా మారింది. అలాగే సుధ దీపిక శ బ్యూటీ పార్లర్ కూడా మొదలు పెట్టింది. అందులో నలుగురు ట్రాన్స్ వుమెన్ కి ఉద్యోగం ఇచ్చింది. ట్రాన్స్ వుమెన్ కి నిర్ణీత సమయాలలో ఉచితంగా బ్యూటీ పార్లర్ సర్వీసెస్ అందించడం మొదలు పెట్టింది.
ఇదీ సుధ జీవిత ప్రస్థానం. దీపిక వల్ల సుధ పూర్తిగా ఆడపిల్ల గా మారింది. సుధ, సావిత్రమ్మ లవల్ల దీపిక, అనసూయమ్మ ల ఆర్థిక స్తోమత పెరిగింది. సుధకి ఇరవై రెండేళ్ళ వయసులో సావిత్రమ్మ కి 56 ఏళ్ళు, అనసూయమ్మ కి 54 ఏళ్ళు, దీపికకి 26 ఏళ్ళ వయసులు. ఆనలుగురు ఆనందమయమైన జీవితం గడుపుతున్నారు.
Discussion (0)